Friday 29 October 2021

స్వచ్ఛమైన ఆ చిరునవ్వుకు శ్రధ్ధాంజలి!

జస్ట్ రెండురోజుల క్రితమే నేనొక మిత్రునితో చెపాను... "మనకు ఎంతో టైమ్ ఉందని అనుకోకు. ఉన్న టైమ్‌ని మాత్రం కనీసం 10X స్పీడ్‌లో పనిచేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ గడిపేద్దాం" అని. 

నిన్న రాత్రే 'ఓషో' కొటేషన్ ఒకటి నా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను: "The real question is not whether life exists after death. The real question is whether you are alive before death."

ఎప్పుడో ఏదో చేస్తాం, ఇంకా టైముందిలే అని అనుకోడానికి లేదు. చిన్నవో పెద్దవో తప్పక పూర్తిచేయాల్సిన బాధ్యతలు, పనులు వెంటనే పూర్తయ్యేలా అన్నీ ప్లాన్ చేసుకోవటం, అలా పని చేయటం చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. 

ఇలాంటి జ్ఞానోదయం నాకు అవటానికి ప్రధాన కారణం... కరోనా వైరస్, నిన్నమొన్నటిదాకా మనకు రకరకాలుగా చుక్కలు చూపించిన లాక్‌డౌన్. 

సో, థాంక్స్ టు లాక్‌డౌన్... నాలో చాలా మార్పు వచ్చింది.

So much to do. So little time!  

కట్ చేస్తే - 

ఇవ్వాళ ఉదయం పునీత్ రాజ్‌కుమార్ విషాద వార్త పెద్ద షాక్. 

స్వచ్ఛమైన ఆ చిరునవ్వును మళ్ళీ చూడలేం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి, మిత్రులకు, ఫ్యాన్స్‌కు నా ప్రగాఢ సానుభూతి. 🙏 

చావు ఎవరికైనా తప్పదు. దాన్ని నివారించలేం. కాని, దానికి కూడా కొన్ని బేసిక్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. 

ఒక బాంబ్ పేలటం కాదు. ఒక యాక్సిడెంట్ కాదు. ఒక సునామీ కాదు. రోజూలాగే క్యాజువల్‌గా జిమ్‌కు వెళ్ళినవాడు ఇంటికి తిరిగివచ్చే నమ్మకం కూడా లేదు. 

లాక్‌డౌన్‌లో ఎందరో నాకు తెలిసినవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళూ... చూస్తుండగా అలా పిట్టల్లా రాలిపోయారు. 

చావు ఎలాగూ ఎవరికైనా తప్పదు. కాని, ఇలాంటివి మనకు ఎక్కువ సమయం లేదు అన్న విషయాన్ని, మన బాధ్యతల చిట్టాను గుర్తుచేస్తూ ఒక్కసారిగా షేక్ చేస్తాయి.

ఇలా నేనీ ఈ బ్లాగ్ పోస్ట్ రాయడం నెగెటివ్ థింకింగ్ కాదు...

"మనకున్న సమయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చూపొద్దు... ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ, మరింత త్వరపడాలి" అని నన్ను నేను అలర్ట్ చేసుకోవడం.

మిత్రులు, శ్రేయోభిలాషులను వారు చేయాల్సి వున్న అసలు పనులమీద నుంచి దృష్టి మరల్చవద్దంటూ, ఉన్నన్ని రోజులూ జీవితాన్ని తనివితీరా జీవించాలంటూ... ఫ్రెండ్లీగా మోటివేట్ చేయటం.

ఆర్జీవీ కూడా ఇవ్వాళ ఇలాంటి ట్వీట్ పెట్టాడంటే... ఎందుకు పెట్టడు? అతను కూడా మనిషే. అతనికీ చావుంది. ఇలాంటి విషాదవార్తలకు ఎవరైనా షాకవుతారు. ఇలాగే స్పందిస్తారు.    

"Apart from the shocking tragedy that Puneeth Rajkumar's sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime. So it is best to live life on a fast forward mode, while we are still alive." - Ram Gopal Varma  

Tuesday 26 October 2021

నిజము మరచి నిదురపోకుమా!

ఎవరైనా నేర్చుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది 'గెలవడం ఎలా' అని. 'ఓడిపోకుండా ఉండటం ఎలా' అని కాదు. ఏది సరైనదో నిర్ణయించుకోవాల్సింది మనమే. 

అలాగే - కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ గ్యాప్ అనే రెండూ చాలా శక్తివంతమైనవి. ఒకటి పాజిటివ్ సంకేతాలనిస్తుంది. రెండోది నెగెటివ్ సంకేతాలనిస్తుంది. ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే.

కట్ చేస్తే - 

నిన్న జరగాల్సిన ఒక పని కాలేదు. వెళ్లాల్సిన ఒక ముఖ్యమైన మీటింగ్‌కు చాలా చెత్త రీజన్ వల్ల వెళ్లలేకపోయాను. కొత్తగా అనుకొన్న ఇంకో డీల్ కూడా మూడోసారి వాయిదా పడింది, ఆశ్చర్యకరంగా.     

వెంటనే రాత్రికి రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నాను. అన్నీ పక్కనపెట్టి, కొన్నాళ్ళు నా క్రియేటివ్ యాడ్స్ క్యాంపెయిన్ ప్లాన్ చేసి, వెంటనే మొదలెట్టాను. ఈ నెల 31 వరకూ ఇదిలాగే కొనసాగుతుంది. నా సోషల్‌మీడియాలో కూడా ఇదే కనిపిస్తుంది.  

నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న, తెలిసిన అతి కొద్దిమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సత్వర బాధ్యతలు, లక్ష్యాల గురించి తప్ప... ఇంక వేటి గురించీ, ఎవరి గురించీ ఆలోచించటం లేదు. 

పని, పని, పని.   

చేసుకుంటూపోవడమే.

అదే చేస్తున్నాను.

దాదాపు 20 నెలలుగా వేధిస్తున్న కోవిడ్, కొత్త జీవితపాఠాల్ని నేర్పింది. 

సమయం మనచేతుల్లో ఉందనుకుంటాం. ఇంకెంతో టైమ్ ఉంది మనకు అనుకుంటాం. "మీకంత సీన్ లేదు" అని మొన్నటి ఫస్ట్, సెకండ్ వేవ్‌లు చెప్పాయి. కళ్ళముందే పిట్టల్లా రాలిపోయిన ఎందరో నాకంటే చిన్నవారి జీవితాలు, నాకు అతి దగ్గరివారి ముగిసిన జీవితాలు చెప్పాయి. 

ఇదిలా ఎంతకాలం కొనసాగుతుందో తెలీదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రష్యాలో, చైనాలో, ఇంకొన్నిచోట్లా కలకలం లేపుతోందట. అలవాటు ప్రకారంగా ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ మనదగ్గర కూడా సమస్య పెరగొచ్చు. చెప్పలేం. 

ఇలాంటి పరిస్థితుల్లో, దేని దారి దానిదే అనుకుంటూ జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకే వెళ్ళాలి తప్ప అసమర్థంగా ఆగిపోకూడదు. మన అసమర్థతకు... దీన్నో, ఎవరినో, ఇంకే పరిస్థితులనో సాకుగా తీసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.  

ప్రతి గంటకు, ప్రతి రోజుకూ ఎంతో కొంత ముందుకు కదలాలి. 

గడిచిపోయే సమయం మనకోసం మళ్లీ వెనక్కి రాదు. పెరుగుతున్న వయస్సు మనమేదో అర్థంలేని స్టకప్‌లో ఉన్నామని మనకోసం ఆగదు. 

సమయం విలువ, బాధ్యతల విలువ ఏంటో తెలిసినవాడెవ్వడూ రోజూ ఓడిపోవాలనుకోడు. ఆ ఎడిక్షన్‌లో కొట్టుకుపోడు. దాన్ని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కోడు. 

కట్ చేస్తే - 

మన లాజిక్‌కి అందని సంఘటనలు కొన్ని మన జీవితంలో జరుగుతోంటే అనిపిస్తుంది. సమ్‌థింగ్ ఇంకేదో ఉందనీ, దాని లక్ష్యం మరొకటేదో అనీ.   

ఉండొచ్చు. ఆ నమ్మకాల దారి వేరు. నిజ జీవితంలోని సమస్యలు, సంఘటనల దారి వేరు. 

మనచుట్టూ కటిక చీకటిలాంటి నెగెటివిటీ పేరుకుపోకుండా చూసుకోవటం ముఖ్యం.  

సమయం విలువ, ప్రొడక్టివిటీ విలువ తెలిసిన పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉన్నప్పుడు... అలాంటి పాజిటివ్‌లీ అగ్రెసివ్, ప్రొయాక్టివ్‌లీ పవర్‌ఫుల్ వ్యక్తులతో నిండిన పీర్‌గ్రూప్‌ మధ్య మనం ఉన్నప్పుడు... ఎలాంటి సమస్యలు, స్టకప్‌లు కూడా మనల్ని ఏం చేయలేవు. మనం ముందుకే కదుల్తుంటాం. 

అలా కదలటమే ఎవరికైనా కావల్సింది. అదే చాలా ముఖ్యం.

సమర్థించుకోడానికి మనం చూపే అనేక సాకులు... చేసే అనేక వాదనలు, తర్కాలు వృధా. 

అవన్నీ... అయితే మన పాండిత్యం ప్రదర్శించుకోడానికో, లేదంటే మన నోరు పెద్దది అని ప్రూవ్ చేసుకోవడానికో. అంతకన్నా ఏం లేదు. 

కళ్ళముందు కనిపిస్తున్న నిజాల ముందు ఇవన్నీ జస్ట్ ఒక గడ్డిపోచతో సమానం.   

When it comes to becoming stronger, healthier and better – there are no excuses. Just fucking do it.

Thursday 21 October 2021

ఫేస్‌బుక్‌తో ఏదైనా సాధ్యమే!

అమ్మాయిలు ఈజీగా అబ్బాయిల్ని పడేయొచ్చు. అబ్బాయిలు అమ్మాయిల్ని పడేయొచ్చు. కొంచెం మెచ్యూర్డ్ భాషలో చెప్పాలంటే ఎవరు ఎవరితోనైనా ఫ్రెండ్స్ అయిపోవచ్చు.

ఈ ప్రాసెస్‌కు ఏజ్ ఫాక్టర్ లేదని ప్రపంచవ్యాప్తంగా చాలామంది విషయంలో చాలా సార్లు రుజువైంది. 

అయితే ఒక వార్నింగ్ –

అమ్మాయిలు అనుకొని, ఎవరో సిల్లీ ఫెలోస్ క్రియేట్ చేసిన “లేని అమ్మాయిల ప్రొఫైల్స్”నే ప్రేమిస్తూ కొందరు అబ్బాయిలు జీవితాలనే వృధా చేసుకోవచ్చు. పరిణితిచెందని మానసిక దౌర్బల్యం వల్ల, అమ్మాయిలు అబ్బాయిల జీవితాల్లో ఇంకెన్నో సమస్యలు రావచ్చు. వీరిలో కొందరు జీవితాల్నే ముగించేసుకోవచ్చు. కొందరి జీవితాలకు ఇంకెవరో ముగింపు చెప్పొచ్చు. అవన్నీ మనం చూస్తున్నాం.   

అంతేనా? ఇంకా చాలా ఉంది... 

హాయిగా ఉన్న కుటుంబ జీవితాన్ని, కుటుంబ సభ్యులమధ్య ఉన్న సంబంధాల్నీ అతలాకుతలం చేసుకోవచ్చు. ఒక్క ఇంట్లోనే అసలు ఒకరికొకరు మాట్లాడుకోకుండా... అంతా అతి సులభంగా మరమనుషులయిపోవచ్చు. నాలుగు గోడల మధ్యే కలిసి జీవిస్తూ, పరాయివారయిపోవచ్చు. 

ఇంకా అయిపోలేదు, చాలా ఉంది...  

జీవిత భాగస్వామిపట్ల, జీవనశైలిపట్ల అసంతృప్తి ఉన్న పురుషులు, స్త్రీలు కొత్త దారులు వెతుక్కోవటంలో బిజీ అయిపోవచ్చు. ప్రయత్నించకుండానే కొన్నిసార్లు కొన్ని పరిచయాలు ఊహించని కొన్ని కొత్తదారులకు దారితీయవచ్చు. 

ఈ ఒక్క ప్లాట్‌ఫామ్ పైన అసలు సాధ్యం కానిదంటూ లేదు. అన్నీ సాధ్యమే.  

ఎన్నో ఉదంతాలని, ఎందరో వ్యక్తుల్నీ, బాగా అధ్యయనం చేశాకే పై వాక్యాలు పుట్టాయి. వాటిల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగని వీటన్నిటినీ తప్పు అని కూడా చెప్పలేం. 

ఎవరి దృక్కోణం వారికుంటుంది. ఎవరి నిర్వచనాలు వారికుంటాయి. 

అదంతా ఒక కాంట్రవర్షియల్ సైడ్.

కాసేపు, దాన్నలా వదిలేద్దాం... 

ఫేస్‌బుక్‌కు పాజిటివ్ సైడ్ కూడా ఒకటుంది. ఈవైపు చాలా తక్కువమంది చూస్తారు. పాజిటివ్ వైపు ఉపయోగించుకొన్నప్పుడు అదే సేమ్ ఫేస్‌బుక్ ఇలా కూడా తోడ్పడుతుంది:

> దశాబ్దాల క్రితం సంబంధాలు తెగిపోయిన మిత్రుల్ని, బంధువుల్నీ ఫేస్‌బుక్ ద్వారా నిమిషాల్లో కలుసుకోవచ్చు.
> నిత్యజీవితంలోని ఎన్నో టెన్షన్లను తట్టుకోడానికి, గాడితప్పిన జీవితాన్ని ఒక పాజిటివ్ కోణంలో బాగుపర్చుకోడానికి… ఒక ప్రయోగశాలగా, ఒక మెడిటేషన్ సెంటర్‌గా కూడా ఫేస్‌బుక్‌లోని పనికొచ్చే ఎన్నో మంచి మంచి గ్రూపులని ఉపయోగించుకొని లాభం పొందవచ్చు.
> ఫేస్‌బుక్‌లో ఫ్లోట్ అవుతున్న ఎందరో వ్యక్తులు, ఎంతో సమాచారం, ఎన్నో ఇన్‌స్పయిరింగ్ కొటేషన్లు, పోస్టుల నేపథ్యంగా - కేవలం ఒకే ఒక్క వ్యక్తితో పరిచయం, లేదా ఓ చిన్న పోస్టు, ఓ చిన్న సమాచారం, ఓ చిన్న కొటేషన్ మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. మీ జీవిత గమ్యాలవైపు మిమ్మల్ని అవలీలగా నడిపించవచ్చు.
> ఫేస్‌బుక్‌ని బాగా ఉపయోగించుకొని చోటా గల్లీ లీడర్ల స్థాయి నుంచి, బడా రాజకీయనాయకుల స్థాయికి ఎదగొచ్చు. ఒక అద్భుతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా దీని శక్తి ఏంటో గుర్తించి బాగా ఉపయోగించుకొంటే మంత్రుల దాకా కూడా ఎదగొచ్చు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి.
> మీకు అవసరమైన ఏ సమాచారాన్నైనా, ఏ సలహానైనా సంబంధిత ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా క్షణాల్లో ఫ్రీగా పొందవచ్చు.
> పైసా ఖర్చు లేకుండా మీ వృత్తి, వ్యాపారాలను అమితంగా విస్తరించుకోవచ్చు. ఒకే ఒక్క ఫేస్‌బుక్‌ పేజి తో ఆన్ లైన్ లో మిలియన్ల వ్యాపారం చేయొచ్చు. దీన్ని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసినవాళ్ళెందరో వున్నారు.
> వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ… మీ అభిరుచికి సూటయ్యే అద్భుతమైన స్నేహితులను, స్నేహితురాళ్ళను సంపాదించుకోవచ్చు.

ఇంత గొప్ప అవకాశాల్న్ని, సౌకర్యాల్ని, ఇంత సింపుల్‌గా ఫేస్‌బుక్‌ రూపంలో ఓ గొప్ప అద్భుతంగా మనకోసం రూపొందించిన మార్క్ జకెర్‌బర్గ్‌కి మనం థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలం? 

ఇంతకీ ఫేస్‌బుక్‌లో మనం ఎటు వెళ్తున్నట్టు? పాజిటివ్ దిశలోనా... నెగెటివ్ దిశలోనా?... ఆలోచించాల్సిన అసలు పాయింట్ ఇదీ!

ఒక్క ఫేస్‌బుక్ విషయంలోనే కాదు... మిగిలిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా దాదాపు ఇలాంటి లాభాలుంటాయి. మనం ఎలా ఉపయోగించుకొంటాం వాటిని అన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్!

Monday 18 October 2021

రెడ్ వైన్ ఎందుకు మంచిది?

సుమారు పాతికేళ్లక్రితం నేను ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు, నా కొలీగ్ అపోలిన్ డిసౌజా, నేనూ ఒక బ్యాంక్ మేనేజర్ ఇంట్లో రెంట్‌కి ఉండేవాళ్లం. 

కింది గదిలో డిసౌజా, పైన పెంట్ హౌజ్‌లో నేను. 

అప్పుడు ఇద్దరం బాచిలర్సే. 

పైన పెంట్ హౌజ్ కాబట్టి డిసౌజా కంటే నాకు 'ఫ్రీడం' కొంచెం ఎక్కువగా ఉండేది. 

వన్ ఫైన్ మార్నింగ్ డిసౌజా నా రూమ్‌కు వచ్చి చెప్పాడు: "మనం రెడ్ వైన్ తయారుచేసుకుందాం. పైన నీ రూం అయితే ఓనర్స్‌తో ప్రాబ్లం ఉండదు" అన్నాడు. 

డిసౌజా నేపథ్యం కొంకణ్ ఏరియాలోని మంగుళూరు. అక్కడి పద్ధతుల ప్రకారం ఈ రెడ్ వైన్ కల్చర్ డిసౌజాకు బాగా తెలుసు. 

క్యూరియాసిటీతో ఓకే చెప్పాను. 

కట్ చేస్తే - 

మార్కెట్‌కు వెళ్ళి ద్రాక్ష, రెండు కొత్త కుండలు ఎట్సెట్రా సరంజామా కొనుక్కొచ్చాము. "మంచి క్వాలిటీ రెడ్ వైన్ ఇంట్లోనే తయారు చేసుకోడం ఎలా?" అంటూ మా ప్రాసెస్ మొదలైంది.   

దాదాలు ఒక నెలరోజులపాటు (ఇంకా ఎక్కువేనేమో, గుర్తులేదు సరిగ్గా) ఒక కుండలోంచి ఇంకో కుండలోకి, అట్నుంచి ఇటు... ఇట్నుంచి అటూ... దాన్ని దొర్లించి దొర్లించి... మొత్తానికి మస్త్ రెడ్ వైన్ తయారుచేసుకున్నాం. 

అలా మేం తయారుచేసుకున్న రెడ్ వైన్‌ను బాటిల్స్‌లో నింపుకొని... రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం కొంచెం సిప్ చేస్తూ, అమృతంలా ఫీలవుతూ ఓ నెలపాటు త్రాగాం. 

అలా... రెడ్ వైన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మా డిసౌజా. 

కట్ చేస్తే -   

ప్రపంచంలోని చాలా దేశాల సంస్కృతుల్లో, ఈరోజుకి కూడా, వారి డైనింగ్ టేబుల్ మీద ఒక రెడ్‌వైన్ బాటిల్ ఉంటుంది. ప్రతిరోజూ వారి డిన్నర్‌లో ఆహారంతోపాటు, వైన్ కూడా ఒక విడదీయరాని భాగం. 

మన దేశంలో కూడా, కొంకణ్ ప్రాంతంలో ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. కార్వార్, మంగళూరు వంటి ప్రాంతాల్లో పండుగలకు, పెళ్ళిళ్లకు మన ఇళ్లల్లో ప్రత్యేకంగా పిండివంటలు ఎలాగైతే చేసుకుంటామో, వారి ఇళ్లల్లో వైన్ కూడా అలా తయారు చేసుకుంటారు, సేవిస్తారు.

ప్రధానంగా నల్లటి ద్రాక్షపళ్లను మెత్తగా నలిపి, మరి కొన్ని పదార్థాలను అందులో కలిపి, కొన్ని రోజులపాటు ఒక పద్ధతి ప్రకారంగా ప్రాసెస్ చేస్తే వచ్చేదే ఈ రెడ్ వైన్.

వైన్‌లో 15% కంటే తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. మిగిలిన లిక్కర్స్‌లో 30% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. సంబంధిత నిపుణులు చెప్తున్నా దాని ప్రకారం... వైన్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి ప్రధానంగా ఇదొక్కటే కారణం కాదు. ఇంకెన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక 3, 4 లాభాల గురించి మాత్రం ఇక్కడ చూద్దాం:

1. గుండె సంబంధిత వ్యాధులు రావడాన్ని రెడ్ వైన్ అరికడుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (CDP) గైడ్‌లైన్స్ ప్రకారం ఆడవాళ్ళయితే రోజూ ఒక గ్లాస్ వైన్ తీసుకోవచ్చు. మగవాళ్లయితే 2 గ్లాసులవరకు తీసుకోవచ్చు. వైన్‌కు సంబంధించినంతవరకు, దీన్ని "మాడరేట్ డ్రింకింగ్" అంటారు. (1 వైన్ గ్లాస్ = 147 ఎం ఎల్).
2. గ్లకోమా, కాటరాక్ట్ వంటి దృష్టిలోపాలు వైన్ తీసుకోడంవల్ల (వయసు మీద పడ్డా) అంత త్వరగా రావు.
3. జ్ఞాపకశక్తికి రెడ్ వైన్ చాలా మంచిది. మీకు ఎంత వయసొచ్చినా, అల్జీమర్స్ మీ జోలికి రావడానికే భయపడుతుంది. మధ్య యుగాలనుంచి, ఇప్పటివరకు వివిధ మోనాస్ట్రీల్లో ‘మాంక్స్’ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి రెడ్ వైనే కారణం అని చరిత్ర, అధ్యయనాలు చెప్తూ వస్తున్నాయి.
4. రెగ్యులర్‌గా వైన్ తీసుకొనేవారి వయస్సు చెప్పటం కష్టం. మీ లుక్ , మీ గ్లామర్, మీ అందం… వీటిమీద రెడ్ వైన్ ఎఫెక్ట్ అంత పాజిటివ్‌గా ఉంటుంది!

పైన చెప్పిన 4 లాభాలకు శాస్త్రీయ అధ్యయనాల సపోర్ట్ మీకు గూగుల్‌లో కొడితే వందల్లో  కనిపిస్తాయి. 


ఇంకా పెద్ద లిస్టు ఉంది. కాని, పర్సనల్ గా నాకు నచ్చిన నాలుగు లాభాలు మాత్రమే ఇక్కడ లిస్టు చేశాను. ఇప్పటికీ, సోషల్‌గా ఎప్పుడైనా గ్లాస్ పట్టుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం, నేను రెడ్ వైన్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను.  

అదలా ఉంచితే - ప్రపంచంలోని టాప్ 10 హాప్పీయెస్ట్ కంట్రీస్‌లో, ప్రతి ఇంట్లో, ఈ రెడ్ వైన్ అనేది డైనింగ్ టేబుల్ మీదుండే ఒక మామూలు తప్పనిసరి పానీయం అంటేనే మనకు మొత్తం సీన్ అర్థమైపోతుంది.

వార్నింగ్: ‘మాడరేట్’ అన్న పదాన్ని ముందు అర్థం చేసుకొని, ఒకసారి డాక్టర్ సలహా కూడా తీసుకొని, ఆ తర్వాతే రెడ్ వైన్ సిప్ చేయండి. తర్వాత నా పూచీ లేదు.🙏🙂

Sunday 17 October 2021

నడిగర్ సంఘం - AMMA - MAA

"Cine'MAA'  people proved to the audience, that they are actually a CIRCUS!" - RGV

కరోనా లాక్‌డౌన్ సమయంలో - తమిళంలో మణిరత్నం తలపెట్టిన "నవరస" 9 భాగాల వెబ్  సీరీస్ (నెట్‌ఫ్లిక్స్) కోసం, ఆయన కోరిన ప్రతి ఒక్క తమిళ ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఫ్రీగా పనిచేశారు. 

సుమారు 17 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో 12,000 మంది సినిమా వర్కర్స్‌కు 6 నెలలపాటు బ్రతకడానికి సరిపడా సపోర్ట్ ఇచ్చారు!  

ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు:  https://youtu.be/zBkiefvQJ6I

కట్ చేస్తే - 

తెలుగు సినీ ఆర్టిస్టులకు MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఉన్నట్టే, తమిళ ఆర్టిస్టుల కోసం "నడిగర్ సంఘం" ఉంది. మళయాళంలో AMMA (అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్) ఉంది. 

మళయాళం AMMA, గత ఫిబ్రవరిలో ఇలాంటిదే ఒక భారీ చారిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. AMMAలో ఉన్న దాదాపు 140 మంది టాప్, మిడ్ రేంజ్, ఇతర ప్రముఖ ఆర్టిస్టులతో ఒక కమర్షియల్ థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసింది. 

ఈ సినిమాకోసం మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా ఫ్రీగా పనిచేస్తున్నారు. 

కమర్షియల్ సినిమా కాబట్టి ఇంచుమించు ఓ 15-20 కోట్లయినా వస్తాయి. ఈ డబ్బుతో కరోనా టైమ్‌లో బాధపడ్డ ఇండస్ట్రీ వర్కర్స్‌కు, ఇతరత్రా బాధల్లో ఉన్న AMMA ఆర్టిస్టులకు ఈ డబ్బు ద్వారా సహాయం చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రకటన సమయంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో, AMMA వారి కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్ కొచ్చిలో ప్రారంభించారు.  

స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సౌకర్యాలన్నీ ఉన్న ఈ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో – AMMA మెంబర్ ఆర్టిస్టుల కోసం 150 సీటర్స్ మినీ థియేటర్ ఉంది. కథా చర్చల కోసం ప్రత్యేకంగా కొన్ని క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు.

AMMA ఏర్పాటైన 25 ఏళ్ల తర్వాత – 2019 లో – ఈ నూతన భవన సముదాయం నిర్మాణం ప్రారంభించారు. సరిగ్గా 18 నెలల్లోనే అద్భుతంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ భవనంలోనే ఇప్పుడు అసోసియేషన్ సమావేశాలన్నీ జరుగుతున్నాయి. 

తమిళం, మళయాళం ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా ఆయా ఆర్టిస్టుల అసోసియేషన్లకు రెగ్యులర్‌గా ఎన్నికలు జరుగుతున్నాయి.  కాని, ఇక్కడ "మా"లో జరిగినంత రచ్చ ఈ రెండుచోట్లా ఎప్పుడూ జరగలేదనుకుంటాను.  

కరోనా సమయంలో - తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని చారిటీ కార్యక్రమాలు బాగానే జరిగాయి కాని, పైన చెప్పిన స్థాయిలో ఏం జరిగినట్టులేదు. 

అయితే - మొన్నటి  MAA ఎలక్షన్లు మాత్రం పీక్స్! 

ఇలాంటి విషయాల్లో "మా"కు ఎవ్వరూ పోటీ రారు, రాలేరని... బాగా ప్రూవ్ చేసుకున్నారు.  

వీళ్ల గొడవంతా రోజూ టీవీ చానెల్స్‌లో, సోషల్ మీడియాలో చూస్తూ... "మీ సినిమావాళ్ళు మరీ ఇట్లనా?!.." అంటూ ప్రతిఒక్కరూ ఏదో ఒక ఎగతాళి మాట అనటం... కామన్ అయిపొయింది. 

అసలు MAA ఎలక్షన్లకు, మిగిలిన 23 క్రాఫ్టుల్లో పనిచేసేవారికీ ఎలాంటి సంబంధం లేకపోయినా, "మీ సినిమావాళ్ళు...",  "మీ సినిమావాళ్ళు..." అంటూ రోజూ నానా సెటైర్స్ వినాల్సి వచ్చింది.

ఎలక్షన్లు అయిపోయినా... ఆ గొడవ ఇంకా ముగిసినట్టులేదు!  

చివరికి MAA రెండు ముక్కలు కూడా కావొచ్చు అంటున్నారు. 

ఎన్ని ముక్కలైనా చేస్కోవచ్చు, అది వారిష్టం. కాని, మరీ ఇంతలా ఇజ్జత్ తీసుకోకపోతే బావుంటుంది. 

వాళ్ళ మాటల్లోనే చెప్పాలంటే... కొంచెం... "డీసెన్సీ, డిగ్నిటీ" కూడా అవసరం. 

Saturday 16 October 2021

మార్కెటింగ్ లైఫ్!

మొన్న సెప్టెంబర్ 29 నుంచీ నా ప్రొఫెషనల్ మార్కెటింగ్ యాక్టివిటీని చాలా అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాను.

మొట్టమొదటిసారిగా, ఒక మల్టి ప్యాషనేట్ క్రియేటివ్‌ప్రెన్యూర్‌గా... నా సర్విసెస్, నా రిక్వయిర్‌మెంట్స్...  ఒకదాని వెనుక ఇంకోటి అన్నీ నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. 

నా ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్, నా 'ఫిలింనగర్ డైరీస్' పాడ్‌కాస్ట్... అన్నీ ఇప్పుడు... అయితే సినిమా, లేదంటే క్రియేటివిటీకి సంబంధించిన కంటెంట్ తో నిండిపోతున్నాయి.

నా మొత్తం క్రియేటివిటీ యాక్టివిటీకి "మార్కెటింగ్ స్పేస్"గా మారిపోతున్నాయి.    

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా - ఖచ్చితమైన టైమ్‌బౌండ్ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అసలు బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. 

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కవులు, రచయితలు, ఇతర మేధావి మిత్రులు, సీనియర్స్... ఈ స్టఫ్ అంతా చూసి ఇబ్బంది పడే అవకాశం చాలావుంది. సరదాగా ఎంజాయ్ చేయండి. లేదా, హాయిగా నన్ను "అన్‌ఫాలో" చేసెయ్యండి! 😊

ఏదో ఒక సినిమా ప్రాజెక్టు అని కాకుండా, నా అన్ని క్రియేటివ్ వింగ్స్‌లోనూ చేతినిండా పనితో చాలా చాలా బిజీ అయిపోవాలన్నది సంకల్పం. ఆ బిజీ ఈ దసరా నుంచే పుంజుకోవాలనీ, ఊపిరి సలపనివ్వని వర్క్‌లోడ్‌తో పనిచేస్తూ, ఈ సంవత్సరం ఆఖరుకల్లా కొన్ని విషయాల్లో నేను పూర్తిగా 'ఫ్రీ అయిపోవాలని' కూడా గట్టిగా అనుకున్నాను.

ఆ దిశలో నా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా స్పీడప్ చేస్తున్నాను.  

పని చేస్తూవుంటేనే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. 'అనుకోకుండా జరుగుతాయని మనం అనుకొనే  మిరాకిల్స్' కూడా మనం పని చేస్తూవుంటేనే జరుగుతాయని నా నమ్మకం, నా అనుభవం. 

అదృష్టం ఎక్కడో ఆకాశం నుంచో, మన తారల నుంచో జారిపడదు. మనం ఎంత కష్టపడితే అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మన వెంటపడి వస్తుంది. ఇలాంటి అదృష్టాన్ని మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎంత కష్టమైనా పడతాను. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు. అందరికీ నా వినమ్ర వందనం. 🙏

Peace, Progress and Prosperity to All of Us...   

Friday 15 October 2021

ఎదుటివారి టైమ్‌కు కూడా విలువుంటుంది!

కొంతమంది మాటలు, చేతలు చాలా "డిప్లొమాటిక్"గా ఉంటాయి. ఎట్‌లీస్ట్... అలా అనుకుంటారేమో వారు. 

కాని, ఎదుటివారు వారికి, వారి మాటకు ఇస్తున్న గౌరవాన్ని, విలువను పోగొట్టుకుంటున్నారని వారు తెలుసుకోరు. తెలుస్తున్నా పట్టించుకోరు.

ఇలాంటివారి దృష్టిలో అవతలివారి టైమ్‌కు అసలు వాల్యూ లేదు! 

కట్ చేస్తే -

నాకు కొన్ని బలహీనతలున్నాయి. అంటే - డ్రగ్స్ అలాంటివికాదు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లారిటీతో చెప్తాను. డైరెక్టుగా చెప్తాను. అదే నా బలహీనత, బహుశా. 

నేనెప్పుడూ అమెచ్యూర్‌గానే ఫీలవుతాను. ఎప్పుడూ కొత్తగా ఎన్నో నేర్చుకొంటూనే ఉంటాను. అన్నీ నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అనుకోను. అలాంటి భ్రమల్లో బ్రతకటం నాకిష్టం ఉండదు.  

ఎదుటివారిని, వారి టైమ్ విలువనీ నాకంటే కనీసం ఒక పది రెట్లు ఎక్కువగా భావిస్తాను. ఆ స్థాయిలోనే ఎదుటివారిపట్ల, వారి సమయం పట్ల నాకు గౌరవం ఉంటుంది. 

అనవసరమైన పరదాలు కప్పి, పరోక్షంగా ఏదో చెప్తున్నాననుకొని ఏదీ చెప్పను. సోకాల్డ్ డిప్లొమాటిక్‌గా అయితే అసలు ఏదీ చెప్పలేను. 

ఇప్పుడు భారతదేశపు రాజధాని ఏది అంటే దానికి సమాధానం "న్యూ ఢిల్లీ" ఒక్కటే ఉంటుంది.  రెండువైపులా సమయం వృధా కాకుండా, అవతలివారి నుంచి కూడా కమ్యూనికేషన్ ఇంత సూటిగా ఉండాలని కోరుకొంటాను. 

కాని, చాలా విషయాల్లో నాకు తగిలే వ్యక్తుల్లో కనీసం ఒక 60% అలా ఉండరు. అసలు విషయం తప్ప ఇంకేదేదో మాట్లాడుతుంటారు. అడిగిందే రెండు మూడు సార్లు అడిగినా సమాధానం చెప్పినట్టు యాక్ట్ చేస్తారు. కాని అందులో సమాధానం ఉండదు.

ఎదుటివారి సమయానికి కూడా వారి సమయానికున్నంత వాల్యూనే ఉంటుందన్న విషయం గుర్తించినప్పుడు ఇలా జరగదు. కాని, కొందరికి ఇంత చిన్న విషయం తెలియదు. తెలిసినా పట్టించుకోరు. 

ఇలాంటి వ్యక్తులకు, వ్యక్తిత్వాలకు, వారితో ప్రొఫెషనల్ సంబంధాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని... ఈ దసరా రోజు సాయంత్రం మరోసారి గట్టిగా అనుకున్నాను. 

ఇలాంటి నిర్ణయం వల్ల నాకు చాలా నష్టం జరగొచ్చు అని కొందరు మిత్రులు నాకు వార్నింగ్ ఇస్తుంటారు. 

నిజానికి, ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంవల్లనే చాలా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు నాకు అలా జరిగింది. 

లేటెస్టుగా ఈ వారం పదిరోజుల్లో కూడా... 

Don't change so people will LIKE you.
Be yourself and the right people will LOVE you!

Saturday 9 October 2021

మానవ సంబంధాలన్నీ మార్కెటింగ్ సంబంధాలే!

సోషల్ మీడియా అంటే జస్ట్ సూక్తి ముక్తావళేనా?... అనిపిస్తుంది అప్పుడప్పుడూ. కాని కాదు. 

సోషల్ మీడియాలో సగానికిపైగా కొటేషన్లు, సూక్తులే కనిపిస్తాయి. మిగిలిన సగం రాజకీయాలు, సినిమాలు, ఫ్యాన్స్ ట్రోల్స్, ఇతర స్టఫ్ ఉంటుంది.

కాని, వీటన్నిటి మధ్య – అరుదుగా – అక్కడక్కడా – నిజంగా మనల్ని ఇన్‌స్పైర్ చేసే విషయాలు, ‘సాధ్యమే కదా’ అనిపించే విజయాలు కనిపిస్తాయి.

సెల్ఫ్ మోటివేషన్ కోసం, డల్ అయి డిప్రెషన్‌లోకి వెళ్లనీయని ఒకలాంటి డ్రైవ్ కోసం... అప్పుడప్పుడూ నేను కూడా నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్, నాకు ఆ సమయంలో, ఆ మూడ్‌లో తోచిన కొన్ని మాటలు ఏవేవో నా సొషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తుంటాను. 

వీటన్నిటిలోనూ – నాకు తెలిసిన తేడా ఒక్కటే… 
ఎడాలిసెంట్ వయస్సులో పెట్టే కొటేషన్స్, రాసే రాతలు వేరు. జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఎంజాయ్ చేసిన అనేక అనుభవాల నేపథ్యంలో రాసే రాతలు, పోస్ట్ చేసే కొటేషన్స్ వేరు.

ఇవన్నీ కూడా సమాజంలో మన చుట్టూ ఉన్న వివిధరకాల వ్యక్తుల, వ్యక్తిత్వాల నేపథ్యంలో పుడతాయి. అప్రయత్నంగా సేకరించబడతాయి. 

వీటిలో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలన్న రూలేమీ లేదు. అయితే – ఏది మనకు నిజంగా ఉపయోగపడుతుందన్నది మన విచక్షణా జ్ఞానం పైన, మన వ్యక్తిత్వం, మన జీవనశైలి పైన, జీవితాన్ని మనం చూసే దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది.

అయితే - కొన్ని విషయాల్లో ఒడ్డున ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడం… సామెతలు, కొటేషన్స్ పోస్ట్ చేయడం చాలా సులభం. కాని, దిగినప్పుడే తెలుస్తుంది అసలు లోతెంతో.

కట్ చేస్తే –

సోషల్ మీడియాలో కొంత సెల్ఫ్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. మన వాయిస్‌ను, మన బ్రాండ్‌ను, మన వృత్తిపరమైన అవసరాలను ఒక స్థాయిలో ప్రచారం చేసుకొనే అవకాశం సొషల్ మీడియా మనకు ఉచితంగా ఇస్తుంది.

అంతే కాదు – ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కేవలం ఈ సోషల్‌మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకొంటూ మిలియన్లు సంపాదించుకొంటున్నారు. ఇందులో మన షేర్ ఎక్కడ, ఎంత అనేది మనమే నిర్ణయించుకోవాలి. 

ఈ నేపథ్యంలో - ప్రొఫెషనల్‌గా నాకూ అవసరం కాబట్టి నేను కూడా కొన్నిసార్లు ఈ సెల్ఫ్ మార్కెటింగ్ అనబడే ‘సొంత డబ్బా’ పోస్టులు, ఫోటోలు పెడుతుంటాను. చాలాసార్లు అవి నేను ఊహించని స్థాయిలో, నాకు కూడా తెలియకుండా షేర్ చేయబడుతుంటాయి. 

ఈ ఒక్క విషయంలో సోషల్ మీడియా అంటే నాకు ఎక్కడలేని అభిమానం, ప్రేమ, అన్నీ. :-)

సొషల్ మీడియా ఇంకో అద్భుతమైన గొప్పతనం ఏంటంటే – ఎప్పుడో దశాబ్దాల క్రితం మనకు దూరమైన మన స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, మనకు అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని లైక్-మైండెడ్ మిత్రులనూ దగ్గర చేస్తుంది. 

ఫేస్‌బుక్ అయితే, మనం మర్చిపోయే అవకాశం ఉన్న ఎన్నో జ్ఞాపకాలను ప్రతిరోజూ మెమొరీస్ రూపంలో గుర్తుచేస్తుంది. ఈ విషయంలో కూడా సోషల్ మీడియా అంటే నాకు పిచ్చి ఇష్టం.

పాజిటివ్ యాంగిల్‌లో చూడగలిగితే, ఉపయోగించుకోగలిగితే – సోషల్ మీడియా వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగించుకొంటాం అన్నది నిజంగా మనకి మనం వేసుకోవాల్సిన ఒక మిలియన్ డాలర్ కొశ్చన్.

After all... మానవ సంబంధాలన్నీ మార్కెటింగ్ సంబంధాలే! 

“Think about what people are doing on Facebook today. They’re keeping up with their friends and family, but they’re also building an image and identity for themselves, which in a sense is their brand. They’re connecting with the audience that they want to connect to. It’s almost a disadvantage if you’re not on it now.”
— Mark Zuckerberg

Saturday 2 October 2021

ఒక్క ఛాన్స్ .. The BIG Offer

I'm gonna make you an offer you can't refuse!

వీక్ మైండ్స్, నెగెటివ్ థింకర్స్ కోసం కాదిది. 

మీరు తీసుకోబోయే ఒకే ఒక్క చిన్ననిర్ణయంతో - ఈ న్యూ ఇయర్ ఈవ్‌కు స్క్రీన్ మీద కనిపిస్తూ 2022 కు మీరు స్వాగతం చెప్పొచ్చు! 

హీరో కావాలనో, విలన్‌గానో, కనీసం ఒక చిన్న ఆర్టిస్టుగా తెరమీద కనిపించాలనో... ఆ "ఒక్క ఛాన్స్" కోసం ఇంక మీకు ఆ ఎదురుచూపులు అవసరం లేదు. 

ఓటీటీ సినిమా కోసం, మైక్రో బడ్జెట్లో, నేనొక సరికొత్త ప్రయోగం చేస్తున్నాను. ఈ ప్రయోగంలో నాతో పాటు నా టీమ్‌లో మీరు కూడా కలిసి పనిచేయొచ్చు. 

కట్ చేస్తే -

ఒక్క ఛాన్స్ కోసం ఇండస్ట్రీలో ఇప్పటికే కొంతయినా తిరిగి, ఇండస్ట్రీ గురించి కొంతయినా అవగాహన తెచ్చుకొన్న 'న్యూ టాలెంట్' ఒక 10 మంది కొత్త ఆర్టిస్టులు కావాలి నాకు.   

టాలెంట్ అనేది 'బై డిఫాల్ట్' మీలో ఉండితీరాలి. 

తర్వాత ఆడిషన్, యాక్టింగ్ వర్క్‌షాప్ ఎలాగూ ఉంటాయి.  

ఇది కాకుండా - నేను అనుకుంటున్న ఈ 10  మంది కొత్త ఆర్టిస్టుల్లో ఉండాల్సిన మొదటి అర్హత: "నేను చేయగలను" అనే పాజిటివ్ మైండ్‌సెట్. రెండో అర్హత: దూసుకెళ్లే డైనమిజమ్. మూడో అర్హత: చేసే పనిమీద గైడెడ్ మిసైల్ లాంటి గురితప్పని ఫోకస్. 

మీలో ఈ అర్హతలున్నాయా?

ఈ అర్హతలు మీలో ఉంటే చాలు. ఇంకో పని మీరు సులభంగా చేయగలుగుతారు... 

క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో కేవలం ఒక లక్ష రూపాయల చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 

హైద్రాబాద్‌లో ఒక స్థాయి ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లోనే ఫీజు 5 నుంచి 27 లక్షలు ఉంది. అలాగని వాటిలో శిక్షణ తీసుకున్నంత మాత్రాన ఎవ్వరూ మిమ్మల్ని పిలిచి సినిమాల్లో ఛాన్స్‌లివ్వరు. 

కాని - 
మీరిక్కడ ఇన్వెస్ట్ చేసే ఒకే ఒక్క లక్షతో మీకు ఫీచర్ ఫిలింలో అవకాశం వస్తోంది. బిజినెస్ అయ్యాక అందులో మీ షేర్ మీకు వస్తుంది.


సినిమా వేగంగా పూర్తిచేయడానికి అవసరమైన మిగిలిన బడ్జెట్ నేను, నా టీమ్ చూసుకుంటాము. అది పూర్తిగా మా బాధ్యత. 

సినిమాలే కెరీర్ అనుకునే కొత్త ఆర్టిస్టులు ఇంక ఒక్క నిమిషం కూడా వృధా చేయకండి.

సినిమాల్లో ఒక్కసారైనా యాక్ట్ చెయ్యాలి అనుకునేవారికి కూడా ఇదొక మంచి అవకాశం. 

చెప్పలేం... ఈ 10 మంది కొత్త ఆర్టిస్టుల్లోనే ఒకరికి సెకండ్ హీరో అవకాశం కొట్టేసే చాన్స్ రావచ్చు. లేదంటే మెయిన్ హీరోగానే సెలెక్టయ్యి జాక్‌పాట్ కొట్టొచ్చు. 

ఇదంతా మీరు ఇప్పటికిప్పుడు ఈ డీల్ ఒప్పుకొని, ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్న తర్వాత జరిగే ఆడిషన్, యాక్టింగ్ వర్క్‌షాప్‌ల్లో డిసైడ్ అవుతుంది.  

మీ కళ్లముందున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటారా? మీ జీవితంలో విలువైన ఇంకో 2, 3 ఏళ్ళు... లేదా ఒక దశాబ్దం... ఫిలింనగర్ వీధుల్లో అవకాశాల కోసం వెతుక్కుంటూ తీరిగ్గా వృధా చేసుకుంటారా? 

నిర్ణయం మీది. ఎలాంటి ఫోర్స్ లేదు. 
   
మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ "ఒక్క ఛాన్స్" ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది.

Now the ball is in your court... 

బాగా ఆలోచించండి. దీనికి ఓకే అనుకుని, వెంటనే ఇన్వెస్ట్ చేయగలిగినవారు మాత్రమే మీ పూర్తి బయోడేటా, మీ 3 లేటెస్ట్ ఫోటోలు, మీ గురించి మీరు పరిచయం చేసుకొంటూ ఒక వన్ మినిట్ రికార్డ్ చేసిన వీడియో మాకు పంపించండి. 

కట్ చేస్తే -

మాకు వచ్చిన అప్లికేషన్స్ లో... "First come first served" బేసిస్‌లో మాకు నచ్చిన 10 మందిని ఎన్నిక చేసి, కాల్ చేస్తాము.  తర్వాత జరిగేది ఇది:

> మీరు వెంటనే "యస్" చెప్పి, లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 
> 10వ తేదీ సాయంత్రం 6 నుంచి మన రెనగేడ్ ఫిలిం మేకింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 
> 10 వతేదీ తర్వాత ఈ యాడ్, ఈ ఆఫర్ ఉండదు.   
> డిసెంబర్ 31 రాత్రి మీరు నటించిన, వర్క్ చేసిన మన కొత్త ట్రెండీ కమర్షియల్ ఫీచర్ ఫిలిమ్‌ను మనమంతా కలిసి పాప్‌కార్న్ తింటూ, కోక్ త్రాగుతూ స్క్రీన్ మీద చూస్తాం. 

నేనిప్పటికే డైరెక్టర్‌గా 3 సినిమాలు చేసివున్నాను. రచయితగా నంది అవార్డ్ తీసుకున్నాను. నా ప్రతి సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేశాను. శాటిలైట్ రైట్స్ అమ్మాను. ఒక సినిమా యూకేలో కూడా రిలీజ్ చేశాం. 

ఇప్పుడిది ఓటీటీల జమానా. కంటెంట్ ఎఫెక్టివ్‌గా బాగుంది అంటే ఇంకా ఈజీ. మనం ఆ స్థాయిలోనే చేస్తాం. 

బాటమ్ లైన్ ఏంటంటే - పైన నేను ఏదైతే చెప్పానో అది 100% చేసి చూపిస్తాను. మీ కల నిజమవుతుంది. 

ఈ డిసెంబర్ 31 లోపే!       

ఇప్పుడు మీరు చేయాల్సింది... క్రింద నా ప్రొఫైల్ లింక్ ఉంది. క్లిక్ చేసి చదవండి. ఆ తర్వాతే, ఈ ప్రపోజల్ కు ముందుకు రండి. అప్లై చేయండి. 
  
All the best to the 10 Renegade New Artists to be selected for my Team in next 48 hours!  

Take inspired action. Countdown already started...

- Manohar Chimmani
Film Director, Writer, Blogger

Whatsapp: +91 9989578125

PS:
ఎన్నిక చేసినవారికి మేమే కాల్ చేసి చెప్తాము. మిగిలిన విషయాలు అప్పుడు మాట్లాడుకొని పూర్తి చేసుకోవచ్చు. 48 గంటల్లో మీకు మా నుంచి కాల్ రాలేదు అంటే మీరు సెలక్ట్ కానట్టు అర్థం చేసుకోవాలి. 

(మీ సర్కిల్‌లో దీంతో అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. థాంక్స్!)  

క్రౌడ్ ఫండింగ్‌తో సినిమా తీయడం ఎలా?

మీకు తెలుసా .. క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో 45 ఏళ్లక్రితమే వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సినిమాకు డైరెక్టర్ - శ్యాం బెనెగల్. 1976 లో వచ్చిన ఆ సినిమా పేరు - "మంథన్".  

కట్ చేస్తే - 

సినిమా బిజినెస్ మీద, సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం మీద ఆసక్తి ఉన్నవారికి ఒక మంచి అవకాశం "క్రౌడ్ ఫండింగ్" సిస్టమ్.  

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి భారీ సైట్స్‌తో అంతర్జాతీయంగా ఆ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సిస్టమ్ ఇంకా మన దగ్గర చాలా మందికి తెలియదు.

ఇండియాలో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ సైట్స్ కొన్ని వచ్చినా, ఇంకా అవి అంత పాపులర్ కాలేదు.  

నాకు తెలిసినంతవరకు, మన దేశంలో ఈ పధ్ధతిని అనుసరించి ఇప్పటి వరకు ఒక పది సినిమాలు తయారై వుంటాయి. 

చెప్పాలంటే - కన్నడలోనే  ఎక్కువగా క్రౌడ్ ఫండెడ్ సినిమాలు వచ్చాయి. లూసియా, తిథి, రామ రామ రే, ఆపరేషన్ అలమేలమ్మ, స్టూడెంట్స్... ఇవన్నీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కన్నడలో వచ్చిన కొన్ని సినిమాలు.

హిందీలో కూడా కొన్ని వచ్చాయి. కానీ, కన్నడలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నంత బాగా  మరే ఇతర భారతీయ భాషల ఇండస్ట్రీల్లో ఉపయోగించుకోలేకపోయారు.

తెలుగులో చాలా ప్రయత్నాలు జరిగాయి కాని, వాటిలో చాలావరకు ప్రయత్నాలు ముగింపుదాకా వెళ్లలేకపోయాయి. క్రౌడ్ ఫండింగ్  పధ్ధతిలోనే తీసామని కొందరు చెప్పే కొన్ని తెలుగు సినిమాలను టెక్నికల్ గా పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ సినిమాలు అనలేం.

తెలుగులో, నేను మాత్రం కనీసం ఒక్కటైనా క్రౌడ్ ఫండెడ్ సినిమా చేస్తాను. దీని మీద బాగా స్టడీ చేశాను, అందుకే - అంత కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. 

కట్ చేస్తే -

ఒక ప్రాజెక్ట్ కోసం ఒక్కరే మొత్తం పెట్టుబడి పెట్టకుండా - తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఎక్కువమంది షేర్‌హోల్డర్స్ కావొచ్చు. అదే క్రౌడ్ ఫండింగ్. 

ఉదాహరణకి -

అంతా కొత్తవారితో ఒక పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం తీసి, రిలీజ్ చేయడానికి ఒక కోటి రూపాయల బడ్జెట్ కావాలనుకొంటే .. ఆ మొత్తం ఒక్కరే పెట్టాల్సిన పనిలేదు.

50 మంది ఒక లక్ష చొప్పున; ఇంకో 25 మంది 2 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే అది కోటి అవుతుంది. లేదా ఓ 10 మంది 10 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. లేదా, ఒక అయిదుగురు 20 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. ఈ పధ్ధతిలో ఎవ్వరికీ పెద్ద రిస్క్ ఉండదు. 

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి క్రౌడ్ ఫండింగ్ ఒక  మంచి అవకాశం. ఎందుకంటే - మీ ఊహకి అందని విధంగా, ఎంత చిన్న పెట్టుబడితోనయినా - ఒక కో ప్రొడ్యూసర్ గా  మీరు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!

నిజంగా మీలో అంత ఆసక్తి ఉండా?

చిన్నస్థాయిలో  అయినా సరే, వెంటనే పెట్టుబడి పెట్టగలరా? 

త్వరలో ఓటీటీ కోసం నేను తీయబోతున్న కొత్త సినిమాలకు, ఈ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. బడ్జెట్ ఎంత కావాలి, గైడ్ లైన్స్ ఏంటి... నేను చెప్తాను. 

అనుభవం ఉండి, బాగా సమర్థులైన మీడియేటర్లకు కూడా ఇదో మంచి బిజినెస్ అవకాశం. 

కట్ చేస్తే - 

కొత్తగా నేను పరిచయం చేయాలనుకొంటున్న కొందరు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కూడా ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టం ద్వారా కొంతయినా, ఎంతయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా, వారి తరపున ఎవరితోనయినా ఇన్వెస్ట్ చేయించవచ్చు.

మీరు భయపడేంత పెద్దమొత్తమేం కాదు. అతి చిన్న బడ్జెట్‌లోనే, ఒక ఫీచర్ ఫిలిం, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో కూడా ప్లాన్ చేస్తున్నాను.

నిజంగా దీనిపట్ల ఆసక్తి వుండి, వెంటనే ఇన్వెస్ట్ చేయడానికిగాని, చేయించడానికి గాని రెడీగా ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.  


అన్నిటికీ లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు, మీలోనే ఎవరైనా ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ క్రౌడ్ ఫండింగ్ సక్సెస్ చేయవచ్చు. 

విన్-విన్ అన్నమాట!  

నిజంగా ఈవైపు ఆసక్తివున్నవారు వాట్సాప్ ద్వారా నన్ను కనెక్ట్ అవండి. వివరంగా చర్చిద్దాం. నా వాట్సాప్: +91 9989578125.