Monday 8 October 2018

టార్గెట్ 100

ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ రాజకీయపార్టీతో పోల్చుకున్నా, టీఆరెస్ బెటర్. ఏ రాజకీయ నాయకునితో పోల్చుకొన్నా, కేసీఆర్ ది బెస్ట్.

కేసీఆర్ స్థాపించిన టీఆరెస్ పార్టీ, ఉద్యమనాయకుడిగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణవాదులందరికీ ఒక వేదిక అయ్యింది. తెలంగాణ సాధించుకున్నాం.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, కేసీఆర్, కేవలం 4 ఏళ్లలో, అంతకుముందు 58 ఏళ్లలో జరగని ఎన్నో అంశాల్ని, ఎంతో ప్రగతినీ సాధించి చూపెట్టారు.

ఇది నిరూపించడానికి ఎవ్వరూ ఏదో భజన చెయ్యనక్కర్లేదు. గూగుల్‌లో కొట్టండి చాలు. కనీసం ఓ 400 అద్భుతమైన పనులు, పథకాల లిస్ట్ మీకు దొరుకుతుంది.

వాటిల్లో కొన్ని పనుల్నిగానీ, పథకాల్ని గాని, ఇంతకు ముందు సమైక్యరాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులెవ్వరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరంటే అతిశయోక్తికాదు!

వీటిల్లో చాలా పనులను, పథకాలను, ఇతర రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా ఇప్పుడు ఫాలో అవుతోంది.

దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.

మనసుంటే మార్గం ఉంటుంది.

ఆ మనసు కేసీఆర్‌కుంది.

తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృధ్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, నిరంతరం ఒక అగ్నిగోళంలా మండుతూ, మధనపడుతూ ఉండే ఒక మహా మనీషి మన ముఖ్యమంత్రి కేసీఆర్.

అలాంటి మనీషి స్థాపించిన మన ఇంటి పార్టీని, మన ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాలి. గెలిపించుకోవాలి.

టీఆరెస్ 'టార్గెట్ 100' అంత ఈజీ కాదు. కానీ, అందరూ పూనుకొంటే అంత కష్టం కూడా కాదు.

జై తెలంగాణ!
జై కేసీఆర్!!        

1 comment:

  1. కేసీఆర్ కేటీఆర్ చేపట్టిన మంచి పథకాలు ఉన్నాయి. అది సత్యం. సమైక్యాంధ్రకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది అనికూడా ఒక్కోసారి అనిపించింది. కానీ కేసీఆర్ మాటతీరు ఎంత దారుణంగా ఉంది. ఒక సాటి ముఖ్యమంత్రిని అసభ్యంగా దూషించడం ఎలా సమర్థించాలి చెప్పు బయ్యా. అలాగే సోనియా గాంధి తెలంగాణా ఏర్పాటుకు కారణం కాదా. కనీస కృతజ్ఞత లేకండా జాతీయపార్టీకి అధ్యక్షుడయిన రాహుల్ గాంధీని బఫూన్ అని తిట్టడం ఇవి ఎలా సమర్ధిస్తావు బయ్యా. ముఖ్యమంత్రికి తగినవిధంగా హుందాగా వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది.

    ReplyDelete