Thursday 13 January 2022

అంతా బాగున్నప్పుడు...

ఒక చిన్న కష్టం ఉంటుంది. లేదా, ఏదో పర్సనల్ సమస్యలో అనుకోకుండా ఇరుక్కుపోతాం. లేదంటే, ఏదో ఒక ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ మిస్ ఫైర్ అయి, ఊహించనివిధంగా మనల్ని ఎంతగానో ఇష్టపడిన మిత్రుల దృష్టిలో ఒక్కసారిగా చెడ్దవారిమైపోతాం. 

వీటిలో ఏదో ఒకటో, లేదా అన్నీ ఒక్కసారిగానో... మనల్ని హాంట్ చేసే పరిస్థితి వస్తుంది. 

కొందరు డీలా పడిపోయి సూసైడ్‌లు చేసుకుంటారు. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి త్రాగుడుకి ఎడిక్టయి మొత్తంగానే కోలుకోకుండా అయిపోతారు.

వీళ్ళిద్దరికి అసలు సమస్యే లేదు. ఒకడు చచ్చిపోతాడు. ఇంకొకడు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. 

కట్ చేస్తే -   

కొందరు మాత్రం చాలా కష్టపడుతూ, ఒక్కో సమస్య నుంచి బయటపడే పని చేస్తుంటారు.  

అసలు సమస్య ఇక్కడే. 

బ్రతికున్న వీడి జీవితం నిజంగా నరకం. 

ముందు ఈ సమస్య క్లియర్ చేస్తే అంతా బాగుంటుంది. అప్పుడు మిగిలిన పనులు టెన్షన్-ఫ్రీగా, ఫుల్ ఫ్రీడంతో చేసుకోవచ్చు అని ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారిలో 95% మంది అనుకుంటారు.

అదే పెద్ద తప్పు. 

కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్న సమస్య కూడా ఇంకో రెండు వారాల్లోనో, రెండు నెలల్లోనో పరిష్కారమవుతుంది. ఫ్రీ అయిపోతాం అనుకుంటాం. వాస్తవం కూడా అదే.

కాని, అలా కావు.

చూస్తుంటే, వారాలు నెలలు నుంచి ఒక్కోసారి సంవత్సరాలు గడుస్తుంటాయి. పరిస్థితి అలాగే ఉంటుంది. మారదు. 

ఫోకస్ సమస్యల మీద కాదు, వాటి పరిష్కారాలమీద పెట్టాల్సి ఉంటుంది. అవి పరిష్కారం కావాలంటే మెయిన్ ట్రాక్‌లో అన్ని పనులు జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారం చాలా సులభమవుతుంది. 

అయితే - ఇది చెప్పినంత సులభం కాదు. చాలా కష్టం. 

కాని, ఇదే సులభం.  

"అంతా బాగున్నప్పుడు" అనేది ఎప్పుడూ ఉండదు. 

ఈ నిజం తెలుసుకోవడానికి ఒక్కోసారి రెండుమూడేళ్ళు కూడా పట్టవచ్చు. గడిచిన ఆ రెండుమూడేళ్ళు తిరిగిరావు. అదే పెద్ద విషాదం. 

No comments:

Post a Comment