ఏదో కొంచెం స్లో అవుతుందనుకున్నాను కానీ, మరీ ఇంతలా నెలకు కేవలం ఓ 5, 6 పోస్టుల స్థాయికి పడిపోతుందనుకోలేదు!
నా కొత్త సినిమాల ప్లానింగ్, మీటింగ్స్, అగ్రిమెంట్లు, కమిట్మెంట్లు వంటి అన్నో అతిముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి పిచ్చి బిజీగా ఉంది లైఫ్.
కట్ టూ నాణేనికి మరోవైపు -
పైన చెప్పిన బిజీ షెడ్యూల్ కారణంగానే నిజంగా ఏమీ రాయలేకపోతున్నానా? నాకెంతో ఇష్టమైన ఒక హాబీని, థెరపీని నిర్లక్ష్యం చేస్తున్నానా?
దీన్ని కేవలం ఒక 10 శాతం కారణంగానే నేను ఒప్పుకుంటాను.
ఎన్ని వ్యక్తిగతమైన, ఆర్థిక, వృత్తిపరమైన వత్తిళ్లు ఉన్నా - ఒక మెడిటేషన్ ప్రక్రియలా కనీసం ఓ పది నిమిషాలు ఏదో ఒకటి రాయగల శక్తి, ఓపిక, ఇష్టం నాకున్నాయి.
అయినా ఆ పని చేయటంలేదు, చేయలేకపోతున్నాను అంటే ఇంకేదో కారణం ఉండాలి.
ఉంది.
2016 చివరివరకు, ఎన్ని వీలైతే అన్ని ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను. వచ్చే 365 రోజులూ చాలా చాలా బిజీగా ఉండేట్టు చూసుకుంటున్నాను.
ఈ స్టేజ్‌లో ఇప్పుడిది చాలా అవసరం నాకు.
నాకున్న అతికొద్దిమంది ఆత్మీయ మిత్రులలో ఒకరిద్దరితో నాకున్న ఒకటిరెండు కమిట్మెంట్లు, నా కుటుంబం, నా బాధ్యతలు, నా వ్యక్తిగత క్రియేటివ్ ఫ్రీడమ్ - ఇప్పుడు ప్రతి క్షణం నా ఫోకస్ అంతా ఇదే.
వీటి మీదే.
ఇదే ఆర్డర్లో.
ఈ ఫోకస్‌ను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు బ్లాగ్ రాసినా, దానికొక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం నా ఫోకస్‌తో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఈ మధ్య నేను బ్లాగ్ రాయడం చాలా స్లో అయ్యింది.
నా ఫేస్బుక్ టైమ్‌లైన్‌లో చాలా కొటేషన్లు, పోస్ట్‌లు నాకోసం నేను పోస్ట్ చేసుకున్నట్తే .. ఈ బ్లాగ్ పోస్ట్ కూడా నాకోసం నేను రాసుకున్నది.
ఇది సంజాయిషీ కాదు. స్వీయ అంతరంగ విశ్లేషణ.

Carry on as your inner sole commands u. Best of luck
ReplyDelete