Monday, 29 June 2020

Prologue to Mr X

మిస్టర్ ఎక్స్...

చాలారోజుల తర్వాత నేను కథ రాశాను. మ్యాగజైన్లో ప్రింట్‌లో చూసుకున్నాను!

'పాలపిట్ట' జూన్ సంచికలో వచ్చిన నా కథను, నా వ్రాతల్ని ఇష్టపడే కొందరికోసం నా బ్లాగ్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.

తెలుగులో దాదాపు అన్ని వీక్లీలు, మంత్లీలు మూతపడ్డాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న ఏకైక సాహిత్య పత్రిక "పాలపిట్ట".

లాక్‌డౌన్ టైమ్‌లో లైఫ్ మరీ ఇంత డల్‌గా ఉండకూడదని చాలా పెద్ద గ్యాప్ తర్వాత ఒక షార్ట్ స్టోరీ రాశాను. 'సరసమైన కథ' లా  ముందు హాట్‌గానే  ప్రారంభించాను కాని, తర్వాత పూర్తిగా సెంటిమెంటల్‌గా రాశాను. ఫీల్‌లో కొట్టుకుపోయాను.

కథ చదువుతుంటే పాఠకులకు ఇది రచయిత సొంతకథేమో అనిపించవచ్చు, కాని కాదు. This is just a story. It's been written in a non stop flow and in a single sitting. రష్యన్ భాషలో పవ్‌స్తోవ్‌స్కీ అనే నా అభిమాన రచయిత స్టయిల్లో రాశాను.

"మనిషి జీవితం అనేది కొన్ని మధురానుభూతుల సమాహారం. మిగిలిందంతా రొటీన్ BS". ఈ నేపథ్యంలో చదవగలిగినప్పుడే మీకీ కథ నచ్చుతుంది. లేదంటే నచ్చదు.

- with ❤️
Manohar Chimmani