Wednesday 15 April 2015

స్విమ్మింగ్‌పూల్ లోతెంత?

మేం షూట్ చేసిన ఫామ్‌హౌజ్ లొకేషన్‌లోని అందమైన స్విమ్మింగ్‌పూల్ ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంది.

సిటీకి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌హౌజ్ - షూటింగ్‌లకోసం అద్దెకిచ్చేది కాదు. పూర్తిగా ప్రైవసీకోసం నిర్మించుకున్న ఒక అద్భుతమైన ఏకాంతవాసం.

ఎంతో టేస్ట్ ఉంటే తప్ప అంతబాగా కట్టుకోవడం అస్సలు కుదరదు. సింపుల్ అండ్ వెరీ ఎట్రాక్టివ్!

ఈ లొకేషన్ యజమానికి అతి దగ్గరి ఫ్రెండ్ ఒకరు, నా ఆత్మీయ మిత్రుడొకరికి కూడా క్లోజ్ ఫ్రెండ్ కావడం ఒక ప్లస్ అయింది. అంతకు ముందు కొన్నాళ్లక్రితం .. మేమందరం కల్సి ఓ "వి వి ఐ పి" స్థాయి మిత్రులతో గండిపేట దగ్గరున్న మరో ఫామ్‌హౌజ్‌లో పార్టీలో పాల్గొన్నప్పుడు ఈ లొకేషన్ యజమాని అక్కడ నాకు పరిచయమయ్యారు.

బై మిస్టేక్ .. ఆ పార్టీలోనే నాతో ఆయనో మాటన్నారు. "నాకో మంచి ఫామ్‌హౌజ్ ఉంది. ఎప్పుడయినా రండి. మీకు షూటింగ్‌కు బాగా పనికొస్తుంది" అని!

"నేను దాన్ని ఎవ్వరికీ షూటింగ్‌లకు ఇవ్వను. మీకే ఈ ఆఫర్!" అని కూడా అప్పుడే మరోమాట కూడా అన్నారాయన. ఆ సందర్భంగానే, తనకు ఇండస్ట్రీలో ఉన్న కొందరు వి ఐ పి మిత్రులు, ఇంకొందరు నటీనటులతో తనకున్న స్నేహం గురించి కూడా చెప్పారాయన.

కట్ చేస్తే -  

ఎప్పుడయితే ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారు "మనం హారర్ సినిమా చేద్దామండి" అన్నారో .. వెంటనే నా మైండ్‌లో ఫ్లాష్ అయింది ఈ ఫామ్‌హౌజే. ఈ స్విమ్మింగ్‌పూలే.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ లోతు - 

మామూలుగా ఓ పది ఫీట్ల లోతు ఉండొచ్చు మేము షూట్ చేసిన స్విమ్మింగ్‌పూల్. కానీ, ఇక్కడ నేను చర్చిస్తున్న లోతు అది కాదు.

స్విమ్మింగ్‌పూల్ సినిమా కోసం ఎందరో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు నాకు చాలా బాగా సహకరించారు. ఎంతో ఉత్సహంగా పనిచేశారు. రెడ్ ఎమెక్స్ కెమెరాతో, దాదాపు ప్రతిరోజూ స్టెడీకామ్ ఉపయోగించి, రాత్రింబగళ్లు నిర్విరామంగా పనిచేస్తూ కేవలం 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాము. కనీసం ప్యాచ్‌వర్క్ కు కూడా ఎలాంటి ఆస్కారం లేకుండా!    

ఇప్పుడు స్విమ్మింగ్‌పూల్ కాపీ వచ్చింది. సెన్సార్ వ్యవహారాల కార్యక్రమం కూడా ప్రారంభమయింది. ఇంకో పది రోజుల్లో ఆ ఒక్కటీ అయిపోతుంది.

ఇప్పుడు - నాతోపాటు, మా టేమ్ అందరి క్యూరియాసిటీ ఒక్కటే.

స్విమ్మింగ్‌పూల్ కు U/A వస్తుందా .. లేదంటే, ఏకంగా A సర్టిఫికేటే వస్తుందా?

U/A వస్తే మీకు అన్నివిధాలా బాగుంటుందని రొటీన్‌గా కొందరంటున్నారు. "కాదు .. A వస్తే మీరు పండగ చేసుకోవచ్చు" అని మా బిజినెస్ కోఅర్డినేటర్స్ అంటున్నారు!

ఏది వచ్చినా మాకెలాంటి బాధలేదు.

మేం అనుకున్న విధంగా, అనుకున్న రేంజ్‌లో స్విమ్మింగ్‌పూల్ సినిమాను ప్రమోట్ చేసి, బిజినెస్ చేసి రిలీజ్ చేయడమే ఇప్పుడు మాముందున్న ఏకైక లక్ష్యం.

ఆ లక్ష్యానికి ఇప్పుడు మేం జస్ట్ కొన్ని వారాల దూరంలో ఉన్నాం.   

No comments:

Post a Comment