Wednesday 6 May 2020

ప్లేబాయ్‌ని కూడా వదలని కరోనా!

66 సంవత్సరాలుగా నాన్‌స్టాప్‌గా వస్తున్న అమెరికన్ లైఫ్‌స్టైల్ & ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ 'ప్లేబాయ్' కరోనా దెబ్బకు టోటల్‌గా తన రూపమే మార్చుకొంది!

ప్రస్తుతమున్న కరోనా విపత్తు నేపథ్యంలో... సమయానికి మ్యాగజైన్‌ను ప్రింట్ చేయలేక, మొత్తంగా ప్రింట్‌కే గుడ్‌బై చెప్పారు ప్లేబాయ్ పబ్లిషర్స్.

ఇకనుంచీ ప్లేబాయ్ డిగిటల్ మ్యాగజైన్.

ఈ మ్యాగజైన్ ఇప్పుడు నేరుగా తమ చందాదారులకు ఆన్‌లైన్ ద్వారా అందుతుంది.

1953లో షికాగోలో ఈ మ్యాగజైన్ ప్రారంభించడానికి, దీని ఎడిటర్-పబ్లిషర్ హ్యూ హెఫ్‌నర్ తన తల్లి దగ్గర తీసుకున్న అప్పు 1000 డాలర్లు. ఇప్పుడు మొత్తంగా ప్లేబాయ్ మ్యాగజైన్ ఎంటర్‌ప్రైజెస్ సామ్రాజ్యం విలువ 3 బిలియన్ల డాలర్లు!

విస్తరించే ఉద్దేశ్యం, సామర్థ్యం ఉండాలేగాని... ఒక సక్సెస్‌ఫుల్ మ్యాగజైన్ పవర్ అలా ఉంటుంది.

ఇంగ్లిష్‌లో ప్రారంభమై, పలు ముఖ్యమైన ప్రపంచ భాషల్లో వస్తూ, ఈమధ్యే ఇజ్రాయల్ పాఠకుల కోసం హిబ్రూలో కూడా వస్తోంది ప్లేబాయ్. ప్లేబాయ్ పేరుతో ఇంకెన్నొ లైఫ్‌స్తైల్ ప్రొడక్టులకు లైసెన్సింగ్ ఇవ్వడం ద్వారా కూడా ప్లేబాయ్ గ్రూప్‌కు ఎంతో ఆదాయం వస్తోంది.

ప్లేబాయ్ ఏదో చీప్ మ్యాగజైన్ కాదు. పైన కవర్ పేజీ, లోపల ఓ నాలుగయిదు పేజీల్లో కొంత న్యూడిటీ తప్పిస్తే... ఇదొక మంచి 'ఎలైట్' లైఫ్‌స్టైల్ మ్యాగజైన్. దీని పాఠకులంతా కూడా బాగా చదువుకున్న ప్రొఫెషనల్స్, సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనించాలి.

ప్లేబాయ్ ప్రతి ఇష్యూలో వివిధరంగాలపైన, జీవనశైలిపైన అత్యుత్తమస్థాయి ఆర్టికిల్స్ ఉంటాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు, బిజినెస్‌మెన్, నాటక రచయితలు, పొలిటీషియన్స్, అథ్లెట్స్ మొదలైనవారిలో ఎవరిదో ఒకరి ఇంటర్వ్యూ చాలా ఇన్స్‌పైరింగ్‌గా ఉంటుంది.

ప్లేబాయ్‌లో ఆర్థర్ సి క్లార్క్, అయాన్ ఫ్లెమింగ్, పి జి వోడ్‌హౌజ్, హరుకి మురకామి వంటి ప్రపంచస్థాయి రచయితల షార్ట్ స్టోరీలు కూడా అచ్చయ్యాయంటే ఈ మ్యాగజైన్ స్థాయిని ఊహించవచ్చు.

కట్ చేస్తే - 

2016 లో ప్లేబాయ్‌లో న్యూడిటీని ప్రయోగాత్మకంగా ఒక సంవత్సరం దూరం పెట్టిచూశారు. పాఠకులు ససేమిరా ఒప్పుకోలేదు. మళ్లీ ఏప్రిల్ 2017 నుంచి ప్లేబాయ్ మార్కు న్యూడిటీని మ్యాగజైన్‌లో రీ-ఇంట్రొడ్యూస్ చెయ్యక తప్పలేదు.

కరోనా పుణ్యమా అని ఇకనుంచీ ప్లేబాయ్ మార్క్ న్యూడిటీకి పేపర్ స్పర్శ ఉండదు. అంతా డిజిటల్ టచ్...