Monday 15 June 2020

శుద్ధ్ దేశీ రొమాన్స్!

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌కు ముందు కొద్దిరోజుల క్రితమే అతని మేనేజర్ ఎందుకు సూసైడ్ చేసుకుంది?

సుశాంత్ సూసైడ్‌కు కొద్దిరోజుల క్రితమే అతని ప్రేయసితో బ్రేకప్ ఎందుకు అయింది?

రెండ్రోజుల క్రితమే తన బ్యాంక్ అకౌంట్ నుంచి సుశాంత్ భారీమొత్తంలో డబ్బు ఎందుకు డ్రా చేశాడు?

సుశాంత్ సూసైడ్ వెనుక ఇంకేదో క్రైమ్ కోణం ఉందేమో అనిపిస్తుంది నాకు.

దిల్ బేచారా...

కట్ చేస్తే -   

పోయిన తర్వాత అందరూ షాక్ అవుతారు. అది మామూలుగా జరిగేదే.

ఇండస్ట్రీవాళ్లు, బయటవాళ్లు, ప్రెస్... సుశాంత్ ఇట్లా, సుశాంత్ అట్లా అని అంతా ఒక టెంప్లేట్ ప్రకారం అన్నీ చెబుతుంటారు.

ఆరైపీలకు, మిస్‌యూలకు లెక్కే ఉండదు. 

కాని, పాయింట్ అది కాదు.

ఈ ఆరైపీలు పెట్టినవాళ్లలో, మిస్‌యూలు రాసినవాళ్లలో ఎంతమంది తమచుట్టూ ఉన్న తమ దగ్గరివారిలో, మిత్రుల్లో ఈ డిప్రెషన్‌ను గుర్తించగలుగుతున్నారు? గుర్తించినా, ఎంతమంది వారు బ్రతికుండగానే వారికేదైనా భరోసా ఇవ్వగలుగుతున్నారు?

పోయిన తర్వాత ఆరైపీలు, మిస్‌యూలు కాదు... మనచుట్టూ ఉన్న మనవారిలో, మిత్రుల్లో, ఇరుగుపొరుగుల్లో కూడా ఎవరికైనా ఒక చిన్న మాట అవసరమేమో గమనించాలి. వారింకేదైనా చెప్పాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఒక్క పది నిమిషాలు ధైర్యం చెప్పాల్సిన అవసరమున్నదేమో చూడాలి. ఆ పని చేసెయ్యాలి.

బ్రతుకు విలువ తెలియచెప్పాలి. 

బ్రతికున్నప్పుడే వారు మిస్ కాకుండా చూసుకోవాలి.

I hate R I P...