Thursday 30 June 2022

సోషల్ మీడియా డే!


సోషల్ మీడియా అనేది – ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియాలను ఎప్పుడో బైపాస్ చేసేసింది. 

సోషల్ మీడియాలోకి ఇంకా ఎవరైనా ఎంటర్ కాలేదంటే – అసలు వారి ఉనికి ఈ భూమ్మీద లేనట్టే లెక్క!

ఆ స్థాయిలో తన పవర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది సోషల్ మీడియా...

మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే – ఇప్పుడు మీరున్న స్థానం నిలబెట్టుకోవాలన్నా, ఇంకా పైకి ఎదగాలన్నా, పడాల్సినవారి దృష్టిలో మీరు పడాలన్నా, మీ క్లయింట్స్‌కు/కస్టమర్స్‌కు/ప్రజలకు అతి తక్కువ సమయంలో చేరువకావాలన్నా, కొత్తగా ఏదైనా పార్టీ టికెట్ సంపాదించుకోవాలన్నా, పార్టీ పెట్టాలన్నా, పాన్ డబ్బా పెట్టాలన్నా… “సోషల్ మీడియాలో నువ్వెక్కడ?” అన్నదే మీ మొట్టమొదటి అర్హత అవుతుందంటే అతిశయోక్తి కాదు. 

ఇప్పుడు చెప్పండి... సోషల్ మీడియాలో మీరెక్కడ? 

Happy Social Media Day! 
- Swarnasudha Projects Private Limited

Wednesday 29 June 2022

"కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ప్రిరిలీజ్-ఆర్డర్!


అతిత్వరలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగబోతోంది. ఎవరు ఆవిష్కరిస్తారు, ఎప్పుడు అన్నది బహుశా కొన్ని గంటల్లోనే నేను మీతో షేర్ చేసుకుంటానని అనుకొంటున్నాను. 

కట్ చేస్తే - 

ఆవిష్కరణ తేదీ రాగానే - ఈ పుస్తకం ప్రతులు ఎక్కడెక్కడ దొరుకుతాయన్న సమాచారం కూడా అందిస్తాము. 

హైద్రాబాద్‌లో ఉన్నవారైతే - వెంటనే ఎక్కడో ఒక ప్లేస్‌లో నేరుగా వెళ్ళి కొనుక్కోవచ్చు. హైద్రాబాద్ బయటున్నవారు మాత్రం ఆర్డర్ పెట్టి, తర్వాత కొరియర్-లేదా-పోస్ట్ ద్వారా వచ్చే పుస్తకం కోసం ఎదురుచూడకతప్పదు.   

హైద్రాబాద్‌లో ఉన్నవారిలో కూడా - ఆసక్తిఉన్నవాళ్ళు, పర్సనల్‌గా వెళ్ళి తెచ్చుకొనే సమయం లేనివాళ్ళు కూడా ప్రి-రిలీజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. పుస్తకం ఆవిష్కరణ అయిన వెంటనే, ఎలాంటి ఆలస్యం లేకుండా - కొన్ని గంటల్లోనే అందరికీ కొరియర్-లేదా-పోస్ట్ ద్వారా పుస్తకాల్ని పంపిస్తాము. 

మిత్రులకు, తోటి కేసీఆర్ ఫ్యాన్స్‌కు, కేటీఆర్ ఫ్యాన్స్‌కు, తెలంగాణ ప్రేమికులకు ఒక గిఫ్ట్‌గా ఈ పుస్తకం ఇవ్వాలనుకొనే కేసీఆర్ ఫ్యాన్స్, కేటీఆర్ ఫ్యాన్స్, టీఆరెస్ కార్యకర్తలు, వివిధస్థాయిల్లోని లీడర్స్, రాజకీయవేత్తలు 100, 50, 25, 20, 10 పుస్తకాల చొప్పున బల్క్‌గా ఆర్డర్ ఇవ్వొచ్చు.     

తెలంగాణ ప్రియులు, కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు... మీమీ క్యాడర్స్‌లో మీకిష్టమైనవారికి ఈ పుస్తకం గిఫ్టుగా ఇవ్వటం అనేది నిజంగా మీకొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 

అవసరమైనవారికి ఈ పుస్తకం గిఫ్టుగా అందిచడం ద్వారా... ప్రత్యక్షంగా వారిని, వారి ద్వారా పరోక్షంగా ఇంకెందరినో మీరు ఇన్‌స్పయిర్ చేసినవాళ్ళవుతారు.   

జాతీయరాజకీయాల్లో కేసీఆర్ సంచలనాలు సృష్టించబోతున్న ఈ సందర్భంలో - మీమీ క్యాడర్స్‌లో అవసరమైనవారికి-లేదా-ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం బహుమతిగా ఇవ్వడం అనేది ఒకవైపు వ్యక్తిగతంగా మీకెంతో సంతృప్తినిస్తుంది. రెండోవైపు, కేసీఆర్ కోసం, తెలంగాణ కోసం మీ తరపున వందలాదిమందిని ఇన్‌స్పయిర్ చేసినట్టవుతుంది.  

ఇక - ఏ స్థాయిలోనైనా సరే - ప్రత్యక్షరాజకీయాల్లో ఉన్నవారికైతే - ఇలాంటి ప్రతిచిన్న అవకాశం కూడా ఏదోరకంగా ఉపయోగపడుతుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 

కట్ చేస్తే - 

212 పేజీల ఈ హార్డ్‌బౌండ్ క్లాసిక్ పుస్తకం ప్రి-రిలీజ్ ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్, పుస్తకం ధర గురించిన పూర్తివివరాలతో త్వరలోనే ఇంకో పోస్టుద్వారా మీముందుకొస్తాను. 

అప్పటిదాకా - మీకోసం, ఈ టీజర్:
https://youtu.be/IAJiDFgZgd8         

కేసీఆర్ - The Art of Politics (Excerpts - 3)


Excerpts from my book "కేసీఆర్ - The Art of Politics"
BOOK RELEASE VERY SOON... 

"రాజకీయాలు వేరు... ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి వేరు. ప్రజల దైనందిన జీవితంతో ఏమాత్రం సంబంధం లేని సున్నితమైన విషయాలపైన దృష్టిపెట్టి రెచ్చగొట్టడం ద్వారా అధికారంలో కొనసాగే ప్రణాళికలు వేసుకోవడం అనేది రాజనీతిలో కూడా బహుశా అత్యంత అధమస్థాయి ఆలోచన. 

రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారాన్ని బంగారుపళ్లెంలో పెట్టి ప్రజలు అందించినప్పుడు దాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎనిమిదేళ్ల సమయంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకా అభివృద్ద్ధిచెందుతున్న దేశంగానే ఉన్న మన దేశాన్ని ధనిక దేశాల లిస్టులో చేర్చవచ్చు. కాని, దురదృష్టవశాత్తు కేంద్రంలో అలా జరగటం లేదు. వారి ఆశయాలు వేరు, ఆకాంక్షలు వేరు అన్నది అతి స్పష్టంగా సామాన్యప్రజలకు కూడా అర్థమవుతోంది. దీనికి వ్యతిరేకంగా ఒక భారీ మార్పుకి పడాల్సిన మొదటి అడుగుకోసం ఈ దేశ ప్రజలు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. 

అలాంటి భారీ మార్పులు అతితక్కువకాలంలో కూడా జరగడం సాధ్యమే అని చెప్పడానికి ఈ దేశంలోను, ఈ రాష్ట్రంలోనూ ఇప్పటికే కొన్ని ఉదాహరణలున్నాయి. ఈ దేశంలో ఇప్పుడున్న పొలిటీషియన్స్‌లో అత్యుత్తమస్థాయి పొలిటీషియన్, వ్యూహకర్త, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది తెలియని అంశం కాదు."

That was the excerpts from my book "కేసీఆర్ - The Art of Politics", a collection of my blog posts and articles. 

BOOK RELEASE VERY SOON... 

ఈ పుస్తకాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది మీలో చాలామందికి తెలుసు. ఎప్పుడు అన్నది అతిత్వరలోనే మీకు తెలియజేస్తాను.

అప్పటిదాకా - మీకోసం ఈ టీజర్: 

Sunday 26 June 2022

కేసీఆర్ - The Art of Politics (Excerpts - 2)


Excerpts from my book "కేసీఆర్ - The Art of Politics"
BOOK RELEASE VERY SOON... 

"జలదృశ్యంలో పార్టీ స్థాపన నుంచి, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా... తెలంగాణ ముఖ్యమంత్రి అయి, ఏదేది మనవల్ల కాదు అని ఎగతాళి చేశారో వాటి జేజమ్మల్ని కూడా చాలెంజ్ చేస్తూ చేసి చూపించేదాకా... గత ఇరవై ఏళ్ళ నా జీవిత కాలంలో నా కళ్ళారా నేను చూసిన ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ అయిన కేసీఆర్‌కు నేను ఫ్యాన్‌ను అని చెప్పుకోడానికి నేనేమాత్రం వెనుకాడను.    
 
ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్లాల్సిన అవసరం లేదు. కాని, మన జీవితంలోని ప్రతి చిన్న పార్శ్వాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయాలను మనం పట్టించుకోవడం ఇప్పుడు చాలా అవసరం. అలా పట్టించుకోకుండా నిరాసక్తంగా ఉండిపోవడమంటే, మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేస్తున్నట్టే అనుకోవచ్చు." 

That was the excerpts from my book "కేసీఆర్ - The Art of Politics", a collection of my blog posts and articles. 

BOOK RELEASE VERY SOON... 

ఈ పుస్తకాన్ని ఎవరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం అతి త్వరలో మీతో పంచుకోబోతున్నాను. 

అప్పటిదాకా - మీకోసం ఈ టీజర్: 
https://youtu.be/IAJiDFgZgd8 

Friday 24 June 2022

కేసీఆర్ - The Art of Politics (Excerpts)


"విజయమే లక్ష్యంగా… వందలాది నాయకుల్ని, వేలాది సంఘాల్ని, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ… పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరిగెత్తిస్తూ… తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కేసీఆర్ పద్నాలుగేళ్ల ఉద్యమ జీవితం ఒక ‘సక్సెస్ స్టోరీ’. 

కాగా… ఈ గమ్యం చేరుకోవడంకోసం ఆయన వేసుకొన్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో ఆయన అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు… అదంతా ఒక ‘సక్సెస్ సైన్స్’. 

ఆరు దశాబ్దాలుగా రగులుతూవున్న తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన ఒక అసామాన్యమైన వ్యక్తికి, ఉద్యమ శక్తికి… ఒక రచయితగా, ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా నేనందిస్తున్న చిరుకానుక ఈ పుస్తకం." 

That was the excerpts from the Prologue of my book "కేసీఆర్ - The Art of Politics"

BOOK RELEASE VERY SOON... 

కట్ చేస్తే - 

ఇది కేసీఆర్ బయోగ్రఫీ కాదు. ఆయన బయోగ్రఫీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడిప్పుడే దేశం మొత్తం తెలుసుకుంటోంది. త్వరలోనే జాతీయస్థాయిలో కేసీఆర్ సృష్టించబోయే సంచలనాల ద్వారా దేశప్రజలందరు కూడా పూర్తిగా తెలుసుకుంటారు.   

ఈ పుస్తకాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు... ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం అతి త్వరలో మీతో పంచుకోబోతున్నాను. 

అప్పటిదాకా - మీకోసం ఈ టీజర్: 
https://youtu.be/IAJiDFgZgd8 

Monday 20 June 2022

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది ఏది?


సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది - అందరూ మామూలుగా అనుకున్నట్టు - కథ, నిర్మాత, బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకింగ్, ప్రమోషన్... ఇలాంటివేవీ కావు.  

ఇవ్వన్నీ సెకండరీ. 

మనతో కలిసి పనిచెయ్యడానికి మనం ఎన్నుకొనే వ్యక్తులు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులే మన జయాపజయాలకు మొట్టమొదటి కారణం అవుతారు! 

కట్ చేస్తే - 

హీరోహీరోయిన్స్ గాని, డైరెక్టర్స్ గాని వాళ్ళదగ్గరికి ఎవరు సినిమా తీస్తామని వస్తే వాళ్ళతో చెయ్యరు. చాలా విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటివాళ్ళే సక్సెస్ సాధిస్తారు.  

సినిమా చేస్తే చాలు, డబ్బులొస్తే చాలు అనుకునేవాళ్ళు వెంటనే ఏం ఆలోచించకుండా ఓకే అంటారు. ఫలితాలు ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తాయి. కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే - కొన్నికొన్నిసార్లు ఒక దశాబ్దకాలం జీవితాన్ని తినేస్తాయి. ఇలాంటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. 

నమ్మటం కష్టం కాని - మనం కొందరు వ్యక్తుల్ని, వారి మాటల్ని సంపూర్ణంగా నమ్మి టీమ్‌లోకి తీసుకుంటాం. అసోసియేట్ అవుతాం. కాని - ఇలాంటి నిర్ణయానికి ముందు చాలా ఆలోచించాలని అనుభవాలు చెబుతాయి. 

చాలామంది సీనియర్లు ఈ విషయం చెప్తే మనం వినం. పట్టించుకోం అసలు. 

ఒక ప్యానిండియా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి ఒక విషయం చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను. ఈయనేదో చెప్తాడ్లే అని!  

"నా దగ్గరికి వెయ్యికోట్లు పెడతాను అని ఒక నిర్మాత వచ్చాడని నేను అతన్ని తీసుకోలేను. అతనిలో నేను డబ్బుకన్నా ముందు ఇంక చాలా విషయాలు చూస్తాను. సినిమా మీద నాకున్నంత ప్యాషన్ ఉండాలి. అతని మైండ్‌సెట్ నాకు కనెక్ట్ కావాలి. యాటిట్యూడ్ నచ్చాలి. రెండు నిమిషాలు మాట్లాడగానే అర్థమైపోతుంది, అతను నాకు కనెక్ట్ అవుతాడా లేదా అన్నది. సరిపోదు అనిపిస్తే వెంటనే సారీ చెప్పేస్తాను". 

ఇంక చాలా చెప్పాడు ఆ డైరెక్టర్. 

ముఖ్యంగా - వాళ్ళ మాటలకి చేతలకి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్న విషయం మాట్లాడుతున్నప్పుడు కనీసం వారికైనా తెలియాలి. 

అందుకే సీనియర్లు ఒకరికి ఛాన్స్ ఇచ్చే ముందు-లేదా-ఒకరితో అసోసియేట్ అయ్యేముందు చాలా టైమ్ తీసుకుంటారు. అందుకే వాళ్ళు నిలబడతారు. సక్సెస్ సాధిస్తుంటారు. సక్సెస్‌లో ఉంటారు. 

నా సినీ జర్నీలో కనీసం ఒక నాలుగుసార్లు ఇలాంటి ముఖ్యమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ఇబ్బందుల్లో ఇరుక్కొన్నాను.

ఇక్కడ తప్పుపట్టాల్సింది ఆయా వ్యక్తులను కాదు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్లని మార్చలేం. మన నిర్ణయాలను తప్పు అనుకోవాలి. ఆ బాధ్యత మనమీదే వేసుకోవాలి. వారితో ఆ అనుభవాన్ని ఒక పాఠంగా గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. 

కట్ చేస్తే - 

ఇప్పుడు నేను ప్రయాణిస్తున్నది ఒక సిస్టమ్‌తో.
అలాంటి సిస్టమ్‌ను క్రియేట్ చేసిన ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో. 
సింప్లిసిటీని ఇష్టపడే ఒక అద్భుతమైన వ్యక్తితో. 

నా ఆత్మీయ మిత్రుడు, నా శ్రేయోభిలాషి, సీరియల్ ఎంట్రప్రెన్యూర్ అయిన ఆ వ్యక్తి గురించి ఒక బ్లాగ్ రెండురోజుల్లో పోస్ట్ చేస్తున్నాను. 

సో, ఇక్కడ విషయం ఏంటంటే - మన యాటిట్యూడ్ బాగున్నప్పుడు అన్నీ అవే కుదురుతాయి. బాగుంటాయి. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అది సహజం.

కాని ఏదైనా సరే... "ఇది మన పని" అనుకొని చేస్తున్నప్పుడు ఏ ఇబ్బందులూ ఇబ్బంది పెట్టవు. అన్నీ బాగుంటాయి. 

మనకు నచ్చిన ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో మనం పనిచేయడం అనేది చాలా ముఖ్యం. 

ఈ సమయంలో - ఈ నిర్ణయం నేను తీసుకొన్నందుకు నాకు నేనే కంగ్రాట్స్ చెప్పుకొంటున్నాను. 

No Regrets. No Negativity. Celebrate Life, Everyday!  

Sunday 19 June 2022

కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్

నేను గత కొంతకాలంగా అనుకొంటున్న ఈ పుస్తకం గురించి ఈమధ్య ఒకే ఒక్కరోజు గట్టిగా అనుకొన్నాను, రెండే రెండు వారాల్లో టాస్క్ పూర్తిచేశాను. 

ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తున్నాను. 

తేదీ ఇంకా నిర్ణయం కావల్సి ఉంది. 

ఈ పుస్తకం ఆవిష్కరణ అఫీషియల్ ప్రమోషన్ రేపు రాత్రి నుంచి ప్రారంభం. 

బైదివే... ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోయే ప్రత్యేక వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆ స్పెషల్ ట్వీట్ మీలో చాలామంది చూశారు...     

కట్ చేస్తే -

కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్. 

ఇది పూర్తిగా కేసీఆర్ కేంద్ర బిందువుగా - ఆయా సందర్భాల్లో నేను రాసిన బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల్లో వచ్చిన నా ఆర్టికిల్స్‌లోంచి ఎన్నిక చేసిన కొన్ని వ్యాసాల అందమైన సంకలనం ఈ పుస్తకం.

212 పేజీల హార్డ్‌బౌండ్ క్లాసిక్. 

ఈ కంటెంట్‌నంతా - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి తెలంగాణ ప్రజలతో ఒక చిన్న పుస్తకరూపంలో ఇలా పంచుకొంటున్నాను.  

ఈ చిన్న ప్రయత్నం ఇన్‌స్పిరేషన్‌తో - నాలాంటి ఇంకెందరో బయటికి రావాలని, వాళ్లంతా కూడా వారికి వీలైనవిధంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలన్నది ఈ పుస్తకం ద్వారా నేనాశిస్తున్న ప్రధాన ప్రయోజనం. 

త్వరలో జాతీయ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్న సందర్భంగా - గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి - ఒక రచయితగా, ఒక అభిమానిగా నేనందిస్తున్న చిరుకానుక ఈ పుస్తకం.  

Friday 17 June 2022

ఒక్క కేటీఆర్, వంద నైపుణ్యాలు!


12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటి అయిన "ఎలెస్ట్" కంపెనీ తెలంగాణలో రూ. 24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్‌ప్లే ఫ్యాబ్ యూనిట్‌ను ప్రారంభించడానికి ఒప్పందంపై సంతకం చేసింది.  దీంతో - ఈ రంగంలో ప్రపంచస్థాయి దిగ్గజాలయిన జపాన్, కొరియా, తైవాన్‌ల సరసన ఇప్పుడు తెలంగాణ చేరింది.    

మే 2022: లండన్, దావోస్‌లలో 10 రోజుల పర్యటన. 45 వ్యాపార సమావేశాలు, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానల్ డిస్కషన్ సమావేశాలు, రూ. 4,200 కోట్ల పెట్టుబడులు.  

మార్చి 2022: వారం రోజుల యూయస్ ట్రిప్. 35 వ్యాపార సమావేశాలు, 4 సెక్టార్ రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 భారీ గ్రీట్ అండ్ మీట్ సమావేశాలు, రూ. 7,500 కోట్ల పెట్టుబడులు.   

ఈ డిజిటల్-సోషల్ యుగంలో - ఒక రాష్ట్ర దార్శనిక ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ఒక మంత్రి, ఆయన టీమ్ పనిచేస్తున్న శైలి ఈ స్థాయిలో ఉంటుంది. 

ఆ రాష్ట్రం తెలంగాణ.
ఆ ముఖమంత్రి కేసీఆర్.
ఆ మంత్రి పేరు కల్వకుంట్ల తారకరామారావు-ఉరఫ్-కేటీఆర్.    

కట్ చేస్తే - 

మొన్న దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి మనదేశం నుంచి చాలామంది మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడ వెళ్ళారు. కాని, మన తెలంగాణ శిబిరం దగ్గర జరిగినంత యాక్టివిటీ మరే ఇతర శిబిరం దగ్గర జరగలేదు.

ఒక ప్రత్యేక వార్తాంశంగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో, మీడియాలో షేర్ చేసిన వాస్తవం ఇది!    

మన దేశం నుంచి గతంలో గాని, ఈ మధ్య గాని ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రుల టీమ్స్ ఇదే దావోస్‌కు చాలాసార్లు వెళ్ళాయి. యూయస్, యూకే, యూరప్‌ల్లో అనేక విదేశీ పర్యటనలు కూడా చేశాయి. అయితే గతంలోదంతా "ప్రపోజల్ పెట్టాం. అయితే అవుద్ది, లేకపోతే లేదు" అన్న సాంప్రదాయికశైలి. "ఎందుకు కాదు, మనమెందుకు సాధించలేం" అన్న ప్రోయాక్టివ్ దృక్పథం కేటీఆర్‌ది. 

ఇంత డైనమిజమ్, ఇంత స్పష్టత, ఇలాంటి అత్యంత వేగవంతమైన భావవ్యక్తీకరణ, సందర్భం ఏదైనా సరే - అలవోకగా ఎదుటివారిని మెస్మరైజ్ చేసే తనదైన ఇంగ్లిష్ శైలి... ఇవన్నీ ఇంతకుముందు మనదేశంలో ఏ రాష్ట్ర మంత్రిలోనైనా చూశామా అన్నది నాకు జవాబు దొరకని ప్రశ్న.   

"భారత్ వైవిధ్యమైన దేశం. ఈ దేశంలో పెట్టుబడులుపెట్టి వ్యాపారం చేయాలనుకున్నా, ఇంకే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నా సరే, మీరు ఏ రాష్ట్రం నుంచి ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారు అనేది చాలా కీలకం!" 

"తెలంగాణ రాష్ట్రం పోటీపడుతున్నది ఈ దేశంలోని రాష్ట్రాలతో కాదు. ప్రపంచంలోని ది బెస్ట్ రాష్ట్రాలతో!" 

ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్, ఆ ఆత్మవిశ్వాసం కేటీఆర్‌లో ఉన్నాయి.    

కట్ చేస్తే - 

కేటీఆర్ జీవితం ఒక్క రాజకీయాలతోనే నిండిపోలేదు. ఆయన జీవనశైలి నిజంగా విశిష్టమైంది. కొత్తతరం నాయకులు, యువతరం కచ్చితంగా అనుసరించతగ్గది.

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో కేటీఆర్ ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. స్పోర్ట్స్, గేమ్స్ ఫాలో అవుతుంటారు. నిత్యం వివిధ సాంఘిక-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంటారు. తాను చూసిన లేటెస్ట్ మళయాళ సినిమా గురించి చెప్పి ఎదురుగా ఉన్న యాంకర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. సమావేశం ఏదైనా, సబ్జెక్టు ఏదైనా సరే - అక్కడున్నది మైక్రోసాఫ్ట్ సీఈవో అయినా సరే - తన మార్క్ చెణుకులు ఒకటోరెండో అలా అలవోగ్గా పడాల్సిందే! 

ట్విట్టర్‌ను కేవలం రాజకీయాలకే కాకుండా, వేగవంతమైన ప్రజాసేవకు కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించిన వ్యక్తి కేటీఆర్. టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా, నిత్యం తన దైనందిన రాజకీయ, ప్రభుత్వ, సాంఘిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూనే - ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలకు స్పందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడారు కేటీఆర్.      

ఇన్ని పార్శ్వాలు, ఇన్ని నైపుణ్యాలు, ఇంత పాజిటివ్ స్పిరిట్, ఇంత ఎనర్జీ, ఇంత దూకుడు ప్రదర్శిస్తూ వడివడిగా ముందుకు సాగిపోతున్న కేటీఆర్ ఒక రాష్ట్ర మంత్రి మాత్రమే అంటే ఆయన పరిధిని తగ్గించినట్టవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో కేటీఆర్ అంటే... ఒక బ్రాండ్.    

కట్ చేస్తే - 

పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా రాజకీయ లక్ష్యాలుంటాయి. ఉండితీరాలి. ఒక లక్ష్యం లేకుండా ఎవ్వరూ ముందుకుసాగలేరు. ఏం సాధించలేరు. కాని, ఆ లక్ష్యాలు సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సివుంటుంది. ఆ కృషి సగటు మనదేశంలో ఒక "ఎక్స్" అనుకుంటే, కేటీఆర్‌లో మనం చూస్తున్న అత్యంత కనిష్ట సగటు "10 ఎక్స్". అంటే కనీసం పదింతలన్నమాట! 

తెలంగాణమీద అణువణువున మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, కృషి సాధ్యం కాదు. ఆ మమకారం కేటీఆర్‌కు అత్యంత సహజసిద్ధంగా కేసీఆర్ గారి నుంచి వచ్చిందనుకోవచ్చు. కాని, దాన్ని ఊహించని ఎత్తులకు తీసుకుపోతూ, తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ, జాతీయ అంతర్జాతీయ వేదికలమీద శ్లాఘించబడే స్థాయికి ఎదగడం అన్నది మాత్రం కేవలం కేటీఆర్ వ్యక్తిగత సామర్థ్యం, ఆయన నిరంతర కృషే. .     

దావోస్‌లో మొన్న కేటీఆర్‌ను కలిసిన తర్వాత - అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్టు, వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని "ఇంత భావ వ్యక్తీకరణ, ఇంత స్పష్టత ఉన్న యువరాజకీయనాయకున్ని నేను ఎప్పుడూ చూళ్ళేదు. 20 ఏళ్ళ తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి" అని ట్వీట్ చేశారు.

ఎలాంటి అతిశయోక్తి లేని ఆ ట్వీట్ సృష్టించిన సంచలనం ఇంకా తాజాగానే ఉంది. 

మరోవైపు - కేటీఆర్‌ను సిఎంగా చూడాలని కూడా తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశంలో ఉన్న ఆయన అభిమానులు, ఎన్నారై ఫ్యాన్స్ కూడా ఎందరో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నా దృష్టిలో కేటీఆర్ సిఎం కావడం పెద్ద విషయం కాదు. కేసీఆర్ గారు, టీఆరెస్ పార్టీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుతారు.

దానికీ సమయం వస్తుంది. 

సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థంలేదు. అలాగే సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు కూడా. కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడిందనుకోవచ్చు. కాని, ఆ తర్వాతదంతా కేటీఆర్ స్వయం కృషే అన్నది ఎవ్వరైనా సరే ఒప్పుకొనితీరాల్సిన నిజం.

ఇందాకే చెప్పినట్టు, కేటీఆర్ అంటే రాజకీయాల్లో ఇప్పుడొక బ్రాండ్. 
***

("కేటీఆర్ అంటే... ఇప్పుడొక బ్రాండ్!" టైటిల్‌తో, ఈ ఆర్టికిల్‌లో కొంతభాగం ఈరోజు 'నమస్తే తెలంగాణ" దినపత్రికలో ప్రచురించబడింది.)