Tuesday 30 November 2021

సిరివెన్నెలతో ఒక పాట

ఇది 2004 నాటి పాట. 

నా మొదటి సినిమా: కల

హీరోయిన్ త్వరలో చనిపోతుందని ఆమెకు తెలుసు. హీరోకి ఆ విషయం తెలీదు అనుకొంటుందామె.  

హీరోకి తెలుసు. కాని, అతను బయట పడడానికి వీళ్లేదు. 

ఈ ఇద్దరి మధ్య ఒకానొక సందర్భంలో ఈ యుగళ గీతం.

హీరో హీరోయిన్ల వెనుక ఎలాంటి డ్రిల్ గుంపు లేకుండా, సోలోగా, రాజమండ్రి దగ్గర గోదావరిలో పడవల్లో 3 రోజులు షూట్ చేశాం. 

ప్రొడక్షన్: శ్రీ వేంకటేశ్వర చిత్ర
నిర్మాత: వై. రామచంద్రా రెడ్డి
దర్శకత్వం: మనోహర్ చిమ్మని 

హీరో: రాజా
హీరోయిన్: నయన హర్షిత
కోరియోగ్రాఫర్: శాంతి 
సంగీతం: ధర్మతేజ
"సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు"

ఇదీ పాట... 

పల్లవి :
-------------
ప్రియరాగాలనే పలికించావులే 
నయగారాలనే ఒలికించావులే
మల్లెపూవల్లె విచ్చావులే 
నువ్వు నాకెంతో నచ్చావులే 

ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే 
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే 
నిండు మనసంతా ఇచ్చావులే 
అందుకే నిన్ను మెచ్చానులే 

చరణం  1:
---------------
చినుకంత స్నేహం కోరిందని 
గగనాల మేఘం ఇల చేరదా
ఇనాళ్ళ దాహం తీరిందని 
చిగురాకు ప్రాణం పులకించదా 

కలల్లోని ఆ స్వర్గం
ఇలా చేతికందింది
నిజంలోని ఆనందం 
మనస్సంతా నిండింది

నీకు తోడుండి పొమ్మన్నది
నన్ను నీవెంట రమన్నది            |ప్రియరాగాలనే|

చరణం  2:
---------------
బతుకంటే అర్థం చెబుతావని
నడిపింది హృదయం నీ దారిని
ఈ గాలి పయనం ఎన్నాళ్లని
నీ ప్రేమ బంధం నన్నాపనీ 

రుణం ఏదో మిగిలింది
అదే నిన్ను కలిపింది
మరీ ఆశ కలిగింది
మరో జన్మ అడిగింది

నిన్ను ప్రేమించుకోమన్నది
ప్రేమనే పంచుకొమ్మన్నది        |ప్రియరాగాలనే|

***

సిరివెన్నెల గారు నా మొదటి సినిమా కోసం అడగ్గానే ఈ  పాట రాశారు. వారితో కొన్ని రోజులపాటు ఆ జర్నీ ఒక మరపురాని జ్ఞాపకం.

సీతారామశాస్త్రి గారికి నా వినమ్ర నివాళి... 🙏🙏🙏

Saturday 27 November 2021

మాధవీలత స్వచ్చంద సేవకు తోడ్పడుదాం!

అప్పట్లో యూత్ హృదయాల్ని కొల్లగొట్టిన సినిమా "నచ్చావులే" ద్వారా పరిచయమైన హీరోయిన్, పొలిటీషియన్, స్వచ్చంద సేవకురాలు, మంచి మిత్రురాలు... మాధవీలత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. 

ఆమధ్య ఉన్నట్టుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్ల్యేగా కూడా పోటీచేసింది మాధవీలత. ఆ సందర్భంగా నేనొక బ్లాగ్ కూడా రాశాను.    

ఇటీవలి కాలంలో ఒక పొలిటీషియన్‌గా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, అనేక విషయాల పట్ల స్పందిస్తూ... ఒక యూట్యూబ్ చానల్ కూడా యమ యాక్టివ్‌గా రన్ చేస్తోంది మాధవీలత. 

ఈ షో కోసం, ఎవరి సహాయం లేకుండా,  "వన్ వుమన్ ఆర్మీ"గా మాధవీలత పడుతున్న కష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరైనా ఇట్టే అర్థంచేసుకోవచ్చు. 

గ్రౌండ్ లెవెల్లో సమాచారం సేకరిస్తుంది, చదువుతుంది, విషయాల్ని అవగాహన చేసుకుంటుంది, విశ్లేషిస్తుంది. చక్కటి భాషలో ఎక్కడా తొణక్కుండా ప్రజెంట్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఒక ఫైర్ బ్రాండ్‌గా కూడా మాటలతో శివమెత్తుతుంది. 

ఒక్కరుగా ఇదంత చేయటం అంత చిన్న విషయమేం కాదు.    
 
ఇంత బిజీ యాక్టివిటీ మధ్య... ఓ కొత్త సినిమా ద్వారా, మళ్ళీ మనకు ఒక మంచి టాలెంటెడ్ హీరోయిన్‌గా కూడా త్వరలో కనిపించబోతోంది మాధవీలత.    


కట్ చేస్తే - 

బేసిగ్గా మాధవీలత ఒక వెరీ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్. "నక్షత్ర ఫౌండేషన్" ద్వారా, గత పదేళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా యాక్టివ్‌గా చేస్తోంది మాధవీలత. 

ఇటీవలి వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల జరిగిన భారీ నష్టం నేపథ్యంలో, నక్షత్ర ఫౌండేషన్ ద్వారా తన వంతుగా వీలైనంత సహాయం చేయాలని సంకల్పించింది మాధవీలత. 

ఆ వివరాల్ని మాధవీలత మాటల్లోనే విందాం. 

ఈ ప్రయత్నంలో మనకు తోచినంత సహాయం చేస్తూ మాధవీలత ప్రయత్నానికి తోడ్పడుదాం. 

Thursday 25 November 2021

తెలుగు సినిమా ఇప్పుడు లోకల్ సినిమా కాదు!

త్వరలో విడుదల కాబోతున్న ప్రభాస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 9, 10 భాషల్లో రిలీజవుతున్నాయి. ఇంగ్లిష్‌తో పాటు జపనీస్, కొరియన్, థాయ్ భాషలు కూడా ఈ 10 భాషల్లో ఉన్నాయి.  

ఆయా భాషలున్న దేశాల్లో, లేదా అంతర్జాతీయంగా ఆయా ఫిలిం మార్కెట్స్‌లో... అంత డిమాండ్ లేనిదే ఇన్ని భాషల్లో ఏ నిర్మాతా దర్శకుడు తమ సినిమాలను రిలీజ్ చేయరు అనేది సింపుల్ లాజిక్. 

హీరో ప్రభాస్‌కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక 50 దేశాల్లో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ గురించి, మొన్నే రిలీజైన ఆ సినిమాలోని ఫస్ట్ సింగిల్ గురించీ... ఇన్ని దేశాల్లోని అతని ఫ్యాన్స్... ట్విట్టర్‌లోనూ, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లోనూ ఈమధ్య చేస్తున్న హల్ చల్ ఒక రేంజ్‌లో ఉంది. 

ఇప్పుడు రూపొందుతున్న సుకుమార్-అల్లు అర్జున్‌ల పుష్ప సినిమాకు, పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు హాలీవుడ్ స్థాయి  టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. లైగర్‌లో అయితే ఏకంగా వెటరన్ బాక్సర్ మైక్ టైసన్‌నే దించారు. ఈ పాడ్కాస్ట్ చేస్తున్న సమయానికి... టైసన్‌తో లాస్ వేగాస్‌లో షూటింగ్‌లో ఉన్నారు... పూరి, చార్మి, అనన్య పాండే, లైగర్ విజయ్ దేవరకొండ అండ్ టీమ్.  

భారతదేశపు తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమాను రామ్‌గోపాల్ వర్మ "లడ్‌కీ" పూజ భలేకర్ హీరోయిన్‌గా తీస్తున్నాడు. ఆ భారీ సినిమాను భారీ బడ్జెట్ తో... సంయుక్తంగా ఇండియన్-చైనీస్ ప్రొడక్షన్ కంపెనీలు నిర్మిస్తున్నాయి. 

సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా - ఈ లడ్‌కీ సినిమాను ఎన్ ఎఫ్‌ టి తో... క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో అమ్మకానికిపెట్టి భారీ బిజినెస్ చేస్తూ ఇంకో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు ఆర్జీవీ.       

మార్షల్ ఆర్ట్స్, అమ్మాయి, ఆర్జీవీ కెమెరా యాంగిల్స్... ఇవన్నీ ఈ సారి కరెక్టుగా వర్కవుట్ అయ్యి, ఈ మధ్యకాలంలో ఆర్జీవీ నుంచి మనం చూడని ఒక భారీ హిట్ వచ్చినా చెప్పలేం. ఇప్పుడీ ఆర్జీవీ లడ్‌కీ సినిమా ఒక్క చైనాలోనే 30,000 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందంటే ఒక్కసారి ఆలోచించండి. 

ఇప్పటికే దాదాపు పూర్తయ్యి, త్వరలో  6 భాషల్లో రిలీజ్ అవబోతున్న రాజమౌళి #RRR సినిమా గురించి ప్రత్యేకించి చెప్పే పనిలేదు. బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచస్థాయికి తీసుకుపోవడంలో పయొనీర్‌గా చరిత్రలో తన స్థానం సుస్థిరం చేసుకొన్న రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  

రాజమౌళి, ఇంకా కొందరు తెలుగు దర్శకులు మనం చూస్తుండగానే హాలీవుడ్‌లో కూడా అడుగుపెడతారు, జెండా ఎగురేస్తారు. ఆరోజు కూడా పెద్ద దూరంలో ఏం లేదు. 

ఇక... ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ నుంచి ప్రభాస్, దీపికా పడుకోన్ హీరోహీరోయిన్స్‌గా, బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్న నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా... మేవెరిక్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా లైన్లో ఉన్న "స్పిరిట్" సినిమా... ఒక రేంజ్‌లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేవే.  

ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ మార్కెట్ కూడా తెలుగు సినిమాలవైపు చూస్తోంది. కొన్ని హాలీవుడ్, బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు మన తెలుగు సినిమాలతో ఇప్పటికే కో-ప్రొడక్షన్ చేస్తున్నాయి. 

నిజంగా మన సినిమాల్లో అంత సత్తా లేకపోతే, ప్రేక్షకులు చూడకపోతే, అంత బిజినెస్‌ని అవి ఇవ్వలేకపోతే - హాలీవుడ్ గానీ, బాలీవుడ్ కానీ అసలు ఈవైపు కన్నెత్తి చూడవు. 

ఇది సింపుల్ లాజిక్. సింపుల్ బిజినెస్ లాజిక్. 

ఇదంతా నాణేనికి ఒకవైపు.   

ఇప్పుడు నాణేనికి రెండోవైపుకి వద్దాం. 

రైల్వే ట్రెయిన్ టికెట్స్, ఆర్టీసీ బస్ టికెట్స్ బుకింగ్ లాగా... పూర్తిగా ప్రయివేట్ వ్యాపారమైన సినిమా టికెట్స్‌కు కూడా ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేయటం, ప్రభుత్వ అజమాయిషీలో టికెటింగ్ పోర్టల్ ఏర్పాటు చేయటం... ఎంతవరకు సమంజసం అనేది... ఇంకో పాడ్కాస్ట్‌లో  వివరంగా చర్చిద్దాం. 

కమ్ర్షియల్‌గా, సాంకేతికంగా ప్రపంచస్థాయి సినిమా నిర్మాణంతో పోటీపడుతూ... మార్కెటింగ్ & బిజినెస్ విషయంలోనూ అదే స్థాయిలో తన కెపాసిటీ చూపిస్తూ కాలర్ ఎగరేస్తున్న తెలుగు సినిమా ఒకటి రెండు చిన్న చిన్న విషయాల్లో చీప్ కావడం... అసలు ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం బిజినెస్‌ల బేసిక్స్‌తో కూడా ఎలాంటి పరిచయం-ఎలాంటి అవగాహన-ఎలాంటి సంబంధం లేని మేధావులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవడానికి కారణం కావటం... నాకెందుకో అంత బాగా అనిపించటంలేదు. 

ఆ ఒకటి రెండు విషయాల్లో ఒకటి - భారీ హీరోల సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ రేట్స్ పెంచడం. 

రెండోది - అదే సమయంలో భారీ టికెట్ రేట్స్‌తో అదనంగా బెనెఫిట్ షోలు వేయడం. 

ఇలాంటి  చిన్న చిన్న విషయాల్ని పక్కనపెట్టి... తెలుగు సినిమా తను ఇప్పుడు దూసుకెళ్తున్న  "లార్జర్ దాన్ లైఫ్" రేంజ్‌లోనే  హాలీవుడ్ స్థాయిలో ఆలోచించి, బిజినెస్ పరంగా మరింత భారీ ఆదాయం కోసం ఫ్రాంచైజీ రూపంలో మరిన్ని ఇన్‌కం అవెన్యూస్‌ను పెంచుకొంటే బాగుంటుంది. 

దేశంలోనే మొదటి 100 కోట్ల రికార్డును, మొదటి వెయ్యి కోట్ల రికార్డును క్రియేట్ చేసిన మన తెలుగు నిర్మాత దర్శకులకు... ఇది... అంత పెద్ద విషయమేం కాదు. 
^^^^^

Transcript of my podcast episode #34, #ManoharChimmaniPodcast. Here're the links:

Anchor:

Spotify:

Youtube:

కొత్త దర్శకులకు, చిన్న బడ్జెట్ సినిమా దర్శకులకు...

Script Writing Services Made Easy! 

హిట్ సినిమా కోసం మీ దగ్గర మంచి మంచి కాన్‌సెప్ట్స్ ఉంటాయి. అయిడియాలుంటాయి.  

సమస్యల్లా ఒక్కటే. 

మీలో చాలా మందికి పర్ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రాసుకొనే అవకాశం ఉండదు. సమయం ఉండదు. 

90 శాతం చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ఏకైక సమస్య డబ్బే. పేరుకే నిర్మాత ఉంటాడు. కాని, డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుందా, ఎప్పుడొస్తుందా అని ఎక్కువగా టెన్షన్ పడేది డైరెక్టరే. 

కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, సినిమా రిలీజయ్యే దాకా ఈ ఫండ్స్ టెన్షన్‌తోనే  డైరెక్టర్‌కు తెల్లారిపోతుంది. 

మరోవైపు,  24 క్రాఫ్ట్స్‌తో కోఆర్డినేట్ అవుతూ ఎప్పటికప్పుడు పని ప్లాన్ చేసుకోవటం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.   

ఇంక స్క్రిప్ట్ రాసుకొనే సమయమెక్కడ? 

ఒక దర్శకరచయితగా ఇలాంటి అనుభవం నాకూ ఉంది. 

ఇలాంటి టెన్షన్ మీకొద్దు. 


స్క్రిప్ట్ విషయంలో ఆ బాధ్యత మీరు నిశ్చింతగా నాకు వదిలేసి, మీ ఇతర పనుల్లో హాయిగా ముందుకెళ్ళిపొండి. 

మీరు అనుకున్న సమయానికి, అనుకున్న స్థాయిలో మీకు స్క్రిప్ట్ అందించే బాధ్యత నాది. 

ఓకే అనుకుంటే, పూర్తి వివరాలు క్రింది లింక్‌లో చదవండి. నాకు వాట్సాప్ చేయండి. 

Read it fully & get connected:

Tuesday 23 November 2021

రజినీకాంత్, చిరంజీవి కూడా ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌కు వెళ్ళినవాళ్లే! కానీ...

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు లీడ్‌లో ఉన్న హీరోహీరోయిన్స్‌లో, దాదాపు అందరూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లో శిక్షణ పొందినవారే. 

రజినీకాంత్, చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదు. 

సుమారు 40 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా మద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు.

ఆ శిక్షణ ద్వారా నేర్చుకొన్న కొన్ని అదనపు మెలకువల ద్వారానే వారిలో ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసంతో  ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఒక అవగాహన తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికే కాదు, ప్రవేశించాక అక్కడ నిలదొక్కుకోడానికి కూడా అవసరమైన ఒక క్రమశిక్షణ క్రియేట్ చేసుకున్నారు. వ్యూహాత్మకంగా కష్టపడ్డారు. 

అవకాశాలు... వాటంతటవే వాళ్లని వెతుక్కొంటూ వచ్చాయి. 

ఇద్దరూ లెజెండ్స్ అయ్యారు. 40 ఏళ్లుగా ఇంకా నటిస్తూనే ఉన్నారు.   

కట్ చేస్తే -  

ఫిలిం కోచింగ్‌లో ప్రధానంగా రెండు రకాలుంటాయి: 

ఒకటి రొటీన్ కోచింగ్. రెండోది పనికొచ్చే కోచింగ్. 

రొటీన్ కోచింగ్ గురించి పెద్దగా చెప్పేదేం లేదు. ఇన్‌స్టిట్యూట్ వాళ్లకు ఆదాయం కావాలి. కోచింగ్ తీసుకొనేవాళ్ళకు "హమ్మయ్య... కోచింగ్ తీసుకున్నాం" అన్న ఆనందం కావాలి. 

ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎవరో ఓ సెలబ్రిటీతో ఒక ఫోటో కూడా వస్తుంది. 

ది ఎండ్. 

తర్వాత ఇంకేం జరగదు. 

ఇంటిదగ్గర నుంచి కష్టాల లిస్టుతో తిట్లు...  కృష్ణానగర్‌లో ఆకలి కేకలు... గణపతి కాంప్లెక్స్ గోడల దగ్గర గాసిప్స్... శ్రీనగర్ కాలనీ, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం అలా తిరుగుతుండగానే నెలలూ సంవత్సరాలూ గడవటం. 

రావల్సిన ఆ "ఒక్క ఛాన్స్" మాత్రం రాదు. 

అయితే - పనికొచ్చే కోచింగ్ అలా ఉండదు...

కోచింగ్ కోసం వాళ్ళు డబ్బు ఎందుకు తీసుకొంటున్నారు అన్న విషయంలో వారికి స్పష్టమైన స్పృహ ఉంటుంది. బాధ్యత ఫీలవుతారు. 

అప్పటిదాకా అస్పష్టంగా ఉన్న మీ లక్ష్యం ఏంటో మీకు బాగా తెలిసేలా చేస్తారు. మీ లక్ష్యాన్ని వాళ్ళ లక్ష్యంగా ఓన్ చేసుకుంటారు. దాన్నెలా మీరు సాధించాలో ఒక బ్లూప్రింట్ ఇస్తారు. ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు. ఒక నిర్దిష్ట సమయానికి మీ లక్ష్యాన్ని మీరు సాధించేలా చేస్తారు. 

ఇదంతా వ్యూహాత్మకం, శాస్త్రీయం. మనకు కనిపించని అదృష్టం కాదు.   

ఈ శిక్షణ ఎవరిది వారికి విభిన్నంగా, కస్టమైజ్‌డ్‌గా ఉంటుంది. 

అందుకే ఇది రొటీన్ శిక్షణ కాదు. పనికొచ్చే శిక్షణ. 

ఇంగ్లిష్‌లో దీన్ని "మెంటారింగ్" అంటారు.   

ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్ యుగంలో కొత్తవాళ్లకి అవకాశాలు బాగా పెరిగాయి. ఓటీటీల్లో ఫిలిమ్స్, వెబ్ సీరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు... ఏది ఏ అద్భుత అవకాశానికైనా దారితీయొచ్చు.   

ఇంతకు ముందులా సంవత్సరాల నిర్విరామ కృషి అవసరం లేదు. కాని, అన్ని సంవత్సరాల కృషిని అతి తక్కువ సమయంలోనే పూర్తి చెయ్యగల పట్టుదల, ఆత్మవిశ్వాసం, లక్ష్యం మీద నుంచి దృష్టి మరల్చని ఏకాగ్రత... ఇవి మాత్రం చాలా అవసరం. 

రొటీన్ కోచింగ్ కోసం అయితే ఒక్క పైసా ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంతా ఆన్‌లైన్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది. 

ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి మీ కల నిజం చేసుకోవాలనుకొంటే మాత్రం - మీకు నిజంగా "పనికొచ్చే కోచింగ్" అవసరం. 

అలాంటి పనికొచ్చే కోచింగ్ మాత్రమే నేనిస్తున్నాను. దీనికి ఫీజుంటుంది. మీ సెలబ్రిటీ కల నిజమౌతుంది. 

దీనివల్ల మీకెంత లాభమో నాకూ అంతే లాభం ఉంది. మీకు నేను వ్యక్తిగతంగా వెచ్చించే సమయానికి నాకు ఫీజు రావడం ఒక్కటే కాదు... అద్భుతమైన టాలెంటున్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లూ నాకు దొరుకుతారు. నా తర్వాతి ప్రాజెక్టుల కోసం నా టీమ్‌లోకి నేను తీసుకొంటాను. 

విన్ విన్ అన్నమాట! 

నిజానికి నా విన్ కూడా అల్టిమేట్‌గా మీ లక్ష్యం నెరవేరడానికే ఉపయోగపడుతుంది. 

సో, ఇలాంటి రొటీన్‌కు భిన్నమైన ఒక పనికొచ్చే కోచింగ్‌లో, మెంటారింగ్‌లో... వెంటనే చేరే ఉద్దేశ్యం మీలో ఉందా? 

వెంటనే సెలబ్రిటీ అయిపోవాలన్న విషయంలో - అంత కసి, పట్టుదల, సీరియస్‌నెస్, ఫోకస్ మీలో ఉన్నాయా? 

నిజంగా ఉన్నట్టయితేనే - అప్లికేషన్, ఫీజు వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్‌కు వెంటనే వాట్సాప్ చేయండి. 

వెల్‌కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ! 
^^^^^

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్యూ!)

"We Make Money to Make More Movies."
- Walt Disney 

*****

Transcript of my latest podcast episode #33, #ManoharChimmaniPodcast. Links:

Spotify:

Anchor:

అదృష్టం అన్న పదాన్ని నేను నమ్మను, కాని...

నమ్ముతున్నాను...

అదృష్టం అనేది ఉంది, ఉంటుంది. 

ఇది నమ్మాలంటే జీవితంలో కొన్ని ఊహించని అనుభవాలు ఎదురవ్వాలి. ఇదెలా సాధ్యం అని లాజిక్కులు పట్టుకోలేక పిచ్చెక్కిపోవాలి. ఇలా కూడా జరుగుతుందా అని షేక్ అయిపోవాలి. 

అప్పుడు మాత్రమే కొన్నిటి మీద నమ్మకం కలుగుతుంది. అందులో ఒకటి - మనం అంతకు ముందెప్పుడూ నమ్మని... అదృష్టం.  

కట్ చేస్తే - 

కొంతమంది జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే కనిపిస్తారు. నిజంగా చేస్తారు కూడా. ప్రతి చిన్న విషయంలో అతి జాగ్రత్తపడతారు. జీవితంలోని ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా - కొందరు అన్నీ చాలా కేర్‌లెస్‌గా తీసుకున్నట్టే ఉంటారు. కాని, అనుకున్న ప్రతి పనీ అలవోగ్గా అలా చేసేసుకుంటూ వెళతారు. ఎక్కడా ఒక చిన్న అడ్డంకిరాదు. వచ్చినా, దాన్ని కూడా లైట్ తీసుకుంటారు. ముందుకే వెళ్తుంటారు తప్ప... అక్కడే చతికిల పడిపోరు. 

ఇది నమ్మకం, మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది... అని మళ్ళీ లాజిక్స్ వెంటపడతాయి. 

కాని, కాదు. 

ఖచ్చితంగా కాదు. 

ఇంకేదో వారికి సహాయపడుతోంది. వారిని లీడ్ చేస్తోంది. కాని, దాని గురించి వాళ్లంతగా పట్టించుకోరు. 

ఇక్కడే అదృష్టం అనే ట్రంప్ కార్డ్ ఒకటి ఉందని నాకు చాలాసార్లు అర్థమైంది. 

కాని, ఆ ట్రంప్ కార్డ్ మనకి పడాలంటే ఏంచెయ్యాలో మాత్రం తెలీదు. అది దానికదే పడాలి తప్ప, ఎదురుచూస్తే మాత్రం రాదు. 

అదృష్టానికి, దేవునికీ ఏదైనా సంబంధం ఉందా అంటే నేనేం చెప్పలేను. ఒకవేళ ఎవరైనా ఉందీ అంటే మాత్రం నాకు నచ్చదు. 

ఎందుకంటే, దేవుడు అంత శాడిస్టు కాదు.  

మాధవరెడ్డి ఎంత మంచివాడంటే...

టైటిల్ చూసి, ఇదేదో చీప్ క్వాలిటీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనుకుంటారేమో! 

నో... కాదు.  

ఎట్ ద సేమ్ టైం... రాజకీయాలకు సంబంధించిన టాపిక్ కూడా కాదు.  

1999 లో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలిమినేటి మాధవరెడ్డి మినిస్టర్‌గా ఉన్నప్పుడు, నేనూహించని విధంగా, ఒక సందర్భంలో, మా ఇద్దరిమధ్య జరిగిన ఓ అయిదారు నిమిషాల సంభాషణ తాలూకు జ్ఞాపకం గురించి... ఈ పాడ్‌కాస్ట్. 

కట్ చేస్తే -  

అప్పుడు నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను. మద్రాస్ నుంచి ఎవరైనా పిల్చినప్పుడల్లా వెళ్ళి, అక్కడ రైటర్‌గానో, ఘోస్ట్ రైటర్‌గానో పీస్ వర్క్ లాగా పనిచేసి వస్తుండేవాణ్ణి. 

డబ్బులు కూడా అప్పుడు బాగానే వచ్చేవి. 3, 4 రోజుల్లో ఒక డైలాగ్ వెర్షనో, ఒక కథావిస్తరణో, ఓ ట్రీట్‌మెంటో రాసిచ్చి వచ్చేవాణ్ణి. అలా వెళ్ళినప్పుడల్లా కనీసం 20-30 వేలకు తక్కువ కాకుండా ఇచ్చేవాళ్ళు. 

ఆలిండియా రేడియోలో అప్పుడు నా నెలజీతం కూడా అంత వచ్చేది కాదనుకుంటాను. 

డబ్బులొక్కటే కాకుండా...  మెరీనా బీచ్‌లో పెద్దవాళ్లతో కలిసి విండోస్ పైకెత్తిన ఫియట్ కార్లో కూర్చొని, పల్లీలు తింటూ ఓ పెగ్ తీసుకోడం... సెలబ్రిటీలతో తరచూ కలిసే అవకాశం ఉండటం... అంతా ఓ రేంజ్ లో ఉండేది అప్పుడు. 

అప్పటి ఆ స్క్రిప్ట్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ అనుభవాలతో - "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" అనే పుస్తకం ఒకటి రాశాను. చకచకా  ప్రింట్స్ వేయాల్సి వచ్చింది. ఎర్ర మంజిల్ లోని మా అన్న ఇంటినుంచి, కర్నూల్లో మా ఇంటినుంచి, విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ ల నుంచి అప్పట్లో మొత్తం ఓ 5 వేల కాపీలు సేలయ్యాయి. అదొక రికార్డు. 

ఆ పుస్తకానికే "బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" క్యాటగిరీ కింద నాకు నంది అవార్డు వచ్చింది. 

ఆ సంవత్సరం నంది అవార్డుల ప్రదానోత్సవం నాడు... అవార్డు గ్రహీతలందరికీ ముందు గోల్కొండ హోటల్లో లంచ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  

సాయంత్రం లలిత కళాతోరణంలో నంది అవార్డుల కార్యక్రమం తర్వాత, జూబ్లీ హాల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. 

అక్కడ ఏవీయస్ గారూ, ఇంకో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు, నేనూ ఒకచోట నిల్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ ఇద్దరు అందమైన ఫిమేల్ ఆర్టిస్టులే ఆ రోజు స్టేజి మీద అవార్డులు, చెక్కులు వగైరా అందించే పనికి నియమించబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు సినిమాల్లో వెరీ బిజీ సపోర్టింగ్ ఆర్టిస్టు. అది వేరే విషయం.     

ఏవియస్ గారు, మా అన్న... ఎర్రమంజిల్లో అనుగ్రహ పార్ట్‌మెంట్స్‌లో పక్కపక్క ఫ్లాట్స్‌లోనే ఉండే వాళ్లు. నేను హైదరాబాద్ వచ్చినపుడల్లా ఏవియస్ గారు, నేను కల్సుకోనేవాళ్ళం. అలా మా ఇద్దరికీ బాగా పరిచయం ఉంది... జోకులు కూడా వేసుకునేంత చనువు కూడా ఉండేది.  

జూబ్లీ హాల్లో డిన్నర్ తర్వాత, లాన్లో నిల్చుని, అలా మేం మాట్లాడుకుంటున్నప్పుడు - వెనకనుంచి నా భుజం పైన ఓ చెయ్యి పడింది. 

"ఏం మనోహర్... ఏంది సంగతి" అంటూ చాలా క్యాజువల్ గా, నన్ను తీసుకొని అలా పక్కకి నడిచాడు ఆ వ్యక్తి. అసలేం జరుగుతోందో అర్థం కాక, నేనూ అనుసరించాను. 

నా భుజం మీద చెయ్యేసి, నన్ను పలకరించి, అంతకు ముందే నేను బాగా తెలిసినట్టు, చాలా క్యాజువల్ గా నన్నలా పక్కకి తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ... మినిస్టర్ మాధవరెడ్డి! 

ఇప్పుడున్నంత సెక్యూరిటీ హడావిడి అప్పుడు లేదు. ఆయన వెనుక ఒకే ఒక్క సెక్యూరిటీ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అక్కడ అంతా కలిపి ఒక యాభైమంది కూడా లేరు. సగం మంది అవార్డీలు వెళ్ళిపోయారు. ఎవరికోసమో వెయిట్ చెస్తూ, రెండు నిమిషాలు అలా క్యాజువల్ గా టైం పాస్ చెయ్యడానికే బహుశా లాన్లోకి వచ్చి ఉంటాడని తర్వాత నాకర్థమైంది.  

నాకిప్పటికీ ఆశ్చర్యం... 

సాయంత్రం అవార్డులిస్తున్నప్పుడు నంది బహుమతిని సి యమ్ చంద్రబాబు ఇవ్వగా, నందితో పాటు ఇచ్చే ఒక లామినేటెడ్ ధృవపత్రాన్ని, చెక్కును... ఆరోజు నాకు అందించింది మాధవరెడ్డి. 

మైక్ లో ఎనౌన్స్ మెంట్ తర్వాత... ఒక్కొక్కటీ నాకు అందిస్తూ, వాటి మీద రాసున్న నా పేరుని, "చిమ్మని మనోహర్"  అని రెండు సార్లూ చిన్నగా ఆయన బయటికే చదువుతూ నాకు అందించటం నాకు ఇంకా గుర్తుంది.  

కాని, ఓ 2 గంటల తర్వాత, జుబ్లీ హాల్లో డిన్నర్ వరకూ నా పేరుని, నన్నూ ఆయన గుర్తు పెట్టుకోవడం - లేదా ఆయనకు గుర్తుండటం... నాకిప్పటికీ ఆశ్చర్యమే. 

ఆయన అడుగుతున్న ప్రశ్నలకు జవాబులిస్తూపోతున్నాను. నా ఉద్యోగం గురించి కూడా అడిగాడు. కర్నూలు ఆలిండియా రేడియోలో ఏడెనిమిదేళ్ళుగా నేను చేస్తున్న జాబ్ గురించి చెప్పాను.  

"ఇంకెన్నేండ్లుంటవ్  మనోహర్ కర్నూల్ల? హైద్రాబాద్ కు రా" అన్నారాయన. 

ట్రాన్స్‌ఫర్ కష్టమని చెప్పాను. అప్పటికే 2 సార్లు, నా ఫ్రెండ్స్ తో కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించినా పని కాలేదన్న విషయం చెప్పాను. 

"సెంటర్ల ఐ & బి మినిస్టర్ మనోడే కదా... ఓసారి కలవకపోయినవ్?" అన్నారాయన. 

"అదీ అయింది సర్. వాళ్లావిడే స్వయంగా రికమెండ్ చేశారు ఆయనకు. హైద్రాబాద్‌లో నా పోస్ట్ ఒకటి ఖాళీగా కూడా ఉంది. ఆయన ఆఫీసునుంచి ఒక పిఏనో, పియస్సో చెప్పినా పని అయిపోద్ది సర్... కాని, ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు" అన్నాను.

"ఇది చాలా చిన్న పని బై... ఆయనో టైప్‌లే!  చెయ్యలేదు... గంతే కదా... సరే... నువ్వు మల్ల ఈసారి హైద్రాబాద్ వచ్చినప్పుడు నన్ను కలువ్. నేను చేయిస్తా" అని చాలా సింపుల్‌గా చెప్పారు మాధవరెడ్డి.   

నా జీవితంలో అదే మొట్టమొదటిసారి... నేను ఒక మినిస్టర్‌తో అంత దగ్గరగా ఉండి, అంత క్లోజ్‌గా మాట్లాడ్డం! 

ఏవియస్ గారు, పక్కనున్న ఇద్దరు ఆర్టిస్టులు మావైపే చూస్తున్నారు. 

ఇంతలో మా పక్కనుంచే సి యం చంద్రబాబు నాయుడు నడిచివెళ్తోంటే, నా భుజం మీద చరుస్తూ "రైట్ మనోహర్... ఈసారి వచ్చినప్పుడు కలువ్ మరి" అంటూ బాబు వెనకే స్పీడ్‌గా నడుస్తూ వెళ్ళిపోయారాయన. మాధవరెడ్డి వెనుకే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ ఫాలో అయ్యాడు. అప్పటిదాకా ఎక్కడున్నారో తెలీదు కాని, సెకన్లో ఇంకో నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్లు వారిని ఫాలో అయ్యారు.  

"ఏంటి... మినిస్టర్ గారు మీకు ముందే తెలుసా?!" అని ఏవీయస్ గారు నన్ను ప్రశ్నించటంతో - ఆ ట్రాన్స్ లోంచి నేను బయటికి వచ్చాను. 

నిజంగా ఆ క్షణమే నాకు హైద్రాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిపోయినంత హాప్పీగా ఫీలయ్యాను. 

అదీ... మాధవరెడ్డి అంటే. 

ఆ తర్వాతే నేను మాధవరెడ్డి గురించి కొంత తెలుసుకున్నాను. 

"నేను మినిస్టర్ ను" అనే భేషజం లేని మనిషి... మంచి మనిషి. మంచి చేతల మనిషి. 

పనికిమాలిన వాగుడు, మీడియా పిచ్చి, లేని పోని బిల్డప్పులు... ఆయనకు పడవ్.     

తర్వాత నేను కర్నూలు నుంచి హైద్రాబాద్‌కు - జస్ట్ నా ట్రాన్స్ ఫర్ పనిమీదనే... కేవలం మాధవరెడ్డిని కలవటం కోసం... ప్రత్యేకంగా ఓ నాలుగురోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటుండగానే బాంబ్ బ్లాస్ట్ జరిగింది.  

మాధవరెడ్డి బ్రతికుంటే మాత్రం అప్పుడు నాకు నిజంగా వెంటనే ట్రాన్స్‌ఫర్ అయ్యేది. నా కెరీర్, నా లైఫ్... మరోలా ఉండేవి.       
***

This is the transcript of my latest podcast episode: #32 #ManoharChimmaniPodcast. Links to this episode:

Anchor Link: 

Spotify Link:

Wednesday 17 November 2021

SCRIPT WRITING SERVICES MADE EASY

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొంటున్న సీనియర్ కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు, బాలీవుడ్‌లో ఒక సినిమాకు తాను ఇచ్చిన ఒక కథ ఓకే అయ్యాక, దానికి "పారితోషికం మీకు ఎంత ఇమ్మంటారు?" అని అడినప్పుడు, "రెండు కోట్లు" అన్నారట. 

అవతల సాల్మన్ ఖాన్ బృందం షాక్!

ఇంతవరకు ఆ స్థాయి రెమ్యూనరేషన్‌ను బాలీవుడ్‌లో ఎవ్వరికీ ఇవ్వలేదు. మిగిలిన భాషల్లో కూడా ఎప్పుడూ అంత సీన్ లేదు. 

ఆ కథ వారికి కావాలి కాబట్టి, విజయేంద్రప్రసాద్ గారు అడిగిన 2 కోట్ల రెమ్యూనరేషన్ వారికి ఇచ్చారు.

డిమాండ్ అండ్ సప్లై! 

హాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్ గారు... కొంతమంది పాతాళానికి తొక్కిన రచయిత విలువను ఒక్కసారిగా ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్ళారు! 

కథే సినిమాకు పునాది. అది లేకుండా అసలు సినిమా ఎక్కడిది?

రైటర్‌కు ఉన్న విలువను గుర్తించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.

ముఖ్యంగా రచయిత విలువను రచయితలే గుర్తించరు... అది వేరే విషయం. 

కట్ చేస్తే - 

ఇప్పుడు తెలుగులో, హిందీలో, ఇతర భాషల్లోనూ కథా రచయితలకు చాలా డిమాండ్ ఉంది. 

ఎక్కువగా దర్శకులే కథలు రాసుకొంటున్నా కూడా... రచయితలు కాని దర్శకుల కోసం, భారీ ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం కథా రచయితలకు చాలా డిమాండ్ ఉంది. 

మరోవైపు... తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి ఒక 150 దాకా చిన్న బడ్జెట్ సినిమాలు తయారవుతుంటాయి . ఈ సెగ్మెంట్‌లో కనీసం 70% మందికి స్క్రిప్ట్ రైటర్ విధిగా కావాల్సి ఉంటుంది. 

ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాల దర్శకులకు రైటింగ్, డైరెక్షన్ కంటే ఎక్కువగా... ప్రతి స్టేజ్ లోనూ సినిమా పూర్తికావడానికి "ఫండ్స్ ఎట్లా?" అన్న టెన్షన్‌లోనే సినిమా అయిపోతుంది! 

ఒక దర్శక-రచయితగా నాకూ ఆ అనుభవం ఉంది. 

ఈ నేపథ్యంలో - 
ఒక నంది అవార్డు రచయితగా, ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్‌ను నేను ప్రారంభించాను. నాతోపాటు నా సహరచయితల టీమ్ పనిచేస్తుంది. 

ఈ వింగ్ ద్వారా, క్రిందివాటి కోసం నేను స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ అందిస్తున్నాను:

> ఫీచర్ ఫిలిమ్స్
> వెబ్ సీరీస్
> షార్ట్ ఫిలిమ్స్

ఫీచర్ ఫిలిమ్స్:
స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను. 

వెబ్ సీరీస్: 
సినిమాలకు దీటుగా ఓటీటీల్లో వీటికి మంచి క్రేజ్ ఉంది. స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను.

షార్ట్ ఫిలిమ్స్: 
షార్ట్ ఫిలిమ్‌ను కూడా ఒక సినిమా స్టాండర్డ్‌లో తీసి మెప్పించగలిగే డైరెక్టర్స్‌ను ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తుంది. వెంటనే ఫీచర్ ఫిలిం అవకాశాలొస్తాయి. అలా అవకాశాలు వచ్చి, ఫిలిం డైరెక్టర్స్ అయినవారు చాలా మంది ఉన్నారు. స్టోరీలైన్ మీది అయినా ఓకే. జోనర్, డ్యూరేషన్ చెప్తే, మీచేత ఓకే అనిపించే ఆప్షన్స్ నేనిస్తాను. 

ఈ మూడింటికీ కేవలం కథ, కథా విస్తరణ, ట్రీట్‌మెంట్, సింగిల్ లైన్ ఆర్డర్ వరకే చాలు అనుకుంటే అంతవరకే ఇస్తాను. కావాలన్నవాళ్లకు డైలాగ్ వెర్షన్ కూడా రాసిస్తాను. 

ఘోస్ట్ రైటింగ్: 
ఒక రచయిత తన రచనలకు తన పేరు కాకుండా – ఇంకొకరి పేరు పెట్టుకొనే సౌకర్యం ఇచ్చే పద్ధతిలో,  ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌ (NDA) చేసుకొని రాసే పద్ధతే “ఘోస్ట్ రైటింగ్”.

దీనికున్న పరిమితులవల్ల ఏ ఘోస్టు ఎవరికి రాశారు అన్నది బయటివారికి తెలియదు. 

అమెరికా వంటి దేశాల్లో ఘోస్ట్ రైటింగ్ సర్విసెస్ అందించే  సంస్థలు ఎన్నో ఉన్నాయి. అదొక భారీ ప్రొఫెషన్ అక్కడ. “I’m a Ghost Writer” అని బాహాటంగా చెప్పుకుంటారక్కడ. ఇక్కడ మాత్రం తెరవెనుకే.

నిజాని ఆ అవసరం లేదు. ఇదీ ఒక ప్రొఫెషనే. రెమ్యూనరేషన్ తీసుకొని రాసివ్వడమే.

తేడా ఒక్కటే... మన పేరుతో రాసిచ్చే క్రియేటివ్ కంటెంట్‌కు ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. “మీరు ఎవరి పేరయినాపెట్టుకోవచ్చు” అని రాసిచ్చే కంటెంట్‌కు కొంత రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుంది. 

దర్శకులు, ప్రొడక్షన్ కంపెనీలు ఘోస్ట్ రైటింగ్ సౌకర్యాన్ని కూడా నిర్మొహమాటంగా వినియోగించుకోవచ్చు. సీక్రెసీ కోసం నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌ ఉంటుంది.  

HOW IT WORKS?

స్టెప్ 1: ఫ్రీ కాల్‌లో ప్రపోజల్ గురించి, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటాము. ఓకే అనుకుంటే వెంటనే 10 వేలు చెల్లించి, సైనప్ కావాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్న స్టోరీలైన్ నాకు చెప్తారు. లేదా, మీకు కావల్సిన జోనర్ చెప్తారు.  

స్టెప్ 2: మూడు రోజుల్లోపల మీకు 3 స్టోరీ ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక స్టోరీలైన్ ఓకే అనుకోగానే, రెమ్యూనరేషన్లో సగం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఓకే చెప్పిన స్టోరీలైన్‌తో కథావిస్తరణ, వన్‌ లైన్ ఆర్డర్, ట్రీట్‌మెంట్ వగైరా పని స్టార్ట్ అవుతుంది.

స్టెప్ 3: మిగిలిన సగం రెమ్యూనరేషన్ స్క్రిప్ట్ డెలివరీకి 2 రోజుల ముందు చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ సీరీస్ స్క్రిప్టుకయినా, షార్ట్ ఫిలిం స్క్రిప్టుకయినా పేమెంట్ విషయంలో ఇదే పద్ధతి.   

స్టెప్ 4: ప్రింట్ & పి డి ఎఫ్ వెర్షన్లో స్క్రిప్ట్ డెలివరీ ఉంటుంది. అవసరమైతే, వెంటవెంటనే  మీ సూచనల మేరకు రెండు సార్లు స్క్రిప్టులో సవరణలు చేయటం జరుగుతుంది. ఈ సవరణల ప్రాసెస్ వెంటనే 2-4 రోజుల్లో పూర్తవుతుంది. 

స్క్రిప్ట్ రైటింగ్ పీరియడ్: 
> ఫీచర్ ఫిలిం: 2-4 వారాలు. 
> వెబ్ సీరీస్ (6 ఎపిసోడ్స్): 2-4 వారాలు.
> షార్ట్ ఫిలిం: 7-10 రోజులు. 

స్క్రిప్ట్ స్టాండర్డ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. 

వేరే భాషల సినిమాల నుంచి ఏదైనా షాటో, సీనో, స్వల్ప స్థాయిలో ఏదైనా కథాంశమో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టయితే - దానికి సంబంధించిన వీడియో బిట్స్‌ను కూడా రిఫరెన్స్ కోసం మీకు ఇవ్వటం జరుగుతుంది.

ఈ డిజిటల్ యుగంలో ప్రతి చిన్న దానికీ వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదు. ఎన్నో రంగాల్లో, ఎన్నో పెద్ద పెద్ద పనులే పూర్తిగా ఆన్‌లైన్‌లో విజయవంతంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రైటింగ్‌కు సంబంధించిన ఈ పని కూడా 90% అలాగే జరుగుతుంది. 

టైమ్ సెన్సిటివ్‌గా పని జరుగుతుంది. ప్రాంప్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. 

మీ అభిరుచికి, మీ విజన్‌కు అనుగుణమైన స్క్రిప్టు రాసి, అందించడం మా బాధ్యతగా భావిస్తాము.

మాకు ఆర్డర్ పెట్టేసి, మీ ఇతర పనుల్లో మీరు నిశ్చింతగా ముందుకెళ్ళిపోవచ్చు. 

కొత్త దర్శకులయితే - ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి, తాజాగా, మీ అభిరుచికి తగిన మంచి స్క్రిప్టు రెడీ చేసుకొని, బౌండెడ్ స్క్రిప్టుతో, మీ మొదటి సినిమా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. 

మరింక ఆలస్యం ఎందుకు?

ఫ్రీ కాల్ కోసం మీ వివరాలు, బడ్జెట్ తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి. టైమ్ సెట్ చేసుకొని మాట్లాడుకొందాం.  

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. 

ఆల్ ద బెస్ట్. 

Nandi Award Winning Writer, Film Director
Whatsapp: +91 9989578125
Email: mchimmani10x@gmail.com

ABOUT MANOHAR CHIMMANI: 

Request:
మీ కాంటాక్ట్స్‌లో "స్క్రిప్ట్ రైటింగ్" అవసరం ఉన్నవారికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.

Tuesday 16 November 2021

మీ షార్ట్ ఫిలింకు స్క్రిప్టు రాయాలా?

ఫీచర్ ఫిలిం స్క్రిప్టులు, వెబ్ సీరీస్ స్క్రిప్టులు, షార్ట్ ఫిలిం స్క్రిప్టులు రాసే పనిని ఒక పద్ధతిలో చిన్నగా వ్యవస్థీకృతం చేసి, ఆ వైపు కూడా బిజీ అవ్వాలనుకుంటున్నాను. 

స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ అన్నమాట! 

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోస్ట్ చేస్తాను. 

కట్ చేస్తే - 

షార్ట్ ఫిలింలకు ఇప్పుడు 2 రకాలుగా చాలా డిమాండ్ ఉంది: 

1. తెలుగులో ఓటీటీలకు కంటెంట్ చాలా కావాలి. ఒక్క సినిమాలే సరిపోవు. సో, మంచి స్టాండర్డ్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలింలను ఓటీటీలు తీసుకొంటాయి.

2. షార్ట్ ఫిలిమ్‌ను కూడా ఒక సినిమా స్థాయిలో తీసి మెప్పించగలిగే డైరెక్టర్స్‌ను ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తుంది. వెంటనే ఫీచర్ ఫిలిం అవకాశాలొస్తాయి. అలా అవకాశాలు వచ్చి, ఫిలిం డైరెక్టర్స్ అయినవారు చాలా మంది ఉన్నారన్న విషయం మీకు తెలుసు. 

ఈ నేపథ్యంలో - టెక్నికల్‌గా మంచి సత్తా ఉన్న కొందరు షార్ట్ ఫిలిం డైరెక్టర్స్‌కు స్టోరీ రాసుకొనే విషయంలో కొంత సమస్య ఉండవచ్చు. మంచి రచయిత అవసరం ఉండొచ్చు. 

ఒక నంది అవార్డు రచయితగా నేను, నా టీమ్ అందిస్తున్న ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ ద్వారా ఇలాంటి ప్యాషనేట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్, వారి అభిరుచికి అనుగుణమైన స్క్రిప్టులను రాయించుకోవచ్చు. 

స్టోరీలైన్ మీదయినా ఓకే. ఇలాంటిది కావాలని క్లుప్తంగా జోనర్ గురించి మీ విజన్‌ను చెప్పినా ఓకే. 

మీకు అవసరమైన డ్యూరేషన్‌లో, ఫీచర్ ఫిలిం స్థాయిలో అద్భుతమైన స్క్రిప్ట్ రాసి, మీ డెడ్‌లైన్‌కు అందిస్తాము. 

రెమ్యూనరేషన్ ఉంటుంది. 

ఫ్రీ కాల్ కోసం మీ వివరాలు, బడ్జెట్ తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి. టైమ్ సెట్ చేసుకొని మాట్లాడుకొందాం.  

ఆల్ ద బెస్ట్. 

Nandi Award Winning Writer, Film Director

Whatsapp: 9989578125 

Monday 15 November 2021

హైలీ టాలెంటెడ్ మళయాళీ బ్యూటీ

జై భీమ్ సినిమాలో ప్రెగ్నెంట్ ట్రైబల్ వుమన్‌గా, నల్లగా డీగ్లామరైజ్‌డ్ పాత్రలో నటించిన లిజోమోల్ జోస్... నిజ జీవితంలో ఎంత ఫెయిర్‌గా, ప్లెజెంట్‌గా, స్మైలీగా, సెక్సీగా ఉంటుందో చూస్తేగాని ఎవరూ నమ్మలేరు.

నేను చూశాను. 

ఈ హైలీ టాలెంటెడ్ మళయాళీ బ్యూటీ గురించే ఇప్పుడీ ఎపిసోడ్. 
---
ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ను మీకు సమర్పిస్తున్నవారు: పాలపిట్ట సాహిత్య మాసపత్రిక. పాలపిట్ట బుక్స్. బాగ్ లింగం పల్లి, హైద్రాబాద్.   
మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిద్దాం. మంచి పుస్తకాలను కొనుక్కొని చదువుదాం.  
---
బ్యాక్ టు బ్యూటిఫుల్ లిజోమోల్ జోస్ - 

జై బీమ్ కంటే ముందు, మళయాళ తమిళ భాషల్లో, ఇప్పటికే 8 సినిమాల్లో నటించిన లిజోకు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో మంచి నటిగా కొంత గుర్తింపు ఉంది కాని, అంత పాపులర్ కాలేదు. 

జై భీమ్ లిజో 9 వ సినిమా. 

జై భీమ్ వచ్చేవరకు అసలు చాలామందికి లిజో ఎవరో తెలీదు. జై భీమ్‌లో లిజో నటించిన ఆ చాలెంజింగ్ ట్రైబల్ చిన్నతల్లి పాత్ర ఓవర్‌నైట్‌లో లిజోను స్టార్‌ను చేసింది. 

ఇప్పుడింక లిజోను వెతుక్కొంటూ భారీ సినిమాలు క్యూ కడతాయి. 

2016 లో మొదటిసారిగా ఒక మళయాల సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది లిజో. ఆ సినిమా పేరు మహేశింతే ప్రతీకారం. సినిమాకు మంచి పేరొచ్చింది. తర్వాత హనీ బీ 2.5, కట్టప్పనాయిలే రిత్విక్ రోషన్, స్ట్రీట్ లైట్స్, ప్రేమసూత్రం వంటి మళయాళ సినిమాల్లో నటించింది లిజో. 

తర్వాత ఓ రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది లిజో.  ఆ రెండు తమిళ సినిమాలే జై భీమ్ సినిమాకు లిజోను ఎన్నిక చేయడానికి ఉపయోగపడ్డాయి.

అంతకు ముందు ఆమె నటించిన మళయాళ చిత్రాలు కూడా కొన్ని చూశాక... లిజోనే కరెక్ట్ అనుకొని, ఆడిషన్ చేసి, కన్‌ఫమ్ చేసి, లిజో చేత సంతకం చేయించుకొన్నారు జై భీమ్ దర్శక నిర్మాతలు. 

ఈ సినిమాలో ట్రైబల్ చిన్నతల్లి పాత్రలో సహజంగా నటించడానికి ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళి, ట్రైబల్ మహిళలతో సమయం గడుపుతూ... వారి జీవితాన్ని, జీవన విధానాన్ని కొన్ని నెలలపాటు బాగా అధ్యయనం చేసింది లిజో.

ఒక సహజ నటిగా లిజోలోని ఆ కమిట్‌మెంట్, కన్విక్షనే జై భీమ్‌లో ఆ పాత్ర అంత సహజంగా రావడానికి కారణమైంది. 

హీరోగా సూర్య, సూర్య నటన, నటించే ప్రతి సినిమాకోసం అతను పడే శ్రమ, చూపించే కమిట్‌మెంట్, కన్విక్షన్ అందరికీ తెలిసిన విషయాలే. అదంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయివున్న విషయం. 

ఈ నేపథ్యంలో - జై భీమ్ సినిమాలోని చాలా సీన్లల్లో, సూర్య కంటే ఎక్కువగా ప్రేక్షకులకు లిజోనే కనిపించిందంటే అతిశయోక్తి కాదు.


లిజోనే కొన్ని ఇంటర్వ్యూలల్లో... జై భీమ్ షూటింగ్‌లోని తను ఏడ్చే సన్నివేశాల్లో తనకు ఎలాంటి గ్లిజరిన్ అవసరం రాలేదనీ, నిజంగానే ఏడ్చేసేదాన్ననీ చెప్పింది లిజో.

డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నిజంగానే ఏడ్చేసేదాన్ని. మళ్ళీ తేరుకోడానికి నాకు కొంత సమయం పట్టేది అని ఆ సినిమా అనుభవాల్ని చెప్పుకొంది లిజో.    

"బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌"గా ఇప్పటికే ఆనంద వికటన్ అవార్డు, తమిళ్ జీ సినీ అవార్డులను గెల్చుకొన్న లిజోకు... జైభీమ్‌లో పెర్ఫామెన్స్‌కు సైమా, ఫిలిం ఫేర్, నేషనల్ అవార్డులు కూడా తప్పకుండా వరిస్తాయని నా నమ్మకం. 


మొన్నే అక్టోబర్ 5 వతేదీన అరుణ్ ఆంటొనీని పెళ్ళి చేసుకొన్న లిజో, పాండిచ్చేరి యూనివర్సిటీలో లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 

(యాక్సిడెంటల్లీ ఎమ్మే లిట్రేచర్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను కూడా ఇదే లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. పీజీ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించాను.) 

ఈ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్ మళయాళీ ముద్దుగుమ్మ లిజో మరిన్ని గొప్ప గొప్ప సినిమాలు చెయ్యాలని ఆశిద్దాం. 

ఆల్ ద బెస్ట్ లిజో!    
---
ENTER FILM INDUSTRY EASY!
ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించడం ఇప్పుడు చాలా సులభం. 6 నెలల ఆన్‌లైన్ కోచింగ్‌తో మీరు ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి అవసరమైన సిసలైన మెలకువల్ని నేర్చుకోండి. సినిమాల్లోకి రావాలన్న మీ కల నిజం చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేయండి. చదవండి. ఫాలో కండి. 
Welcome to Film Industry!  
^^^
Transcript of my latest podcast episode: #29 #ManoharChimmaniPodcast. Links to this episode: 

Anchor Link: https://anchor.fm/manohar-chimmani3/episodes/30-HIGHLY-TALENTED-MALAYALI-BEAUTY-e1a9ueg 

Spotify Link: https://open.spotify.com/episode/1quvZGzvnCvFvRHODapPlt?si=t4P5cyPAT-Gz_tmFxojpgA

Online Film Coaching: https://bit.ly/okkachance 

Sunday 14 November 2021

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా?

ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని “ఏదో అలా” అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం.

రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

మొదటి దారిలో – మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఏదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము.

“నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తిగత వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం… ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట.

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

కట్ టూ రెండో దారి –

ఈ దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, లేదా సంపాదించే ప్రయత్నంలో ముందుకెళ్తుండటం (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!)... ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం… ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు. 

మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు. కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు విజయవంతంగా అవే ఫాలో అవుతుంటాయి. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే. ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. 95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు.   

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా? సినిమా మీద నిజంగా మీలో అంత ప్యాషనుందా? 

ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి, నిజంగా బిజీగా ఉండే ఆ 5 శాతం మందిలో మీరూ ఉండాలనుకొంటున్నారా? 

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ విభాగాల్లో ఆన్‌లైన్ కోచింగ్‌లో చేరండి. నిజంగా ఇండస్ట్రీకి పనికొచ్చే మెలకువలు నేర్చుకోండి. ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంటర్ అవ్వండి. 

ఇంట్రెస్టుందా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేయండి. చదవండి. మీ విలువైన సమయం వేస్ట్ కావద్దు అనుకుంటే అది ఫాలో కండి. 

వెల్‌కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ!   
^^^

Transcript of my latest podcast episode: #29 #ManoharChimmaniPodcast. Links to this episode: 

Saturday 13 November 2021

బ్లాగింగ్ సినిమా!

వరుసగా తర్వాతి 365 రోజులు... అంటే 2022 నవంబర్ వరకు ఈ బ్లాగ్‌లో ఇంక దాదాపు అన్ని పోస్టులూ సినిమా స్టఫ్‌తోనే నిండి ఉంటాయి. 

ఒక చిన్న కదలిక. ఎప్పుడు, ఎలా వస్తుందన్నది ఇంకా అస్పష్టం. కాని, అతి త్వరలోనే ఉంటుంది.

వరుసగా సినిమాలు చేసే పనిలో, మొట్టమొదటిసారిగా దారుణమైన కన్విక్షన్‌తో ఉన్నాను.

త్వరలోనే ఆ న్యూస్ కూడా పోస్ట్ చేస్తాను.   

కట్ చేస్తే - 

మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (#TFDA) ఎన్నికలు ఆదివారం ఉన్నాయి. మొదటి వోట్ వేయటానికి జస్ట్ ఒక 33 గంటల టైం మాత్రమే ఉంది.

ఇవ్వాటితో క్యాంపెయిన్ కూడా అయిపోయింది. రేపు గ్యాప్. ఎల్లుండి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. అప్పటికప్పుడే ఇంకో 2 గంటల్లో కౌంటింగ్. ఆతర్వాత ఓ 2 గంటల్లో ఫలితాలు, బహుశా!  

అంతే!  

నమ్మశక్యంగా లేదు కదూ?

నాకూ అలాగే ఉంది. చాలా చప్పగా!😊

మూడు ప్యానెల్స్ పోటీలో ఉన్నాయి. 2200 మంది వోటర్లున్నారు. 

చడీ చప్పుడు లేదు. అసలు క్యాంపెయిన్ కూడా ఎప్పుడు మొదలయింది, ఎప్పుడు పూర్తయ్యింది కూడా నాకే తెలీదు. 

జస్ట్ 800 మంది వోటర్స్ ఉన్న "మా" వాళ్ల క్యాంపెయిన్ ఏ రేంజ్‌లో జరిగింది? చానెల్స్ ఏ రేంజ్‌లో బ్రేకింగ్ న్యూస్‌లిచ్చాయి? ఎన్నిరోజులు నడిచిందా సందడి? ఆ లొల్లి?🙏😊 

మరి 2200 మంది వోటర్స్ ఉన్న మా దర్శకుల అసోసియేషన్ ఎన్నికలు ఏ రేంజ్‌లో, ఎంత అరాచకంగా జరగాలి?😜😊 

అసలేం లేదే?

ఉండదు. 3 ప్యానల్స్ రంగంలో ఉన్నా, వాటిలో ఏ ఒక్క ప్యానెల్ నెగ్గినా... మళ్ళీ అందరం ఒక్కటే. ఈ డిసిప్లిన్ గురించి మా వాళ్ళు ముందే మాకు చెప్పారు.     

మేం దర్శకులం.

క్రియేటివిటీ ఒక్కటే మేం పట్టించుకొనేది. మిగిలిందంతా ఉట్టి ట్రాష్.     

కట్ చేస్తే - 

సరదాగా రాసిన పోస్ట్ ఇది.

"మా" వాళ్ళు చూసి మరింత సరదాగా నవ్వుకోవాలని రాసిన పోస్ట్ ఇది.  

ఆదివారం ఉదయం నేను వోటెయ్యబోతున్నాను. నేను వోటేసిన ప్యానెలే గెలుస్తుంది.😊 గెలవని ప్యానెల్స్‌లో నుంచి కూడా ఒకరిద్దరు అభ్యర్థులు వారికున్న సొంత ఇమేజ్‌తో గెలవ్వొచ్చు. 

గెలవని ప్యానెల్స్ వాళ్ళు కూడా గెలిచినట్టే నేను భావిస్తాను. ఎన్నికల్లో పాల్గొనటమే వారి తొలిగెలుపు కాబట్టి.    

పోటీచేస్తున్న దర్శక మిత్రులు, గౌరవ సీనియర్ దర్శకులు అందరికీ నా బెస్ట్ విషెస్...  

Thursday 11 November 2021

రెండే దారులు, ఒక జీవితం !!

ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి.

ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

“నా దారి రహదారి!” అని రజనీకాంత్ డైలాగ్ చెప్పినట్టు – “నాది ఈ దారి” అన్న ఎంపిక కొంతమంది విషయంలో తెలిసి జరగొచ్చు. కొంతమంది విషయంలో తెలియక జరగొచ్చు.

ఎలా జరిగినా, ఉన్న ఆ రెండే రెండు దారుల్లో ఏదో ఒకదానిలోనే ఎవరైనా వెళ్లగలిగేది. వారు ఎన్నుకున్న ఆ ఒక్క దారే… అతడు/ఆమె “ఎవరు” అన్నది నిర్వచిస్తుంది.

ఇంతకీ ఆ రెండు దారులేంటో ఊహించగలరా?

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని “ఏదో అలా” అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం.

రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

కట్ టూ మొదటి దారి –

మొదటి దారిలో – మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము.

“నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తిగత వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం… ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట.

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

కట్ టూ రెండో దారి –

ఈ దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, లేదా సంపాదించే ప్రయత్నంలో ముందుకెళ్తుండటం (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!)... ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం… ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు. 

మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు. కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు విజయవంతంగా అవే ఫాలో అవుతుంటాయి. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే. ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. 95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు.   

Monday 8 November 2021

జై భీమ్!

జై భీమ్ ఒక మంచి సినిమా. ఒక కన్విక్షన్‌తో డైరెక్టర్ జ్ఞానవేల్ చాలా బాగా తీశాడు. సూర్య, లిజోమోల్ జోస్ బాగా నటించారు. 

ఐ ఎం డి బి లో 39 వేలమంది 9.6/10 పాయింట్స్ ఇచ్చారు. అన్ని చానల్స్, పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్ సైట్స్‌లో 3.5 నుంచి 4.5 దాకా స్టార్స్ ఇచ్చారు.  

సుమారు 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన జై భీమ్‌కు అమెజాన్ ప్రైమ్ నుంచి అంతకు రెండింతల ధర పలికిందని సినీ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 

జై భీమ్ విషయంలో ముందు మనం మెచ్చుకోవాల్సిందీ, అభినందించాల్సిందీ దర్శకుడు జ్ఞానవేల్‌ను... ఇలాంటి కథ చేయాలని ముందుకు వచ్చినందుకు. 

తర్వాత అప్రిషియేట్ చేయాల్సింది జ్యోతిక, సూర్యలను. నిర్మాతలుగా వారిద్దరూ జ్ఞానవేల్‌కు అన్నిరకాలా అంత బాగా సహకరించినందుకు.  

సినిమా కోర్ట్ కేసుల్లో చిక్కుకున్నా, కోవిడ్ వల్ల ఆగిపోయినా, మరేదో కారణంగా ఇంకా రిలీజ్ ఆలస్యమైనా - సరైన టైంలో సరైన నిర్ణయం వారు తీసుకోకపోయినా వారికి చాలా నష్టం జరిగేది. 

ప్రైమ్‌లో రిలీజ్ అయినా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. 

ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయకపోవటం అనేది నిర్మాతలు తీసుకొన్న గొప్ప నిర్ణయం. ప్రైమ్ ప్రేక్షకులు వేరే. మెయిన్ స్ట్రీం ప్రేక్షకులు వేరే.  

చెప్పాలంటే - మొత్తం మెయిన్‌స్ట్రీం ప్రేక్షకుల్లో ప్రైంలో చూసే ప్రేక్షకుల సంఖ్య 30% కూడా ఉండదు. ఈ పాయింటాఫ్ వ్యూలో నిర్మాతల నిర్ణయం చాలా వ్యూహాత్మకమైనదని చెప్పాల్సి ఉంటుంది. 

నేషనల్ అవార్డులు కనీసం ఒక 3 అయినా వస్తాయి.

లిజోమోల్ జోస్ ఈ సినిమా ద్వారా బయటికి వచ్చిన ఒక అద్భుతం. ఒక మ్యాజిక్.   

జై భీమ్ టీమ్‌కు హార్టీ కంగ్రాట్స్!

కట్ చేస్తే -             

ఒక మాస్ హిస్టీరియా గురించి చెప్పుకుందాం.

ఇది అప్పుడప్పుడూ అలా బయటపడుతుంటుంది. 

ఒక స్కై లాబ్. ఒక  Y2K. ఒక ఎమర్జెన్సీ. ఒక అన్నా హజారే. ఒక ఆ పార్టీ. ఒక  ఈ పార్టీ. ఒక పి ఎం. ఒక సి ఎం. ఇప్పుడు... ఒక సినిమా. 

వీటన్నిటికీ  లాజికల్ రీజన్స్ ఉంటాయి. కాని, ఆ లాజిక్స్ కు అతీతంగా అందరం ఏదో అలా మందలా హడావుడి పడిపోతుంటాం. మన చదువులు, మన మేధావిత్వం, పిల్లాడు కూడా అర్థం చేసుకొనే కొన్ని బిజినెస్ బేసిక్స్... అన్నీ అలా మూలన పడేస్తాం. అంతే.

ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అది కూడా ఫ్రీ కాబట్టి అందరూ రాస్తున్నారు. 

ఇంటికో మేధావి. ఇంటికో క్రిటిక్. 

అంతకన్నా ఏం చెప్పలేం. 

వేరే భాషలో వచ్చిన ఒక మంచి సినిమాని అద్భుతం అని మెచ్చుకోవడంలో తప్పులేదు. కాని, దాని మెచ్చుకొంటూ, దాంతో పోలుస్తూ, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక క్రిమినల్ లా చూడటం కరెక్ట్ ఎలా అవుతుంది?  

తెలుగులో అసలెన్నడూ మంచి సినిమాలు రాలేదా?  

అసలు మంచి సినిమాకు నిర్వచనం చెప్పేదెవరు?

అసలీ మంచి చెడు అనే తూనిక రాళ్ళను ఎవరు క్రియేట్ చేస్తారు? 

ఇదంతా... నథింగ్ బట్, సంపూర్ణ అవగాహనారాహిత్యం. 

ఒక "దాసి" వచ్చింది. ఒక "రంగుల కల" వచ్చింది. 

ఎంతమంది ఆదరించారు?

ఎన్ని ఇలాంటి రివ్యూలు రాశారు? 

సినిమా తీసిన డబ్బులయినా తిరిగొచ్చాయా బి నర్సింగరావుగారికి? 

మళ్లీ ఎలా తీస్తాడాయన ఇంకో సినిమా?

అంతకు ముందు నర్సింగరావు గారే తీసిన "మా భూమి" పూర్తికావడానికి, రిలీజ్ చేయడానికి... ఎంతమంది ఎన్నెన్ని అమ్ముకోవాల్సి వచ్చింది?  ఆకాలంలో మాభూమిని ఎంతో కొంత ఆదరించారు కాబట్టి ఆయన బ్రతికి బట్ట కట్టారు. ఇంకో 2, 3 సినిమాలు తీసారు. ఆ తర్వాతేమయింది?

మీకు తెలుసా... అల్లాణి శ్రీధర్ "కొమరం భీమ్" సినిమా రిలీజ్ కావడానికి 20 ఏళ్ళు పట్టింది. 

అది కూడా హైదరాబాద్ లోని ఒకే ఒక్క థియేటర్‌లో.   

ఎంతమంది చూశారు? 

ఎంతమంది రివ్యూలు రాశారు? 

అసలు "కొమరం భీమ్" నారాయణగూడాలోని ఒక థియేటర్లో రిలీజైన విషయం ఎంతమందికి తెలుసు?

ఏ భాషలో అయినా అక్కడి భౌగోళిక, సాంఘిక పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచులుంటాయి. వీటి ఆధారంగానే సినిమాల నిర్మాణం జరుగుతుంది. అరుదుగా కొన్ని అద్భుత సినిమాలు కూడా వస్తుంటాయి. ఈ అద్భుత సినిమాల జోనర్ ఏదైనా కావచ్చు.  

ఆఫ్ బీట్ సినిమాలు, సీరియస్ సినిమాలు, ఆర్ట్ సినిమాలే మంచి సినిమాలా? 

మళయాలం, తమిళం, బెంగాలీలో లాగా మనదగ్గర సినిమాలు రావు అంటే... ఏం చెప్తాం?

30 ఏళ్ల క్రితమే తెలుగులో "అంకురం" రాలేదా? ఆ కథ గుర్తుందా?   

వీళ్ళు చెప్పే భాషల్లో కూడా 100 సినిమాల్లో ఒకటో రెండో జై భీమ్‌ లాంటి సీరియస్ సినిమాలొస్తాయి  అంతే. మిగిలినవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలే కదా...   

డెభ్భైల్లో, ఎనభైల్లో, మొన్న మొన్న తొంభైల్లో కూడా... తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లెక్కలేనన్ని హాట్ సీన్‌లతో, వారం వారం ఎన్ని సెక్స్ సినిమాలు రాలేదు? వాటి డబ్బింగ్ వెర్షన్స్ ను "ఆమె మధుర రాత్రులు", సత్రంలో ఒకరాత్రి", "షకీలా నైట్స్" వంటి పేర్లతో ఎన్ని వందల సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఎగబడి చూడలేదు?  

సినిమా ప్రాథమికంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. 

కోట్ల రూపాయలు, కొందరి జీవితాలతో వ్యాపారం. 

ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమయంలో, ఒక్కో బిజినెస్ ట్రెండ్ లో... ఒక్కోరకమైన సినిమాలకు ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ తో సహా దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు... కొలాబొరేషన్ కోసం, ఇన్‌స్పిరేషన్ కోసం... ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయన్న నిజం ఎంతమందికి తెలుసు?  

తెలుగు సినిమాలు ఇప్పుడు ఇంగ్లిష్, చైనీస్, జపనీస్, కొరియన్, థాయ్ వంటి ప్రపంచభాషలతో కలిపి మొత్తం 8, 9 భాషల్లో... ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? 

హిందీలో తొలి వంద కోట్ల కలెక్షన్  సినిమాను తీసింది తెలుగు నిర్మాతే. దేశంలోనే తొలి వెయ్యి కోట్ల కలెక్షన్  సినిమా తీసింది కూడా తెలుగు దర్శక నిర్మాతలే. 

ఇరాన్ సినిమాలు అద్భుతంగా ఉంటాయని, అలాంటి సినిమాలు ఇక్కడ ఇండియాలో రావటం లేదంటే ఎలా?

"తెలుగు సినిమాల్లో ఏముంటుంది?"... "తెలుగు సినిమా బాగుపడదు"... "తెలుగు సినిమాను ఎవ్వడు బాగు చెయ్యలేడు"... 

ఇలాంటి సినిక్ అభిప్రాయాలు ఉన్నవాళ్లను చూసి జాలి పడకతప్పదు. 

టికెట్ కొని, సినిమా చూసేవాడికి తాను చూసిన సినిమాను విమర్శించే హక్కు వంద శాతం ఉంటుంది. కాని, ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చూసే కొందరు సోకాల్డ్ మేధావులు, సోషల్ మీడియా రచయితలు అసలు ఏమీ తెలియకుండానే "తెలుగు సినిమాను ఎవ్వడు బాగుచెయ్యలేడు" తరహా స్టేట్‌మెంట్లు ఇవ్వటం మూర్ఖత్వం.

ఒక్క "జై భీమ్" సినిమా చూసి, అసలు తెలుగులో మంచి సినిమాలే రానట్టు మాట్లాడ్డం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట.  

తెలుగులోనే కాదు... ప్రపంచంలోని ఏ భాషలోని ఫిలిం ఇండస్ట్రీలో అయినా కేవలం 2-3% మాత్రమే సాంఘిక స్పృహతో కూడిన సందేశాత్మక సినిమాలొస్తాయి. మిగిలినవన్నీ వినోదాత్మక కమర్షియల్ సినిమాలే ఉంటాయి. తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా అంతే.  

సరే, తెలుగు సినిమా మంచిదా చెడ్డదా పక్కన పెడదాం. మీరు తెలుగు సినిమానే చూడండి అని ఎవ్వరూ మిమ్మల్ని ఫోర్స్ చెయ్యటం లేదు. అంత బలవంతంగా మీకు నచ్చని తెలుగు సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. 

సినిమా అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా అందరికీ అందుబాటులో ఉన్న ఒక పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. ప్రపంచంలోని ఏ భాషలో వచ్చిన సినిమానైనా... ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ... ఇంట్లో కూర్చొని, మనకు నచ్చిన సినిమాను, మనకు ఇష్టమొచ్చిన టైం లో చూడొచ్చు.  

"ఆగ్రాలోని తాజ్‌మహల్ లాగా హైద్రాబాద్‌లో చార్మినార్ ఎందుకు లేదు?" అని ఎవరైనా అడిగితే, ఏం సమాధానం చెప్తాం? 

ముందు... అలా అడిగిన వ్యక్తి మానసిక స్థితిని గురించి ఆలోచిస్తాం. 

ఇదీ అంతే.  

జై భీమ్! 

^^^
Written & podcast on 7th Nov 2021. Here's the link: https://youtu.be/rvlh7OQaNgc 

ఉచిత సలహాదారులకు వందనం!

ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టడం ఈజీ. కాని, లక్షలు కోట్లు ఖర్చుపెట్టి ఒక సినిమా తీయడం మాత్రం అంత ఈజీ కాదు. 

కట్ చేస్తే - 

ప్రపంచంలోని ఏ బిజినెస్‌లో కాని, ఏ ప్రొఫెషన్‌లో కాని దారినపోయే దానయ్యలు సలహాలనిచ్చే సాహసం చెయ్యరు. 

ఒక్క సినీఫీల్డు విషయంలో మాత్రమే... సోకాల్డ్ మేధావి నుంచి మిరపకాయ బజ్జీలేసుకునేవాడిదాకా అందరూ సలహాలిచ్చేవారే! 

ఇదేం అతిశయోక్తి కాదు. 100% నిజం. 

శుక్రవారం ఒక సినిమా రిలీజైతే చాలు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో కనీసం ఓ వందమంది రివ్యూలు పెడతారు. 2/5 అంటారు. 2.5/5 అంటారు. 3/5 అంటారు. వాళ్ళిష్టం.

ఫస్టాఫ్ ఓకే అంటారు. సెకండాఫ్ మీద డైరెక్టర్‌కు గ్రిప్ పోయిందంటారు. అయినాసరే, డైరెక్టర్‌కు మంచి ఫ్యూచరుందంటారు!

ప్రిక్లయిమాక్స్ అదిరిందంటారు. క్లయిమాక్స్ మాత్రం అలాక్కాదు, ఇంకోలా తీయాల్సింది అంటారు.

ఎడిటర్ నిద్రపోయాడంటారు. ఆర్ట్ డైరెక్టర్ పనిచేయలేదు అంటారు. 

మ్యూజిక్ డైరెక్టర్‌కు అసలు మ్యూజిక్ తెలీదంటారు. రెండు పాటలు సూపర్‌గా ఉన్నాయంటారు.

హీరోహీరోయిన్లను డీఓపీ బాగా చూపించాడంటారు. కానీ, లైటింగ్ బాలేదంటారు. 

హీరోయిన్ నుంచి డైరెక్టర్ తనకు కావల్సింది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడంటారు. హీరో విషయంలో మాత్రంఫెయిలయ్యాడంటారు. 

డబ్బులుపెట్టి సినిమా చూసే ప్రతి ప్రేక్షకునికి సినిమా మీద తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. బాగుందనొచ్చు, యావరేజ్ అనొచ్చు. చెత్త సినిమా అనొచ్చు. తప్పులేదు. 

కాని, రివ్యూ అలాకాదు. దానికి కొన్ని బేసిక్స్ ఉంటాయి. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ ఫ్రీనేకదా అని, ఏదో తోచిన సొల్లు రాసి, దానికి పాయింట్స్ ఇచ్చి, రివ్యూయర్‌లా ఫీలయిన ప్రతి ఒక్కరూ రివ్యూయర్స్ అయిపోరు. 

అంతే కాదు - పూరి పనైపోయిందంటారు. మణిరత్నం, ఆర్జీవీ ఇంక రిటైరయిపోవచ్చునంటారు.  ఎ ఆర్ రెహ్మాన్ ఏవైనా బిజినెస్‌లుంటే చూసుకోవచ్చు అంటారు. 

ఏ మళయాళంలోనో, తమిళంలోనో వచ్చిన ఏదో ఒక సినిమాను పట్టుకొని, అసలు తెలుగు సినిమా బాగుపడాలంటే ఏం చెయ్యాలో చెప్తారు. తెలుగులో అసలు మంచి సినిమాలే రానట్టు!

ఇన్ని ఉచిత సలహాలనిచ్చే ఈ మేధావులకు ఇదే తెలుగులో వచ్చిన ఎన్నెన్నో గొప్ప సినిమాలు గుర్తుండవు. ఇంకెన్నో అలాంటి  తెలుగు సినిమాలను వీరు ఆదరించలేదన్నది గుర్తుండదు. 

అసలు సినిమా అనేది కోట్లతో ముడిపడిన ఒక క్రియేటివ్ బిజినెస్ అన్న బేసిక్ థింగ్ వీరికి తెలియదు. బాలీవుడ్‌తో సహా, ఇప్పుడు దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీవైపు చూస్తున్నాయన్న విషయం తెలియదు. ఒక్క తెలుగు హీరో మీద 2500 కోట్ల పెట్టుబడులతో 5 సినిమాలు లైన్లో ఉన్నాయన్న వాస్తవం తెలియదు. ఇంగ్లిష్, జపనీస్, కొరియన్ వంటి భాషలతో కలిపి - తెలుగు సినిమా ఇప్పుడు 8, 9 భాషల్లో ఏకకాలంలో  ప్రపంచమంతా రిలీజ్ అవుతుందన్న వాస్తవం వీరికి తెలియదు.  

వ్యక్తిగత అభిరుచులు వేరు. బిజినెస్ ట్రెండ్స్ వేరు. 

ఆఫ్ బీట్ సినిమా వేరు. మెయిన్‌స్ట్రీమ్ సినిమా వేరు. 

ఆర్ట్ సినిమా వేరు. కమర్షియల్ సినిమా వేరు. 

ఒక్కో భాషలో ఒక్కో సినిమా తీయడం వెనుక ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఒక భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన ఒకానొక సినిమా, ఇంకో భాషలో అలాగే తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయ్యే చాన్సెసే ఎక్కువగా ఉంటాయన్న రియాలిటీ తెలియదు. 

స్టార్‌డమ్‌కు బిజినెస్‌కు ఉన్న లింక్ వీరికి తెలియదు. 

ఇలాంటి బేసిక్స్ మర్చిపోయి - తెలుగు సినిమా ఇలా తీయాలి, అలా తీయాలి అని ఉచిత సలహాలిచ్చేవాళ్లంతా - ఒక పదిమంది కలిసి, వాళ్ళ డబ్బుతోనో, లేదంటే క్రౌడ్ ఫండింగ్‌తోనో... ఒక మాంచి... వారి ఊహల్లోని గొప్ప టెన్‌కమాండ్‌మెంట్సో, బెన్‌హర్ లాంటి సినిమానో తీయొచ్చు కదా?! 

అలా మీరొక సినిమా తీసి అందర్నీ మెప్పించండి. దాన్ని మేమంతా చూసి, "సినిమా ఆఫ్ ద సెంచరీ" అని మస్త్ రివ్యూ రాసి, 5 /5 ఇస్తాం.  

కానీయండి మరి... మీదే లేటు... 

Happy Diwali! 
^^^

This was written & podcast on Diwali day. Here's the link to my podcast: https://anchor.fm/manohar-chimmani3/episodes/26---UCHITA-SALAHADARULAKU-VANDANAM-e19oq96
 
Continued this topic in my next podcast: #JaiBheem, posting the same later today. 

Saturday 6 November 2021

TFDA నామినేషన్స్ నేడే!

తెలుగు సినీ దర్శకుల సంఘం (#TFDA) ఎలక్షన్స్‌లో పోటీచేద్దాం అనుకున్నాను. 

పదవుల మీద ఆసక్తితో కాదు. గెలుస్తానా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు.

ఈ విషయంలో నా ఆలోచనలు పూర్తిగా వేరు. 

ఈ 10 రోజుల ఎన్నికల హడావిడిలో ఆయినా... మనవాళ్ళు అందరితో కలిసి తిరిగే అవకాశం, మాట్లాడే అవకాశం నాకు, ఫోన్లు చేసే అవకాశం... ఫాస్ట్ ట్రాక్‌లో దొరుకుతుందన్నది నా ఆలోచన.

ఇప్పుడు పూర్తిస్థాయిలో రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి, ఇలాంటి ఒక చిన్న యాక్టివిటీ వ్యక్తిగతంగా నాకో చిన్న కిక్ ఇస్తుందని. అంతే.    

కాని, ఒకటి రెండు ప్రాథమిక మీటింగ్స్ తర్వాత నాకు అంత ఉత్సాహకరంగా అనిపించలేదు వాతావరణం.  నాకున్న వ్యక్తిగత తలనొప్పులకు తోడు అదనంగా ఇప్పుడిది తగిలించుకోవడం అవసరమా అనిపించింది.  

సో, ఆ ఆలోచనకు నిన్న మధ్యాహ్నమే గుడ్ బై చెప్పాను. 

కట్ చేస్తే - 

అసోసియేషన్ కోసం నిస్వార్థంగా, ఉత్సాహంగా పనిచేయాలన్న ఆసక్తి, అవకాశం అందరికీ ఉండదు. అందరివల్ల కాదు.   

డైరెక్టర్‌గా కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నవాళ్ళెవ్వరికీ ఈ అసోసియేషన్ యాక్టివిటీ వైపు, ఎన్నికలవైపు చూసే అవకాశం ఉండదు. చూడాలన్న ఆసక్తి ఉన్నా కుదరదు. 

ఎన్నికలు, పదవులతో సంబంధం లేకుండా - అసోసియేషన్ కోసం నిజంగా పనిచేయాలనుకున్న డైరెక్టర్స్‌కు, ఎప్పుడయినా ఏ రూపంలో అయినా దానికి తోడ్పాటు అందించే అవకాశం ఉంటుంది. 

నా విషయంలో, ఉడతాభక్తిగా అసోసియేషన్‌కు నావంతు తోడ్పాటు నేనూ ఏదైనా చేయాలనుకొన్నా... రెగ్యులర్‌గా సినిమాలు చేయటం ద్వారా మాత్రమే నాకది సాధ్యమవుతుంది. ప్రస్తుతం నా దృష్టంతా దీనిమీదే ఉంది. 

ఇవాళ టి ఎఫ్ డి ఏ ఎన్నికలకు నామినేషన్స్ వేస్తున్న మిత్రులు, గౌరవ సీనియర్స్ అందరికీ శుభాభినందనలు. 

Tuesday 2 November 2021

59 రోజులు!

2022కు స్వాగతం చెప్పడానికి కేవలం 59 రోజులే మిగిలుంది. 

అంటే కౌంట్‌డౌన్ ప్రారంభమయినట్టే.

ఈ సందర్భంగా ఒక రెండు పాయింట్స్‌తో ఓ చిన్న బ్లాగ్ పోస్ట్ రాయాలనుకుని ఇది రాస్తున్నా:

ఒకటి-
జనవరి 1 నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం పాత పధ్ధతి. అలా తీసుకున్న నిర్ణయాల్లో 90% మర్చిపోతారు.  

రెండు-
ఇంకా 59 రోజులుంది కాబట్టి... డిఫరెంట్‌గా ఉండేలా ఒక పని చెయ్యొచ్చు. ఈ 59 రోజుల్లోనే సాధించగలిగిన ఒకే ఒక్క మంచి నిర్ణయం తీసుకోండి. దాన్ని సక్సెస్ చేయండి. జనవరి ఒకటి నాడు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. 

ఈ చిన్న విజయం ఇచ్చే ఉత్సాహంతో, జనవరి ఒకటి నాడు కొంచెం భారీ నిర్ణయం తీసుకోవచ్చు. 365 రోజుల లక్ష్యం పెట్టుకోవచ్చు. 

అప్పుడు-
59 రోజుల్లో ఒక చిన్న లక్ష్యాన్ని సాధించడం వీలైనప్పుడు, ఆ తర్వాతి 365 రోజుల్లో పెద్ద లక్ష్యాల్ని సాధించడం అసాధ్యం కాదు.

మీరే చూడండి, ఎంత సులభంగా సాధిస్తారో!

కట్ చేస్తే -

ఇది నా బర్త్‌డే నెల. నేనూ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాను. దాన్ని అమలు చేయడం ఆల్రెడీ ప్రారంభించాను. 

దాని లక్ష్యం 59 రోజులే. 

నేను సాధిస్తాను. ఆ నమ్మకం నాకుంది.