Sunday 5 January 2020

"క్రౌడ్ ఫండింగ్" మనదగ్గర ఎందుకు సక్సెస్ కాదు? - CF3

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నో సైట్స్ - అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఎంతో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందరి ప్రాజెక్టులకో ఊహించని స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాయి.

మనదగ్గర ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు  కనీసం ఒక్కటంటే ఒక్క సైట్ కూడా పైన నేను చెప్పిన రెండి సైట్స్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. 

చాలా సైట్స్  తుస్సుమన్నాయి. దీనికి కారణాలు అనేకం.

అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో - క్రౌడ్‌ఫండింగ్ సైట్స్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డబ్బు వెనక్కిరాదు. ఉదాహరణకు నేను చెప్పిన ఇండీగోగో, కిక్‌స్టార్టర్ సైట్స్ చూడండి. మీకే అర్థమయిపోతుంది. (ఇక్కడ ప్రాజెక్ట్ అంటే సినిమా అనే కాదు. ఏ ప్రాజెక్టయినా కావొచ్చు.)

సినిమా ప్రాజెక్ట్ అయితే - కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు డివిడిలు, టీషర్ట్స్, క్యాప్స్, ఆటోగ్రాఫ్ చేసిన వస్తువులు, ప్రీమియర్‌కు ఉచిత ఆహ్వానం, టీమ్‌తో ఒకపూట డిన్నర్!

అక్కడ ఇవే .. ఎంత ఇన్వెస్ట్ చేసినవాళ్లకయినా తిరిగి వచ్చేవి.

టాప్ రేంజ్‌లో కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తారు. అంతే. అంతకు మించి ఏదీ ఉండదు.

ఇదంతా అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్యదేశాల్లో అలవాటు. ఇదే అక్కడి పధ్ధతి.

అదిక్కడ మన దేశంలో ఎంతమాత్రం కుదరని పని. ముఖ్యంగా మన సెటప్‌లో.

వాటిల్లో కొన్ని కారణాలు :

> మనవాళ్లు రూపాయి పెట్టుబడి పెడితే తెల్లవారే 100 రూపాయలు రావాలనుకుంటారు.

> ఎదుటివారిలోని క్రియేటివ్ ప్యాషన్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వీరికి కనిపించదు, లేదు. మన మైండ్‌సెట్స్ అలాంటివి. తప్పేం లేదు.

> ఇంకెవరయినా ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెడుతున్నా వద్దని వారిస్తారు. అవసరమయితే, అదే డబ్బుతో ఏ లిటిగేషన్ ఉన్న ల్యాండుకో అడ్వాన్స్ ఇప్పిస్తారు.

> ఎవరయినా మహానుభావుడు మంచి ఉద్దేశ్యంతో కొంత పెట్టుబడి పెట్టినా, ఆ మొత్తం ప్రాజెక్టును ఎట్లా చెడగొడతామా అని అలోచిస్తారు. అంత పని చేస్తారు కూడా.

> అన్నింటికంటే ముందు.. "అసలు నువ్వు మా డబ్బులు పట్టుకుని ఉడాయిస్తే!?".. అన్న డౌట్ వీళ్లని వెంటాడి వేధిస్తుంది.

> మన దగ్గర డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరికీ కథ చెప్పాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చాలి. క్రౌడ్ ఫండింగ్ కి కనీసం ఒక 100 మంది అయినా అవసరం. అలాంటప్పుడు.. ఏ ఒక్క కథయినా ఆ 100 మందిలో అందరికీ నచ్చుతుందా?

ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు..

జస్ట్ ఈ సైట్స్‌ని విజిట్ చేయండి సరదాకి. బయట ఏం జరుగుతోందీ.. మనం ఎక్కడున్నామో.. ఒక ఐడియా వస్తుంది. ఆ అయిడియా మనలో కొందరికయినా అవసరమని నా ఉద్దేశ్యం.

సినిమాలు తీయడం ఒక్కటే కాదు.. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంకెన్నో కూడా సాధించొచ్చు. అదికూడా మనలో చాలామందికి తెలియాలి. ఎవరు ఏదయినా సాధించొచ్చు..

చెప్పలేం.. మనవాళ్లలోనూ ఉన్నారు మార్క్ జకెర్‌బర్గ్‌లు! 
^^^^^^

మీలో /మీకు తెలిసిన వారిలో , అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో  సినీ ఫీల్డులోకి  ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా నన్ను సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది: mchimmani@gmail.com