Tuesday 7 April 2020

Age is Just a Number !!

ఈమధ్యే ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి హిట్ చేసి చూపించిన మణిరత్నం వయస్సు 63.

ఇప్పుడు "వెస్ట్ సైడ్ స్టోరీ" చేస్తున్న స్టీవెన్ స్పీల్‌బర్గ్ 73 లో ఉన్నారు.

2025 దాకా "అవతార్" 2, 3, 4 లను ప్లాన్ చేసుకొని, ఆ క్రియేటివ్ బిజీలో మునిగితేలుతూ  ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 65.

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా  యాంగిల్స్‌లో షాట్స్ పెడుతూ, ఇప్పుడు "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీస్తున్నాడు. అతనికిప్పుడు 57.

సో వాట్?!

నాగార్జునకు 60, చిరంజీవికి 64 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు?

Age is just a number...

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్.

నలభై దాటిన డైరెక్టర్స్‌తో నేను పనిచేయను అని ఎవరో యంగ్ హీరో అన్నారంటే నవ్వుకోక ఏం చేస్తాం... "కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృధ్ధులు" అని ఎప్పుడో నిర్ధారించేసిన శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకోవడం తప్ప. 

కట్ చేస్తే - 

పూర్తిగా వరంగల్/వైజాగ్ నేపథ్యంలో నేను ప్లాన్ చేస్తున్న నా కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ సెట్ అయ్యాక, ఏ ఏప్రిల్ చివర్లోనో నేనీ బ్లాగ్ ప్రారంభిద్దామనుకొన్నాను.

మధ్యలో కరోనా వైరస్ ఎంటరైంది.

"హోమ్ స్టే" లో కావల్సినంత టైమ్, అంతకు మించిన టెన్షన్, కన్‌ఫ్యూజన్... ఇట్లా ఇంకెంత కాలం అని...

వేరే ఏం ఆలోచించకుండా, ఇంటిదగ్గరుండి నేను చేయగలిగిన అన్ని పనులూ ఒకేసారి మొదలెట్టాను. అలా నిన్న రాత్రి అప్పటికప్పుడు క్రియేట్ చేసిన బ్లాగ్ ఇది.

బ్లాగింగ్... నాకో ఎడిక్షన్ లాంటిది.

ఈ బ్లాగ్‌లో నేను రాసే ప్రతి పోస్టు ఒక ప్రాక్టికల్ రియాలిటీ రూపంలో ఉంటుంది. నా అనుభవాలుంటాయి. ఇండస్ట్రీలోని ఇంకెందరివో అనుభవాలుంటాయి.

అవన్నీ కూడా సరదాగా లైటర్‌వీన్‌లో చిన్న చిన్న టిడ్‌బిట్స్ సైజులో రాసేవే.

అయితే - కొత్తగా ఫీల్డులోకి ప్రవేశించేవారికి మాత్రం తప్పక ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడాలన్నదే నా ఉద్దేశ్యం.

In times of emotional challenges, how you respond is everything. It not only impacts your personal life, it demonstrates how you show up as a person as well.
^^^^^

(Written and posted on 1 April 2020, on my new blog. Re-posted here.)