Monday 27 April 2020

జల దృశ్యం నుంచి, సుజల దృశ్యం దాకా...‬

సక్సెస్‌సైన్స్ పాయింటాఫ్ వ్యూలో... మనం ఇప్పటివరకూ ఎంతోమంది ప్రపంచస్థాయి నాయకుల సక్సెస్‌స్టొరీలను గురించి విన్నాము, పుస్తకాల్లో చదివాము, సినిమాలుగా చూశాము.

మన కళ్లముందు మనం చూసిన ఆస్థాయి సక్సెస్‌స్టోరీ... కేసీఆర్. 

19 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన రోజు, ప్రాణాలకు తెగించి యుధ్ధభూమిలోకి దిగిన ఒక సంకల్పశక్తిగా... 

19 ఏళ్ల తర్వాత, ఈరోజు... తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ స్వాప్నికుడిగా, ఆ దిశలో రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిగా...

ఇప్పుడు, ఈ క్షణం... ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 నుంచి తెలంగాణ ప్రజలను కాపాడటం కోసం అనుక్షణం తన టీమ్‌తో కలిసి సమీక్షలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ, పనులు చేయిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు-కేంద్రానికి కూడా చాలా విషయాల్లో మార్గదర్శకమవుతూ, రాష్ట్రంలోని ప్రజలందరి ప్రాణాలకు భరోసా ఇస్తూ, ఒక పెద్దన్నగా...

నా కళ్ళముందు, నేను చూసిన ఒక ప్రపంచస్థాయి విజయగాథ... కేసీఆర్.

ఉద్యమసమయంలో ఒక్క రక్తపుచుక్క చిందకుండా లక్ష్యం సాధించడం అంత సామాన్యమైన విషయం కాదు.

రాష్ట్ర విభజన అనంతరం కూడా... రెండు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహం, ఆత్మీయ సౌరభాలే తప్ప, మరొక భావం కించిత్తైనా రావడానికి వీల్లేని పాలన అందించడం కూడా అసామాన్యమే.

ఈ రెండింటి విషయంలో ఆయన ముందే చెప్పాడు. చెప్పినవిధంగా ఆ మాట నిలబెట్టుకున్నాడు.

అంధకారమవుతుంది అన్నచోటే 24 గంటల కరెంటు ఇచ్చాడు.

వ్యవసాయం తెలియదు అన్నచోటే, "రైస్ బౌల్ ఆఫ్ ఇండియా" స్థాయికి పంట దిగుబడిని సాధించి చూపించాడు.

ప్రాజెక్టులు అంటే, కనీసం 10-15 ఏళ్లు అన్నది ఒక మామూలు విషయమైన ఈ దేశంలో, ఒక అత్యుత్తమస్థాయి వండర్ ప్రాజెక్టు 'కాళేశ్వరం'ను కేవలం నాలుగున్నరేళ్లలో పూర్తిచేసి చూపించాడు.

లిటరల్లీ, ఇలాంటి ఒక 100 అసాధారణ విజయాలను గురించి నేను తడుముకోకుండా చెప్పగలను.

దటీజ్ కేసీఆర్. 

కట్ చేస్తే -  

కేసీఆర్ స్థాపించిన టీఆరెస్ పార్టీ నేడు 20వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా...పార్టీ శ్రేణులకు, వివిధస్థాయిల్లోని పార్టీ నాయకులందరికీ... కేసీఆర్ గారికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

"When Politics Decide Your Future, Decide What Your Politics Should Be!"
- KTR, Hon Min & TRS Working President