Monday 20 December 2021

టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్!

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు! 

కట్ చేస్తే - 

ఇదివరకులా కాదిప్పుడు... 
సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

ఇవన్నీ పక్కనపెట్టి, ఇదివరకులా పాత చింతకాయ పచ్చడి పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య పని చేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు.

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

అయితే - వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దానికి ఆఫీస్ అవసరం ఎంతమాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే.

ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా... చక చకా అయిపోతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.

కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్‌ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని .. ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఫ్లాట్ తీసుకొని గాని... పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు.

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!

ఇక బిజినెస్ కోసం అయితే ఇప్పుడు అసలు ఆఫీసే అక్కర్లేదు! పని, వాళ్ళ ఆఫీసుల్లోనే కాబట్టి, మనకు ప్రత్యేకంగా ఆఫీసు అవసరం లేదు. 

సో... ఇప్పుడంతా...
కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ. నెక్లెస్ రోడ్డు. ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. యాత్రి నివాస్. సినీ ప్లానెట్... కాఫీడేలు, ఇరానీ హోటల్లూ, పార్కులు, బ్యాచిలర్ రూముల్లోనే మన "చిన్న సినిమా"లనబడే "మైక్రో బడ్జెట్ సినిమా"ల నిర్మాణం అంతా జరిగిపోతుందన్నమాట!

ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి. 

పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక్క రోజు షూటింగ్ చేసుకోవచ్చు!   

ఇదంతా హాలీవుడ్లో ఎప్పుడో ఉంది. ఇప్పుడూ ఉంది. కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు! 

అయితే - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు. ఎవరూ నమ్మరు. కానీ, నిజం మాత్రం ఇదే.  

నేను కూడా ఇప్పుడు నా టీమ్ తో కలిసి, ఇలాంటి మల్టీ లొకేషన్ ఆఫీస్ లోనే  పనిచేస్తున్నాను. దీనికి మేం ముద్దుగా పెట్టుకున్న పేరు... "డిజిటల్ ఆఫీస్!"

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఇంతా చెప్పాక కూడా "మీ ఆఫీస్ ఎక్కడ?" అని ఎవరైనా అడిగితే ఏం చెయ్యలేం. "స్టాప్ బ్లాక్"లో అక్కణ్ణించి మాయమై పోవటం తప్ప! 

***

(Off the track:
సరిగ్గా ఈ టైమ్‌కు... న్యూ ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న యు ఎస్ ఎంబెస్సీలో వీసాకోసం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు మా అబ్బాయి. ఆ టెన్షన్ తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా, ఇలా ఈ బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను. ఇంకో గంటలో మా అబ్బాయి గుడ్ న్యూస్ ఇస్తాడని నమ్మకం.)

No comments:

Post a Comment