Sunday 12 July 2020

సినిమా ఇప్పుడు 'ఇండస్ట్రీ' కాదు!

యస్. ఇప్పుడు సినిమా ఫీల్డు పూర్తిగా మారిపోయింది. ఒక వ్యవస్థగా ఫిల్మ్ ఇండస్ట్రీ పరిధి తగ్గింది. క్రమంగా ఇంకా తగ్గుతుంది.
.
సినిమా అంటే 2 గంటలు, 3 గంటలు అనే రోజులు కూడా పోయాయి. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కూడా బాగా డబ్బు సంపాదిస్తాడు.

షార్ట్ ఫిల్మ్స్ తీయడం కూడా అంత చిన్న విషయమేం కాదక్కడ.

ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు ప్రతి సినిమా ఫార్మాట్‌కు విలువ ఉంటుంది. సినిమా రిలీజ్ చేసుకోవడానికి, ఇక్కడిలా "మాకు థియేటర్స్ దొరకటం లేదు, ఇవ్వటం లేదు" అని ఎవ్వరూ మొత్తుకోరు.
.
ఎందుకంటే, అక్కడ దేన్నయినా "నెట్‌ఫ్లిక్స్" ,"వీమియో" వంటి OTTల్లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ డెవలప్‌మెంట్ అమెరికా, ఇంక అనేక అభివృధ్ధిచెందిన దేశాల్లో దాదాపు ఒక 20 ఏళ్ల ముందునుంచే ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడో 1997 లో వచ్చింది. వీమియో 2004 లోనే ఉంది. అమెజాన్ ప్రైమ్ 2005 నుంచి ఉంది. మనదగ్గర మాత్రం వీటి గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది.
.
ముఖ్యంగా ఎలాంటి ఖర్చులేకుండా సినిమాలు ఈ OTTల్లో రిలీజ్ చేసుకోవచ్చు అన్న విషయం మనం రియలైజ్ కావడానికి కరోనా లాక్‌డౌన్ రావాల్సి వచ్చింది!
.
స్టార్స్ భారీ సినిమాలు, ఏవైనా ఆడియో విజువల్ వండర్స్ తప్పిస్తే, ఇకనుంచి ఎక్కువ శాతం ప్రేక్షకులు OTT/ATT లకే ప్రాధాన్యం ఇస్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో... సగటు మనిషి జీవనశైలి, ఆలోచనా విధానం, జీవితం పట్ల అవగాహన ఇప్పుడు పూర్తిగా మారిపోతాయి. చాలా విషయాల్లో సమయానికి ప్రాధాన్యం ఇస్తారు.

సగటు మనిషే సగటు ప్రేక్షకుడు!
.
ఈ నేపథ్యంలో, ఆల్రెడీ సినీఫీల్డులో పనిచేస్తున్నవారికి కూడా అందరిలాగే, ఈ లాక్‌డౌన్ వరకు కష్టనష్టాలు తప్పవు. లాక్‌డౌన్ తర్వాత మాత్రం, ఇంతకుముందుకంటే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. కొత్తగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది.

క్రియేటర్స్‌కు ఆకాశమే హద్దు!

గ్లామర్, పేరు, డబ్బు... ఏదయినా.
.
సో, సినిమాఫీల్డు ఇప్పుడు ఇండస్ట్రీ కాదు. ఒక క్రియేటివ్ కార్పొరేట్ బిజినెస్. ఎవరైనా ఈ రంగాన్ని ఎన్నుకోవచ్చు. పనిచేయవచ్చు. తమలో ఉన్న ప్రతిభను బట్టి ఏ స్థాయికైనా ఎదగొచ్చు.