Thursday 28 July 2022

అసలేం గుర్తుకురాదు...


హిట్టూ ఫట్టులతో  సంబంధం లేకుండా వీరి అన్ని సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను... 

'అసలేం గుర్తుకురాదు' అనే పాటలో సౌందర్య అందాన్ని ఆయన పెట్టిన ఫ్రేమ్స్ బీట్ చేస్తుంటాయి. టాబూ ఫీలింగ్స్‌ని వీరికన్నా అందంగా క్యాప్చర్ చేసిన సినిమా నేను చూడలేదు. ఒక ఇరవై మంది ఉన్న కుటుంబాన్ని వీరు చూపించినదానికంటే ఆత్మీయంగా ఇంకెవ్వరైనా చూపిస్తారా అన్నది నాకిప్పటికీ డౌటే. తలకాయ కూర ప్లేట్లో వేసుకొని అతి మామూలుగా కింద నేలమీద కూర్చొని తిన్న ప్రకాశ్‌రాజ్‌ను అంతకంటే అత్యంత సహజమైన నటనలో నేనింకా చూళ్ళేదు. సౌందర్య కావచ్చు, సోనాలి బింద్రే కావచ్చు... వీరి ఫ్రేముల్లో దిద్దుకున్న అందాన్ని మరోచోట మనం చూడలేం. 

బైక్ మీద, కాటమరాంగ్ బోట్ మీద పూర్తిపాటల్ని అంత బాగా, అంత కిక్కీగా తీయగలం అన్న ఆలోచన వీరికే వస్తుంది. శశిరేఖా పరిణయాలూ, చందమామలూ, గులాబీలూ వీరు తీసినంత అందంగా మరొకరు తీయలేరేమో. సిందూరాలూ, ఖడ్గాలూ వీరివల్లనే తెరమీద చూస్తాం. రాఖీలు, చక్రాలు వీరు తీస్తేనే చూడగలం. ఎన్టీఆర్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌తో మనకు తెలీకుండానే మన కళ్ళు వర్షిస్తుంటాయి. ప్రభాస్ అసలు డైలాగ్ చెప్పకుండానే అతని ముఖాన్ని పట్టుకున్న ఆ ఫ్రేమ్ మనల్ని చాలెంజ్ చేస్తుంది... మీ కంట్లో తడి రాకుండా ఆపుకోగలరా అని...    

ఒక ఫ్రేమ్ కోసం, ఒక ఫీలింగ్ కోసం, ఒక డైలాగ్ కోసం, డైలాగ్ లేని ఒక క్లోజప్ కోసం... మొత్తంగా మీ మార్క్ క్రియేటివిటీ కోసం... మీ సినిమాల్ని మేం చూస్తూనే ఉంటాం.   

'రంగమార్తాండ' తీస్తారో, ఇంకేం తీస్తారో... తీయండి. తీస్తూ ఉండండి. మేం చూస్తూ ఉంటాం. 

వయసుతోపాటు సహజంగా వచ్చే టూ మచ్ మెచ్యూరిటీని మాత్రం మీ దగ్గరికి రానీకండి. 

Bcoz, Age is just a number. Cinema is just an entertainment. 

Happy Birthday, Krishna Vamsi garu. Have a wonderful year ahead... 

- Manohar Chimmani

Wednesday 27 July 2022

సినిమా... కరోనాకు ముందు, కరోనా తర్వాత!


మనిషి జీవితంలో, జీవనశైలిలో, ఆలోచనావిధానంలో, సమయపాలనలో... మొత్తంగా ఒక పెద్ద మార్పు తెచ్చింది కరోనా. 

కరోనా పోయింది, ఇంక "అంతా ఓకే" అనుకొని, మన భ్రమల్లో మనం ఉండి ఏదో అవుతుందనుకుంటే బోర్లాపడతాం. 

ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు జరుగుతోందదే. 

కట్ చేస్తే - 

గత జూన్ వరకు, 2022లో, తెలుగులో సరిగ్గా 100 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో కేవలం ఒక 6 సినిమాలు నిజంగా హిట్ అయ్యాయి. ఇంకొక 6 సినిమాలు హిట్ అయ్యాయి అనిపించుకున్నాయి. 

దీన్నిబట్టి విషయం అర్థం చేసుకోవచ్చు. సినిమా సక్సెస్ రేట్ కేవలం 3 శాతానికి పడిపోయింది. ఇది అంతకుముందు 5 నుంచి 10 వరకుండేది.   

అరుదుగా వచ్చే ఒకరిద్దరు పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలకోసం మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్ళి సినిమా చూస్తారు.

అది కూడా కొంచెం అటూఇటూ ఉందంటే నిర్మొహమాటంగా తిప్పికొడతారని మొన్నొక సినిమా విషయంలో రుజువైంది కూడా. 

అంటే - ఫ్యాన్స్‌కు కూడా అంత ఓపికలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. 


ఇంక - పాయింట్ నంబర్ టు... 

టికెట్ రేట్స్. 

ఒక సింపుల్ లాజిక్ మనవాళ్ళు పక్కనపెడ్తున్నది ఏంటంటే - టికెట్స్ నిజంగా వేలల్లో లక్షల్లో తెగేది, కొనేది, చూసేది మాస్ ప్రేక్షకులే. వారి ద్వారానే సినిమాలకు 70-80 శాతం ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్ కూడా ఓటీటీలకు బాగా అలవాటయ్యారు. 

వారికి చేతిలోనే/ఇంట్లోనే సినిమా చూసే సౌకర్యం ఓటీటీల రూపంలో రెడీగా ఉన్నప్పుడు, థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసే విషయాన్ని సింపుల్‌గా లైట్ తీసుకుంటున్నారు. 

టికెట్ రేట్స్ పెంచితే ఇంకా లైట్! 

ఇది కరోనా తర్వాత వచ్చిన మార్పు. 

మనం కోట్లల్లో రెమ్యూనరేషన్స్ పెంచుకొని, అదంతా రకరకాల పద్ధతుల్లో ఈ మాస్ సెంగ్మెంట్ నుంచి ఆశించడం వృధాప్రయాసే. 

వేరే సెగ్మెంట్స్ సినిమాలు చూసేది తక్కువ, రాసేది ఎక్కువ!  అసలు ఈ "అన్నీ మాకు తెలుసు" అనుకునే ఈ మేధావి సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం లెక్కలోకే రాదు.        

ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా - చిన్న హీరోలకూ పెద్ద హీరోలకూ పది కోట్ల నుంచి, వందా నూటయాభై కోట్లవరకు రెమ్యూనరేషన్ పెంచుకొని సినిమాలు తీస్తే కష్టం.

సినిమా ఎంత బాగున్నా అంత బడ్జెట్లు వెనక్కిరావు. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్. 

మార్కెట్‌ను బాగా స్టడీచేసి సినిమాలు చేయాల్సి ఉంటుంది. 

మంచి సినిమా అని "పేరు" తెచ్చుకోవడం సమస్య కాదు. పేరు అనేది ఫేస్‌బుక్‌లో కావల్సినంత వస్తుంది. ఆ సినిమాకు పెట్టిన డబ్బు వెనక్కిరావాలి. లాభాలూ రావాలి. అదంత ఈజీ కాదు. 

ప్రపంచ సినిమా ఇప్పుడు ప్రేక్షకుడి అరచేతుల్లో ఉంది. మనం మనకిష్టమొచ్చినట్లు ఏవో లెక్కలు వేసుకొని సినిమా తీస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. 


భవిష్యత్తులో కూడా సినిమా ఉంటుంది. థియేటర్లూ ఉంటాయి. కాని, ఇంతకుముందులా ఒక టాప్ ప్రయారిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లా మాత్రం కాదు.  

మాస్, క్లాస్ బేధం లేకుండా - ఏ సెగ్మెంట్ ప్రేక్షకులకైనా - థియేటర్‌లో సినిమా చూడ్దం అనేది ఇప్పుడొక ఆప్షన్ మాత్రమే. 

Tuesday 26 July 2022

ప్రేయసి... ప్రయోగశాల!


వైజాగ్‌లో ఉన్న నాకత్యంత ప్రియమైన ఒక ఫ్రెండ్‌కూ నాకూ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది.

కొంచెం ఏం కాదు, చాలానే వచ్చింది. 

మొన్నొకసారి మళ్ళీ కలిశాం. కాని, ఆ గ్యాప్ గ్యాప్‌గానే ఉంది. 

జీవితంలోని ఏదో ఒక దశలో ఇలాంటి జెర్క్‌లు ఎవరికైనా కొన్ని తప్పవనుకుంటాను.

అకారణంగా ఎలాంటి గొడవలు, గొడవలకు కారణమైన దారుణాలేం లేకుండానే వచ్చిన ఈ గ్యాప్ నన్ను నేను చాలా విధాలుగా విశ్లేషించుకోడానికి కారణమైంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా విషయాల్లో నేను నిరాసక్తంగా మారిపోయాను. 

అందులో ఒకటి నా బ్లాగింగ్.  

కట్ చేస్తే - 

థాంక్స్ టూ మై ఫ్రెండ్ ఇన్ వైజాగ్... నాలో వచ్చిన ఈ 'బ్లాగర్స్ బ్లాక్‌'ను బ్రేక్ చేయడం కోసం తనని గుర్తుతెచ్చుకొంటూ ఈ పోస్టు రాయడం మొదలెట్టాను. 

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయటం లేదు ఈమధ్య. 

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం... నిజంగానే పెద్ద నేరం. 

ఏదో రాసి, ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. కరోనా లాక్ డౌన్  సమయంలో నేను ఎదుర్కొన్న ఎన్నో ఊహించని సంఘటనల నేపథ్యంలో నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇప్పుడు నాకు నిజంగా తప్పనిసరి. 

ఖచ్చితమైన లక్ష్యాలతో ఎవరేమనుకుంటారోనన్న పనికిరాని సంకోచాలేం లేకుండా ఒక్కొక్కటీ పూర్తిచేసుకొంటూ ముందుకెళ్తున్నాను. 

ఈ నేపథ్యంలో నాకెంతో ప్రియమైన నా బ్లాగింగ్ చాలా తగ్గిపోయింది. 

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక గిఫ్ట్. నాకత్యంత ఇష్టమైన నా సహచరి, నా ప్రేయసి.  

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు. 

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే. ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను. 

బ్లాగింగ్ నిజంగా ఒక స్ట్రెస్‌బస్టర్.

ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా నేను ఎన్నోసార్లు గుర్తించాను. చాలా సార్లు ఈ విషయం గురించి ఇదే బ్లాగ్‌లో రాశాను.  

జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు కూడా నిజంగా నన్ను కాపాడేది ఈ అలవాటే. ఈ థెరపీనే. ఈ యోగానే. 

నేను రాయాలనుకున్న కొన్ని పుస్తకాల గురించి, స్క్రిప్టుల గురించి, ఇంకెన్నో క్రియేటివ్ థింగ్స్ గురించి నాకు మొట్టమొదటగా ఐడియా ఫ్లాష్ అయ్యిందీ, అయ్యేదీ కూడా... ఇలా బ్లాగింగ్ చేస్తున్నప్పుడే. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist. Sometimes I think of it as mulching a garden." ~Kate Christensen

Wednesday 20 July 2022

లైగర్ తర్వాత బాలీవుడ్‌లో పూరి బిజీ!


రేపు ఉదయం 9.30 కి పూరి-విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ రిలీజ్ ఉంది.  

చిరంజీవి, ప్రభాస్... ఇద్దరూ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడే చూశాను. 

లైగర్ మీద అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. చూడాలి మరి... ఈ ఇద్దరు కలిసి ఏంచేస్తరో! 

ఈ మధ్యకాలంలో నేను వేరే ఏ సినిమా ట్రైలర్ కోసం అసలు ఆలోచించలేదు. దీనికోసం మాత్రం రేపు పొద్దున 9.30 కి తప్పక చూస్తాను. 

కట్ చేస్తే- 

వరంగల్‌లో ఒక సినిమా ప్రిరిలీజ్ ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వెళ్ళినప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. "దేశాన్నే ఊపేద్దాం" అన్న అర్థంలో లైగర్ సినిమా గురించి విజయ్ అప్పుడే హింట్ ఇచ్చాడు. 

మొత్తం 5 భాషల్లో - ఆగస్ట్ 25 నాడు - ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. హిందీలో కూడా హిట్ అవ్వాలి.

పూరి జగన్నాధ్‌కు, విజయ్‌కి కూడా ఈ హిట్ చాలా అవసరం. 

లైగర్ హిట్ పూరి జగన్నాధ్‌ను బాలీవుడ్‌లో బాగా బిజీ చేస్తుంది. అదే జరగాలి. బహుశా అదే జరుగుతుంది కూడా. 

నిజానికి, పూరి అసలు అనుకోలేదు. లేదంటే - ఇప్పటికి ఎప్పుడో బాలీవుడ్‌లో ఒక టాప్ డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యుండేవాడు.     

Saturday 16 July 2022

ఆడియో పాడ్‌కాస్టా, వీడియోనా?


మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాను... 

ఆడియో పాడ్‌కాస్టా, వీడియోనా అని అని దాదాపు సంవత్సరం నుంచి - గుర్తొచ్చినప్పుడల్లా అనుకొంటూ - ఒకసారి ఇదనీ ఒకసారి అదనీ - ఎటూ తేల్చుకోలేక, గత కొద్ది నెలలుగా, అసలావైపు ఆలోచించడం మానేశాను. 

చివరికి... ఇప్పుడొక నిర్ణయానికొచ్చాను. 

కట్ చేస్తే - 

మనవాళ్ళు ఇంకా ఆడియో పాడ్‌కాస్ట్‌లకు అంతగా అలవాటుపడలేదు. యూట్యూబ్ వీడియోలకే అత్యధికశాతం మంది అంకితమయ్యారు. 

మనదేశంలో కూడా  వేళ్లమీద లెక్కించగలిగినంతమంది పాపులర్ పాడ్‌కాస్టర్స్ ఉన్నారు. తెలుగులో కూడా ఉన్నారు. కాని, అభివృద్ధిచెందిన పాశ్చాత్యదేశాల్లో పాపులర్ అయినంతగా ఇక్కడ మనదేశంలో పాడ్‌కాస్ట్ ప్రాచుర్యం కాలేదు. 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 'ప్రోగ్రెస్' అనేది పశ్చిమ దేశాల్లో ఒక జీవనవిధానం. వాళ్ళు వాకింగ్ చేస్తున్న సమయంలో, డ్రైవ్ చేస్తున్న సమయంలో కూడా ఆడియో బుక్స్, ఆడియో ప్రోగ్రామ్స్, పాడ్‌కాస్ట్‌లు వింటుంటారు. పాడ్‌కాస్ట్‌లు రోజూ మిలియన్స్‌లో డౌన్‌లోడ్ అవుతుంటాయి. 

మనం ఇంకా అక్కడిదాకా రాలేదు.   

అయితే - ఆడియో పాడ్‌కాస్ట్‌లకు ఎడిక్టయ్యే రోజు ఇక్కడ కూడా తప్పక వస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం కొంచెం లేటు... అంతే. 

మార్కెటింగ్ పరంగా ఒక్క నిజం మాత్రం ఒప్పుకొని తీరాలి. ఏంటంటే - వీడియోలు చూపినంత ప్రభావం మార్కెటింగ్ విషయంలో ఆడియోలు చూపలేవు. ఎఫ్ ఎం రేడియోల్లాంటివి కొంతవరకు ప్రభావం చూపిస్తున్నా... అవి వీడియోలకు పోటీ కావు. 

ముఖ్యంగా... బ్రాండింగ్ విషయంలో పాడ్‌కాస్ట్ ప్రభావం మరీ స్లో. 

కాని, దీనికున్న అడ్వాంటేజెస్ దీనికున్నాయి. 

ఇలాంటి ఆలోచనల మధ్య - నేను ఏదో ఒకటి త్వరగా ప్రారంభించాలనుకొంటున్నాను. 

వ్యక్తిగతంగా, మార్కెటింగ్ పరంగా ఇప్పుడు నాకీ అవసరం ఉంది.  

అయితే - ఏది ప్రారంభించినా అది 100% నేనే చేసుకోవాలి. ఎడిటింగ్, డిజైనింగ్, ఇతర టెక్నికల్ విషయాల కోసం ఇంకొకరి మీద నేను ఆధారపడకూడదు. నా సమయం వృధా కాకూడదు. 

రాత్రే ఈ విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చేశాను. త్వరలోనే ప్రారంభిస్తున్నాను...

అది పాడ్‌కాస్టా, వీడియోలా అన్నది కొద్దిరోజుల్లో మీరే చూస్తారు.      

Thursday 14 July 2022

BECOME MY FUNDING PARTNER!



సినిమాలంటే ఇష్టం... ఫిలిం ప్రొడక్షన్‌ పట్ల ఆసక్తి... సెలెబ్రిటీ హోదాపైన ప్యాషన్... మొత్తంగా, ఎలాగైనా సరే వెంటనే ఫిలిం ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలన్న కోరిక... ఇవన్నీ మీలో ఉన్నాయా?

మీరు ఎన్నారైలా?... డాక్టర్సా?... ఇంజినీర్సా?... ఎంట్రప్రెన్యూర్సా?... ఇతర ప్రొఫెషనల్సా?

చిన్న స్థాయిలో ఏదైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నారా?

అయితే, ఈ పోస్ట్ మీకోసమే!    

థాంక్స్ టు కరోనా లాక్‌డౌన్... ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం బిజినెస్, ఫిలిం మేకింగ్ స్టయిల్స్... అన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. 

సంవత్సరానికి ఏ నాలుగో. అయిదో వచ్చే భారీ హీరోల సినిమాలను, ప్యాన్ ఇండియా సినిమాలను పక్కనపెట్టండి. ఆ సెగ్మెంట్ వేరే, ఆ లెక్కలు పూర్తిగా వేరే.   

కరోనా తర్వాత, ఇప్పుడంతా ఇండిపెండెంట్ సినిమాల హవా నడుస్తోంది.  

ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is the king.
Money is the ultimate goal.

మీరు ప్రొడ్యూసర్ అవుతారా, కోప్రొడ్యూసర్ అవుతారా, హీరో అవుతారా... మీ ఇష్టం. ఇదంతా సాధ్యమే. 


మార్కెట్‌నూ బిజినెస్‌నూ బాగా స్టడీ చేసి, ఒక అవగాహనతో సినిమా నిర్మించినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బులూ వస్తాయి. పేరూ వస్తుంది. ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా వస్తుంది. 

అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఇదంతా ఇప్పుడు అతి సులభంగా సాధించవచ్చు. 

ఓటీటీల నేపథ్యంలో - ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. 

చిన్న బడ్జెట్ సినిమాల రిలీజ్ సమస్యకు కూడా ఈ ఓటీటీలే ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపాయి. ఇకనుంచీ, 60% చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లోనే రిలీజవుతాయి.

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్, ఎంత చిన్న పెట్టుబడితోనయినా సరే ఇప్పుడు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు! 

బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ, సినిమా పట్ల ప్యాషన్ ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ ఇదొక మంచి అవకాశం. OTTల ప్రారంభంలో ఉండే అత్యధిక స్థాయి బిజినెస్‌ను ఇప్పుడు సులభంగా క్యాష్ చేసుకోవచ్చు.

మీరు హీరో కావాలనుకుంటున్నారా? హీరోయిన్ కావాలనుకొంటున్నారా? ఒక మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కావాలనుకొంటున్నారా? ఒక పాపులర్ విలన్ కావాలనుకొంటున్నారా?...

ఓవర్‌నైట్‌లో మీరనుకొంటున్నది ఏదైనా సాధ్యమే. 


24 క్రాఫ్ట్స్‌లో ఏదైనా ఒక మంచి స్కిల్ మీలో ఉండి కూడా, మీకు ఇండస్ట్రీలో ఎంట్రీ దొరకడం లేదా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే. 

ఆల్రెడీ మీరు ఇతర వృత్తి-వ్యాపారాల్లో స్థిరపడి ఉండి, ఒక కో-ప్రొడ్యూసర్‌గా చేరి, అసలు ఫిలిం బిజినెస్ ఎలా ఉంటుందో స్టడీ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో మీకు ఇది కూడా సాధ్యమే.

ఇవన్నీ కాదు... జస్ట్ ఒక సోషలైట్‌గానే ఉండి, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమయ్యే ఫోకస్, ప్రమోషన్, సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే. 

యస్... నిజంగా, ఎలాంటి అతిశయోక్తిలేకుండా, ఇవన్నీ ఓవర్‌నైట్‌లో సాధ్యమే!   

అయితే - అందరిదగ్గర సాధ్యం కాదు. అన్ని చోట్లా సాధ్యం కాదు. అన్ని వేళలా సాధ్యం కాదు.  

లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో - ప్రపంచవ్యాప్తంగా ఫిలిం బిజినెస్‌లో కొత్తగా వచ్చిన అనేక క్రియేటివ్ & ఇన్‌కమ్ అవెన్యూస్ నేపథ్యంలో - అనుభవం ఉన్న ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేసి, వాటి ప్రి-ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాను.

తర్వాత, ఇండిపెండెంట్ సినిమాల సెగ్మెంట్‌లో ఇదే ఒక భారీ 'ప్రొడక్షన్ హౌజ్' అయినా ఆశ్చర్యం లేదు.  

ఒక లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్‌గా, మీకు సాధ్యమయిన ఇన్వెస్ట్‌మెంట్‌తో, 'లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్‌' గా నాతో కొలాబొరేట్ అవండి... ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ అయిపోండి. 


మీ ఇన్వెస్ట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ లీగల్ అడ్వైజర్స్ సలహాతో స్పష్టంగా పేపర్ మీద రాసుకొని, సంతకాలతో నోటరైజ్ చేయటం జరుగుతుంది.

నిజంగా ఆసక్తి వుండి, వెంటనే ఇన్వెస్ట్ చేయగల సౌకర్యం ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 

Whatsapp: +91 9989578125.  
email: mchimmani10x@gmail.com

కలిసి పనిచేద్దాం... కలిసి ఎదుగుదాం.

Welcome to Film Industry! 

- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer, Blogger
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association

ABOUT MANOHAR CHIMMANI: 
Short Intro AV on Manohar Chimmani: 

మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):

About Manohar Chimmani (English): 

Tuesday 12 July 2022

Addicted to KCR!


"ఎనిమిది సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది?" 

మొన్న సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఇదీ కేసీఆర్ గారి సూటి ప్రశ్న. 

ఎవరికైతే ఈ ప్రశ్నను కేసీఆర్ వేశారో - దీనికి సమాధానం ఇచ్చే బాధ్యత తీసుకొనే స్థాయిలో వారు లేరు. ఆ స్థాయికి ఎదగలేరు కూడా అని ప్రతిరోజూ స్వయంగా వారి వాట్సాప్ కంటెంట్‌తో వారికి వారే ప్రూవ్ చేసుకుంటున్నారు.   

"కరెంట్ ఇవ్వలేరు, సాగునీరు ఇవ్వలేరు, మంచినీరు కూడా ఇవ్వలేరు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంట్ కోతలు, త్రాగడానికి మంచినీళ్ళు లేవు! ఇదీ మీ ప్రభుత్వం... ఇది నిజం కాదా?"

ఇది కేసీఆర్ గారి ఇంకో సింపుల్ కొశ్చన్. కాని, వాళ్ళు దీన్ని నిజమని ఒప్పుకోరు, జవాబివ్వలేరు.  

"సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటింది" అని చెప్పే అంత స్థాయిలో అసలు మీరున్నారా? అంత స్థాయి పనులు మీరు ఏం సాధించారని సుప్రీంకోర్టు జడ్జీలనే ట్రోలింగ్ చేస్తున్నారు?  

"ఒక రైతు భీమా ఇచ్చే తెలివి ఉందా మీ గవర్నమెంటుకు?" 

"నాన్ బిజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎక్కువుందన్న విషయం అసలు మీకు తెలుసా?" 

"ది హిందు పత్రిక ఎడిటర్ ఎన్ రాము, ఎన్‌డిటీవీ ప్రణయ్ రాయ్‌లను నక్సలైట్లని పేరుపెడతారా?"  

"ఇండియన్ డెమాక్రసీని ఘోరంగా హత్యచేస్తున్న మీరు, ఇంకెందరో ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని సిగ్గులేకుండా బాహాటంగా చెప్పుకుంటారా?"  

"మీరు ప్రజాస్వామ్య హంతకులు కారా?"  

"రఘురాం రాజన్, అమర్త్యసేన్, ఇతర ప్రపంచ ఆర్థికవేత్తలు చెప్తున్న వాస్తవాలు అసలు వింటున్నారా?"   

"నేను చాలా బాధతో చెప్తున్నాను ఏందంటే - దేశంలో ఇంతవరకు ఏ మూర్ఖుడు కూడా చేయని పనుల్ని ఈ ప్రధానమంత్రి చేస్తున్నాడు... మీకు తెలుసా?" 

"దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తున్నాడు... మీకు తెలుసా?"

... ... ...  

గ్యాప్ లేకుండా, యుద్ధభూమిలో బాంబుల మోతలా... ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ప్రశ్నల వర్షం! 

కాని, అవతలివైపు నుంచి సమాధానాలు ఇచ్చేంత సీన్ లేదు... ఇవ్వలేరు.    

కట్ చేస్తే -

మన ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టారు: "ముఖ్యమంత్రి గారి రెండున్నర గంటల మారథాన్ ప్రెస్‌మీట్ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ఎక్సలెంట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్! అవతల కొందరు 8 ఏండ్లు అవుతున్నా ఒక్క ప్రెస్‌మీట్ ఫేస్ చేయడానికే వణుకుతున్నారు!!" అని.

ఒక్క ప్రెస్‌మీట్ ఫేస్ చెయ్యడానికి 8 ఏండ్లుగా వణుకుతున్నదెవరో మనకు తెలుసు, అందరికీ తెలుసు. 

నిజానికి, కేసీఆర్ ప్రెస్‌మీట్స్ పైనే పొలిటికల్ సైన్స్ పరిశోధకులు పిహెచ్‌డిలు చేయాల్సి ఉంది, చేస్తారు కూడా. 

మా కంపెనీ సైట్ మేలా నుంచి తిరిగివస్తూ - కేసీఆర్ గారి మొన్నటి ప్రెస్‌మీట్ చివరి అరగంట మాత్రమే చూడగలిగాను. నేను చూసిన ఆ అరగంటలోనే కావల్సినన్ని కొత్త పదాల్ని, కొత్త పంచ్‌ల్ని, కొత్త భావాల్ని, కొత్త నినాదాల్ని ఇచ్చారు "కంటెంట్ కింగ్" కేసీఆర్. 

"హ్యూమన్ క్యాపిటల్." 
అసలు ఈ పదం ఎప్పుడైనా ఈ దేశాన్ని పాలిస్తున్నవాళ్ళు విన్నారా? 

"ఇండియా రియాక్ట్స్!" 
కేవలం రెండు పదాల్లో ఇంత ప్రొయాక్టివ్, ఇంత పవర్‌ఫుల్ స్లోగన్ ఒకదాన్ని వీళ్ళు సృష్టించగలరా? 

భారతదేశంలో కురిసే వర్షపాతం అంకెల్ని పేపర్ మీద రాసిచ్చినా, కనీసం చూసి చదవగలరా వీళ్ళు? 

జింబాబ్వేలో, రష్యాలో, చైనాలో, అమెరికాలో ఉన్న భారీ నీటి రిజర్వాయర్ల గురించి అధ్యయనం చేసి, వాటి కెపాసిటీని అంకెల్లో ఆశువుగా చెప్పేంత సీన్ వీరికి ఎన్నటికైనా వస్తుందా? 

75 ఏళ్ళ భారత రాజకీయ చరిత్రలో జరుగుతున్నది కేవలం "బ్లేమ్ గేమ్" తప్ప మరొకటి కాదు అని చెప్పేంత విశ్లేషణ, వివేచన వీరికుందా? ఎప్పటికైనా తెలుసుకుంటారా?

మారుతున్న కాలమాన పరిస్థితులు, అవసరాలు, అభివృద్ధినిబట్టి - ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగాన్ని రివైజ్ చెయ్యాలని చెప్పిన థామస్ జెఫర్సన్ గురించి వీరెప్పుడైనా విన్నారా?  

ఒక అరగంటలో ఏదో ఒక చిన్న బ్లాగ్ రాసి పోస్ట్ చేద్దామనుకున్నవాణ్ణి... దాన్ని పక్కనబెట్టి, మొత్తం ప్రెస్‌మీట్‌ను మళ్ళీ మొదటినుంచి చూశాను. 

దటీజ్ కేసీఆర్. 

రెండు గంటల పక్కా కమర్షియల్ సినిమాను చూడటమే కష్టమైపోతున్న ఈ డిజిటల్-సోషల్ యుగంలో - కేసీఆర్ గారి రెండున్నర గంటల నాన్-స్టాప్ మారథాన్ ప్రెస్‌మీట్‌ను నిమిషం మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్... వారికి పార్టీలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తికాదు. 

కేసీఆర్ అందించే కంటెంట్ స్థాయి అలాంటిది. ఆ స్థాయిని రీచ్ కావడం అందరివల్ల కాదు. వాట్సాప్ యూనివర్సిటీలు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేవు.   

కట్ చేస్తే -

మొన్న 5 వ తేదీనాడు... మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆవిష్కరించిన నా పుస్తకానికి ముందు నేననుకొన్న పేరు "ఎడిక్టెడ్ టు కేసీఆర్". 

ఆ పేరుతో చేసిన కవర్ డిజైన్ ఇంకా నాదగ్గర భద్రంగా ఉంది.  

కాని, 'ఎడిక్టెడ్' అన్న నెగెటివ్ పదంతో టైటిల్ వద్దు అని ఒకరిద్దరు మిత్రులు అనడంతో ఆ టైటిల్ పక్కనపెట్టి, "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" అన్న టైటిల్‌తో ప్రచురించాను. 

వాస్తవానికి, కేసీఆర్ నిజంగా ఒక ఎడిక్షన్.

ఒకసారి వారి ఆలోచనలకు, వారి వ్యూకి, వారి విజన్‌కి కనెక్ట్ అయ్యామా... ఇంక అంతే.  

నిన్నటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చెప్పినట్టు, 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి ఈ దేశం బయటపడాలి. అవుటాఫ్ ద బాక్స్ రాజకీయాలు రావాలి.  

ఈ దిశలో కూడా ఒక మహోఉద్యమం ప్రారంభం కాబోతోందని నేననుకొంటున్నాను. ఆ మహోద్యమానికి కేసీఆరే నాయకత్వం వహిస్తారన్నది స్పష్టం. అందుకోసం, అవసరమైతే టీఆరెస్ జాతీయపార్టీగా కూడా మారుతుంది. 

ఇది డిజిటల్-సోషల్ యుగం. కొన్ని నెలలల్లోనే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా ఫ్లిప్ చేయగల టెక్నాలజీ, మీడియా, సోషల్ మీడియా మన ముందున్నాయి. 

ఒక్క చిన్న ఆలోచన చాలు, ఒక్క చిన్న ట్విస్ట్ చాలు, పదునైన ఒకే ఒక్క వ్యూహం చాలు. ఓవర్‌నైట్‌లోనే దేశ రాజకీయ ముఖచిత్రంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. 

ఇప్పుడలాంటి పరిణామాల కోసం దేశం ఎదురుచూస్తోంది. 

సంకల్పం గొప్పది, శక్తివంతమైనది అయినప్పుడు... ఈ సర్వ ప్రపంచం, ఈ అనంతవిశ్వం కూడా పాజిటివ్‌గా కుమ్మక్కై... ఆ సంకల్పాన్ని నిజం చెయ్యడానికి సహకరిస్తాయంటారు.

కేసీఆర్‌లో ఆ సంకల్పం ఉంది. 

వారి సంకల్పానికి మనం కూడా సహకరిద్దాం.  

Thursday 7 July 2022

ఒక్క కేటీఆర్, వంద నైపుణ్యాలు! - 2.0


మొన్నీమధ్యే "ఒక్క కేటీఆర్, వంద నైపుణ్యాలు" పేరుతో ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను నేను. దాన్లో కొంత భాగాన్ని తీసుకొని, "కేటీఆర్ అంటే ఇప్పుడొక  బ్రాండ్" అన్న టైటిల్‌తో నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురించారు.

ఆ బ్లాగ్‌లో నేను రాసినట్టు - సందర్భం, సమావేశం ఏదైనా కానీ... తన మార్క్ చెణుకులు ఒకటో రెండో వేయకుండా కేటీఆర్ ఉపన్యాసం పూర్తికాదు!

ఇవ్వాళ 1200 కోట్ల పెట్టుబడితో శంషాబాద్‌లో రెండు యూనిట్లు ప్రారంభించిన "శాఫ్రాన్ ఏరోస్పేస్" (ప్యారిస్) ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కూడా, కేటీఆర్ నుంచి ఆయన స్టయిల్లో ఒక మంచి చెణుకు పడింది:   
  
"యూరోప్ నుంచి హైద్రాబాద్‌కు డైరెక్ట్ ఫ్లయిట్‌లో - అవసరమైతే ఢిల్లీని స్కిప్ చేసి - రండి!" అని డయాస్ మీదున్న శాఫ్రాన్ వాళ్ళతో చెప్పాడు కేటీఆర్!  

ఇలాంటివి అర్థం కావాలంటే వాట్సాప్ యూనివర్సిటీలు కనీసం 10 జన్మలెత్తాలి!

కట్ చేస్తే -

ఇదీ మొన్నటి నా బ్లాగ్ పోస్ట్:

***
12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటి అయిన "ఎలెస్ట్" కంపెనీ తెలంగాణలో రూ. 24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్‌ప్లే ఫ్యాబ్ యూనిట్‌ను ప్రారంభించడానికి ఒప్పందంపై సంతకం చేసింది.  దీంతో - ఈ రంగంలో ప్రపంచస్థాయి దిగ్గజాలయిన జపాన్, కొరియా, తైవాన్‌ల సరసన ఇప్పుడు తెలంగాణ చేరింది.    

మే 2022: లండన్, దావోస్‌లలో 10 రోజుల పర్యటన. 45 వ్యాపార సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానల్ డిస్కషన్ సమావేశాలు, రూ. 4,200 కోట్ల పెట్టుబడులు.  

మార్చి 2022: వారం రోజుల యూయస్ ట్రిప్. 35 వ్యాపార సమావేశాలు, 4 సెక్టార్ రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 భారీ గ్రీట్ అండ్ మీట్ సమావేశాలు, రూ. 7,500 కోట్ల పెట్టుబడులు.   

ఈ డిజిటల్-సోషల్ యుగంలో - ఒక రాష్ట్ర దార్శనిక ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ఒక మంత్రి, ఆయన టీమ్ పనిచేస్తున్న శైలి ఈ స్థాయిలో ఉంటుంది. 

ఆ రాష్ట్రం తెలంగాణ.
ఆ ముఖమంత్రి కేసీఆర్.
ఆ మంత్రి పేరు కల్వకుంట్ల తారకరామారావు-ఉరఫ్-కేటీఆర్.    

కట్ చేస్తే - 

మొన్న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి మనదేశం నుంచి చాలామంది మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడ వెళ్ళారు. కాని, మన తెలంగాణ శిబిరం దగ్గర జరిగినంత యాక్టివిటీ మరే ఇతర శిబిరం దగ్గర జరగలేదు.

ఒక ప్రత్యేక వార్తాంశంగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో, మీడియాలో షేర్ చేసిన వాస్తవం ఇది!    

మన దేశం నుంచి గతంలో గాని, ఈ మధ్య గాని ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రుల టీమ్స్ ఇదే దావోస్‌కు చాలాసార్లు వెళ్ళాయి. యూయస్, యూకే, యూరప్‌ల్లో అనేక విదేశీ పర్యటనలు కూడా చేశాయి. అయితే గతంలోదంతా "ప్రపోజల్ పెట్టాం. అయితే అవుద్ది, లేకపోతే లేదు" అన్న సాంప్రదాయికశైలి. "ఎందుకు కాదు, మనమెందుకు సాధించలేం" అన్న ప్రోయాక్టివ్ దృక్పథం కేటీఆర్‌ది. 

ఇంత డైనమిజమ్, ఇంత స్పష్టత, ఇలాంటి అత్యంత వేగవంతమైన భావవ్యక్తీకరణ, సందర్భం ఏదైనా సరే - అలవోకగా ఎదుటివారిని మెస్మరైజ్ చేసే తనదైన ఇంగ్లిష్ శైలి... ఇవన్నీ ఇంతకుముందు మనదేశంలో ఏ రాష్ట్ర మంత్రిలోనైనా చూశామా అన్నది నాకు జవాబు దొరకని ప్రశ్న.   

"భారత్ వైవిధ్యమైన దేశం. ఈ దేశంలో పెట్టుబడులుపెట్టి వ్యాపారం చేయాలనుకున్నా, ఇంకే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నా సరే, మీరు ఏ రాష్ట్రం నుంచి ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారు అనేది చాలా కీలకం!" 

"తెలంగాణ రాష్ట్రం పోటీపడుతున్నది ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు. ప్రపంచంలోని ది బెస్ట్ రాష్ట్రాలతో!" 

ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్, ఆ ఆత్మవిశ్వాసం కేటీఆర్‌లో ఉన్నాయి.    

కట్ చేస్తే - 

కేటీఆర్ జీవితం ఒక్క రాజకీయాలతోనే నిండిపోలేదు. ఆయన జీవనశైలి నిజంగా విశిష్టమైంది. కొత్తతరం నాయకులు, యువతరం కచ్చితంగా అనుసరించతగ్గది.

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో కేటీఆర్ ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ మళయాళ సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే - అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే - తన మార్క్ చెణుకులు ఒకటోరెండో అలా అలవోగ్గా పడాల్సిందే! 

ట్విట్టర్‌ను కేవలం రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించిన వ్యక్తి కేటీఆర్. టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా, నిత్యం తన దైనందిన రాజకీయ, ప్రభుత్వ, సాంఘిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే - ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలకు స్పందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారు కేటీఆర్.      

ఇన్ని పార్శ్వాలు, ఇన్ని నైపుణ్యాలు, ఇంత పాజిటివ్ స్పిరిట్, ఇంత ఎనర్జీ, ఇంత దూకుడు ప్రదర్శిస్తూ వడివడిగా ముందుకు సాగిపోతున్న కేటీఆర్ ఒక రాష్ట్ర మంత్రి మాత్రమే అంటే ఆయన పరిధిని తగ్గించినట్టవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో కేటీఆర్ అంటే... ఒక బ్రాండ్.    

కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. ఉండితీరాలి. ఒక లక్ష్యం లేకుండా ఎవ్వరూ ముందుకుసాగలేరు. ఏం సాధించలేరు. కాని, ఆ లక్ష్యాలు సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సివుంటుంది. ఆ కృషి సగటు మనదేశంలో ఒక "ఎక్స్" అనుకుంటే, కేటీఆర్‌లో మనం చూస్తున్న అత్యంత కనిష్ట సగటు "10 ఎక్స్". అంటే కనీసం పదింతలన్నమాట! 

తెలంగాణమీద అణువణువున మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, కృషి సాధ్యం కాదు. ఆ మమకారం కేటీఆర్‌కు అత్యంత సహజసిద్ధంగా కేసీఆర్ గారి నుంచి వచ్చిందనుకోవచ్చు. కాని, దాన్ని ఊహించని ఎత్తులకు తీసుకుపోతూ, తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ, జాతీయ అంతర్జాతీయ వేదికలమీద శ్లాఘించబడే స్థాయికి ఎదగడం అన్నది మాత్రం కేవలం కేటీఆర్ వ్యక్తిగత సామర్థ్యం, ఆయన నిరంతర కృషే. .     

దావోస్‌లో మొన్న కేటీఆర్‌ను కలిసిన తర్వాత - అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని "ఇంత భావ వ్యక్తీకరణ, ఇంత స్పష్టత ఉన్న యువరాజకీయనాయకున్ని నేను ఎప్పుడూ చూళ్ళేదు. 20 ఏళ్ళ తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి" అని ట్వీట్ చేశారు.

ఎలాంటి అతిశయోక్తి లేని ఆ ట్వీట్ సృష్టించిన సంచలనం ఇంకా తాజాగానే ఉంది. 

మరోవైపు - కేటీఆర్‌ను సిఎంగా చూడాలని కూడా తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశంలో ఉన్న ఆయన అభిమానులు, ఎన్నారై ఫ్యాన్స్ కూడా ఎందరో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నా దృష్టిలో కేటీఆర్ సిఎం కావడం పెద్ద విషయం కాదు. కేసీఆర్ గారు, టీఆరెస్ పార్టీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుతారు.

దానికీ సమయం వస్తుంది. 

సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థంలేదు. అలాగే సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు కూడా. కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడిందనుకోవచ్చు. కాని, ఆ తర్వాతదంతా కేటీఆర్ స్వయం కృషే అన్నది ఎవ్వరైనా సరే ఒప్పుకొనితీరాల్సిన నిజం.

ఇందాకే చెప్పినట్టు, కేటీఆర్ అంటే రాజకీయాల్లో ఇప్పుడొక బ్రాండ్. 

Tuesday 5 July 2022

థాంక్స్ టు కేటీఆర్... ప్రగతిభవన్‌లో నా బుక్ లాంచ్!


కొందరి గురించి ఎంత చిన్న నిజం రాసినా అది పొగడ్తగానో, లేకపోతే భజనగానో అనిపిస్తుంది. అలాంటివారిలో ఒకరు కేసీఆర్. ఇంకొకరు కేటీఆర్.   

బ్లాగ్‌లో రాసినా, న్యూస్‌పేపర్స్ ఆర్టికిల్స్‌లో రాసినా - నేను వారి గురించి రాసిన ప్రతి ఒక్క విషయం నిజమే రాశాను. కళ్ళముందు జరిగిన విషయమే రాశాను. వారు సాధించిన విజయాలే రాశాను. వారు పూనుకొంటున్న మరెన్నో గొప్ప గొప్ప పనుల గురించి రాశాను. అంతకు ముందు అరవై ఏళ్ళుగా - వేరెవ్వరూ తెలంగాణ కోసం తలపెట్టని, కనీసం ఊహించని ఎన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల గురించి రాశాను. 

వారిద్దరి గురించి నేను రాసిన ప్రతి వాక్యం వెనుక రియాలిటీ ఉంది, లాజిక్ ఉంది.      

పనిచేస్తున్నవారిని గురించి, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గురించి రాస్తే తప్పేంటి? 

ఈ దృక్పథంతోనే - గత కొన్నేళ్ళుగా కేసీఆర్ కేంద్రబిందువుగా నేను రాసిన ఎన్నో బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల ఎడిట్ పేజీలకు రాసిన ఎన్నో ఆర్టికిల్స్‌లోంచి - ఎన్నిక చేసిన కొన్ని ఆర్టికిల్స్‌తో రూపొందించిన అందమైన సంకలనం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం.  

216 పేజీల హార్డ్‌బౌండ్ క్లాసిక్. 

ఈ కంటెంట్‌నంతా - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి తెలంగాణ ప్రజలతో ఒక చిన్న పుస్తకరూపంలో ఇలా పంచుకొంటున్నాను. ఈ చిన్న ప్రయత్నం ఇన్‌స్పిరేషన్‌తో - నాలాంటి ఇంకెందరో బయటికి రావాలని, వాళ్లంతా కూడా వారికి వీలైనవిధంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలన్నది ఈ పుస్తకం ద్వారా నేనాశిస్తున్న ప్రధాన ప్రయోజనం.

త్వరలో జాతీయ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్న సందర్భంగా - గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి - ఒక రచయితగా, ఒక డైహార్డ్ అభిమానిగా నేనందిస్తున్న చిరుకానుక ఈ పుస్తకం. 

ఇక, ఈ పుస్తకానికి సంబంధించి ముఖ్యమైన కొందరు వ్యక్తులకు నా కృతజ్ఞతాభివందనాలను పుస్తకంలో ప్రత్యేకంగా తెలుపుకొన్నాను. వారందరికీ పేరుపేరునా మరొక్కసారి నా ధన్యవాదాలు.     

కట్ చేస్తే - 

ట్విట్టర్‌లో "ఆస్క్ కేటీఆర్" కార్యక్రమం ద్వారా నాకు మాట ఇచ్చినట్టుగానే - ఈరోజు గౌరవ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రగతి భవన్‌లో తన ఛాంబర్‌కు నన్ను ఆహ్వానించి, ఆత్మీయంగా పలుకరించి, మాట్లాడి, అక్కడున్న మరొక మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, ఎంపి రంజిత్ రెడ్డి గారికి, ఇతర విఐపిలకు నన్ను పరిచయం చేసి, నా పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుత  జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేసీఆర్ గారి కోసం ఒక పుస్తకాన్ని, తన కోసం ఇంకో పుస్తకాన్ని కేటీఆర్ గారు నా సంతకంతో అడిగి తీసుకోవడం అనేది ఇంకో గొప్ప అనుభూతి. 

కేటీఆర్ గారు నా పుస్తకం చదివి తన రివ్యూ ట్వీట్ చేస్తానని చెప్పడం... అది ఇంకో లెవెల్ ఫీలింగ్. 

That's KTR garu... 

Progressive Yet Rooted,
Aggressive Yet Inclusive, 
Administrator Par Excellence
Yet Master Political Strategist,
Torchbearer of New Age Politics,
Icon of Modern Telangana &
Brand Ambassador for Telangana Youth... 

Thanks a bunch, Hon Min KTR garu! 

Monday 4 July 2022

కేసీఆర్ - The Art of Politics (Excerpts - 4)


Excerpts from my book "కేసీఆర్ - The Art of Politics"
BOOK RELEASE VERY SOON... 
^^^

“నేను ఏదైనా అంశం మీద పోరాడేటప్పుడు ఇక ఇది అవదు, ఎవరూ నాతో సహకరించడం లేదు, ఇంక వదిలేయమని నా చుట్టూ ఉన్నవారు చెప్పినప్పుడు నాకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు కేసీఆర్ గారే... విశాఖ ఉక్కులో ఎదురయ్యే సమస్యలను, విశాఖ ఉక్కు ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో నాకు అలుపొచ్చిన ప్రతిసారీ… నేను వినేది, చూసేది కేసీఆర్, కేటీఆర్ గారి వీడియోలనే. వాటిని పెయిడ్ చానెల్స్‌లో పెడితే, బహుశా నా నెలజీతం మొత్తం వాటికే ఖర్చు పెట్టేవాడినేమో. ఆయనకు ఉన్న విషయపరిజ్ఞానం, భాష మీద పట్టు సమకాలీన నాయకుల్లో ఎవరికీ లేవనటంలో అతిశయోక్తి లేదు..."
- 'విశాఖ ఉక్కు' నుంచి ఆఫీసర్స్ అసోసియేషన్ లీడర్. 

ఈ మిత్రుడు నా పుస్తకం కోసం ఈ కంటెంట్ రాసిచ్చింది మే నెల 30 కాగా, సరిగ్గా 2 వారాల తర్వాత జరిగిన విశాఖ ఉక్కు ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో 14 జూన్ నాడు విజయం సాధించడం విశేషం.

That was the excerpts from my book "కేసీఆర్ - The Art of Politics", a collection of my blog posts and articles. 

BOOK RELEASE VERY SOON... 

అప్పటిదాకా - మీకోసం ఈ టీజర్: