Monday 4 March 2019

టీ ఆర్ పీ మీడియా

ఇది అభినందన్ ఇంకా పాక్ కస్టడీలోనే ఉన్నప్పటి విషయం ...

అక్కడ పాకిస్తాన్‌లో ఆర్మీ కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను "ఇండియాలో నీదే ప్రాంతం?" అని ప్రశ్నించారు.

"నేనది చెప్పకూడదు" అని ఎలాంటి భయంలేకుండా జవాబును దాటవేశాడు అభినందన్.

శతృదేశం చెరలో, అంత భయంకరమైన సిచువేషన్లో ఉండి కూడా!

కట్ చేస్తే - 

"ప్రస్తుతం మేము ఎక్కడున్నామో మీకు తెలుసా? చెన్నైలో, మన వింగ్ కమాండర్ అభినందన్ ఇంటి గేటు దగ్గరున్నాం. ఇదే పాకిస్తాన్ చెరలో ఉన్న మన అభినందన్ ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ల అమ్మ, నాన్న ఉంటారు. అభినందన్ భార్య, కొడుకు ఢిల్లీలో ఉంటారు. అతని భార్య ..."

ఇదీ కామన్‌సెన్స్ లేని మన మీడియా జోష్!

ఒక బాధ్యతగల జవాన్‌గా అభినందన్ దాచిపెట్టిన విషయాన్ని, మన దేశపు 101 న్యూస్ టీవీ చానళ్లు చాలా సింపుల్‌గా, బాహాటంగా, బహిరంగపరిచాయి.

పాకిస్తాన్‌కు ఇంకేం కావాలి?

అందుకే .. మీడియా అయినా సరే, దేశభద్రత వంటి కొన్ని విషయాల్లో నియంతృత్వం అనేది చాలా అవసరం.

ఇదే సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది. 

1 comment:

  1. మీడియా ఓవరాక్షన్ నిజం; భద్రత విషయాల్లో దానికి బ్రేకులు వెయ్యాలన్నదీ నిజం. ఆ బ్రేకులే దేశభక్తిని, జవాన్ల సాహసాల్నీ, త్యాగాల్నీ రాజకీయం చేసి, వోట్లుగా మార్చుకునే వ్యవహారాలకీ బ్రేకులౌతాయి.
    ఈ అవసరాన్ని చట్టంగా మార్చడం ఎలా అన్నదే ప్రశ్న!!

    ReplyDelete