Sunday 26 December 2021

ఈ పూల దారులు, ఆ నీలి తారలు

I like gardening. It’s a place where I find myself when I need to lose myself. 
– Alice Sebold in “Above and beyond”.

నిజంగా ఇంత అందంగా ఈ హోం గార్డినింగ్ చెయ్యటానికి చాలా ఓపిక కావాలి. ఇది కూడా ఒక మంచి క్రియేటివ్ టాలెంటే. 

గార్డెనింగ్ అనేది మనకిష్టమైన రంగులతో సృష్టించుకొనే ఆర్ట్, పెయింటింగ్ లాంటి మరొక కళారూపం. ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో హాబీల్లో స్వచ్ఛతను, సంతోషాన్ని సమపాళ్లలో ఇచ్చే హాబీ ఇదొక్కటే.  

ప్యూర్ ప్లెజర్‌ అన్నమాట. 

ఇది నేర్చుకొంటే వచ్చే అభిరుచి కాదు. ఎంతో ఆసక్తి, ప్యాషన్ సహజంగా ఉండాలి. ఒకసారి దీనికి ఎడిక్ట్ అయితే చాలు, చివరి క్షణం వరకూ మానుకోలేరు. ప్రపంచంలోని ఏ డ్రగ్ కూడా దీన్ని మించిన 'హై' ఇవ్వలేదు. అయితే - ఇది సిగరెట్స్, మందు, డ్రగ్స్ లాంటి నెగెటివ్ ఎడిక్షన్ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పాజిటివ్ ఎడిక్షన్.  

ఇంకో కోణంలో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - ఈ అభిరుచి ఉన్నవాళ్ళు మానసికంగా చాలా మెచ్యూర్డ్‌గా, కామ్‌గా ఉంటారు. లోపల ఇంకేమైనా అసంతృప్తి, బాధలు, కష్టాలు ఉన్నా సరే... కామ్‌గా, కంటెంటెడ్‌గా సులభంగా ఉండగలుగుతారు.

ఈ హాబీ ఉన్నవాళ్ళలో వయస్సు కూడా అంత త్వరగా దగ్గరికి రాదు. కనీసం ఒక పదేళ్ళు తక్కువగా కనిపిస్తారు. 

ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్నించి వెనక్కివెళ్ళలేరు. అవసరమైతే బండరాయిలా ఉంటారు. అదే వారి శక్తి.   

గార్డెనింగ్‌ను "గ్రాండ్ టీచర్" అని కూడా అంటారు. ఎలాంటి క్లాసులు తీసుకోకుండానే ఎన్నో నేర్పిస్తుంది. వాటిల్లో చాలా ముఖ్యమైనది - ఓపిక. ఈ గ్రాండ్ టీచరే నేర్పించే ఇంకెన్నో ముఖ్యమైన విషయాల్లో ఒకటి - నమ్మకం.   

హోం గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం. హైద్రాబాద్‌లోని బిజీ జీవితం, ఎప్పుడూ వెంటాడే ఏదో ఒక స్ట్రెస్ నన్ను దీన్నుంచి చాలా దూరంగా విసిరేశాయి. అయితే, చెప్పుకోడానికి ఇదొక సాకు మాత్రమే. నిజంగా చేయాలనుకొంటే ఏదీ దేనికీ అడ్డు కాదు. 

ఏదేమైనా, ఈ ప్యాషన్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. నేను చేయలేకపోతున్నానే అని ఏ మూలో చిన్న బాధ.   

కట్ చేస్తే - 

నాకున్న లిమిటెడ్ సర్కిల్లో ఇంతమంచి హాబీని, మారిషస్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ఒక నేటివ్ తెలుగువారింట్లో చూశాను. పాండిచ్చేరిలో ఒక డాక్టర్ ఇంట్లో చూశాను. మణికొండలో ఈమధ్యే ఒక ఆర్టిస్ట్ ఇంట్లో చూశాను. 

మళ్ళీ దాదాపు అంతే ఫాంటాబ్యులస్ స్థాయిలో ఈ హోమ్ గార్డెనింగ్ ప్యాషన్‌ను ఇంకొక చోట చూశాను. అయితే - ఈ ప్యాషనేట్ గార్డెనర్ నా స్టుడెంట్ కావడం నేను చాలా గర్వంగా, సంతోషంగా ఫీలయ్యే విషయం. 

I wish my student a very happy Green, Gardenish & Gorgeous Birthday! 
***

#HappyBirthday #MyStudent #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog #Gardening #HomeGardening #GoGreen #GoingGreen #HobbyGardener 

Saturday 25 December 2021

ఈ బ్లాగ్ నాకు చాలా ఇచ్చింది

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. అందుకే, ఈ బ్లాగ్‌కు నగ్నచిత్రం అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ ఏదో రాయాలి కాబట్టి రాస్తాను అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు 9 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 3409 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ!       

కట్ చేస్తే - 

మనం ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోకూడని, రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, మరీ వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా వచ్చేస్తుంటాయి. 

తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు... ఇలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్లాగుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఏం తప్పుకాదు. బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు. 

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఇలాంటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

ఇలాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా చాలా లాభాలున్నాయి.  

ఈ లాభాలు పొందటం కోసం నాకు దొరికిన ఒక అద్భుత సాధనం - బ్లాగింగ్. 

నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనకు ఆరోగ్యాన్నిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉండనిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది. 

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”

Welcome to my beautiful world of Creative Souls!  
***

#Nagnachitram #MyBlog #TeluguBlog #ManoharChimmani #BloggingHobby #ILoveBlogging #GoBlogIt #BloggersWorld #BlogAddict 

Friday 24 December 2021

క్రియేటివిటీ వర్సెస్ ఫ్రీడమ్

తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.

ఎవడి పిచ్చి వాడికానందం.

రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ .. ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.

పాజిటివ్‌గానా, నెగెటివ్‌గానా అన్న విషయం ఇప్పటికి పక్కనపెడదాం.అదింకో చర్చ అవుతుంది.

కట్ టూ క్రియేటివిటీ - 

మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు .. నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక .. ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను.  నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ. ఈ రెండూ నా జీవనశైలి.

ఈ రెంటినీ ఎప్పుడూ నేను వేరుగా చూడలేను.

కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా .. ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.  

మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

అది నేనయినా, ఎవరయినా.  

చివరాఖరికి స్పిరిచువాలిటీ!

1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2020 ల్లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!  

అయితే - నేనిప్పుడు ఇలాంటి లాజిక్స్ గురించి అసలు పట్టించుకోవడం లేదు. 

మిగిలిన ఒకటి రెండు బాధ్యతలు, కమిట్‌మెంట్స్ త్వరత్వరగా ముగించుకొని, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఫ్రీ అయిపోయి... నేను కోరుకొన్న ఫ్రీడంతో బ్రతకాలని చాలా పనులు ఒకేసారి చేస్తున్నాను. 

ఆ పనులన్నీ అలా చేస్తూనే - మినిమలిజమ్ వైపు, లాప్‌టాప్ లైఫ్‌స్టైల్ వైపు ఏకకాలంలో ప్రయాణిస్తున్నాను కూడా. 

After all, spirituality is a personal thing. 

Thursday 23 December 2021

అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. ఈ రెండూ నాకత్యంత ఇష్టమైన అంశాలు.

ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా?

ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా?

భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది.

ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.

నిజానికి ఈరెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.

అంతే తప్ప, అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు .. కాకూడదు. 

దీనికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

90 శాతం మందికి యాభై దాటితే గాని అసలు ఈవైపు చూడాలన్న ఆలోచన రాదు. ఆలోచించరు. కనెక్ట్ కారు.  

జీవితంలో అన్నీ అయిపోయాకనో, లేదంటే జీవిత చరమాంకంలో ఏదైనా ఓ పెద్ద కుదుపు వచ్చాకనో కాకుండా... వయసులో ఉన్నప్పటినుంచే మనిషి తన మనసుని కొంత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళించుకోగలిగితే మాత్రం... ఆ ఆనందమే వేరు. 

Wednesday 22 December 2021

మార్పే శాశ్వతం!

ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని.

ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది కొన్ని వారాల్లో ప్రారంభమై, ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. 

ఇంతకుముందులా సినిమాల మీద ప్యాషన్ కాదు. అవసరం. 

అత్యంత వేగంగా నేను కోరుకొన్న ఫ్రీడం ఈ ఒక్క పని నుంచే నాకు సాధ్యమవుతుంది. ఇదొక్కటే ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడే ప్లాట్‌ఫామ్. ఇదొక్కటే అంత ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్.  

అనుకోని ఒక చిన్న సెట్‌బ్యాక్‌తో అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను బాగా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు.    

నేను సినిమాల్లో ఉన్నన్ని రోజులు కొన్ని పనులు చేయలేను అని మొన్నటివరకూ అనుకొనేవాణ్ణి. కానీ అది నిజం కాదని నేనే ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను. 

ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే. 

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.

ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!

అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్. 

మర్చిపో.  

ఎవరైనా, ఎన్ని పనులైనా, ఏకకాలంలో చేయొచ్చు. అది ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!  

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, విజయవంతంగా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరోపనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి.

ఒకప్పుడు నేను చేయడానికి ఇష్టపడని పనుల్ని ఇప్పుడు యాడ్స్ ఇచ్చి మరీ చేస్తున్నాను. 

నాకే అర్థం కావడం లేదు... ఇంత మార్పు ఏమిటో. 

ఇంకోవైపు... "ఇదింక వద్దు" అనుకుంటే చాలు, అది ఇప్పటివరకూ నాకు ఎంత ఇష్టమైనదైనా సరే, ఆ క్షణం గుడ్ బై చెప్పేస్తున్నాను.

ఈ బ్లాగ్ కూడా ఇప్పుడు నిజంగా కొన్నిరోజులే.  

అలాగని నా రైటింగ్ హాబీని వదిలేస్తున్నానా? అదెప్పటికీ జరగదు...

ఇదంతా నన్ను ఎటు తీసుకెళ్తోందో తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. 

Minimalism? Law of Least Effort?... ఏమో, తెలీదు. 

ఒక్క విషయం మాత్రం గుర్తుకొస్తోంది -
Everything is spiritual in this world.

BECOME HERO !!

నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న యాస్పయిరింగ్ హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇదొక పనికొచ్చే పోస్ట్.  

హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.  

కట్ చేస్తే -

సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. 

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. 

ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం... ఏళ్లూ దశాబ్దాలూ... వృధాకావడం తప్ప వేరేదేం జరగదు.  

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు. 

అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 60 లక్షలవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... 

కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు!  

ఇది ఎప్పుడూ జరిగేదే.  

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. ఇది చాలా మామూలు విషయం. 

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు. 

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.  ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.

ఆసక్తి ఉందా? 

సినీఫీల్డులో హీరోగా మీ కెరీర్ పట్ల చచ్చేంత ప్యాషన్ ఉందా? 

అయితే - ఆసక్తి, ప్యాషన్ మాత్రమే సరిపోవు. స్థోమత ఉండాలి. మీ కుటుంబ నేపథ్యం మీకు సహకరించాలి. అలా లేనప్పుడు, మీకోసం బడ్జెట్‌లో కొంత భాగమయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే కాంటాక్ట్స్ మీకుండాలి.  

ఓకే అనుకుంటే... నిజంగా ఆ సీరియస్‌నెస్, ఆ స్థోమత, ఆ కాంటాక్ట్స్ మీకు ఉన్నట్టయితే... మీ పూర్తి వివరాలతో నాకు వాట్సాప్ పెట్టండి. 

ఒక పాపులర్ ఓటీటీ కోసం, అతి త్వరలో షూటింగ్‌కి వెళ్తున్న మా కొత్త ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులో మీరు హీరోగా బెస్ట్ పాజిబిలిటీస్ ఆలోచిద్దాం.     

Welcome to Glamour World! 
SEE YOU ON THE SETS...  

– Manohar Chimmani
Film Director, Nandi Award Winning Writer
WhatsApp: +91 9989578125

ABOUT Manohar Chimmani: 

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి దయచేసి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ!)

Monday 20 December 2021

టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్!

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు! 

కట్ చేస్తే - 

ఇదివరకులా కాదిప్పుడు... 
సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

ఇవన్నీ పక్కనపెట్టి, ఇదివరకులా పాత చింతకాయ పచ్చడి పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య పని చేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు.

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు .. ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమేలేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

అయితే - వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని చూడ్డానికి మాత్రం ఒక్కసారి మాత్రం డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దానికి ఆఫీస్ అవసరం ఎంతమాత్రం లేదన్నది అందరికీ తెలిసిందే.

ఇక కథా చర్చలు, మేకింగ్ ప్లానింగ్స్, అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో, కేబీఆర్ పార్కులో, టాంక్‌బండ్ మీదా... చక చకా అయిపోతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా జరిగిపోతున్నాయి.

కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్‌ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని .. ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఫ్లాట్ తీసుకొని గాని... పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు.

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ!

ఇక బిజినెస్ కోసం అయితే ఇప్పుడు అసలు ఆఫీసే అక్కర్లేదు! పని, వాళ్ళ ఆఫీసుల్లోనే కాబట్టి, మనకు ప్రత్యేకంగా ఆఫీసు అవసరం లేదు. 

సో... ఇప్పుడంతా...
కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ. నెక్లెస్ రోడ్డు. ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. యాత్రి నివాస్. సినీ ప్లానెట్... కాఫీడేలు, ఇరానీ హోటల్లూ, పార్కులు, బ్యాచిలర్ రూముల్లోనే మన "చిన్న సినిమా"లనబడే "మైక్రో బడ్జెట్ సినిమా"ల నిర్మాణం అంతా జరిగిపోతుందన్నమాట!

ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పనిజరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి. 

పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక్క రోజు షూటింగ్ చేసుకోవచ్చు!   

ఇదంతా హాలీవుడ్లో ఎప్పుడో ఉంది. ఇప్పుడూ ఉంది. కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు! 

అయితే - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు. ఎవరూ నమ్మరు. కానీ, నిజం మాత్రం ఇదే.  

నేను కూడా ఇప్పుడు నా టీమ్ తో కలిసి, ఇలాంటి మల్టీ లొకేషన్ ఆఫీస్ లోనే  పనిచేస్తున్నాను. దీనికి మేం ముద్దుగా పెట్టుకున్న పేరు... "డిజిటల్ ఆఫీస్!"

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఇంతా చెప్పాక కూడా "మీ ఆఫీస్ ఎక్కడ?" అని ఎవరైనా అడిగితే ఏం చెయ్యలేం. "స్టాప్ బ్లాక్"లో అక్కణ్ణించి మాయమై పోవటం తప్ప! 

***

(Off the track:
సరిగ్గా ఈ టైమ్‌కు... న్యూ ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న యు ఎస్ ఎంబెస్సీలో వీసాకోసం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు మా అబ్బాయి. ఆ టెన్షన్ తప్పించుకొనే ప్రయత్నంలో భాగంగా, ఇలా ఈ బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను. ఇంకో గంటలో మా అబ్బాయి గుడ్ న్యూస్ ఇస్తాడని నమ్మకం.)

Sunday 19 December 2021

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా?

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా? సినిమా మీద నిజంగా మీలో అంత ప్యాషనుందా? 

ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి, నిజంగా బిజీగా ఉండే 5 శాతం మందిలో మీరూ ఉండాలనుకొంటున్నారా? 

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ కోచింగ్‌లో చేరండి. నిజంగా ఇండస్ట్రీకి పనికొచ్చే మెలకువలు నేర్చుకోండి. ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవ్వండి. 

ఇంట్రెస్టుందా? కింద లింక్ ఉంది. క్లిక్ చేయండి. చదవండి. మీ విలువైన సమయం... నెలలూ, సంవత్సరాలూ, దశాబ్దాలూ... వేస్ట్ కావద్దు అనుకుంటే ఆ లింక్ ఫాలో కండి. 

కట్ చేస్తే - 

నిజంగా మీలో అంత ప్యాషన్ ఉందనుకోండి. ఇప్పుడు షూటింగ్‌కి రెడీ అవుతున్న మా ప్రాజెక్టులో మీకు వెంటనే అవకాశం కూడా రావచ్చు.  

ఈ అద్భుత అవకాశాన్ని ఓన్ చేసుకొనే అవకాశం మీకు ఈ నెల 24 వ తేదీ వరకే ఉంటుంది. 

ఇంకేం ఆలోచిస్తున్నారు? 

వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి. ఫాలో కండి. 

వెల్‌కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ!   

The coaching link: 

Saturday 18 December 2021

CASTING CALL for NEW HERO, HEROINES !!

మనోహర్ చిమ్మని దర్శకత్వంలో, కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో మేం చేస్తున్న ఫీచర్ ఫిలిం కోసం - కేవలం హైద్రాబాద్‌లో ఉన్న "కొత్త హీరో హీరోయిన్స్" (18-28) వెంటనే కావాలి.

క్రింది అంశాలు జాగ్రత్తగా చదివి, తగిన అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి: 

1. బడ్జెట్ పరంగా మాత్రమే ఇది దాదాపు జీరో బడ్జెట్ సినిమా. కాని, వాల్యూ & క్వాలిటీ పరంగా కనీసం కోటిన్నర బడ్జెట్‌కు తక్కువకాని రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది.
2. టాలెంట్ ప్రధానంగా అవకాశం ఇస్తాము. ఎవరికీ ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు. 
3. ఈ డిసెంబర్‌లోనే, మేము చెప్పిన రోజు నుంచి షూటింగ్‌కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేనివారే అప్లై చేసుకోవాలి. 
4. ఎన్నిక చేసిన రోజు నుంచి వర్క్‌షాప్ ఉంటుంది. తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. 
5. ఇప్పుడు వస్తున్న ట్రెండీ యూత్ సినిమాల స్థాయిలో నటించడానికి మీ కుటుంబం నుంచి మీకు 100% అనుమతి ఉండాలి. 
6. ఫాస్ట్ ఫిలిమ్‌మేకింగ్ పధ్ధతిలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేసిన ఈ సినిమా,  జనవరిలోనే ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ బాగా ఉంటుంది. 
7. దయచేసి ఇతర క్యారక్టర్స్ కోసం ఫోన్స్, మెసేజెస్ చెయ్యవద్దు. అవసరమైతే మేమే కాస్టింగ్ కాల్ పోస్ట్ చేస్తాము.  
8. కాస్టింగ్ డైరెక్టర్స్‌కు ఇది మంచి అవకాశం. ముందు మాకు వెంటనే వాట్సాప్ చేయండి. మనం మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు.  
9. కొత్త హీరో హీరోయిన్స్... మీ పూర్తి బయోడేటా/ప్రొఫైల్, కేవలం 3 ఫోటోలు (ఉంటే వీడియో లింక్స్) వెంటనే పంపించండి. ప్రాథమికంగా ఆడిషన్‌కు ఎన్నిక చేసినవారికి మాత్రం మా టీమ్ నుంచి కాల్ వస్తుంది.  

All the best!

- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer
About Manohar Chimmani: http://bit.ly/manutime

- PRADEEP CHANDRA
Producer, Music Director
P C Creations

PS: Strictly NO CALLS Please!

Friday 17 December 2021

సినిమాలో కథారచయిత స్థానం ఎక్కడ?

చాలా సార్లు ప్రి-రిలీజ్ ఈవెంట్స్‌లో నాకు నచ్చని ఒక విషయం గమనించాను... కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత కూడా. 

మొన్న వరంగల్‌లో జరిగిన శ్యామ్ సింగరాయ్ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఇదే విషయం గమనించాను. 

ఎంతసేపూ కెమెరామన్ బాగా చూపించాడు, ఎడిటర్ బాగా కష్టపడ్డాడు, ఆర్ట్ డైరెక్టర్ నిద్రపోలేదు, నిర్మాత బాగా ఖర్చుపెట్టాడు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో టీమ్ అంతా అసలు నిద్రపోలేదు... అని ఇవన్నీ ప్రతి ఒక్కరూ చెప్తారు.

కాని, అంత పెద్ద ప్రాజెక్టుకి పునాదిలాంటిది అయిన కథ గురించి, కథా రచయిత గురించి మాత్రం చెప్పరు! 

హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ కూడా అంతే. ఒక్క రచయిత పేరు తప్ప... మిగిలిన అందరినీ మెచ్చుకుంటారు, పదే పదే థాంక్స్ చెప్తారు. రచయిత మాత్రం ఏ ఒక్కరికీ గుర్తుకురాడు. 

ఇలాంటి సంస్కృతి ఈమధ్యే వచ్చింది. అంతకు ముందు ఇలా లేదు. సినీ కథా రచయితకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు. మంచి గౌరవం ఉందేది.    

కట్ చేస్తే - 

ఇప్పుడు డైరెక్టర్స్‌లో దాదాపు 60 శాతానికి పైగా కథ కూడా వారే రాసుకుంటున్నారు. అది వేరే విషయం. కాని, కథ వేరే వ్యక్తి అందించినప్పుడు ఆ రచయిత పేరు చెప్తే వచ్చే నష్టం ఏంటి వీరికి? 

"రచయిత ఫలానా సో అండ్ సో. ఈ సినిమాకు మంచి కథ అందించారు" అని ఒక్క మాట చెప్తే ఏం పోతుంది? అందరికీ ఇచ్చినట్టు స్టోరీ రైటర్‌కూ ఒక్క నిమిషం మైక్ ఇవ్వచ్చు కదా? సమస్య ఎక్కడ? 

అంత ఇన్‌సెక్యూరిటీనా? కథ వేరే రచయితది అని చెప్తే డైరెక్టర్ వాల్యూ ఏమైనా పడిపోతుందా? రచయితకు ప్రమోషన్ ఇవ్వటం ఎందుకు అనా? 

ఆ రచయిత కథ విని ఇంప్రెస్ అయ్యే కదా ఆ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ప్రాజెక్టుకి ఒప్పుకొంది? కథ లేకుండా సినిమా ఎలా ఉంటుంది? 

ఇలాంటి చిన్న చూపు... విజయేంద్రప్రసాద్ గారి విషయంలో చెయ్యగలరా? 

నిజానికి విజయేంద్రప్రసాద్ గారికి ఒక కథా రచయితగా ఇలాంటి ఫంక్షన్స్‌లో మాట్లాడే అవకాశం కూడా ఎక్కువ ఇస్తారు. అలా ఇవ్వాలి కూడా. 

నా ఉద్దేశ్యంలో ఇది కథా రచయిత పట్ల గౌరవం లేకపోవడం, చిన్నచూపు మాత్రమే కాదు. కావాలని ఇలా చేసే ఆయా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్, హీరోహీరోయిన్స్ మీన్ మెంటాలిటీని కూడా ఇది బహిర్గతం చేస్తుంది.

వాళ్లేంటో వాళ్లకై వాళ్లే చెప్పుకోవడమన్నమాట! 
***

#TeluguCinema #Writer #ScreenplayWriter #ScriptWriter #Tollywood #ManoharChimmani #NagnachitramBlog #WriterValue #FilmWriter #MovieWriter

Thursday 16 December 2021

వాసు లేకుండా అప్పుడే మూడేళ్ళు!

బ్రతికుండటానికి కూడా చాలా శక్తి, చాలా విల్‌పవర్ కావాలని నువ్వు వెళ్ళిపోతూ మా అందరికి తెలియజెప్పాకే తెలిసింది. 

నేను కొంచెం చొరవతీసుకున్నా, నువ్వు "అన్నా, మా సమస్యను పరిష్కరించు" అని నాతో ఒక్క ముక్క గట్టిగా చెప్పినా ఇవ్వాళ నేనిది రాసుకొంటూ ఇలా బాధపడేవాణ్ణి కాదు. 

మానవసంబంధాల విలువ ఏంటో కూడా నువ్వు వెళ్ళిపోతూ చెప్పావు. 

సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా కాలగమనంలో ఎంతో మారిపోతూవస్తోంది. నువ్వూ మారాల్సింది. సమస్యను ఏవైపునుంచయినా పరిష్కరించుకోవాల్సింది. సమస్యే మూలం కాని, సమస్యకు నువ్వు మూలం కాదు అన్న చిన్న ఆలోచన చెయ్యలేకపోయావు. 

నేను బాగుంటే నువ్వు బ్రతికుండేవాడివి. అన్నగా ఏం చేయలేకపోయాననే బాధ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది. నీ పదేళ్ళ కొడుకు కార్తీక్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా కళ్ళుచెమ్మగిల్లుతాయి. వాడిని కలిసి హత్తుకున్నప్పుడు వదిలిపెట్టలేనంత దుఃఖం. 

నువ్వొక్కడివే స్నేహితుడిగా, తమ్ముడిగా, నీతోనే పెరిగిన శ్రీధర్‌కు ఇప్పుడు వరంగల్‌లో ఎవ్వరున్నారు మనసు విప్పి మాట్లాడుకోడానికి? వాడెంత నీకోసం తపనపడ్డాడు? వాడితోనైనా గట్టిగా చెప్పాల్సింది కదా - "అన్నతో చెప్పి, నువ్వూ అన్నా కలిసి నా సమస్యను వెంటనే ఇప్పుడే పరిష్కరించండి" అని.  

నీ చివరిరోజుల్లో నువ్వు నన్ను కలిసిన ప్రతిసారీ, నీ జీవితం ఎలాపోతోందో తెలుసుకోవడం ద్వారానైనా నేను చాలా తెలుసుకోవాల్సింది. ఇలాంటి ముగింపు నేనూహించలేదు. నేనెలా ఉన్నా సరే, అన్నగా నేను పూనుకోవాలన్న ఆలోచన ఆ మూడేళ్ళలో ఒక్కసారి నాకు వచ్చినా ఇవ్వాళ నాకింత బాధ వుండేదికాదు. 

ఇప్పుడు శ్రీధర్, నేనూ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకొన్నా నీ గురించే. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరై మర్చిపోయిన మానవసంబంధాలగురించే. 

నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.  

ఎందుకు వాసూ, ఇలా చేశావు? 

"అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు నాకు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

శ్రీనివాస్ చిమ్మని... నా చిన్న తమ్ముడు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? 

నీ ఫోన్ కాల్ ఏది? మొన్న వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? మనం ఎక్కడో అక్కడ కలిసి బయట బయట చాయ్ త్రాగలేదే? టిఫిన్ చేయలేదే? నీ నవ్వు ముఖంతో ఎప్పట్లా నాతో ఏదో ఒకటి మాట్లాడలేదే? శ్రీధర్, నేనే కలుస్తున్నాం తప్ప నువ్వు లేవే? 

ఎంత మెటీరియలిస్టిగ్గా ఆలోచించినా, నువ్వింక రావు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆ దుఖాన్ని ఆపుకోలేకపోతున్నాను.         

మిస్ యూ వాసూ...  
***

#SrinivasChimmani #Vasu #VasuChimmani #ManoharChimmani #Nagnachitram #NagnachitramBlog #MissYouVasu 

మార్కెటింగ్ లైఫ్!

"You'll quit worrying about what others think about you when you realize how rarely they actually think about you." - Unknown

రెండు మూడు నెలల నుంచే అనుకుంటున్నప్పటికీ, గత రెండు వారాల నుంచి మాత్రం... నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ యాక్టివిటీని చాలా అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను.

మొట్టమొదటిసారిగా, ఒక మల్టి ప్యాషనేట్ క్రియేటివ్‌ప్రెన్యూర్‌గా... నా సర్విసెస్, నా రిక్వయిర్‌మెంట్స్ అన్నిటినీ, ఒకదాని తర్వాత ఇంకోటిగా... నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. 

నా ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్... అన్నీ, ఇప్పుడు... అయితే సినిమా, లేదంటే నా ఇతర ప్రొఫెషనల్ యాక్టివిటీస్‌కు సంబంధించిన కంటెంట్ తో నిండిపోతున్నాయి. నా మొత్తం క్రియేటివిటీ యాక్టివిటీకి "మార్కెటింగ్ స్పేస్"గా మారిపోతున్నాయి.    

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా - ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ నాకు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని నేను పట్టించుకోవడం లేదు. 

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కవులు, రచయితలు, మేధావి మిత్రులు, సీనియర్స్, నా శ్రేయోభిలాషులు, నా ఆత్మీయ మిత్రులు...... ఈ స్టఫ్ అంతా చూసి ఇబ్బంది పడే అవకాశం చాలావుంది. సరదాగా ఎంజాయ్ చేయండి. లేదా, హాయిగా నన్ను "అన్‌ఫాలో" చేసెయ్యండి! 😊 అన్‌ఫ్రెండ్ చేసినా నో ప్రాబ్లమ్. కలుసుకునేవాళ్లం ఎలాగూ మళ్ళీ కలుసుకుంటాం. 😊😊

అన్‌ఫాలో చేస్తారో, అన్‌ఫ్రెండ్ చేస్తారో మీ ఇష్టం. నేనిప్పుడు పూర్తిగా బిజినెస్ మూడ్‌లో ఉన్నాను. నా టార్గెట్స్, నా ఫ్రీడమ్ తప్ప ఇంకేదీ నాకు ముఖ్యం కాదిప్పుడు.  

ఏదో ఒక సినిమా ప్రాజెక్టు అని మాత్రమే కాకుండా, నా అన్ని క్రియేటివ్ వింగ్స్‌లోనూ చేతినిండా పనితో చాలా చాలా బిజీ అయిపోవాలన్నది నా సంకల్పం. ఆ బిజీ మొన్నటి దసరా నుంచే పుంజుకోవాలనీ, ఊపిరి సలపనివ్వని వర్క్‌లోడ్‌తో పనిచేస్తూ, ఈ సంవత్సరం ఆఖరుకల్లా కొన్ని విషయాల్లో నేను పూర్తిగా 'ఫ్రీ అయిపోవాలని' కూడా గట్టిగా అనుకున్నాను. 

ఆ దిశలోనే వెళ్తున్నాను. ఇంకా స్పీడప్ చేస్తున్నాను.  

పని చేస్తూవుంటేనే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. 'అనుకోకుండా జరుగుతాయని మనం అనుకొనే  మిరాకిల్స్' కూడా మనం పని చేస్తూవుంటేనే జరుగుతాయని నా నమ్మకం, నా అనుభవం. 

అదృష్టం ఎక్కడో ఆకాశం నుంచో, మన తారల నుంచో జారిపడదు. మనం ఎంత కష్టపడితే అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మన వెంటపడి వస్తుంది. ఇలాంటి అదృష్టాన్ని మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎంత కష్టమైనా పడతాను. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏

Peace, Progress and Prosperity to All of Us...   

INVEST IN FILMS & BECOME HERO OR CO-PRODUCER!

బాలనగర్ వర్క్‌షాపుల్లో మెషినిస్ట్‌గా గంటకు 30 రూపాయలకు పనిచేయటం నుంచి, జూబ్లీ హిల్స్ ప్రశాసన్‌నగర్‌లో కోటిరూపాయల సినిమా ప్రారంభించే డైరెక్టర్ స్థాయికి ఎదిగిన నాకు ప్రాక్టికల్‌గా తెలుసు... డబ్బు మంచిదో, చెడ్డదో, అది ఎంత కష్టపడితే వస్తుందో!  

పదో తరగతి ఫెయిల్ తర్వాత, చేతినిండా ఆయిల్ మరకలు పూసుకున్న మెషినిస్ట్ దశ నుంచి... నేరుగా యూనివర్సిటీలోకి ప్రవేశించి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు పీజీలు, రెండు గోల్డ్ మెడల్స్, మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేసి... జీవితంలోని ఆనందాల శిఖరాగ్రాల అంచులనూ, బాధల అగాధాల లోతులనూ అనుభవించిన నాకు తెలుసు... ఏ నిర్ణయం తప్పో, ఏ నిర్ణయం ఒప్పో!    

వీక్లీల్లో నా కథలు చదివిన డైరెక్టర్స్ నన్ను చెన్నై పిలిపించుకుని స్క్రిప్ట్ వెర్షన్స్ రాయించుకున్నరోజు నుంచి, స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్స్ తెలిపే పుస్తకం రాసి, దానికి నంది అవార్డ్ పొందేవరకు... రైటర్‌గా, టెక్నీషియన్‌గా అనేక ప్రత్యక్ష అనుభవాల నేపథ్యం ఉన్న నాకు తెలుసు... ఫిలిం ఇండస్ట్రీలోని జీవితాల వాస్తవాలేంటో, ఏమీ తెలియక బయట ఏదేదో రాసుకొనే సోషల్ మీడియా శునకానందాలేంటో! 

నెలలూ సంవత్సరాలూ ఎవరి చుట్టూ తిరక్కుండానే సొంతంగా అవకాశాలు క్రియేట్ చేసుకున్న నాటి నుంచి... డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌గా సినిమాలు తీసి... ఇప్పుడు కోవిడ్ మహమ్మారి తర్వాత మారిన ఫిలిం బిజినెస్ ట్రెండ్స్ నేపథ్యంలో, వ్యక్తిగత జీవితపు బరువూబాధ్యతల నుంచి కాస్త లిబరేట్ అయిపోతూ...  త్వరలో భారీ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించే దిశగా చిన్నచిన్నగా అడుగులేస్తున్న నాకు తెలుసు... 

అతి తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో 
ట్రెండీ కమర్షియల్ సినిమా తీసి,
అతి తక్కువ రోజుల్లోనే ఆ సినిమాను 
బిజినెస్ చేసి, రిలీజ్ చేయడం ఎలాగో! 

కట్ చేస్తే - 

ఈ నేపథ్యంలో… 

"ఇన్వెస్టర్-హీరో"గా కాని, "కో-ప్రొడ్యూసర్"గా కాని - సినీఫీల్డు వైపు బాగా ఆసక్తి ఉండి, నాతో వెంటనే కొలాబొరేట్ అవ్వగల లైక్-మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్స్ కోసం నేను చూస్తున్నాను.    

మీరు కో-ప్రొడ్యూసర్‌గా అసోసియేట్ అవొచ్చు, ఇన్వెస్టర్-హీరోగా కూడా ఫండింగ్ చేయొచ్చు. మీకు సినీఫీల్డు పట్ల అమితమైన ప్యాషన్ ఉండటం ముఖ్యం.   

పార్ట్‌నర్‌గా మీ బెనిఫిట్స్ మీకు చాలా ఉంటాయి. అవన్నీ పర్సనల్‌గా చర్చిద్దాం.   

మనం కాల్‌లో మాట్లాడుకోడానికి ముందు, మీకు తెలియాల్సిన మరిన్ని వివరాల కోసం వీలైతే ఈ లింక్స్ క్లిక్ చేసి, చదవండి. లేదంటే, డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి: 

1. Investor-Hero option: https://bit.ly/hero10x 
2. Co-Producer option: http://bit.ly/totalcinema 

మీరు వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే, నాకు ఇప్పుడే కాల్‌ చేయండి. మాట్లాడుకుందాం... కలుద్దాం... కొత్త సినిమా ప్రారంభిద్దాం.      

Welcome to Glamour World! 

Film Director, Nandi Award Winning Writer
Call: +91 9989578125

ABOUT MANOHAR CHIMMANI: 

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు ఆసక్తి ఉన్నవారికి, ఫిలిం ప్రొడక్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవారికి, ఇన్వెస్ట్ చేస్తూ హీరోగా పరిచయం కావాలని ప్రయత్నిస్తున్నవారికి... దయచేసి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్ యూ! 😊)
***

#FilmInvestment #Funder #Investor #Co-producer #BecomeProducer #FilmProduction #FilmPartner #ManoharChimmani #TeluguCinema #Tollywood #TeluguFilmIndustry #InvestInFilms #FIlmEntryMadeEasy 

Wednesday 15 December 2021

ఒక్క గంట సమయం మీకుందా?

ఏదయినా చేయండి... మీ నిద్రని కొంత తగ్గించుకోండి. మీ జీవిత భాగస్వామికీ, మీ పిల్లలకూ లంచాలూ, తాయిలాలివ్వండి. రోజూ ఆ సమయంలో రొటీన్‌గా చేసే ప్రతి చెత్త పనినీ కాసేపు మర్చిపోండి. అవసరం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేసెయ్యాలన్న దురదని కూడా... ఆ కొద్దిసేపు మర్చిపోండి.

ఇంకా ఏ త్యాగమయినా సరే.. ఫరవాలేదు. చేసెయ్యండి. కానీ –

మీ దినచర్యలో మొదటి అరవై నిమిషాల సమయాన్ని మాత్రం మీ కోసం రిజర్వ్ చేసుకోండి. సంపూర్ణంగా.

"Me-time" అన్నమాట!

ఈ ఒక్క గంట చాలు... మనకున్న 24 గంటల్లో – మనకోసం మనం కెటాయించుకొనే ఈ ఒక్క గంటకు మన జీవితగమనాన్నే మార్చివేసే శక్తి ఉంది. సరిగ్గా ఉపయోగించుకోగలిగితే.

ఈ ఒక్క గంటనే, టొనీ రాబిన్స్ వంటి “పీక్ పెర్ఫామెన్స్” స్పెషలిస్టులు, “Hour of Power” గా చెప్తారు.

ముందుగా – ఈ ఒక్క గంటలో మనం ఏం చేయకూడదో చూద్దాం:
> ఫేస్‌బుక్ జోలికి వెళ్లకండి. అలాగే ట్విట్టర్, ఇతర సోషల్ మీడియానీ మర్చిపోండి.
> నో ఈమెయిల్స్ ప్లీజ్!
> న్యూస్‌పేపర్ చదవొద్దుగాక చదవొద్దు. కనీసం ఆ ఒక్క గంట. మేగజైన్లు కూడా స్ట్రిక్ట్‌లీ నో. టీవీ ప్లగ్ పీకేసేయండి.

మరేం చేయాలి?

ఇదిగో, ఇవి:
> అలవాటుంటే డైరీ రాయండి. లేదా బ్లాగ్ చేయండి. ఏదయినా రాయండి.
> నాలుగు గోడలు దాటి బయట ఒంటరిగా జాగింగ్‌కి వెళ్లండి. వాక్ చేయండి.
> అలా నడుచుకుంటూ వెళ్లి మీకిష్టమైన బండిపైనో, బంకు దగ్గరో టీ త్రాగండి.
> మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఏదయినా పుస్తకంలోని ఒక చాప్టర్ చదవండి.
> మీ అంతరంగాన్ని దర్శించుకోండి. మెడిటేషన్ చేయండి.
> మీ జీవనశైలి గురించి, మీ జీవిత లక్ష్యాల గురించి ఆలోచించండి.
> మీరెక్కడున్నారో తెలుసుకోండి. ఇంకా ఎంత దూరం వెళ్లాలో, ఏమేం చేయాల్సి ఉందో గుర్తించండి.

ఇదంతా ఏదో చిట్కాల బ్లాగ్ పోస్ట్ కాదు. 

సక్సెస్ సైన్స్! 

ఆధునిక జీవనశైలికి అలవాటుపడిపోయి, మనం మర్చిపోతున్న ఒక కళ.

మీ దినచర్యలో మీకోసం మీరు కెటాయించుకోనే ఈ అరవై నిమిషాలకి నిజంగా చాలా శక్తి ఉంది. దీన్నొక అలవాటుగా చేసుకోండి. కేవలం ఒక్క నెల తర్వాత మీలో, మీ ఆలోచనల్లో, మీ జీవనశైలిలో ఎంతో మార్పు ఉంటుంది.

అది మీకిష్టమైన మార్పు. మీరు కోరుకున్న గమ్యానికి మిమ్మల్ని సులభంగా చేర్చే మార్పు.

ఆ మార్పు మీకవసరం. నాకవసరం. మనందరికీ అవసరం.

రోజుకి ఒక గంట కెటాయించే ఇదే Me-time ను, నెలకి ఒక సారి... ఒక్క రోజంతా... మీ ఇష్టారాజ్యంగా గడపగలిగితే, అది మీ "Self-date" అవుతుంది. 

ఒకసారి ఈ రెండింటి గురించి ఆలోచించండి. ఆచరించి కూడా చూడండి. మీకే అర్థమవుతుంది... మీరేంటో, మీరేం కోల్పోతున్నారో!   

“Identify your problems, but give your power and energy to solutions.”
– Tony Robbins
***

#MeTime #SelfDate #Aloneness #SelfMotivation #LoveYourself #ArtDay 

FILM ENTRY MADE EASY!

బాలనగర్ వర్క్‌షాపుల్లో మెషినిస్ట్‌గా గంటకు 30 రూపాయలకు పనిచేయటం నుంచి, జూబ్లీ హిల్స్ ప్రశాసన్‌నగర్‌లో కోటిరూపాయల సినిమా ప్రారంభించే డైరెక్టర్ స్థాయికి ఎదిగిన నాకు ప్రాక్టికల్‌గా తెలుసు... డబ్బు మంచిదో, చెడ్డదో, అది ఎంత కష్టపడితే వస్తుందో!  

పదో తరగతి ఫెయిల్ తర్వాత, చేతినిండా ఆయిల్ మరకలు పూసుకున్న మెషినిస్ట్ దశ నుంచి... నేరుగా యూనివర్సిటీలోకి ప్రవేశించి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు పీజీలు, రెండు గోల్డ్ మెడల్స్ సాధించి, మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేసి... జీవితంలోని ఆనందాల శిఖరాగ్రాల అంచులనూ, బాధల అగాధాల లోతులనూ అనుభవించిన నాకు తెలుసు... ఏ నిర్ణయం తప్పో, ఏ నిర్ణయం ఒప్పో!    

వీక్లీల్లో నా కథలు చదివిన డైరెక్టర్స్ నన్ను చెన్నై పిలిపించుకుని స్క్రిప్ట్ వెర్షన్స్ రాయించుకున్నరోజు నుంచి, స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్స్ తెలిపే పుస్తకం రాసి, దానికి నంది అవార్డ్ పొందేవరకు... రైటర్‌గా, టెక్నీషియన్‌గా అనేక ప్రత్యక్ష అనుభవాల నేపథ్యం ఉన్న నాకు తెలుసు... ఫిలిం ఇండస్ట్రీలోని జీవితాల వాస్తవాలేంటో, ఏమీ తెలియక బయట ఏదేదో రాసుకొనే సోషల్ మీడియా శునకానందాలేంటో! 

నెలలూ సంవత్సరాలూ ఎవరి చుట్టూ తిరక్కుండానే సొంతంగా అవకాశాలు క్రియేట్ చేసుకున్న నాటి నుంచి... డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌గా సినిమాలు తీసి... ఇప్పుడు కోవిడ్ మహమ్మారి తర్వాత మారిన ఫిలిం బిజినెస్ ట్రెండ్స్ నేపథ్యంలో, వ్యక్తిగత జీవితపు బరువూబాధ్యతల నుంచి కాస్త లిబరేట్ అయిపోతూ...  త్వరలో భారీ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించే దిశగా చిన్నచిన్నగా అడుగులేస్తున్న నాకు తెలుసు... 

అతి తక్కువ సమయంలో 
సినిమాల్లో అవకాశాలు పొందడం ఎలాగో...
ఆ తర్వాత, నిలదొక్కుకొని 
విజయం సాధించటం ఎలాగో...

కట్ చేస్తే - 

2022 ప్రారంభంలోనే మీరు సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకుంటున్నారా? 

ఇప్పుడంత అసాధ్యమేం కాదది. 

నిజంగా మీలో అంత ఆసక్తి, అంత ప్యాషన్ ఉందా? 

మీ లక్ష్యాన్ని నా లక్ష్యంగా తీసుకొని, మీ కల నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. 

#యాక్టింగ్, 
#డైరెక్షన్, 
#స్క్రిప్ట్‌రైటింగ్ లలో 
ఆన్‌లైన్‌ కోచింగ్! 

వెంటనే ఫీజు చెల్లించి కోచింగ్‌లో చేరగలను అనుకుంటే - కింద లింక్ ఉంది. పూర్తిగా చదవి అవగాహన చేసుకోండి. ఆ తర్వాతే నాకు వాట్సాప్ చేసి ఫీజు వివరాలు తెలుసుకోండి. ఓకే అనుకుంటే నాతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని, వెంటనే కోచింగ్‌లో చేరిపొండి.

Welcome to Film Industry! 

Read this & get connected:
https://bit.ly/okkachance

– Manohar Chimmani,
Film Director, Nandi Award Winning Writer 

For application & fee details:
WhatsApp only: +91 9989578125 

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. Thank you.)

***

#FilmCoaching #Acting #Direction #FilmDirection #ScriptWriting #ManoharChimmani #FilmCoachingOnline

బాపుగారి బొమ్మ

బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి:

బాపు గీసిన బొమ్మ, బాపు సినిమాలో హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయి. 

ఈ రెండూ కాకుండా, సుమారు 15 ఏళ్ళక్రితం చెన్నైలోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను.

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణు కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 5 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా అదొక గొప్ప అనుభవం.

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా.

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారి ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. బహుశా ఆ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చు.

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం.

బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే స్వయంగా చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. 

ఏదైనా కథ రాస్తున్నప్పుడో, ఇంకేదైనా ఆర్ట్ వర్క్ ఉన్నప్పుడో... తెలుగులో ఏదైనా టైటిల్-లేదా-హెడ్డింగ్ రాయాల్సిన అవసరం ఉన్నా కూడా... నేను నాకు తెలియకుండానే బాపు గారి శైలిని అనుకరిస్తూ రాసేస్తాను. నా పెళ్ళిపత్రికను కూడా నేనే స్వయంగా రాసుకొని, బాపు గారి స్టైల్‌లోనే బార్డర్ వేసి, స్క్రీన్ ప్రింట్ చేయించాను... 

మనకు తెలీకుండానే అదలా జరిగిపోతుంది. బాపుగారి శైలి ప్రభావం!  

కట్ చేస్తే –

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు ఇంట్లో ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం.

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట.

ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణు బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది.

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను... 

అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇప్పటికీ అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది?

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో అడిగాను. తర్వాత మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. “నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ, వారి ఇంటర్వ్యూ కేసెట్లు... ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి. వన్ ఫైన్ డే... ఒక పుస్తకంలో భాగంగా వాటిని ప్రింట్‌లో బయటికి తెస్తాను.  

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి.
***

#Bapu #FilmDirectorBapu #BapuGariBomma #MutyalaMugguBapu 

Tuesday 14 December 2021

నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు - 2

"నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు" టైటిల్‌తో, వారం క్రితం నేను చేసిన పాడ్ కాస్ట్ మొదటి భాగంలోనే చెప్పాను... ఇదంతా ఇప్పుడు గుర్తుకుతెచ్చుకొని పాడ్‌కాస్ట్ చెయ్యటం అనేది... ముందు నాకోసం. తర్వాత నా లైక్‌మైండెడ్ కోసం.  

నేనిప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కనీసం ఒక 20 మంది కొత్తవాళ్లను ప్రధాన పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేశాను. లిటరల్లీ, ఇంకో 40 మందిని చిన్న చిన్న పాత్రల్లో పరిచయం చేశాను.  వీళ్ళల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు. వీరిలో కొందరి గురించి ముందు ఎపిసోడ్‌లో చెప్పాను. 

ఇంకొందరి గురించి ఇంకో రెండు మూడు ఎపిసోడ్స్ చెయ్యాలనుకుంటున్నాను. తప్పక చేస్తాను. 

ఇప్పుడీ ఎపిసోడ్‌లో - సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన అమిత్ కుమార్ గురించి కొన్ని విశేషాలు చెప్తున్నాను. 

అలాగే - నేను పరిచయం చేసిన హీరోయిన్ నవ్య (నయన హర్షిత) గురించి, మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ గురించి కూడా కొన్ని విశేషాలు తర్వాతి ఎపిసోడ్సా్‌లో షేర్ చేస్తాను.

ఇక - నేను పరిచయం చెయ్యలేదు... కాని, నా సినిమాకోసం అప్పుడు నా టీంలో పనిచేసిన మా కోడైరెక్టర్ వేణు గురించి, కెమెరామన్ శంకర్ గురించి, కోరియోగ్రాఫర్ నిక్సన్ గురించి కూడా కొన్ని విశేషాలు తర్వాతి ఎపిసోడ్సా్‌లో షేర్ చేసుకుంటాను. అవన్నీ చాలా మంచి జ్ఞాపకాలు.    

మొన్నే చెప్పినట్టు - ఇదంతా ఎందుకంటే, పెద్ద రీజన్ లేదు. జస్ట్ నాస్తాల్జియా. 

నేను మళ్ళీ రెగ్యులర్‌గా సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకొని, చేయబోతున్న సందర్భంగా, మళ్ళీ పూర్తిస్థాయిలో, ఆ మూడ్‌లోకి పూర్తిగా దిగిపోడానికి, ఇలాంటి పాజిటివ్ జ్ఞాపకాలు ఒక మంచి డ్రైవ్‌లా పనికొస్తాయి (అని నా నమ్మకం).    

కట్ చేస్తే -    

ఇప్పుడు విలన్‌గా, కో-విలన్‌గా దాదాపు అన్ని భాషల్లో బిజీగా పనిచేస్తున్న అమిత్ కుమార్ ను నా మొదటి సినిమా "కల"లో మెయిన్ విలన్‌గా నేనే పరిచయం చేశాను. 

ఈ మధ్య అమిత్ తివారి అని టైటిల్స్‌లో వేసుకుంటున్నాడు. 

చాలా మంచి ఆర్టిస్టు. 

అప్పుడు మా ఆఫీసుకి వచ్చిన ఫోటోల్లో అమిత్ ఫోటో చూడగానే "ఇతనే మన సినిమాలో విలన్" అని డిసైడయ్యాను. ఆ తర్వాతే అతని మ్యానేజర్ నరేష్‌ను పిలిపించి మాట్లాడాను. తర్వాత అమిత్ ముంబై నుంచి వచ్చాడు . అయితే - ముంబైలో పుట్టి పెరిగినా, అమిత్ తెలుగువాడే కావడం విశేషం. అమిత్ వాళ్ళ బంధువులంతా హైదరాబాద్ లోని నారాయణగూడలో ఉంటారు.

అమిత్ కు యాక్టింగ్ మీద ఎంత ప్యాషన్ అంటే - మా కెమెరామన్ శంకర్ తో సహా, మా టీమ్ అంతా అతను యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. స్క్రిప్ట్ లో ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. అమిత్ సీన్లు కూడా ఆ సినిమాలో చాలా బాగున్నాయి. 

"ఇంకా ఏమైనా చెయ్యాలా సర్... ఇంకా వేరే రకంగా చెయ్యాలా సర్" అని దాదాపు ప్రతి సీన్లో, ప్రతి షాట్ కూ... ఎప్పుడూ అడుగుతుండేవాడు. 

యాక్టింగ్ మీదున్న అతని ప్యాషన్ కు ఇంప్రెస్ అయిపోయి, అతని కోసం స్క్రిప్ట్‌లో లేని సీన్ ఒకటి కొత్తగా క్రియేట్ చేసి, రాసి, సినిమా ముగింపులో యాడ్ చేశాను. అలా చేయడం వల్ల మా హీరో ఫీలయ్యాడు. అమిత్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని కూడా కొందరు కామెంట్ చేశారు. అదంతా ఉట్టిదే. 

టు బి ఫ్రాంక్, అమిత్ కుమార్ ను నేను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసినందుకు, డబ్బు కాదుకదా... కనీసం ఒక 'యూజ్ అండ్ త్రో' పెన్ను కూడా నేను గిఫ్టుగా తీసుకోలేదు. 

నిజానికి, ఆ సినిమా తర్వాత అతనెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. కాల్స్ కూడా లేవు. ఇండస్ట్రీలో ఇదంతా మామూలే. అది వేరే విషయం.😊

He's a very good actor. మిగిలిన విషయాలు... జస్ట్ ట్రాష్.  నేను పెద్దగా పట్టించుకోను.

అప్పుడు మేం అమిత్ కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే. బహుశా 10,116 అనుకుంటాను. "శాస్త్రానికి" అంటారు కదా అలా... ఒక మంచి ప్రారంభానికి గుర్తుగా, అతనికి అంతా మంచి జరగాలని ఇచ్చిందది. చెక్ ఇచ్చాం. జ్ఞాపకంగా దాన్ని అలాగే దాచిపెట్టుకుంటా అన్నాడు అమిత్. 

ఆనాటి ప్రారంభం నుంచి ఇప్పటివరకు, ఇన్ని వందల సినిమాల్లో, అమిత్ ఒక 10 కోట్లు సంపాదించాడన్నా నేను ఆశ్చర్యపోను.    

ఇక - మా సినిమా జరుగుతున్న టైంలో, మేం ఇద్దరం, అతని మేనేజర్ నరేష్ కలిసి బాగానే తిరిగాం. ఒకసారి ముంబై వెళ్ళినప్పుడు, అక్కడ అమిత్ వాళ్ళ నాన్న మాకు మంచి డిన్నర్ ఇచ్చారు. ఆయన ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్. చాలా మంచివారు.  

అమిత్, నేను, నరేష్ కలిసి పబ్స్ కు కూడా వెళ్ళేవాళ్ళం. పబ్ అనగానే ఇంకోటి గుర్తొచ్చింది. మా సినిమాలో అమిత్ ఉన్న ఒక పబ్ సీన్ కోసం, అప్పట్లో నానక్ రాం గూడలో ఉన్న "ఎపిక్యురస్" పబ్ లో షూట్ చేసాము.     

ఇదంతా ఎలా ఉన్నా... ఒక్కటి మాత్రం నిజం. తన తొలి చిత్రం లోనే, ఒక ఫుల్ రేంజ్ విలన్‌గా "కల"లో అద్భుతంగా నటించాడు అమిత్. అందులో ఎలాంటి డౌట్ లేదు. 

రిలీజైనప్పటి నుంచి, ఇప్పటివరకు, జెమిని, తేజ చానల్స్ లో  మా ఇద్దరి డెబ్యూ సినిమా "కల" కనీసం ఒక వంద సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి చెప్తూ, జెమినిలోనే ఒక ఆఫీసర్ అప్పట్లో నాతొ ఇంకో మాట కూడా చెప్పాడు:  

"సార్, మీ ప్రొడ్యూసర్ కు ఎన్ని డబ్బులొచ్చాయో తెలీదు కాని, మా జెమినీ చానెల్ కు మాత్రం, వేసినప్పుడల్లా పండగే. స్పాన్సర్లూ ఎక్కువే, యాడ్స్ కూడా ఎక్కువే!"  

కట్ చేస్తే - 

నా సినిమా తర్వాత - అమిత్ కు వై వి యస్ చౌదరి, పూరి, యస్ యస్ రాజమౌళి, త్రివిక్రమ్ వంటి డైరెక్టర్స్ చాలా మంచి లిఫ్ట్ ఇచ్చారు.  నాకు తెలిసి, గత పదేళ్ళలో - తెలుగులో సినిమాలు తీసిన టాప్ డైరెక్టర్స్ అందరి సినిమాల్లో అమిత్ నటించాడు. 

అయినప్పటికీ - నా ఉద్దేశ్యంలో అమిత్‌కు నా మొదటి సిన్మా "కల"లో వచ్చినంత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ ఇప్పటివరకు రాలేదు. ఎందుకనో తెలీదు. లేటెస్ట్ గా... ఈ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అన్నయ్యగా సపోర్టింగ్ రోల్ లో చూసాను. బాగా చేసాడు. ఇక అలాంటి సపోర్టింగ్ రోల్స్ లో కూడా బిజీ అవుతాడు. 

ఇంకా, ఆమధ్య ఎటీటీ కోసం ఆర్జీవీ తీసిన మినీ మూవీ "నేకెడ్"లో కూడా చేసాడు. 

చెప్పాలంటే - తెలుగులో రిలీజవుతున్న ప్రతి మూడో సినిమాలో అమిత్ ఉంటాడు.      

అప్పట్లోనే రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు అమిత్. ఇప్పుడు కూడా... ఏదో "నల్లమల" అనే ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు. 

యాక్టర్ గా... ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడాలన్నది అమిత్ కుమార్ డ్రీమ్. మా సినిమా జరుగుతున్నన్ని రోజులూ, ఈ విషయం నాతో ఎన్నోసార్లు షేర్ చేసుకునేవాడు. యాక్టింగ్ మీద తనకున్న ప్యాషన్ తో, తన డిసిప్లిన్ తో ఆ కల సంపూర్ణంగా నిజం చేసుకున్నాడు అమిత్. 

ఇది మామూలు విషయం కాదు. అందరివల్లా సాధ్యం కాదు.

"అమిత్ ను నేను కదా ఇంట్రడ్యూస్ చేసింది"... అని, తెరమీద అతన్ని చూసినప్పుడల్లా గుర్తుకొచ్చి నేను హాపీగా ఫీలవుతాను.  I wish him all the best.

కట్ చేస్తే - 

ఇప్పుడు అతి త్వరలో నేను చేయబోతున్న సినిమాలో - ఫ్రెష్‌గా ఒక అయిదు జంటల్ని పరిచయం చేయబోతున్నాను. ప్రాజెక్టు వివరాలు చెప్పడానికి ఇంకా టైముంది. 

ఆసక్తి, అవసరమైన అర్హతలు, ఆ రేంజ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు... కేవలం కొత్త హీరోలు, హీరోయిన్స్ మాత్రమే... I repeat... కేవలం కొత్త హీరోలు, హీరోయిన్స్ మాత్రమే... కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి... డి ఎం చేయండి. Strictly no calls please.  

ఆల్ ద బెస్ట్.  
***

– Manohar Chimmani,
Film Director, Nandi Award Winning Writer 

WhatsApp only: +91 9989578125 
*****

This post is the transcript of my recent podcast. 
Here's the podcast Links:

Anchor:

 
Youtube:
https://youtu.be/VxJ0vqNLjpo
***

#AmitKumar #AmitTiwari #VillainAmitKumar #KalaVillain #NewTalent #ManoharChimmani #DirectorManoharChimmani #NavyaNatarajan #NayanaHarshita, #KalaTeluguMovie #KalaTeluguFilm #Kala #Dharmateja #Nixon

Sunday 12 December 2021

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగులో బ్లాగింగ్ చేస్తున్న మిత్రులందరికీ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు.

వీవెన్ గారి ట్వీట్ ద్వారా తెలిసింది నాకు... డిసెంబర్ రెండో ఆదివారం "తెలుగు బ్లాగుల దినోత్సవం" అని. వారికి నా ధన్యవాదాలు.  

కట్ చేస్తే - 

బ్లాగింగ్ నాకిష్టం. చాలా ఇష్టం.

ఎంత ఇష్టమంటే... ఒక ఎడిక్షనంత ఇష్టం.

ఇంగ్లిష్ నవలల్లో వర్ణించే ఒక మాండ్రెక్స్ మత్తంత ఇష్టం. 

అంత వ్యామోహం. అంత పిచ్చి. అంత ఆనందం. 

నేను రాస్తున్నది సినిమాలు కావచ్చు, సక్సెస్ సైన్స్ కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, నా సొంత గొడవ కావచ్చు.

నేను రాస్తున్నది టైమ్‌పాస్ టిడ్ బిట్స్ లాంటిది కావొచ్చు. ఎందుకూ పనికిరాని చెత్తాచెదారం కావొచ్చు. ఎక్కడో ఏ కొంచెమో పనికొచ్చే ఏదైనా మంచి విషయం కూడా కావొచ్చు.

కానీ, అలా రాస్తున్నంత సేపూ నన్ను నేను మర్చిపోతాను. నా పీకలమీదున్న ఎంతో వత్తిడిని, ఎన్నో కష్టాల్నీ కూడా పూర్తిగా మర్చిపోతాను.

ఒక మత్తులో మునిగిపోతాను.

ఆ మత్తు అలాగే ఉండిపోతే బాగుండు అనిపించేంత ఆనందంలో మునిగిపోతాను...

దురదృష్టవశాత్తు, ఇలా రాసే ఆనందాన్ని నేనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ పొరపాటు చేయకపోయుంటే తప్పకుండా నేనొక మంచి పాపులర్ రైటర్ అయ్యుండేవాన్ని.

కానీ, ఎందుకో అలా అనుకోలేదెప్పుడూ.

కట్ చేస్తే - 

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్. 

మై ఫస్ట్ లవ్... నా తొలి ప్రేమ. 

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు. 

జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు నిజంగా నన్ను కాపాడేది ఈ థెరపీనే. ఈ యోగానే. 

నేను రాయాలనుకున్న కొన్ని పుస్తకాల గురించి, స్క్రిప్టుల గురించి, ఇంకెన్నో క్రియేటివ్ థింగ్స్ గురించి, నేను చేస్తున్న ఎన్నో ఫ్రీలాన్సింగ్ పనుల గురించీ... నాకు మొట్టమొదటగా ఒక కొత్త ఐడియా మెరిసేది కూడా... ఇలా బ్లాగింగ్ చేస్తున్నప్పుడే.  

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

బై ది వే, మొన్న ఏప్రిల్‌లో నాకు  కరోనా వచ్చినప్పుడు కూడా, ఎలాంటి భయం లేకుండా నేను బయటపడటానికి నాకు ఎక్కువగా ఉపయోగపడింది కూడా ఈ బ్లాగింగ్ థెరపీనే. 

ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కూడా... నా క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి ఒక హబ్‌లా పనిచేస్తూ, నాకెంతో సహాయపడుతోంది నా బ్లాగింగ్.  

ఇందాకే చెప్పినట్టు - నాకెంతో ప్రియమైన నా రాసే అలవాటుని, నా బ్లాగింగ్‌నీ నేను నిజంగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ అలవాటు మాత్రం నన్నెప్పుడూ కంటికిరెప్పలా చూసుకొంది.

ఒక నిజమైన స్నేహితునిలా, ఒక ప్రేయసిలా, ఒక తల్లిలా.

అనుక్షణం నా వెంటే ఉంది. 

నా చివరి క్షణం వరకు నేనూ వదలను. 
***

#TeluguBlogs #NagnaChitram #NaganaChitramTeluguBlog #TeluguBlogsDay #TeluguBloggers #TeluguBlogging #TeluguBlogulaDinotsavam #Blogging #BloggingTherapy

Saturday 11 December 2021

ఫిలిం కోచింగ్ ఎందుకు అవసరం?

సుమారు నెల క్రితం ఒక మిత్రుడు కలిశాడు. తనతోపాటు వచ్చిన మిత్రున్ని నాకు పరిచయం చేశాడు. కాబోయే డైరెక్టర్ అతను. ప్రొడ్యూసర్ కూడా అతనే. సమస్య ఏంటంటే - తర్వాత ఏం చెయ్యాలన్నది అతనికి తెలీదు. దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది చాలా ప్రామిస్‌లు చేస్తూ దోచేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ అంకె 10 లక్షలు దాటింది. ఇప్పటికి కూడా అతనికి "నెక్‌స్ట్ ఏంటి" అన్నది పెద్ద ప్రశ్నే. 

వైజాగ్ నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇక్కడ హైద్రాబాద్‌లో ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. డైరెక్షన్ కోర్సు. ఫీజు 5 లక్షలు. అయిపోయింది. సెలెబ్రిటీతో సర్టిఫికేట్, ఫోటో చేతికొచ్చాయి. నెక్‌స్ట్ ఏంటన్నది తెలియక, ఇక్కడే ఓ ఫ్లాట్ తీసుకొని ఉన్నాడు. నలుగురూ చెప్పే గప్పాలు, గాసిప్స్ వింటూ ఒక సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది. శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, కరిగిపోతున్న సమయం విలువ గురించి ఆ కుర్రాడికి ఇంకా తెలియట్లేదు. 

అనుకోకుండా మొన్నీమధ్యే... కాబోయే డైరెక్టర్, మంచి రైటరూ అయిన ఒక మిత్రునితో ఫోన్ సంభాషణలో తెలిసిందేంటంటే - ఒక హీరోయిన్ డేట్స్ కోసం సహాయం చేస్తానని అతని దగ్గర ఒకరెవరో లక్షరూపాయలు తీసుకున్నారట. డేట్సూ లేవు, సహాయం లేదు... అంతా ఉట్టిదే అని మిత్రునికి ఇప్పుడర్థమైంది. మా చర్చల్లో ఒక హీరోయిన్ పేరొచ్చింది. ఆ హీరోయిన్ మేనేజర్ ఎవరో, నంబర్ ఏంటో ఆయనకి దొరకలేదు. ఇండస్ట్రీలో చాలా మందితో మంచి నెట్‌వర్క్ ఉంది. మరి, వాళ్లంతా ఇంత చిన్న విషయానికి అతనికి సహకరించలేకపోయారా? నమ్మశక్యం కాదు. 

కట్ చేస్తే -

పైన చెప్పింది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ.

కోచింగ్ అంటే ఏదో రొటీన్ బేసిక్స్ చెప్పడం కాదు. దానికోసం ఇంటర్నెట్ నిండా ఒక జీవిత కాలం సరిపోయేంత స్టఫ్ ఉంది. అది చదువుకుంటే చాలు. చూసి అర్థం చేసుకుంటే చాలు.  

కాని, నిజంగా పనికొచ్చే కోచింగ్-లేదా-మెంటారింగ్  అలా కాదు. సమయం వృధా కానివ్వదు. సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చెప్తుంది. అన్నీ తెలిసీ, ఎందుకు 90% మంది ఫెయిల్ అవుతారో చెప్తుంది. ఇదిగో... ఇలాంటి సందర్భాల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో చెప్తుంది. 

టోటల్ ప్రాక్టికాలిటీ.  

Social-Digital Age లో నిజంగా పనికొచ్చే కోచింగ్ కావాలి. అతి తక్కువ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడాలి. అలాంటి కోచింగ్ మాత్రమే నేనిస్తున్నాను. కోచింగ్‌కు ఫీజు ఉంటుంది.  

నిజంగా అలాంటి కోచింగ్ కావాలనుకొనే వారు, 2022 ప్రారంభంలోనే ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకొనేవారూ... ఈ లింక్ క్లిక్ చేయండి:  

Tuesday 7 December 2021

జీవితం సప్తసాగర మథనం

ప్రతి మనిషి జీవితంలో ఒక అత్యంత క్లిష్టమైన సమయం వస్తుంది. ఏ పనీ జరగదు. జరిగినట్టే అనిపించినా.. మనం కలలో కూడా ఊహించని విధంగా అన్నీ ఎదురుకొడుతుంటాయి. దెబ్బ మీద దెబ్బ ఏదో ఒక రూపంలో పడుతూనే ఉంటుంది.

ఊపిరి తీసుకోలేం. ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేం. మనకి మనం కూడా ఒప్పుకోలేం.

ఇలాంటి సమయాలు నీ అనాలోచిత పాత నిర్ణయాల పరిణామాలేకావొచ్చు. నువ్వు కొత్తగా తీసుకొన్న మంచి నిర్ణయాల చెడు ఫలితాలు కూడా కావొచ్చు.

ఇలాంటి క్లిష్ట సమయాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వచ్చాయనుకోవద్దు. ఈ స్థాయి పరీక్షలను తట్టుకొనే శక్తి నీకుందని నిరూపించడానికి కూడా వస్తాయి.

“నో.. ఇంక నావల్లకాదు” అనుకుంటున్నావా?

అవసరంలేదు.

నీమీద నాకు నమ్మకముంది.
నీగురించి నువ్వు ఆలోచిస్తున్నదానికంటే 
శక్తివంతమైనవాడివని.

నీమీద నాకు నమ్మకముంది.
నీ కలల్ని నువ్వు తప్పక నిజం చేసుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది.
నువ్వు చేరాల్సిన గమ్యం చేరుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది.
నువ్వు కూడా నీమీద నమ్మకం పెంచుకోగలవని. 

Sunday 5 December 2021

నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు - 1

నేనిప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కనీసం ఒక 20 మంది కొత్తవాళ్లను ప్రధాన పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకో 40 మందిని చిన్న చిన్న పాత్రల్లో పరిచయం చేశాను.  వీళ్ళల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, మోడలింగ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు. 

వీళ్లల్లో కొందరి గురించి ఓ రెండు మూడు ఎపిసోడ్స్ చేద్దామనుకుంటున్నాను. 

ఇదంతా ఎందుకంటే - పెద్ద రీజన్ లేదు. జస్ట్ నాస్తాల్జియా. 

నేను మళ్ళీ రెగ్యులర్‌గా సినిమాలు చేయబోతున్న సందర్భంగా, మళ్ళీ పూర్తిస్థాయిలో ఆ మూడ్‌లోకి వెళ్లిపోడానికి ఇలాంటి జ్ఞాపకాలు ఒక మంచి డ్రైవ్‌లా నాకు ఉపయోగపడతాయని జస్ట్ అలా ఒక ఫీలింగ్... అంతే. 

నా మొదటి సినిమా "కల"లో హీరోగా చేసిన రాజా అప్పటికే రెండు, మూడు సినిమాలు చేసి ఉన్నాడు. రామానాయుడు "విజయం" అపజయం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు నా సినిమాకు బుక్ చేసుకున్నాం. తర్వాత శేఖర్ కమ్ముల "ఆనంద్"లో బుక్ అయ్యాడు. 

ఈ సినిమా ద్వారా నేను కొత్తగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసినవారిలో హీరోయిన్ నయన హర్షిత (నవ్య), విలన్ అమిత్ కుమార్ ఉన్నారు. 

నవ్య తర్వాత చాలా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం ఒక బిజినెస్ వుమన్‌గా బెంగుళూరులో వుంది. సినిమాలు కూడా చేస్తోంది.

నేను విలన్ గా పరిచయం చేసిన అమిత్ కుమార్ (అమిత్ తివారీ) ఇప్పుడు  విలన్ గా, సైడ్ విలన్‌గా  నాలుగు భాషల్లో బిజీగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఇప్పుడు కూడా "నల్లమల" అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మొన్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" సినిమాలో అన్నగా చేశాడు. 

నా అంచనా ప్రకారం, ఈ రేంజ్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్, కాల్‌షీట్‌కు యావరేజ్‌న ఒక యాభైవేలకు తక్కువుండదు. ఈ పదేళ్లలో ఎన్ని కోట్లు సంపాదించి వుంటాడో జస్ట్ అలా గెస్ చేయండి. :-)

అమిత్ మంచి ఆర్టిస్టు. మా సినిమా జరిగినన్నాళ్ళూ చాలా క్లోజ్‌గా, ఆత్మీయంగా ఉండేవాడు. అతని గురించి మరోసారి వివరంగా చెప్తాను.  

ఇంకా... నా మొదటి సినిమాలో మంజూష, కరుణ, అంజూ అస్రానీ మొదలైనవారిని పరిచయం చేశాను. వీళ్లల్లో ఒకరిద్దరు మంచి యాంకర్స్‌గా, ప్రోగ్రాం ప్రజెంటర్స్‌గా, ఇంటర్వ్యూయర్స్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లల్లో ఒకమ్మాయి తను నటించిన ఒక ట్రావెల్ సీరియల్‌లో భాగంగా దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ చుట్టేసి వచ్చింది.  ఒకమ్మాయి ఈమధ్యే BMW కొనుక్కుంది. 

ఈ సినిమాలోనే మణిశర్మకు కజిన్ ధర్మతేజను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాను. అతనికి వేటూరి గారి దయవల్ల అప్పట్లో పాన్‌లు బాగా తినటం అలవాటయ్యింది. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరిగినన్నాళ్ళూ ధర్మతేజ మా అఫీసుకో, స్టుడియోకో వస్తున్నపుడల్లా నాకూ ఓ నాలుగు పాన్లు తెచ్చి తినిపించేవాడు.😊 అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం మేం. మంచి ఫ్రెండ్. 

ధర్మతేజ మంచి టాలెంటెడ్, ఇండస్ట్రీలో  చాలా హై రేంజ్ పరిచయాలు కూడా ఎక్కువే. మరెందుకనో వెనకే ఉండిపోయాడు. ఇతని మీద కూడా ఒక ఎపిసోడ్ ప్రత్యేకంగా చెయ్యాలి. 

ఈ సినిమా ద్వారా భాస్కర్‌ను ఎడిటర్‌గా పరిచయం చేశాను. కోలా భాస్కర్ అనుకుంటాను. మళ్ళీ ఎక్కువగా కలవలేదు మేము. ఎడిటర్‌గా అతనింకా ఫీల్డులో  బిజీగానే ఉన్నాడు. 

లారెన్స్ అసిస్టెంట్ శాంతిని ఈ సినిమా ద్వారా కోరియోగ్రాఫర్‌గా ఇంట్రడ్యూస్ చేశాను. శాంతి హైలీ టాలెంటెడ్. పిచ్చి ఎనర్జీ. మంచి ఫ్రెండ్. ఈ సినిమా తర్వాత వెంటనే తనకు మణిరత్నం "యువ"లో, పవన్ కళ్యాణ్ "గుడుంబా శంకర్"లో అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత, తమిళంలో చాలా బిజీగా పనిచేసింది 'శాంతి మాస్టర్'. 

నేను బాగుండాలని, రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనీ ఎప్పుడూ అంటూండేది శాంతి. తమిళనాడులో ఏదో గుడి పేరు చెప్తుండేది ఎప్పుడూ. "నా మాట మీద మీరు ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి రండి సర్" అని చాలాసార్లు చెప్పింది. శాంతి గురించి కూడా తర్వాత వివరంగా ఒక బ్లాగో, పాడ్‌కాస్టో తప్పక చేస్తాను. 

నేనేం నాస్తికున్ని కాదు. అయినా ఇవన్నీ పెద్దగా నమ్మను. నా వ్యక్తిగత కారణాలవల్ల నేను రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యలేకపోయాను. ఇప్పుడు మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. ఆ పనిలోనే చాలా బిజీగా ఉన్నాను.    

నా తర్వాతి ప్రాజెక్టులు... "అలా", "స్విమ్మింగ్‌పూల్" సినిమాల్లో నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గురించి ఇంకోసారి, ఇంకో ఎపిసోడ్‌లో చెప్తాను.  

కట్ చేస్తే - 

ఇప్పుడు అతి త్వరలో నేను చేయబోతున్న సినిమాలో - ఫ్రెష్‌గా ఒక అయిదు జంటల్ని పరిచయం చేయబోతున్నాను. ప్రాజెక్టు వివరాలు చెప్పడానికి ఇంకా టైముంది. 

ఆసక్తి, అవసరమైన అర్హతలు, ఆ రేంజ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు... కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి... డి ఎం చేయండి.

ఆల్ ద బెస్ట్.  

Film Director, Nandi Award Winning Writer 

WhatsApp only: +91 9989578125 
^^^^^
^^^^^

Transcript of my podcast. Links:

Anchor:


Youtube:

Saturday 4 December 2021

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ - 2

ఆమధ్య "Iceక్రీమ్" సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌కి తెరతీశాడు వర్మ. దాని పేరు "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్". సోషల్ మీడియా లేని కాలంలోనే, 2006లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను. 1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగజ్ ఇదే పధ్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు.  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పధ్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమా బడ్జెట్ పాతిక లక్షలు కావొచ్చు. 50 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  సో .. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

కట్ చేస్తే - 

ఈ కాన్సెప్ట్‌తో నేను, నా చీఫ్ టెక్నీషియన్స్ వీరేంద్ర లలిత్, ప్రదీప్‌చంద్రతో కలిసి... నా సొంత బ్యానర్‌లో... ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.

అంతా న్యూ టాలెంట్, అప్-కమింగ్ టాలెంటే ఉంటుంది. 

థియేటర్స్‌లో రిలీజ్ అనేది పెద్ద సమస్యగా ఉన్నప్పుడే నేను నా సినిమాలను బిజినెస్ చేసి, థియేటర్స్‌లో రిలీజ్ చేశాను. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి. అసలు రిలీజ్ సమస్యే కాదు.    

ఇంతకు ముందు సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. 

Content is king. Money is the ultimate goal.

నో కాల్ షీట్స్. నో టైమింగ్స్. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్. 

చిన్నమొత్తంలో అయినా సరే... ఇన్వెస్ట్ చేసి, ఫీల్డులోకి రావాలనుకొనే ప్యాషనేట్ ఇన్వెస్టర్‌లకు వెల్కమ్!  

ఇన్వెస్ట్ చేస్తూ, హీరోలుగా ఇంట్రడ్యూస్ కావాలనుకోనే కొత్త హీరోలకు కూడా సూపర్ వెల్కమ్!! 

కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. నన్ను కనెక్ట్ అవండి. చర్చిద్దాం.  

ఒక్కటే గుర్తుపెట్టుకోండి... 

ఏదీ
ఊరికే
రాదు! 

Film Director 

Whatsapp: +91 9989578125,

ABOUT MANOHAR CHIMMANI: 

PS:
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ -1 కూడా చదవండి:  

రజినీకాంత్, చిరంజీవి కూడా ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌కు వెళ్ళినవాళ్లే! కానీ...

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు లీడ్‌లో ఉన్న హీరోహీరోయిన్స్‌లో, దాదాపు అందరూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లో శిక్షణ పొందినవారే. 

రజినీకాంత్, చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదు. 

సుమారు 40 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా మద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు.

ఆ శిక్షణ ద్వారా నేర్చుకొన్న కొన్ని అదనపు మెలకువల ద్వారానే వారిలో ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసంతో  ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఒక అవగాహన తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికే కాదు, ప్రవేశించాక అక్కడ నిలదొక్కుకోడానికి కూడా అవసరమైన ఒక క్రమశిక్షణ క్రియేట్ చేసుకున్నారు. వ్యూహాత్మకంగా కష్టపడ్డారు. 

అవకాశాలు... వాటంతటవే వాళ్లని వెతుక్కొంటూ వచ్చాయి. 

ఇద్దరూ లెజెండ్స్ అయ్యారు. 40 ఏళ్లుగా ఇంకా నటిస్తూనే ఉన్నారు.   

కట్ చేస్తే -  

ఫిలిం కోచింగ్‌లో ప్రధానంగా రెండు రకాలుంటాయి: 

ఒకటి రొటీన్ కోచింగ్. రెండోది పనికొచ్చే కోచింగ్. 

రొటీన్ కోచింగ్ గురించి పెద్దగా చెప్పేదేం లేదు. ఇన్‌స్టిట్యూట్ వాళ్లకు ఆదాయం కావాలి. కోచింగ్ తీసుకొనేవాళ్ళకు "హమ్మయ్య... కోచింగ్ తీసుకున్నాం" అన్న ఆనందం కావాలి. 

ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎవరో ఓ సెలబ్రిటీతో ఒక ఫోటో కూడా వస్తుంది. 

ది ఎండ్. 

తర్వాత ఇంకేం జరగదు. 

ఇంటిదగ్గరనుంచి కష్టాల లిస్టుతో తిట్లు...  కృష్ణానగర్‌లో ఆకలి కేకలు... గణపతి కాంప్లెక్స్ గోడల దగ్గర గాసిప్స్... శ్రీనగర్ కాలనీ, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం అలా తిరుగుతుండగానే నెలలూ సంవత్సరాలూ గడవటం. 

రావల్సిన ఆ "ఒక్క ఛాన్స్" మాత్రం రాదు. 

అయితే - పనికొచ్చే కోచింగ్ అలా ఉండదు...

కోచింగ్ కోసం వాళ్ళు డబ్బు ఎందుకు తీసుకొంటున్నారు అన్న విషయంలో వారికి స్పష్టమైన స్పృహ ఉంటుంది. బాధ్యత ఫీలవుతారు. 

అప్పటిదాకా అస్పష్టంగా ఉన్న మీ లక్ష్యం ఏంటో మీకు బాగా తెలిసేలా చేస్తారు. మీ లక్ష్యాన్ని వాళ్ళ లక్ష్యంగా ఓన్ చేసుకుంటారు. దాన్నెలా మీరు సాధించాలో ఒక బ్లూప్రింట్ ఇస్తారు. ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు. ఒక నిర్దిష్ట సమయానికి మీ లక్ష్యాన్ని మీరు సాధించేలా చేస్తారు. 

ఇదంతా వ్యూహాత్మకం, శాస్త్రీయం. మనకు కనిపించని అదృష్టం కాదు.   

ఈ శిక్షణ ఎవరిది వారికి విభిన్నంగా, కస్టమైజ్‌డ్‌గా ఉంటుంది. 

అందుకే ఇది రొటీన్ శిక్షణ కాదు. పనికొచ్చే శిక్షణ. 

ఇంగ్లిష్‌లో దీన్ని "మెంటారింగ్" అనవచ్చు.  

ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్ యుగంలో కొత్తవాళ్లకి అవకాశాలు బాగా పెరిగాయి. ఓటీటీల్లో ఫిలిమ్స్, వెబ్ సీరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు... ఏది ఏ అద్భుత అవకాశానికైనా దారితీయొచ్చు.   

ఇంతకు ముందులా సంవత్సరాల నిర్విరామ కృషి అవసరం లేదు. కాని, అన్ని సంవత్సరాల కృషిని అతి తక్కువ సమయంలోనే పూర్తి చెయ్యగల పట్టుదల, ఆత్మవిశ్వాసం, లక్ష్యం మీద నుంచి దృష్టి మరల్చని ఏకాగ్రత... ఇవి మాత్రం చాలా అవసరం. 

రొటీన్ కోచింగ్ కోసం అయితే ఒక్క పైసా ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంతా ఆన్‌లైన్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది. 

ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి మీ కల నిజం చేసుకోవాలనుకొంటే మాత్రం - మీకు నిజంగా "పనికొచ్చే కోచింగ్" అవసరం. 

అలాంటి పనికొచ్చే కోచింగ్ మాత్రమే నేనిస్తున్నాను. దీనికి ఫీజుంటుంది. మీ సెలబ్రిటీ కల నిజమౌతుంది. 

దీనివల్ల మీకెంత లాభమో నాకూ అంతే లాభం ఉంది. మీకు నేను వ్యక్తిగతంగా వెచ్చించే సమయానికి నాకు ఫీజు రావడం ఒక్కటే కాదు... అద్భుతమైన టాలెంటున్న కొంతమంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లూ మీ నుంచి నాకు దొరుకుతారు. నా తర్వాతి ప్రాజెక్టుల కోసం అలా ఎన్నిక చేసిన కొందరిని నా టీమ్‌లోకి తీసుకొంటాను. 

విన్ విన్ అన్నమాట! 

నిజానికి నా విన్ కూడా అల్టిమేట్‌గా మీ లక్ష్యం నెరవేరడానికే ఉపయోగపడుతుంది. 

సో, ఇలాంటి రొటీన్‌కు భిన్నమైన ఒక పనికొచ్చే కోచింగ్‌లో, మెంటారింగ్‌లో... వెంటనే చేరే ఉద్దేశ్యం మీలో ఉందా? 

వెంటనే సెలబ్రిటీ అయిపోవాలన్న విషయంలో - అంత కసి, పట్టుదల, సీరియస్‌నెస్, ఫోకస్ మీలో ఉన్నాయా? 

నిజంగా ఉన్నట్టయితేనే - అప్లికేషన్, ఫీజు వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్‌కు వెంటనే వాట్సాప్ చేయండి. 

వెల్‌కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ! 

ఆల్ ద బెస్ట్. 

Nandi Award Winning Writer, Film Director

MANOHAR CHIMMANI SCRIPT WRITING SERVICES
Whatsapp: 9989578125 

ABOUT MANOHAR CHIMMANI: 
^^^^^

PS: మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్యూ!