Friday 3 July 2020

2020, ఆ తర్వాత కూడా... ఇక అంతా ఓటీటీనే!

పీవీఆర్ లాంటి కొన్ని మల్టీప్లెక్స్‌లను ఆగస్ట్, సెప్టెంబర్‌లలో తెరిచే అవకాశం ఉందన్నట్టు వినిపిస్తోంది. అది నిజమే అయి, థియేటర్స్‌ను తెరిచే ఈ ప్రయోగం సక్సెస్ అయినప్పుడే అన్ని థియేటర్స్‌ను తెరిచే ధైర్యం చేస్తారు. అప్పటిదాకా థియేటర్స్ తెరిచే ప్రసక్తే లేదు.

2020 మొత్తంగా పోయినట్టే అని సినిమా ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోయింది.

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఏ ఒక్క నిర్మాత కూడా ఇంతవరకు షూటింగ్ ప్రారంభించలేదు. కారణం... కరోనా.

టీమ్‌లో ఉండే ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా మొత్తం కొంప కొల్లేరైపోతుంది. జరక్కూడని ప్రమాదం ఏ ఒక్క ఆర్టిస్టు, లేదా టెక్నీషియన్‌కు జరిగినా, ఆ నష్టం నిర్మాత భరించాల్సి వస్తుంది. ఇన్ని టెన్షన్ల మధ్య షూటింగ్ ఎందుకు అని ఎవ్వరూ షూటింగ్ జోలికి పోవటంలేదు.

2020 ని చాలామంది చాలారకాలుగా విజువలైజ్ చేశారు. కాని, ప్రపంచం అంతా ఇలా మూసుకొని కూర్చునేలా చేసిన ఈ కరోనావైరస్‌ను మాత్రం ఎవ్వరూ విజువలైజ్ చెయ్యలేకపోయారు!

కట్ చేస్తే -

కరోనావైరస్‌ను, లాక్‌డౌన్‌ను బాగా వాడుకొంటూ, సీరీస్ ఆఫ్ సినిమాలు తీస్తూ, కోట్లు కొల్లగొడుతున్న ఆర్జీవీ ఒక్కని విషయంలో మాత్రమే పైన చెప్పుకొన్న పరిస్థితులేవీ ఎలాంటి అడ్డంకులను సృష్టించలేకపోతున్నాయన్న విషయం మనం గమనించాలి.

"వందల కోట్లు పెట్టి తీసే పెద్ద సినిమాల విషయంలో OTT (Over The Top) లు అసలు వర్క్ఔట్ కావు... వాళ్లు థియేటర్స్ తెరిచేవరకు ఆగక తప్పదు" అంటున్నారు. కాని, మొన్ననే బిగ్‌బి అమితాబ్ సినిమా ఒకటి ఓటీటీలోనే రిలీజయ్యింది. రేపు అక్షయ్ కుమార్ సినిమా ఒకటి ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇంకేం వర్క్ ఔట్ కావాలి?! ఆ విషయం అలా వదిలేద్దాం...

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ ఓటీటీలు బాగా పనిచేస్తాయి. బాగా వర్క్ ఔట్ అవుతాయి.

OTT లు కాస్తా ఇప్పుడు ATT (Any Time Theater) లయ్యాయి. Pay per View (PPV) పధ్ధతిలో చిన్న బడ్జెట్ సినిమాలన్నీ హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు. శుక్ర, శని, ఆదివారాలు... అంటే కేవలం 3 రోజుల్లో సినిమా రిలీజ్ కావడం, మొత్తం లెక్కలు సెటిల్ చేసుకోవడం అయిపోతుంది. మార్కెట్ బాగా స్టడీ చేస్తూ, కరెక్ట్ కంటెంట్ తయారుచేయగలిగే ప్రతి ఒక్కరు ఈ ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవడం ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు.

అసలు బడ్జెట్ లేకుండా తీసిన "నేకెడ్" 80 లక్షలు కలెక్ట్ చేసింది. అంతకు ముందు "క్లైమాక్స్" కేవలం కొన్ని గంటల్లో కోటీ డెభ్భై లక్షలు కలెక్ట్ చేసింది.

That's RGV Vision! 

కట్ చేస్తే -

ఇప్పుడు ఫీల్డులో ఉన్న ఓటీటీలతోపాటు ఇంకో అరడజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఎన్ని సినిమాలు తయారయినా, రిలీజ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి పబ్లిసిటీ ఖర్చులు, రిలీజ్ ఖర్చులు ఉండవు.

ఈ నేపథ్యంలో, ప్యూర్‌లీ ఒక బిజినెస్‌గా, సీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ సినిమాలను ఇప్పుడు నేను రూపొందించేపనిలో నా టీమ్‌తో బిజీగా ఉన్నాను. ఈ ఓటీటీ టైమ్స్‌లో ఎంతయినా సంపాదించుకొనే అవకాశం బాగా ఉంది.

Content is the king! 

ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.

Ping me on my WhatsApp: +91 9989578125