Saturday 21 May 2016

ఇక్కడికి ఎందుకు వెళ్లకూడదు?

అంతకుముందు ఎక్కడా ఓడిపోనివాడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడు.

అంతకుముందు జీవితంలో ఎవ్వరిముందూ తలదించుకోనివాడు ఇక్కడ ఎంటరయ్యాక, అదే తలను పాతాళంలోకి పెట్టుకోవల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు.

అంతకుముందు తనముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా అర్హతలేని అనామక వ్యక్తుల సమక్షంలో ఇక్కడ గంటలు గంటలు గడపాల్సి వస్తుంది. పనికిరాని సొల్లు వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా.

అప్పటివరకూ నిన్ను మెచ్చుకొంటూ ఆకాశానికెత్తిన నీ అతి దగ్గరి మిత్రులు, ఆత్మీయులు - అదే నోటితో నువ్వు కలలో కూడా ఊహించని మాటలంటోంటే విధిలేక వినాల్సివస్తుంది. ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత.

నీ చదువు, సంస్కారం, నీ సిన్సియారిటీ, నీ సెన్సిటివ్‌నెస్, నీలోని మానవత్వం, మంచితనం, నీ నీతి, నిజాయితీ లకు ఇక్కడ అస్సలు విలువుండదు. అలా ఉంటుందనుకున్నావా .. అది నీ మూర్ఖత్వం.

అయితే, సక్సెస్ సాధించి ఒక రేంజ్‌లో ఉన్నవాళ్లలో కూడా దాదాపు చాలామంది ఇలాంటి పరిస్థితుల్నే ఇక్కడ ఎదుర్కోవాల్సిరావడం అత్యంత విషాదకరం. జీర్ణించుకోలేని ఒక వాస్తవం.  

ఆ "ఇక్కడ" ఎక్కడో కాదు .. ది గ్రేట్ సినీ ఫీల్డు!  

కట్‌చేస్తే - 

అంత నిరాశపడకండి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆ నాణేనికి మరోవైపు కూడా ఉంది. అదేంటో నా తర్వాతి బ్లాగ్‌: "ఇక్కడికి ఎందుకు వెళ్ళితీరాలి?" లో చూడండి.   

No comments:

Post a Comment