Sunday 30 August 2015

12 రోజుల్లో సినిమా తీయొచ్చా?

నేను తీశాను.

దీని గురించి చెప్పేముందు - ఇక్కడ రెండు ఉదాహరణలు చాలా అవసరం. చెప్పాలి.

అమితాబ్ బచ్చన్ రేంజ్ ఆర్టిస్టుతో కేవలం 20 రోజుల్లో "నిశ్శబ్ద్" తీశాడు రామ్‌గోపాల్‌వర్మ. ఇదే వర్మ, రవితేజ, ఛార్మిలతో ఆ మధ్య 5 రోజుల్లో "దొంగల ముఠా" సినిమా తీశాడు.

గట్స్!

పైన చెప్పిన రెండు సినిమాలూ పక్కా మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలే. అయితే - దొంగల ముఠా మాత్రం - ఫిలిం మేకింగ్‌లో కొత్తగా వచ్చిన డిజిటల్ కెమెరాలను పరిచయం చేస్తూ తీసిన ఎక్స్‌పరిమెంటల్ సినిమా.

అయితే ఏంటట?

అమితాబ్, వర్మ బ్రాండెడ్ పర్సనాలిటీలు. రవితేజ, ఛార్మి ఆల్రెడీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకున్న హీరోహీరోయిన్లు.

వాళ్లు ఏ ఆట ఆడినా నడుస్తుంది. లేదా ఇండస్ట్రీలో చెల్లుతుంది.

కట్ టూ మన పాయింట్ - 

ఇంతవరకూ ఇండస్ట్రీలో ఎలాంటి బ్రాండ్ లేని అప్‌కమింగ్/కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నేను 12 రోజుల్లో ఒక రొమాంటిక్ హారర్ సినిమా తీశాను.

అదే స్విమ్మింగ్‌పూల్.

ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా తీయాలంటే యావరేజ్‌న కనీసం 40 రోజుల షూటింగ్ అవసరం. నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ కూడా ఒక కమర్షియల్ సినిమానే. పైగా, రొమాంటిక్ హారర్! దీని సబ్జెక్టునుబట్టి చూస్తే, కనీసం ఓ 40 రోజులయినా షూటింగ్ చేయాలి.

కాని, నేను 12 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తిచేశాను.

అది కూడా .. ఒక మెలొడీ సాంగ్, ఒక ఐటెమ్ సాంగ్‌తో కలిపి!

ఎలాంటి ప్యాచ్ వర్క్, గ్రాఫిక్ వర్క్ లేకుండా.  

ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే .. నేను చెప్పే కారణాలు రెండే రెండు: ఒకటి అవసరం. రెండోది లేటెస్ట్ టెక్నాలజీ.

మైక్రో బడ్జెట్ కాబట్టి, మనం అనుకున్నన్ని రోజులు లీజర్‌గా సినిమాతీసే అవకాశం అసలుండదు. బట్ .. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ముందు ఇదసలు సమస్యే కాదు.

సో .. అదన్నమాట.

12 రోజుల్లో నేను షూట్ చేసిన స్విమ్మింగ్‌పూల్ సినిమా - వచ్చే 11 సెప్టెంబర్ నాడు యు కె, యు ఎస్ ఏ ల్లో కూడా రిలీజవుతోంది.

ఇంక చెప్పేదేముంది? చిన్న బడ్జెట్ సినిమాలకు అవసరమైనంత ప్రమోషన్ ఉండదు. సరైన థియేటర్స్ కూడా దొరకవు. అదలా పక్కనపెడితే - ఈ సినిమాలకు ఓపెనింగ్స్ మరో పెద్ద సమస్య. ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగితే చాలు. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా మన రూటే సెపరేట్ అయిపోతుంది.

దానికోసమే ఇదంతా ..  

2 comments:

  1. > చిన్న బడ్జెట్ సినిమాలకు..... సరైన థియేటర్స్ కూడా దొరకవు. అ......
    ప్రస్తుతవాతావరణంలో సినిమాథియేటర్లు బడాబాబుల కబంధహస్తాలలో నలుగుతున్నాయి. వాళ్ళ సినిమాలు వేలకొద్దీ థియేటర్లలో విడుదల కావాలి. వాళ్ళ సినిమా ఒకటి సినిమా చెత్తగా ఉన్నప్పటికీ ఆ సంగతి ప్రచారంలోకి వచ్చేసరికే డబ్బులు మూటకట్టేసుకోవాలన్న దుగ్ధ మరి! ఇక చిన్న సినిమాలకు చోటేది. అందుచేత నేరుగా అంతర్జాలంలో కూడా సినిమాను విడుదల చేసుకుందుకు on-line థియేటర్లు ప్రవేశపెట్టి చిన్న సినిమాలు లాభపడేందుకు ప్రయత్నించాలి. on-line కాబట్టి screens కొఱత అన్న సమస్య ఉండదు కదా! నేరుగానూ chromecast ద్వారా TVల్లోనూ చూసుకుందుకు అవకాశం కల్పించితే చాలు. ఈ దారిలో ఆలోచించి చిన్నసినిమాలు ముందుగా సొమ్ముచేసుకోవటం మంచిది.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది 100% నిజం. అతి త్వరలోనే ఆ పరిణామం కూడా సాధ్యం చేసే పనిలో ఉన్నాం. థాంక్యూ ఫర్ యువర్ కామెంట్!

      Delete