Friday 15 October 2021

ఎదుటివారి టైమ్‌కు కూడా విలువుంటుంది!

కొంతమంది మాటలు, చేతలు చాలా "డిప్లొమాటిక్"గా ఉంటాయి. ఎట్‌లీస్ట్... అలా అనుకుంటారేమో వారు. 

కాని, ఎదుటివారు వారికి, వారి మాటకు ఇస్తున్న గౌరవాన్ని, విలువను పోగొట్టుకుంటున్నారని వారు తెలుసుకోరు. తెలుస్తున్నా పట్టించుకోరు.

ఇలాంటివారి దృష్టిలో అవతలివారి టైమ్‌కు అసలు వాల్యూ లేదు! 

కట్ చేస్తే -

నాకు కొన్ని బలహీనతలున్నాయి. అంటే - డ్రగ్స్ అలాంటివికాదు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లారిటీతో చెప్తాను. డైరెక్టుగా చెప్తాను. అదే నా బలహీనత, బహుశా. 

నేనెప్పుడూ అమెచ్యూర్‌గానే ఫీలవుతాను. ఎప్పుడూ కొత్తగా ఎన్నో నేర్చుకొంటూనే ఉంటాను. అన్నీ నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అనుకోను. అలాంటి భ్రమల్లో బ్రతకటం నాకిష్టం ఉండదు.  

ఎదుటివారిని, వారి టైమ్ విలువనీ నాకంటే కనీసం ఒక పది రెట్లు ఎక్కువగా భావిస్తాను. ఆ స్థాయిలోనే ఎదుటివారిపట్ల, వారి సమయం పట్ల నాకు గౌరవం ఉంటుంది. 

అనవసరమైన పరదాలు కప్పి, పరోక్షంగా ఏదో చెప్తున్నాననుకొని ఏదీ చెప్పను. సోకాల్డ్ డిప్లొమాటిక్‌గా అయితే అసలు ఏదీ చెప్పలేను. 

ఇప్పుడు భారతదేశపు రాజధాని ఏది అంటే దానికి సమాధానం "న్యూ ఢిల్లీ" ఒక్కటే ఉంటుంది.  రెండువైపులా సమయం వృధా కాకుండా, అవతలివారి నుంచి కూడా కమ్యూనికేషన్ ఇంత సూటిగా ఉండాలని కోరుకొంటాను. 

కాని, చాలా విషయాల్లో నాకు తగిలే వ్యక్తుల్లో కనీసం ఒక 60% అలా ఉండరు. అసలు విషయం తప్ప ఇంకేదేదో మాట్లాడుతుంటారు. అడిగిందే రెండు మూడు సార్లు అడిగినా సమాధానం చెప్పినట్టు యాక్ట్ చేస్తారు. కాని అందులో సమాధానం ఉండదు.

ఎదుటివారి సమయానికి కూడా వారి సమయానికున్నంత వాల్యూనే ఉంటుందన్న విషయం గుర్తించినప్పుడు ఇలా జరగదు. కాని, కొందరికి ఇంత చిన్న విషయం తెలియదు. తెలిసినా పట్టించుకోరు. 

ఇలాంటి వ్యక్తులకు, వ్యక్తిత్వాలకు, వారితో ప్రొఫెషనల్ సంబంధాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని... ఈ దసరా రోజు సాయంత్రం మరోసారి గట్టిగా అనుకున్నాను. 

ఇలాంటి నిర్ణయం వల్ల నాకు చాలా నష్టం జరగొచ్చు అని కొందరు మిత్రులు నాకు వార్నింగ్ ఇస్తుంటారు. 

నిజానికి, ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంవల్లనే చాలా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు నాకు అలా జరిగింది. 

లేటెస్టుగా ఈ వారం పదిరోజుల్లో కూడా... 

Don't change so people will LIKE you.
Be yourself and the right people will LOVE you!

2 comments:

  1. వాళ్ళు మారరు. వాళ్ళ వ్యవహార శైలిని మార్చాలనుకోవడం కూడా టైం వేస్ట్.
    మనం పని జరగాలి - అది ముఖ్యం.

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసేసుకొంటూ పోవడమే కరెక్టు. Thanks for your comment, Vishnuvardhan!

      Delete