Monday 26 September 2022

జీవితమ్ ఆధ్యాత్మికమ్!


Everything is spiritual in this world!
- Joe Vitale


జీవితంలో అనుకోకుండా కొన్ని ఊహించని మలుపులు వస్తాయి... 

మూడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్ని - ఒకదాని తర్వాత ఒకటి - దాదాపు ఓ పద్నాలుగేళ్ళపాటు చేసిన తర్వాత, నా చివరి ఉద్యోగం ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు రిజైన్ చేశాను.

అలా అసలు ఉద్యోగం అంటేనే పడనివాణ్ణి, ఫ్రీలాన్సర్‌గా, ఫ్రీ బర్డ్‌గా బ్రతకటమే ఇష్టపడినవాణ్ణి... దాదాపు ఒక 22 సంవత్సరాల తర్వాత, నా జీవితంలోనే ఎప్పుడూ ఊహించనివిధంగా, కొన్ని నెలల క్రితం మళ్ళీ నేను కొత్తగా ఒక ఉద్యోగంలోకి చేరిపోయాను. 

తర్వాత కొన్ని రోజులకి అది ఉద్యోగం కాదు, బాధ్యత అని టెక్నికల్‌గా నాకు తెలిసింది. 

చిన్నప్పట్నుంచీ ఇంట్లో గాని, విద్యార్థిగా ఉన్నప్పుడు గాని, పెళ్లయ్యాక గాని, నా పిల్లల విషయంలో గాని, నా ఉద్యోగాల్లో కాని నేనెప్పుడూ పనికి భయపడలేదు. పని తప్పించుకోవాలనుకోలేదు. పని చేస్తూ ఉండటమే నాకిష్టం. 

ఇక్కడ పని కూడా క్రియేటివిటీకి సంబంధించిందే కాబట్టి ఎంతైనా సరే బాగా కష్టపడాలనుకున్నాను. నా పనికి సంబంధించిన ఎలాంటి చాలెంజ్‌నయినా స్వీకరించాలనుకున్నాను.    

అంత గట్టి కమిట్‌మెంట్‌తో ఈ ఉద్యోగంలోకి ఎంటరయ్యాను. జీతం విషయంలో కూడా అంతే గట్టిగా ఒకటికి నాలుగుసార్లు కన్‌ఫర్మేషన్ తీసుకొన్నాను. 

కాని... అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? 

తప్పెవరిదీ లేదు. కాని... ఈ ఉద్యోగం మీద ఆధారపడి నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ అలా అలా ఆవిరైపోయాయి. చూస్తుండగానే నాలుగున్నర నెలలు గడిచిపోయాయి.  

దాదాపు 5 నెలలన్నమాట!

ఇప్పుడు నాకున్న పరిమిత సమయంలో 5 నెలలు నేను వృధా చేసుకున్నానంటే అది అత్యంత బాధాకరం.      

అదలా వుంచితే, రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత - ప్రధానంగా దేని గురించయితే నేను కొత్తగా మళ్ళీ ఉద్యోగంలో చేరానో అది అసలు జరగలేదు.     

ఎంతైనా సరే కష్టపడదాం అనుకున్నవాణ్ణి... అసలు నా పనే ప్రారంభం కాలేదు. ఆఫీసులో ఎప్పుడైనా ఏదైనా చిన్న పని చేస్తున్నానంటే, అది జస్ట్ క్లరికల్ పని లేదా అంతకంటే క్రింది సబ్ స్టాఫ్ చేసే పని. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి తెలిసినవాణ్ణి కాబట్టి దానిగురించి నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. పెద్దగా పట్టించుకోను. 

ఇంక క్రియేటివిటీకి సంబంధించి నేను నా చాంబర్లో కూర్చొని ఒక తపస్సులా ఒంటరిగా చేసే శ్రమ బయటికి కనిపించని శ్రమ.

బయటివాళ్ళకి నేను ఖాళీగా కూర్చొని ఏదో చదువుకుంటున్నట్టు, రాసుకుంటున్నట్టు, నాలుగు సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటున్నట్టు, చాటింగ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇదింకో మానసిక వ్యధ.   

ఏది ఎలా ఉన్నా, నేను ఏ రెండు ప్రయోజనాలు ఆశించి ఇన్నేళ్ళ తర్వాత ఈ ఉద్యోగంలో చేరానో, ఆ రెండింటి విషయంలో కూడా కనుచూపుమేరలో నాకు ఎలాంటి క్లారిటీ లేదు. 

ఇలాంటి నేపథ్యంలో ప్యానిక్ అయ్యి అనవసరంగా టెన్షన్ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

ఒకటి మాత్రం గట్టిగా అనుకొన్నాను... ఎంత పనయినా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను...

కాని, 
నేను ఎవరికీ భారం కావద్దు,
కొత్తగా నామీద ఏ భారాలు పడవద్దు. 

ఈ నేపథ్యంలో ఒక గట్టి నిర్ణయం తీసుకొన్నాను. ఈ ప్లాట్‌ఫామ్ బేస్‌గా - అంతకుముందు ఎన్నెన్నో పనులు చేయాలనుకొన్నవాటినన్నిటినీ ఇప్పుడు దాదాపు పూర్తిగా మినిమైజ్ చేసేసుకున్నాను. 

Ultimate Minimalism... 

ఒక నిర్దిష్టమైన తేదీ తర్వాత - అన్ని పనులకూ గుడ్-బై  చెప్పెయ్యాలని గట్టిగా అనుకున్నాను. ఇలా అనుకున్నదానికి వంద శాతం కట్టుబడి ఉంటాను. 

ఇందులో మార్పు ఉండదు.   

అప్పటిదాకా - ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గా స్వీకరిస్తూ, తుఫానులో కూడా స్మూత్ సెయిల్ చెయ్యడానికే ఎంతయినా కష్టపడతాను. 

కట్ చేస్తే -    

మారిన ఫిలిం కంటెంట్ ట్రెండ్స్, బిజినెస్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని - అతి తక్కువ సమయంలో ఒక 3 ఫీచర్ ఫిల్మ్స్ చెయ్యడానికి ప్లాన్ చేశాను. 

వాటిలో ఒకటి ఈ విజయదశమికి ఎనౌన్స్ చేస్తున్నాను. 

భారీ స్టార్లు, భారీ బడ్జెట్స్ కావు కాబట్టి ఎలాంటి ఇబ్బందులుండవు. నాకు పెద్ద సమస్య కాదు. 

ముఖ్యంగా నేను మళ్ళీ ఫ్రీ బర్డ్ కావడమే ఇప్పుడు నాముందున్న పెద్ద సమస్య.  

స్టీరింగ్ నా చేతుల్లోకే తీసుకుంటున్నాను కాబట్టి ఏ సమస్యా ఉండదు. అన్ని బాధ్యతలూ నా ఒక్కడి భుజాలమీదే ఉంటాయి. 

దేనికైనా నాకు నేనే సమాధానంగా ఉండాలి. 

అదే నాకిష్టం.

సో... ఇలాంటి ఇన్ఎక్స్‌ప్లికబుల్ స్ట్రెస్‌లో కూడా... ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఖచ్చితమైన టైమ్ బౌండ్ టార్గెట్స్‌తో ముందుకెళ్తున్నాను. 

ఈ నేపథ్యంలో - తాత్కాలికంగా కొన్నాళ్లపాటు నాకెంతో ప్రియమైన నా బ్లాగింగ్ హాబీకి విరామం ఇవ్వక తప్పటం లేదు. 

మళ్ళీ తప్పక కలుద్దాం. అందాకా శెలవ్. 

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.

Sunday 25 September 2022

"ఫిమేల్" అన్న పదం ఉంటేనే తప్పా?


"ఫిమేల్ స్క్రిప్ట్ రైటర్" కోసం ఒక క్రియేటివ్ గ్రూప్‌లో ఎవరో పోస్టు పెట్టారు. 

అంతే... 

ఆ పోస్టుని విమర్శిస్తూ టపటపా పోస్టులు పడిపోయాయి!

అసలు "ఫిమేల్" రైటర్స్ ఏంటి?... 
ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా అడిగారా?... 
రైటర్ రైటరే... 
మేల్ అయితే ఏంటి, ఫిమేల్ అయితే ఏంటి?... 
మేల్ రైటర్స్ పనికిరారా... 

అలా పోస్ట్ పెట్టడం ఏదో పెద్ద నేరం అయినట్టు... ఇలా రకరకాల కోణాల్లో దండయాత్ర! 

ఈ ట్రోల్ అంతా చదివితే మాత్రం... ఆ పోస్ట్ పెట్టినతను ఎలాంటి అనుమానం లేకుండా మెంటల్ అయిపోవడం పక్కా.  

కట్ చేస్తే - 

లత సాహిత్యం చదివినవారికి ఆ రచయిత్రి రాసే  'ప్రేమలో ఇంటెన్సిటీ' గుర్తుండే వుంటుంది. రంగనాయకమ్మ, ఓల్గా, కుప్పిలి పద్మ రాసినట్టు మేల్ రచయితలు రాయగలరా? 'ఏ మాయ చేసావె' సినిమాలో ఉమర్జీ అనురాధ రాసినట్టు డైలాగ్స్ ఇంకో మగ రచయిత రాయగలడా? 

అర్థం లేని ట్రోలింగ్ కాకపోతే "ఫిమేల్ రైటర్ కావాలి" అని ఒక క్రియేటివ్ గ్రూప్‌లో పోస్టు పెట్టుకొనే స్వతంత్రం మరో క్రియేటివ్ జీవికి లేకపోవడం బాధాకరం. 

"Female ADs" కోసం నిన్న రాత్రే నేనొక యాడ్ పెట్టాను. మా డైరెక్షన్ టీమ్‌లో ఆల్రెడీ కావల్సినంతమంది బాయ్స్ ఉన్నారు. కొన్ని అంశాల్ని అమ్మాయిలే ఇంకాస్త బాగా హాండిల్ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పుడొక ఇద్దరు ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను తీసుకొంటున్నాను. 

అసలిప్పుడు దాదాపు ప్రతి డైరెక్టర్ టీమ్‌లో 50% మంది ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటుండం ఈ మధ్య వచ్చిన అద్భుత పరిణామం. అది వేరే విషయం.   

మా మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ఫిమేల్ వాయిస్ కోసం చూస్తున్నాడు. ఈ రిక్వయిర్‌మెంట్ గురించి ఆల్రెడీ మ్యూజిక్ అరేంజర్స్‌కు, కోఆర్డినేటర్స్‌కు చెప్పాడు. ఒక యాడ్ కూడా ఇచ్చాడు. 

సో... మేం కూడా అలా "ఫిమేల్... సో అండ్ సో కావలెను" అని యాడ్ ఇవ్వకూడదా? 

"ఫిమేల్" అన్న పదం ఉంటేనే తప్పా? 

భయమా,  అపనమ్మకమా? 

అసలు ఏ కాలంలో ఉన్నాం మనం? 

ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాం?    

ఎలాంటి వుమెన్ రైటర్స్, ఎలాంటి వుమెన్ టెక్నీషియన్స్ ఇంతకుముందు వచ్చారు... ఇప్పుడొస్తున్నారు? 

కనీసం ఐడియా ఉందా?   

సారీ... అపర్ణా సేన్, దీపా మెహతా, భాను అతియ, అలంకృత శ్రీవాస్తవ, తనూజ చంద్ర, నందితా దాస్, లీనా యాదవ్, షోనాలి బోస్, రీమా కగ్తి, ఆశ్విని అయ్యర్ త్రివేది, జూహి చతుర్వేది, మేఘనా గుల్జార్, జోయా అఖ్తర్, గురిందర్ చద్దా, కొంకనా సేన్ శర్మ, సుధా కొంగర, నందిని రెడ్డి...  

We still have such pseudo creative people who cannot just think out of the bloody box. 

Sunday 18 September 2022

సముద్రం నాకిష్టం


"కొన్ని జ్ఞాపకాల్ని 
అంత ఈజీగా మర్చిపోలేం. 
అంత ఈజీగా తుడిచివేయలేం.
 
అవి పోవాలంటే పోతాయ్...
కాని, మనతో పాటే." 

కట్ చేస్తే -

 హైద్రాబాద్‌లో అన్నీ ఉన్నాయి. ఒక్క సముద్రం తప్ప.

ఆమధ్య కేసీఆర్ ఏపీనుంచి ఏదో పోర్ట్ ఎత్తుకొస్తారని విన్నాను.

ఆ పని చేస్తారో లేదో గాని, దానికి బదులు వైజాగ్ నుంచి సముద్రం ఎత్తుకొస్తే బాగుండునని నేను చాలాసార్లు అనుకొన్నాను. :)

సముద్రమంటే నాకు అంత ఇష్టం.

కట్ టూ వైజాగ్ - 

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మేమున్న నాలుగు రోజులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి.

1987లో అనుకుంటాను, నేను వైజాగ్ మొట్టమొదటిసారిగా వెళ్లాను...

తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లానుగానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.


వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది.

ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి.

ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు.

దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

సముద్రం నా ప్రేయసి. 

సముద్రం నా ఆత్మ. 

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్... 

Saturday 17 September 2022

విమర్శ వేరు, విద్వేషం వేరు!


"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు" అని శ్రీశ్రీ గారు ఎంతమంది కుర్రాళ్లనో చూసింతర్వాతనే కదా రాసుంటారు? 

అలాంటి కుర్రాళ్లను నేను కూడా అప్పుడప్పుడు చూస్తున్నాను. జాలిపడుతున్నాను. 

కట్ చేస్తే - 

రాజకీయాల్లో అభిమానం, దృక్పథాలు వేరుగా ఉండటం సర్వసహజం. 

విమర్శలు కూడా బాహాటంగా చేయవచ్చు. తప్పేం లేదు. అయితే, విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. 

వ్యక్తిగత విద్వేషం విమర్శ కాదు. 

సబ్జెక్ట్ లేనప్పుడే అలాంటి విమర్శలు చాలా అవేశంతో చేస్తారు. అనుకోకుండా కుండి సంజయ్ అవతారమెత్తుతారు.  

ఇవ్వాళ నేను పెట్టిన ఒక పోస్టు చదివి, గుంటూరు నవోదయలో నేను పనిచేసినప్పటి నా విద్యార్థి ఒకరు చాలా ఆవేశంతో ఏదేదో కామెంట్ పెట్టాడు, అసలు సబ్జెక్టు తప్ప. 

హిందూ మతం గురించి నాకేం తెలీదట. కేసీఆర్ మత్తులో ఉన్నానట. ఇక కేసీఆర్ మీదనయితే కావల్సినంత విద్వేషం చిమ్మాడు. 

అదే ఇంకొకరెవరో అయితే వాడు రాసిన ప్రతిపదానికీ ఫిట్టింగ్ ఆన్సర్ ఇచ్చేవాణ్ణి. 

కాని, ఇక్కడ వీడు నా విద్యార్థి.     

నేను మావాడి కంటే పదిరెట్లు ఆవేశంగా, నిర్మాణాత్మకంగా, లాజికల్‌గా సమాధానమివ్వగలను. 

కాని, నేనిచ్చే ఆ సమాధానం చూసి, కేసీఆర్ అభిమానులు అతన్ని తుక్కుతుక్కుగా ఆడుకుంటారు. అది నాకిష్టం లేదు. అందుకే నేనా పని చేయలేదు. సింపుల్‌గా వాడి కామెంట్స్ డిలీట్ చేశాను. ఈ విషయంలో మరింత కొనసాగింపు వాడితో ఇష్టం లేక బ్లాక్ చేశాను. 

ఎందుకంటే... నాకు వాడిలో సుమారు పాతికేళ్ల క్రితం నాటి నా 12 ఏళ్ళ విద్యార్థే కనిపిస్తున్నాడు! 

నాతో ఇంకేదన్నా వాదించాలనుకుంటే హాయిగా వాడు నాకు కాల్ చేస్తాడు. కలుస్తాడు. 

మా అనుబంధం నవోదయమ్! :-) 

కట్ చేస్తే - 

నా విద్యార్థి హైద్రాబాద్‌లోనే చాలాకాలంగా మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హాప్పీగా ఉన్నాడు. సైడ్‌కు చిన్నస్థాయిలో రియల్ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. మంచి పెయింటింగ్స్ వేసే ఆర్టిస్టు కూడా. హైద్రాబాద్‌లోనే రెండు మూడు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టాడు.  

కడుపులోంచి అంత విద్వేషం కక్కడానికి మరి కేసీఆర్ మావాడికి ఎప్పుడు ఏ అన్యాయం చేశారో నాకైతే తెలీదు.  

కేసీఆర్ 2.0 - 4


రాజకీయాలు రాజకీయాలే. కాని, గుడ్డిగా ఫాలో కావడం కాదు.

మన చదువులు సింపుల్ లాజిక్స్‌కయినా ఉపయోగపడాలి.  

ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే పనులు చేసేవాళ్ళను... అలాంటి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. పౌరులుగా మన బాధ్యత. 

వాళ్ళేం బట్టలేసుకోవాలి, వీళ్ళేం తినొద్దు... సమాజాభివృద్ధికి ఏరకంగానూ పనికిరాని ఇలాంటి విషయాలు దేశాన్ని ఇంకో వందేళ్ళు వెనక్కి తీసుకుపోతాయి. ముఖ్యంగా - మేధావులు, విద్యావంతులు అనుకున్నవాళ్ళు ఈ సున్నితమైనవిషయాన్ని, ఈ ప్రమాద ఘంటికలను గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి.

ఈ ప్రపంచంలో మతం అడ్డం పెట్టుకొని పాలించిన ఏ దేశం కూడా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు. బిచ్చమెత్తుకుంటున్నాయి. లేదా, నిరంతరం అంతర్యుద్ధాల రక్తపాతంలో బతుకుతున్నాయి.  

After all, religion is a man made thing. 

కట్ చేస్తే - 

గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవతల అసలు కంటెంట్ లేదు. 

ఏం చేస్తారు? 

డైవర్షన్.

అబద్ధాల వార్తలు. జనమే లేని సభలు, విమోచనోత్సవాలు. 

మరోవైపు... రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ జాతీయ సమగ్రతా వజ్రోత్సవాల్ని ఘనంగా జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు! 

Thursday 15 September 2022

కేసీఆర్ 2.0 - 3


గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. 

గెలిచిన తన ఎమ్మెల్యేలకు ఆత్మవిశ్వాసం అందించి కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమీ చేయలేదు అని ఇలా ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. 

బీజేపీయేతర పార్టీల్లో ఎక్కడ ఎవరు ఎంతమంది గెలిచినా, వారికి ఓపెన్‌గా తాయిలాలిస్తూ తమపార్టీలోకి చేర్చుకొని ప్రభుత్వాలను కూలగొట్టే అధమస్థాయి రాజనీతి బీజేపీది. 

ఒకేదేశం, ఒకే పార్టీ దిశగా ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం నిర్దేశించుకుని, దేశాన్ని వందల సంవత్సరాల వెనక్కి తీసుకుపోతున్న పార్టీని, ప్రధానమంత్రిని... జస్ట్ అలా చూస్తూ ఊరుకుంటున్నాయి మిగిలిన అన్ని పార్టీలు, ఆ పార్టీల అధినేతలు. 

ఇది ఇంక నడవనీయం అని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ  సింహంలా గర్జిస్తున్న గొంతు ప్రస్తుతం ఈ దేశంలో ఒక్కటే. 

కేసీఆర్. 

కట్ చేస్తే - 

హైద్రాబాద్ వేదికగా కేసీఆర్ ప్రకటించే జాతీయపార్టీ కోసం తెలంగాణ ప్రజలే కాదు... యావత్ దేశంలోని అత్యధికశాతం మంది రైతులు, ప్రజలు, ఇతరపార్టీల రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ వర్గాలు, మిగిలివున్న ఆ కొద్ది కేంద్రప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు, అనేక ఎన్‌జీవో వ్యవస్థలు ఎదురుచూస్తున్నాయి. 

అయితే - కేంద్రంలో ఉన్న బీజేపీపై, మోదీపై కేసీఆర్ ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించే ఆ సంచలనాత్మక దినం వచ్చే విజయదశమికేనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  

Wednesday 14 September 2022

మనం తీసే సినిమాలు థియేటర్‌కా, ఓటీటీకా?


నిత్యా మీనన్ న్యూస్ ఐటమ్ ఒకటి చదివాను ఇందాకే.

ఒక నెల క్రితం ఇంటర్వ్యూ అనుకుంటాను, అందులో ఆమె చెప్పింది నాకు బాగా నచ్చింది. 

మన రొటీన్ థియరీలు, ప్రాక్టికాలిటీలు, పనికిరాని ఈగోలు పక్కనపెట్టి ఆలోచిస్తే మాత్రం నిత్యా మీనన్ అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది. 

అసలు విషయమేంటంటే - 

మనం సినిమాలు తీసేటప్పుడే "ఇది థియేటర్ కోసం తీస్తున్నాం, ఇది ఓటీటీ కోసం తీస్తున్నాం" అని ఒక కేటగరైజేషన్ చేసుకొని తీయటం సరైన ఆలోచన కాదు. 

అసలు సినిమా అంటూ తీస్తే - తప్పకుండా దాని ప్రధాన లక్ష్యం థియేటర్‌లో ప్రదర్శించడమే కావాలి. 

ఆ సినిమాలోని కంటెంట్, దాని బిజినెస్ పొటెన్షియాలిటీని బట్టి, తర్వాత అది థియేటర్‌కు వెళ్ళగలుగుతుందా, ఓటీటీ దగ్గరే సెటిలవుతుందా, అసలు మార్కెట్లో ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం.  

నిజమే కదా?

సో... ముందైతే, సినిమా అంటూ తీస్తే... అది థియేటర్ రిలీజ్ కోసమే తీయాలి. ఓటీటీలు, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ ఎట్సెట్రా అన్నీ తర్వాతెలాగూ ఫాలో అవుతాయి. 

అది చిన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమా అయినా ఇక్కడ మర్చిపోకూడని పాయింట్ ఒక్కటే... 

Cinema is a battle ground! 

Tuesday 13 September 2022

కేసీఆర్ 2.0 - 2

 

"ఈ దేశంలో బీజేపీ పాలనలో దేశంలో ఒక్కటన్న మంచి పని జరిగిందా? అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్నరు. ఇప్పటికే 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోశారు. చెప్పుకోడానికి సిగ్గుండాలె. తెలంగాణలో మూడు తోకలు లేవు. "తీసేస్తం, కూలగొడతం" అంటరు. ఎట్లా తీసేస్తరు? పోగాలం వచ్చింది కాబట్టి అట్ల మాట్లాడుతున్నరు!" 
- కేసీఆర్ 

దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పనికొచ్చే పనులు చేయాలన్న ఉద్దేశ్యం వారికి ఎంతమాత్రం లేదన్నది ఈ ఎనిమిదేళ్ళలో అతి స్పష్టంగా నిరూపించుకొన్నారు.

మరి అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి వారు ఎక్కడెక్కడ ఏమేం సాధించారన్నది వారికే తెలియాలి. 

వారి ఎజెండా స్పష్టం... సున్నితమైన విషయాలను కెలికి ప్రజల మధ్య గొడవలు పెట్టడం, తద్వారా ఎన్నికల్లో లాభపడాలనుకోవడం. 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలగొట్టడం... వినని వారిని రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం. 

ఇంతే. 

ఈ రెండు తప్ప వారు ఇంకేదీ చేయలేరు, చేయరు.

దురదృష్టవశాత్తు...ఇలాంటి ప్రభుత్వాన్ని, వారి పార్టీని, వారి నాయకున్ని గుడ్డిగా వెనకేసుకొచ్చేవారిలో విద్యావంతులు,  విద్యాధికులు కూడా ఉండటం అత్యంత విషాదం. 

దీనికే చెక్ పెట్టదల్చుకున్నారు కేసీఆర్. 

అందుకే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు, జాతీయపార్టీని ప్రకటించబోతున్నారు కేసీఆర్. 

తర్వాత జరిగేదంతా ఉద్యమమే.  

కేసీఆర్ 2.0 - 1


అసెంబ్లీలో ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్ సింప్లీ అదరహో! 

గణాంకాలతో, ఖచ్చితమైన నిజాలతో కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క అంశం దేనికదే గొప్పది. ఉన్నదున్నట్టుగా ఆ స్పీచ్ ట్రాన్స్‌క్రిప్షన్ రాస్తే, ఏ ఒక్క పదం కూడా మనం స్కిప్ చేయలేం. 

కేసీఆర్ గారి అంత పెద్ద స్పీచ్‌లోంచి, కేవలం రెండే రెండు మాటల్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను: 

"బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలే!"

"లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఒక తిరుగుబాటు చేసి పిలుపిస్తే, నలభై యాభై రోజులల్లో జైళ్ళల్లోంచి పుట్టిన జనతాపార్టీ ఈ దేశం మీద జెండా ఎగురేసింది. That is the power of democracy." 

కట్ చేస్తే - 

ఈ రెండు ముక్కలు చాలు. రేపు ఏం జరగబోతోందో మనకు అర్థం కావడానికి. 

అసలెలాంటి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేని కాలంలోనే... ఈ దేశంలోనే... అతి తక్కువ కాలంలో జనతాపార్టీ సాధించగలిగిన అద్భుతం ఇప్పుడెందుకు సాధ్యం కాదు? 

సంకల్పం గొప్పది, శక్తివంతమైనది అయినప్పుడు... ఈ సర్వ ప్రపంచం, ఈ అనంతవిశ్వం కూడా పాజిటివ్‌గా కుమ్మక్కై ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి అన్నివిధాలుగా, అన్నివైపులనుంచీ సహకరిస్తాయి.   

కేసీఆర్ సంకల్పం కూడా అంత గొప్పది, అంత శక్తివంతమైందని ఇంతకు ముందే, మన కళ్ళముందే చూశాం. 

దేశ రాజకీయాల్లో ఇప్పుడు చూడబోతున్నాం.   
^^^

("కేసీఆర్ 2.0" ఈరోజు ప్రారంభించాను. వచ్చేది ఎలక్షన్ ఇయర్. లక్ష్యం సాధించేదాకా ఈ బ్లాగ్ సీరీస్ కొనసాగుతుంది. - మనోహర్ చిమ్మని)  

Monday 12 September 2022

కంగ్రాట్స్, విభా!


సైమాలో పూజా హెగ్దేకి అవార్డు రావటం ఏంటి అని కొంతమంది బాధపడుతూ న్యూస్ ఐటమ్స్ రాశారు. 

"ఆ సినిమాలో అఖిల్ కంటే పెద్దగా కనిపించింది" అంటూ ఫీలైపోయారు. 

సో వాట్? నిజంగా కూడా అఖిల్ కంటే పెద్దదే కదా... అయితే ఏంటి? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? 

మన 60+ హీరోలు 20+ హీరోయిన్స్‌తో పనిచేయడంలేదా? అరుదుగా ఎప్పుడో ఒకసారి, హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ ఇలా ఏజ్ గ్యాప్‌ని ఎంజాయ్ చేస్తే తప్పేముంది? 

Age is just number...   

ఇదిగో ఇలాంటి ఆలోచనావిధానం ఉన్నవాళ్లే రివ్యూల పేరుతో నానా చెత్త రాస్తుంటారు.   

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో డైరెక్టర్ భాస్కర్ హీరోయిన్ క్యారెక్టర్‌ను కొత్తగా డిజైన్ చేశాడు. పూజా ఆ క్యారెక్టర్‌లో నిజంగానే బాగా చేసింది. నాకు నచ్చింది. 

ఆ రోల్‌కి తప్పకుండా పూజా హెగ్డేకి సైమా అవార్డ్ ఇవ్వొచ్చు. తప్పేముంది? 

కట్ చేస్తే -

ఆర్ట్ సినిమాల్లాంటి సీరియస్ సినిమాలకిచ్చే నేషనల్ అవార్డులు వేరు. సైమా అవార్డులు వేరు. 

సైమా అవార్డులు బాగా పాపులర్ అయిన సినిమాలకు, అలా హిట్ అయిన సినిమాల్లోని ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌కు ఇచ్చే అవార్డులు. ఇవి ఎక్కువగా ప్రేక్షకుల తీర్పుని ఫాలో అవుతుంటాయి. అందుకని, సైమాలో అన్ని అవార్డులు అందరికి నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. 

బట్ - నిజంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజాకు ఈ అవార్డు రావటం అంత ఆశ్చర్యకరం ఏం కాదు.   

Truly Puja deserves this award. 

Hearty Congratulations, Puja! 

Sunday 11 September 2022

ఎవరిలోనైనా నన్ను ఆకర్షించే మొట్టమొదటి అంశం...


వ్యక్తిగతంగా తను ఏ పార్టీకి అనుకూలమైనా సరే, కొన్ని కొన్నిసార్లు అర్థం లేకుండా ఎంత పిచ్చిపిచ్చిగా మాట్లాడినా సరే... కంగనా రనౌత్ లోని కిల్లర్ ఇన్‌స్టింక్ట్, భయంలేనితనం నాకు బాగా నచ్చుతాయి. 

ఎక్కడో హిమాచల్ నుంచి అనుకుంటాను... ఒక్కతే ముంబై వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమిళంలో కూడా నటించింది. 60 కోట్లతో ముంబైలో ఒక ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టింది. సినిమాలు నిర్మిస్తోంది. దర్శకురాలయింది కూడా. 

కట్ చేస్తే - 

పద్మశ్రీ అవార్డుతో పాటు, 3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా గెల్చుకొన్న కంగానాను, జస్ట్ ఒక "అందాలు ఆరబోసే రొటీన్ గ్లామర్ డాల్" అని అంత ఈజీగా తీసుకోడానికిలేదు. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె వృత్తిజీవితం కూడా అనేక చాలెంజ్‌లతో కొనసాగుతూ వస్తోంది. 

కరణ్‌జోహార్ లాంటి బాలీవుడ్ మొఘల్స్‌తో ఢీ అంటే ఎంత పెద్ద విషయమో కంగనాకు తెలియక కాదు. "తుఝే క్యా లగ్తాహై ఉధ్ధవ్ థాకరే..." అని సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రినే ఏకవచనంలో సంభోధిస్తూ, సవాల్ విసరడం అంత ఈజీ కాదు.    

ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. కొన్ని తెలియనివి. కొన్ని తెలిసే చేసేవి.  

ఎవరి రీజన్స్ వారికుంటాయి. ఎవరి జీవితం వారిది. 

ఎవరిలోనైనా నన్ను ఆకర్షించే మొట్టమొదటి అంశం వారు సాధించిన విజయాలు. వారిలోని గట్స్.

తర్వాత - వారిలోని నిరంతర ఉత్సాహం. జీవితం పట్ల వారికున్న ప్యాషన్. ఒక రొటీన్‌కు అలవాటుపడకుండా ఉండటం. "వెయిట్ అండ్ సీ" అన్న ధోరణికి ఎడిక్ట్ కాకుండా ఉండగలగటం. 

ఇవేవీ అంత ఈజీ కాదు.    

ఇలాంటి లక్షణాలన్నీ తన డి ఎన్ ఏ లో భాగం చేసుకొన్న కంగానా... ఒక ఫైటర్. 

ఆ ఫైటర్ పోరాటం వెనుక తన 16 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.  

Saturday 10 September 2022

కొందరుంటారు... వారి కోసమే ఈ పోస్టు!


బ్లాగింగ్ కూడా సోషల్ మీడియాలో భాగమే. మనకిష్టమొచ్చింది మనం రాసుకుంటాం. 

మన ఆలోచనలు, అయిడియాలు, రాతలు నచ్చినవాళ్ళు మన బ్లాగ్ వైపు వస్తారు. నచ్చితే చదువుతారు. లేదంటే, ఆసక్తిగా అనిపించిన ఇంకోవైపు వెళ్ళిపోతారు. 

స్పష్టంగా ఒక చాయిస్ ఉంటుంది ఎవరికైనా.

నా బ్లాగ్ చదవండి అని ఎవరూ ఎవరిని బలవంతపెట్టరు. కాలర్ పట్టుకోరు. 

మన కంటెంట్ నచ్చకపోతే - మళ్ళీ ఇటువైపు రాకుండా ఉండటానికి వందకి వంద శాతం చాన్స్ ఉంది ఎవరికైనా. 

కాని చదివి... లాజికల్‌గా ఎలాంటి సంబంధం లేని, నిర్మాణాత్మకం కాని, చెత్త కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి శ్రమ ఎవరూ తీసుకోవద్దు.

నేను కూడా అంతే. అలా నా సమయం వృధా కానీయను. 

కట్ చేస్తే - 

నా రెడీ రెఫరెన్స్ కోసం... అప్పుడప్పుడూ నేను కొన్ని యాడ్స్ వంటి పోస్టులు రాస్తుంటాను. ఆన్‌లైన్‌లో రెడీగా ఉంటుందని ఇక్కడ రాసుకుంటాను. జస్ట్, వీటి లింక్ పంపించేస్తే సరిపోతుంది నాకు. 

ఇలాంటి పోస్టులు... నాకు, నా టార్గెట్ కస్టమర్స్‌కు సంబంధించిన విషయాలు. 

నేను టార్గెట్ చేసినవారికి తప్ప ఇవి నచ్చవు, చదవరు. చదవాల్సిన అవసరం లేదు. అలా పక్కకెళ్ళిపోవచ్చు. 

చదివి అనవసరంగా సెటైరిక్ కామెంట్స్ చెయ్యడం వల్ల మీ సమయం వృధా. నేను ఆ కామెంటర్‌కు అదే స్థాయిలో సమాధానమిస్తూ నా సమయం వృధా చేసుకోలేను. 

సింపుల్‌గా డిలీట్ చేస్తాను. 

గమనించాల్సిన ఆ కొందరు ఎవరో దీన్ని గమనిస్తే చాలు.   

Thanks. 

Thursday 8 September 2022

సొమ్మొకడిది సోకొకడిది!


"టాలీవుడ్ హబ్" అట! సినీ ప్రముఖులందరితో కలిపి "మహత్తరమైన సభ" అట, దానికి "ప్రధాని నరేంద్రమోది"ని ఆహ్వానించటం జరుగుతుందని... మొన్ననే రాజ్యసభ సభ్యత్వం తీసుకొన్న రచయిత విజయేంద్రప్రసాద్ గారి ఉవాచ...  

దేశానికి ప్రధాని అయిన మోదీని పిలిస్తే తప్పేం లేదు. ఆ కుర్చీకి మనం తప్పక రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. (మనకు కుర్చీ ఇచ్చినందుకు కూడా అనుకోండి. తప్పదు. We understand.) 

కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తాం అని మాటవరుసకైనా అనటం కనీస మర్యాద, బాధ్యత. 
    
ప్రతిదానికీ కలిసి, వంగి వంగి దండాలు పెట్టి, తాయిలాలు తీసుకొనేది కేసీఆర్ దగ్గర! టాలీవుడ్ హబ్బూ గిబ్బూ ఐడియాలకు మాత్రం మోదీ కావాలి!! 

సో... లోపల్లోపల బాగానే జరుగుతోంది రాజకీయం!

కట్ చేస్తే - 

కోరింది ఇస్తూ, కోరినదానికంటే ఇంకా ఎక్కువే ఇస్తూ... మనస్పూర్తిగా మన కేసీఆర్ వీళ్ళను ఎంత బాగా చూసుకుంటే మాత్రం ఏం లాభం? 

"మేం వేరే" అని ఎప్పటికప్పుడు కొందరు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. 

తెలుగు వేరే, తెలంగాణ వేరే అని ఇలా ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటారు. 

ఇలాంటివారివల్ల ఇండస్ట్రీలోని మాగ్జిమమ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు ఎలాంటి లాభం ఉండదు. జీరో. ఉంటే గింటే నష్టమే ఉంటుంది. 

అయినాసరే, నా నమ్మకం ఏంటంటే... కేసీఆర్, కేటీఆర్, తెలంగాణలను అంత ఈజీగా వదులుకోలేని వర్గం ఒకటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. ఉంటుంది.

అదే చాలా శక్తివంతమైన వర్గం కూడా.  

ఫక్తు రాజకీయాలే అనుకున్నప్పుడు ఆ వర్గం బాహాటంగానే బయటకొస్తుంది. అది వేరే విషయం.  

అయితే... దేన్నీ అంత ఈజీగా తీసుకోవద్దు అన్న విషయం... గమనించాల్సిన పెద్దలు గమనిస్తున్నారనే అనుకుంటున్నాను. 

After all... క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!

స్కిప్ యాడ్!



మన జీవితంలోకి వచ్చే చాలామంది యూట్యూబ్ వీడియోలో యాడ్స్ లాంటివాళ్ళు. ఏం ఆలోచించకుండా అలా "స్కిప్ యాడ్" కొట్టేసెయ్యాలి. 

ప్రతి యాడ్ చూసుకుంటూ కూర్చుంటే మనం చూడాలనుకున్న వీడియో చూడలేం. అప్పటికే మన టైమ్ అయిపోతుంది, అసలు వీడియోకే స్కిప్ కొట్టాల్సి వస్తుంది. 

కట్ చేస్తే - 

చాలా చాలా అరుదుగా, అనుకోకుండా మనకు అసలు సంబంధం లేని ఏదో ఒక యాడ్ చూస్తాం. ఆశ్చర్యంగా కనెక్టయిపోతాం. మనకు తెలీకుండానే కంటిన్యూ అయిపోతాం. 

అదే మ్యాజిక్. 

Sunday 4 September 2022

అమ్మకాలే కాదు, ఆశయ సాధన కూడా ముఖ్యం!


కనీసం ఒక డజన్ భాషల్లో, మిలియన్ల సంఖ్యలో అమ్మకాలు జరిగిన పుస్తకాలను చదువుతూ పెరిగినవాణ్ణి. కేవలం మనకోసమే ఒక పుస్తకం రాసుకున్నా, ఆ పుస్తకాన్ని ఇష్టపడే మనలాంటి లైక్‌మైండెడ్ కనీసం ఒక వెయ్యి మంది అయినా ఉండితీరతారన్నది నా హంబుల్ లాజిక్. 

1000 True Friends అన్నమాట! 

ఇంగ్లిష్‌లో చాలా చోట్ల మనం వినే "1000 True Fans" కాన్‌సెప్ట్ కూడా ఇదే. 

వెయ్యిమంది ట్రూ ఫ్యాన్స్ ఉన్నారంటే పదివేల పుస్తకాలమ్మినట్టే లెక్క.  

నాకున్న కొన్ని వ్యక్తిగత పరిమితులవల్ల, ముఖ్యంగా నా అశ్రద్ధవల్ల ఇప్పటివరకు నేను చేయాలనుకొన్న రచనలు గాని, రాయాలనుకొన్న పుస్తకాలు గాని రాయలేదు. కాని, రాసిన రెండు మూడు బుక్స్ మాత్రం అన్నీ బెస్ట్ సెల్లర్ పుస్తకాలే. 

వేటినీ ఇంట్లో అటకమీదకెక్కించలేదు. ఇంట్లోవాళ్ళకో, ఇంకెవరికో భయపడి పబ్లిషర్ దగ్గరే అట్టడబ్బాల్లో వదిలెయ్యలేదు. అన్నీ అతి తక్కువ సమయంలో సోల్డ్ అవుట్ అయిన పుస్తకాలే! 

కట్ చేస్తే -  

కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ గారు లాంచ్ చేసిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేంద్ర బిందువుగా తీసుకొని, ఒక రాజకీయ కోణంలో రాసిన పుస్తకం.

బుక్ సెల్లర్స్, పబ్లిషర్స్ చెప్తున్న బుక్ సేల్స్ అంకెల ప్రకారం ఈ పుస్తకం కూడా లాంచ్ అయిన కొద్దిరోజుల్లోనే "బెస్ట్ సెల్లర్ పుస్తకం" గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నా ఇతర పుస్తకాలతో పోలిస్తే ఈ పుస్తకం కనీసం ఒక పదిరెట్లు సేల్ అవ్వాలి. 

'తెలుగు బుక్స్ డాట్ ఇన్' తప్ప, ఇంకా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లోకి ఎక్కలేదు. త్వరలోనే మా స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ఈ పని కూడా పూర్తిచేయవచ్చు. 

కేసీఆర్ అభిమానులు, తెలంగాణ ప్రేమికులు కోట్లల్లో ఉంటారు. వాళ్ళల్లో కనీసం ఒక లక్షమంది అయినా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వీరిలో ఒక పావు భాగం మందిని మరింతగా ఇన్‌స్పైర్ చెయ్యడానికి, ఉడతాభక్తిగానైనా నా పుస్తకం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం.

అతిదగ్గరలో ఉన్న 'ఎలక్షన్ ఇయర్' సందర్భంగా - కేవలం అమ్మకాల్లోనే కాదు, ఆశయ సాధనలో కూడా ఉపయోగపడాలన్నది నా ఉద్దేశ్యం. 

దీని కోసం, బల్క్ ఆర్డర్స్‌తో, భువనగిరి నవీన్ లాంటి కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ కనీసం ఇంకో పదిమందయినా ముందుకువస్తే బాగుంటుంది. వస్తారు కూడా. 

Saturday 3 September 2022

120 గంటల్లో డీల్ పూర్తిచేయించగలరా?


సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్. 

ఇంతకుముందు సినిమాలు వేరు. ఇప్పుడు వేరు. 

Content is king. Money is the ultimate goal.

కట్ చేస్తే - 

లాక్‌డౌన్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. ఓటీటీల రూపంలో కొత్తగా మరిన్ని ఆదాయమార్గాలు క్రియేట్ అయ్యాయి. 

ఒక వైపు భారీ బడ్జెట్స్‌తో ప్యానిండియా సినిమాలు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే, మరోవైపు చాలా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి. 

చిన్న బడ్జెట్లో తీసే ఇండిపెండెంట్ సినిమాల హవా ఊపందుకొంది. థియేటర్లో రిలీజ్ అయినా కాకపోయినా -- Amazon Prime, Netflix, Zee5, Sony Liv, Aha వంటి  OTTల ద్వారా చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మంచి బిజినెస్ అవుతోంది. 

చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇప్పుడు కోట్లల్లో బిజినెస్ కొల్లగొడుతున్నాయి.  

ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొంటూ – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలను, మైక్రో బడ్జెట్‌లో  ప్లాన్ చేస్తున్నాను. ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

మా ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొడటి సినిమాను ఈ దసరాకు ఎనౌన్స్ చేయబోతున్నాం. 

ఈ నేపథ్యంలో - 

ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టుతో పాటు... పర్సనల్ ప్రమోషన్ మీద, సెలెబ్రిటీ స్టేటస్ మీద కూడా ప్యాషన్ ఉన్న డైనమిక్ ఇన్వెస్టర్స్‌తో మీటింగ్స్ ఏర్పాటు చేసి, సమర్థవంతంగా డీల్ వెంటనే క్లోజ్ చేయగల "ఐకానిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్‌" కోసం నేను చూస్తున్నాను. 

టైమ్‌బౌండ్‌గా ఈ పనిని అత్యంత సమర్థవంతంగా చేయగల అలాంటి 'ఎన్ ఆర్ ఐ' మిత్రుల కోసం కూడా నేను చూస్తున్నాను. 

మీడియేటర్స్‌కు మంచి కమిషన్ ఉంటుంది. ఆకర్షణీయమైన ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. డీల్ పూర్తి అయిన రోజే మీడియేటర్స్‌కి కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటగా వచ్చే "అక్నాలెడ్జ్‌మెంట్స్" టైటిల్ కార్డ్స్‌లో మీడియేటర్స్‌ పేరు వేస్తాము.

నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఎవరైనా ఉన్నట్లయితే - వెంటనే వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్‌గా కాల్ చేయండి. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం. 

120  గంటల్లో డీల్ పూర్తి చేయించగలిగిన మీడియేటర్స్‌కు రెట్టింపు కమిషన్ ఉంటుంది!  

ఇదీ మా నంబర్: +91 9989578125 

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer, Blogger
MD, Swarnasudha Projects Private Limited
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association

ABOUT MANOHAR CHIMMANI: 
Short Intro AV on Manohar Chimmani: 

మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):

About Manohar Chimmani (English):