Saturday 13 June 2015

అతి తక్కువ పెట్టుబడితో "మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్!"

ప్రస్తుతం ఇండస్ట్రీలో లోబడ్జెట్ సినిమాల బిజినెస్ వ్యవహారాలన్నీ చూస్తున్నప్పుడు నా మనసులో మెదులుతున్న ఆలోచన ఒక్కటే.

"కేవలం కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే .. ఎంత తక్కువలో .. ఎంత మంచి క్వాలిటీ సినిమా తీయవచ్చు?" అని.

"ఇది సాధ్యం" అని ఇంతకుముందే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు నిరూపించాయి. మన తెలుగు సినిమాలతో సహా!

కట్ టూ ది ట్రెండ్ సెట్టర్స్ - 

2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" అనే సినిమా అంతర్జాతీయంగా ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆ తర్వాత ఈ విషయం మీద మరింత లోతుగా స్టడీ చేశాను. ఎన్నో సినిమాలు ఈ పంథాలో తీయటం జరిగింది. ఇది ఫిలిం నెగెటివ్ ని అసలు ఉపయోగించని పంథా. ఫిలిం టెక్నాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఆవిష్కరించిన పంథా.

బ్లెయిర్విచ్ ప్రాజెక్ట్, ఫర్ లవర్స్ ఓన్లీ, న్యూలీ వెడ్స్ ... ఇలా ఎన్నయినా ఉదాహరణల్ని చెప్పగలను.

కేవలం $9,000 లోపు బడ్జెట్ లో కూడా తీసిన ఇలాంటి కొన్ని కమర్షియల్ సినిమాలు మిలియన్లు సంపాదించిపెట్టాయి.

ఇవేం ఆర్ట్ సినిమాలు కాదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

రొటీన్ ఫిలిం నెగెటివ్ ని కాదని, ఈ ఫార్మాట్ లో సినిమా తీయడానికి మన దగ్గర దాదాపు ఓ దశాబ్దం పట్టింది! డిజిటల్ కెమెరాల్లో కూడా ఏ రెడ్ కెమెరానో, అలెక్సా ఎక్స్‌టీనో కాకుండా - కేవలం కెనాన్ 5 డి తోనే షూట్ చేసి సూపర్ డూపర్  హిట్ కొట్టిన సినిమాలు కూడా తెలుగులో ఉన్నాయి.

ఆమధ్య వచ్చిన  "ఈ రోజుల్లో", "ఒక రొమాంటిక్ క్రైం కథ" చిత్రాలు కూడా ఈ ఫార్మాట్ లో తీసినవే.

మనవాళ్లు మాత్రం "శాటిలైట్ రైట్స్ కొనరు .. క్వాలిటీ అసలు ఉండదు .. అందరూ చీప్‌గా అనుకుంటారు" అని నానా కథలు చెప్తారు. అది వారి విజ్ఞానం .. లేదా అజ్ఞానం.

ఆ విషయం అలా వదిలేద్దాం.

స్విమ్మింగ్‌పూల్ తర్వాత నేను తీయబోతున్న కొత్త సినిమా - ఇంకా లేటెస్ట్ కెమెరాలతో, మరింత తక్కువ బడ్జెట్‌లో,
మరింత మంచి క్వాలిటీతో, మరింత తక్కువ సమయంలో తీయబోతున్నాను.

ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే  బిజీగా ఉన్నాను.

ఈవైపు నిజంగా ఆసక్తి, సినీఫీల్డుపట్ల నిజంగా ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్‌లు/కొత్త నిర్మాతలు/సహనిర్మాతలు నన్ను నేరుగా ఈమెయిల్ ద్వారా మీ ఫోన్ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా అలాంటి ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్‌లను నాకు కనెక్ట్ చేయొచ్చు. నేనే మీకు కాల్ చేస్తాను.

(email: manutimemedia@gmail.com)

No comments:

Post a Comment