Wednesday 27 July 2022

సినిమా... కరోనాకు ముందు, కరోనా తర్వాత!


మనిషి జీవితంలో, జీవనశైలిలో, ఆలోచనావిధానంలో, సమయపాలనలో... మొత్తంగా ఒక పెద్ద మార్పు తెచ్చింది కరోనా. 

కరోనా పోయింది, ఇంక "అంతా ఓకే" అనుకొని, మన భ్రమల్లో మనం ఉండి ఏదో అవుతుందనుకుంటే బోర్లాపడతాం. 

ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు జరుగుతోందదే. 

కట్ చేస్తే - 

గత జూన్ వరకు, 2022లో, తెలుగులో సరిగ్గా 100 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో కేవలం ఒక 6 సినిమాలు నిజంగా హిట్ అయ్యాయి. ఇంకొక 6 సినిమాలు హిట్ అయ్యాయి అనిపించుకున్నాయి. 

దీన్నిబట్టి విషయం అర్థం చేసుకోవచ్చు. సినిమా సక్సెస్ రేట్ కేవలం 3 శాతానికి పడిపోయింది. ఇది అంతకుముందు 5 నుంచి 10 వరకుండేది.   

అరుదుగా వచ్చే ఒకరిద్దరు పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలకోసం మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూస్తారు.

అది కూడా కొంచెం అటూఇటూ ఉందంటే నిర్మొహమాటంగా తిప్పికొడతారని మొన్నొక సినిమా విషయంలో రుజువైంది కూడా. 

అంటే - ఫ్యాన్స్‌కు కూడా అంత ఓపికలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. 


ఇంక - పాయింట్ నంబర్ టు... 

టికెట్ రేట్స్. 

ఒక సింపుల్ లాజిక్ మనవాళ్ళు పక్కనపెడ్తున్నది ఏంటంటే - టికెట్స్ నిజంగా వేలల్లో లక్షల్లో తెగేది, కొనేది, చూసేది మాస్ ప్రేక్షకులే. వారి ద్వారానే సినిమాలకు 70-80 శాతం ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్ కూడా ఓటీటీలకు బాగా అలవాటయ్యారు. 

వారికి చేతిలోనే/ఇంట్లోనే సినిమా చూసే సౌకర్యం ఓటీటీల రూపంలో రెడీగా ఉన్నప్పుడు, థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసే విషయాన్ని సింపుల్‌గా లైట్ తీసుకుంటున్నారు. 

టికెట్ రేట్స్ పెంచితే ఇంకా లైట్! 

ఇది కరోనా తర్వాత వచ్చిన మార్పు. 

మనం కోట్లల్లో రెమ్యూనరేషన్స్ పెంచుకొని, అదంతా రకరకాల పద్ధతుల్లో ఈ మాస్ సెంగ్మెంట్ నుంచి ఆశించడం వృధాప్రయాసే. 

వేరే సెగ్మెంట్స్ సినిమాలు చూసేది తక్కువ, రాసేది ఎక్కువ!  అసలు ఈ "అన్నీ మాకు తెలుసు" అనుకునే ఈ మేధావి సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం లెక్కలోకే రాదు.        

ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా - చిన్న హీరోలకూ పెద్ద హీరోలకూ పది కోట్ల నుంచి, వందా నూటయాభై కోట్లవరకు రెమ్యూనరేషన్ పెంచుకొని సినిమాలు తీస్తే కష్టం.

సినిమా ఎంత బాగున్నా అంత బడ్జెట్లు వెనక్కిరావు. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్. 

మార్కెట్‌ను బాగా స్టడీచేసి సినిమాలు చేయాల్సి ఉంటుంది. 

మంచి సినిమా అని "పేరు" తెచ్చుకోవడం సమస్య కాదు. పేరు అనేది ఫేస్‌బుక్‌లో కావల్సినంత వస్తుంది. ఆ సినిమాకు పెట్టిన డబ్బు వెనక్కిరావాలి. లాభాలూ రావాలి. అదంత ఈజీ కాదు. 

ప్రపంచ సినిమా ఇప్పుడు ప్రేక్షకుడి అరచేతుల్లో ఉంది. మనం మనకిష్టమొచ్చినట్లు ఏవో లెక్కలు వేసుకొని సినిమా తీస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. 


భవిష్యత్తులో కూడా సినిమా ఉంటుంది. థియేటర్లూ ఉంటాయి. కాని, ఇంతకుముందులా ఒక టాప్ ప్రయారిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లా మాత్రం కాదు.  

మాస్, క్లాస్ బేధం లేకుండా - ఏ సెగ్మెంట్ ప్రేక్షకులకైనా - థియేటర్‌లో సినిమా చూడ్దం అనేది ఇప్పుడొక ఆప్షన్ మాత్రమే. 

1 comment:

  1. అదేదో హిందీ సినిమాలో చెప్పినట్టు
    Entertainment, Entertainment, Entertainment. . కావాలి.
    కానీ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కొట్టుకు చావడం తప్ప ఇంకేమీ ఉండడం లేదు. Ott లో కూడా FF లోనే చూస్తున్నారు.

    ReplyDelete