Wednesday 24 June 2020

OTT వల్ల సినిమారంగంలో రాబోతున్న 10 భారీ మార్పులు

1. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, శ్రేయాస్ ఈటీ... వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల సినిమాల రిలీజ్‌లకు ఇకమీదట ఎలాంటి సమస్య ఉండదు. ఒకేరోజు ఎన్ని సినిమాలైనా రిలీజ్ చేసుకోవచ్చు.

2. చిన్న సినిమాల నిర్మాత "మాకు రెంటు కట్టినా థియేటర్స్ ఇవ్వట్లేదు" అని ఎక్కడా చెప్పుకొనే అవకాశం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. సినిమాలో సత్తా ఉంటే డబ్బులొస్తాయి.

3. నెలలుగా కొనసాగుతున్న ఈ లాక్‌డౌన్ ఎఫెక్టు వల్ల ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవనశైలిలో, ఆలోచనావిధానంలో ఎన్నోమార్పులు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా థియేటర్‌కు వెళ్లకుండా ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులు రేపు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు కూడా బయటకువెళ్లి థియేటర్లో సినిమా చూడటానికి ఆలోచిస్తారు. అదేదో భారీ ఆడియో విజువల్ వండర్ అయితే తప్ప, సినిమాను థియేటర్లోనే చూడాలన్న కరోనా ముందటి ఆలోచనావిధానానికి గుడ్‌బై చెప్తారు. 

4. పై భారీ మార్పు కారణంగా సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోతాయి. ఫలితంగా, మేకింగ్ బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్ భారీగా తగ్గకతప్పదు. అయితే, ఈ భారీ సినిమాల విషయంలో, టికెట్ రేట్స్ భారీగా పెట్టడం ద్వారా మాత్రమే ఓటీటీలో కూడా భారీగా సంపాదించుకొనే అవకాశం ఉంటుంది.

5. అంతకు ముందు "మీ సినిమా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రిలీజయ్యిందా?" అని అడిగేవాళ్లు. ఇప్పుడు "మీ సినిమా ఓటీటీలో రిలీజయ్యిందా?" అని అడుగుతారు!

6. మొన్న ఆర్జీవీ "క్లైమాక్స్" రిలీజ్‌కి ఏకంగా ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభమయింది. ఇప్పుడు ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొత్తగా ఒక డజన్ అయినా మార్కెట్లోకి వస్తాయి. 

7. చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఇదొక గోల్డెన్ అపార్చునిటీ. కంటెంట్‌లో సత్త ఉండే సినిమాలను, ప్రేక్షకులను ఓటీటీ దగ్గరికి రప్పించే సినిమాలను తీయగలిగే దర్శకులకు చేతినిండా పని ఉంటుంది.   

8. లిటరల్లీ నెలకో సినిమా తీసి రిలీజ్ చేయగలిగే సత్తా ఉన్నవాళ్లకు ఓటీటీ నిజంగా ఒక గోల్డ్ మైన్.

9. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకొనే సినిమాలను తీయగలిగే దర్శకులకు మంచి గిరాకీ ఉంటుంది. 

10. ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కొత్తగా లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది.

కట్ చేస్తే -

ఈ లాక్‌డౌన్ ఇంకాస్త ఫ్రీ అయినవెంటనే నా కొత్త సినిమా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాను. ఈవైపు ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ చిన్న ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు: WhatsApp: +91 9989578125

పి ఎస్: ఓటీటీలో ఆర్జీవీ "క్లైమాక్స్" కేవలం 4 గంటల్లో 1.6 కోట్లు కలెక్ట్ చేసింది!