ఏ పనీపాటా లేనివాడైనా సరే, సొషల్మీడియాలో రోజుకు ఒక పది పోస్టులు/ట్వీట్లు పెట్టొచ్చు. అతికష్టం మీద ఓ నాలుగైదు కామెంట్లు చెయ్యొచ్చు.
అంతకు మించి చెయ్యటం అనేది చాలా బోరింగ్. చాలా కష్టం.
కానీ, మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో, ఉన్నట్టుండి ఒక పేరుతో పోస్టులు/ట్వీట్లు రోజుకి వందల్లో కనిపించాయి నాకు.
నిజంగా వందల్లోనే!
బాగా ఆశ్చర్యపోయాను.
అదే పని చెయ్యమని ఓ లక్షరూపాయల జీతమిచ్చి పెట్టుకున్నా .. అంత సిన్సియర్‌గా, అంత వేగంగా, అంత అర్థవంతంగా, అన్ని వందల పోస్టులు/ట్వీట్లు పెట్టేపని ఎవ్వరూ చెయ్యరు, చెయ్యలేరు.
అసలెవరితను అని ప్రొఫైల్ చూశాను.
ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. లండన్ టెక్‌మహీంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్.
మరింత క్యూరియాసిటీ పెంచాడతను ...
ఇతనికి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, ఇంకెవరైనాగాని .. లేదా టీఆరెస్ పార్టీగాని డబ్బేమీ ఇవ్వటంలేదు. మంచి జాబ్‌లో లండన్‌లో ఉన్నాడు. అసలెందుకింత కష్టపడుతున్నాడు? ఇంత భారీ సంఖ్యలో సోషల్‌మీడియాలో పోస్టులు/ట్వీట్లు ఎలా పెడుతున్నాడు? పైగా వాటిల్లో కనీసం ఓ 10 శాతం పోస్టులు/ట్వీట్లకు ఫోటోలు, కాప్షన్స్ వగైరాలతో ఫోటోషాప్ డిజైన్స్ కూడా!
కట్ చేస్తే -
తర్వాత కొన్నిరోజులకు .. ఒకసారి అనుకోకుండా ట్విట్టర్ ఇన్‌బాక్స్‌లో పలకరించుకొన్నాం. ఇంకో రెండుసార్లు ట్విట్టర్లో రెండుమూడు నిమిషాలకు మించని చాట్ చేశాం.
మొత్తం పిక్చర్ నాకప్పుడు తెలిసింది ...
ఆమధ్య నేనొక బ్లాగ్ రాశాను, "సోషల్‌మీడియా సైన్యం .. కేసీఆర్ కోసం" అని.
అలాంటి సైనికుడితను.
సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.
తండ్రి తిరుపతయ్య 'స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ఎన్ ఎమ్ డి సి' పాల్వంచలో రిటైరయ్యారు. తల్లి లింగమ్మ గృహిణి.
క్రమశిక్షణ, పొదుపు, అందరితో బాగుండటం అనేది తల్లిదండ్రుల నుంచే వచ్చింది. ఒక మనిషి ఉన్నంతలో సుఖంగా బ్రతకాలంటే ఈ మూడే ముఖ్యం. వీటిల్లో ఏ ఒక్కటి బాగాలేకపోయినా మిగిలిన రెండు సరిగ్గా ఉండవు.
ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకెదిగినా మన మూలాలు మర్చిపోకూడదు. అలా ఉన్నప్పుడే సాటిమనిషిపట్ల ప్రేమ, మానవత్వం అనేవి కూడా అతి సహజంగా మనలో ఎప్పుడూ బ్రతికే ఉంటాయి.
అలాంటి నేలమీదుండే మనిషితను.
భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది.
వాళ్ళిద్దరికీ ఒక పాప - వైష్ణవి.
ఆల్ హాపీస్ ...
ఇప్పుడు చేస్తున్న ఐటి ఉద్యోగంతోపాటు, NRI TRS UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడితను.
ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, రెండోసారి ఎన్నికల్లో టీఆరెస్ అద్భుత విజయం ..
ఈ రెండూ అతనెన్నడూ మర్చిపోలేని అద్భుత జ్ఞాపకాలు.
ఎక్కువగా లండన్‌లోనే ఉండటంవల్ల కేసీఆర్ గారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాలేదు. కానీ .. ఏదో ఒకరోజు, ఆరోజు కూడా వస్తుందని అతని నమ్మకం.
ఇంట్లో రాజకీయ నేపథ్యం అసలు లేకపోయినా, చిన్నప్పటినుంచే రాజకీయాలపట్ల, రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చదవడంపట్ల ఏర్పడిన ఆసక్తి ఇప్పటికీ ఇతనిలో కొనసాగుతోంది.
ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమ చరిత్ర, 2001 లో కేసీఆర్ TRS స్థాపన, కేసీఆర్ ఉపన్యాసాలు ఇతన్ని బాగా ఇన్స్పైర్ చేశాయి.
వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకెళ్లినపుడు .. అక్కడ ఎప్పుడూ కనిపించే కూలిపోయిన గోడలు, ఎండిపోయిన చెరువులు, అక్కడి పేదరికం, వెనుకబాటుతనం కూడా ఇతన్ని బాగా కదిలించేవి.
వీటన్నిటి ఇన్స్స్పిరేషనే .. అనుక్షణం .. తను పుట్టిన తెలంగాణ కోసం తనకు చేతనయింది ఏదయినా చేయాలనిపించేలా చేస్తోంది.
ఆ నిరంతర తపనే అతనిచేత సోషల్‌మీడియాలో రోజూ ఇన్ని వందల పోస్టులు/ట్వీట్లు పెట్టేలా చేస్తోంది.
ఎవరో చెప్పారనో, ఏదో పేరు కోసమో కాదు .. అచ్చంగా తెలంగాణకోసం, ఆ తెలంగాణను సాధించిన కేసీఆర్ కోసం, స్వచ్చందంగా పోరాడే సైనికుడితను.
ఇతని పేరు భువనగిరి నవీన్.
ఇతని నిరంతర గానం .. తెలంగాణం.

Wow!!! Congratulations my loving Bro.
ReplyDeleteCongrats Bro
ReplyDeleteCongrats Bro.
ReplyDeleteCongratulations bavagaru
ReplyDeleteCongratulations Naveen
ReplyDeleteCongratulations bava
ReplyDeleteCongratulations bava
ReplyDeleteCongratulations Brother
ReplyDeleteసూపర్ అన్నా
ReplyDeleteAwesome Navin!!!
ReplyDeleteCongratulations Navin!!!
ReplyDelete