Friday 3 April 2015

ఎవరు?

"Your posters are looking extremely good Sir.  Best wishes for a grand success!"

ఈ మాటల్ని నేనిక్కడ కోట్ చేస్తూ బ్లాగ్ రాస్తున్నానంటే ఒక కారణముంది. ఫేస్‌బుక్‌లో ఏదో రొటీన్‌గా, నాకు వ్యక్తిగతంగా తెలియని ఎవరో పెట్టిన కామెంట్ కాదది.

మొహమాటానికి పెట్టినా, ఎంకరేజ్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్పినా .. ఇలాంటి కామెంట్స్‌కి నేను పెద్దగా ఇదయిపోను. ఉబ్బిపోను. అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడే ఉంటుంది అసలు కిక్. మిగిందంతా ఉట్టిదే అని నా ఉద్దేశ్యం.

అయితే - ఈ కామెంట్ పూర్తిగా వేరు. ఈ బెస్ట్ విషెస్ పూర్తిగా వేరు.

కట్ టూ ఎవరీ 'ఎవరు'?

నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్ లోకి ఈ కామెంట్‌ను షూట్ చేసిన ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. కాకూడదని నా కోరిక. అలాగని, ఇక్కడ నేను అతన్ని పొగడ్డంలేదు. అతని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి - అందులో కొంతయినా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

నో హిపోక్రసీ. నో ఇన్‌హిబిషన్స్.

ఇతని ఆలోచనా విధానం పూర్తిగా వేరు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాడు. చెప్పలేకపోతే సైలెంట్‌గా ఉంటాడు. తను చేయాలనుకున్నదే చేస్తాడు. అతనిలో నాకిష్టమైంది అదే. చాలావరకు నా రిప్లికా అతను.

అమెరికా వెళ్లి అక్కడ చదువుకొని, ఉద్యోగాలు చేసి, మళ్లీ తను పుట్టిన ఊరికే తిరిగొచ్చేశాడు.

ఏదో చేయాలని.

ఏం చేస్తాడో తర్వాత విషయం. కాని, అతనిలోని ఈ ఆలోచనా విధానం నాకిష్టం.

ఇంగ్లిష్‌లో అతను రాసిన తొలి ఫిక్షన్ అతి త్వరలో ప్రపంచమంతా విడుదల కాబోతోంది. కనీసం ఒకానొక సెగ్మెంట్ వ్యక్తుల ఆలోచనల్లో ఒక చిన్న ఝలక్ ఇవ్వబోతోంది.

ఆ పుస్తకం ఒక "బెస్ట్ సెల్లర్" కాబోతోంది.

ఆ బెస్ట్ సెల్లర్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదవగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. గర్వంగా కూడా ఉంది.

ఆ ఆనందం, ఆ గర్వం ఎందుకో మళ్ళీ ఇదే బ్లాగ్‌లో చెప్తాను. మరోసారి. మరిన్ని వివరాలతో.   

No comments:

Post a Comment