Friday 27 February 2015

సినిమా చూపిస్త మామా!

సినిమా తీయడం ఒక యజ్ఞంలాంటిది.

అది చిన్నదయినా పెద్దదయినా ప్రాసెస్ ఒకటే.

బడ్జెట్ 50 లక్షలయినా, 50 కోట్లయినా లక్ష్యం ఒక్కటే.

సినిమా రూపొందుతున్న సమయంలో మేం కలెక్టివ్‌గా తీసుకొనే ప్రతి చిన్న నిర్ణయానికీ, ప్రతిదశలోనూ మేము చేసే ప్రతి చిన్న పనికీ ఎంతో ఆలోచిస్తాము. ఎంతో చర్చిస్తాము.

బయట నుంచి ఎన్నో చెప్పవచ్చు.

ఈ డిజైన్ బాగా లేదు .. ఇలా చేయాల్సింది .. ఈ యాడ్ బాగా లేదు .. ఇలా చేయాల్సింది .. అదలా చేశారు .. ఇదిలా చేశారు ... ఇలా ఎన్నయినా చెప్పడం చాలా ఈజీ.

కాని .. ఒక సినిమా తీయడం కోసం ప్రతి స్టేజ్‌లోనూ ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్, పూర్తి కమిట్‌మెంట్‌తో ఉన్న ఆ టీమ్ మొత్తం చేసే శ్రమ, పడే కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయి.

కట్ టూ "స్విమ్మింగ్‌పూల్" సినిమా - 

ముందు ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్‌కు టీమ్ మొత్తం హాట్స్ ఆఫ్ చెప్పాలి.

నిజంగా ఆయన కమిట్‌మెంట్ అలాంటిది. "కట్టె కొట్టె తెచ్చె" .. అంతే. అనవసరమయిన సాగదీయడం ఉండదు. ఏదయినా నచ్చలేదు, లేదా ఎక్కడయినా క్లారిటీ లేదు అనిపిస్తే ఆ ముక్క వెంటనే చెప్పేస్తారు. డిస్కషన్ జరుగుతుంది. ఒక మ్యూచువల్, అర్థవంతమయిన నిర్ణయానికి వచ్చేస్తాం. ఇంక మళ్ళీ దృష్టంతా జరగాల్సిన పని పైనే. పెట్టుకున్న లక్ష్యం పైనే.

అదీ పని చేసేవాళ్ల స్టయిల్. ఆ స్టయిల్‌కు ఒక ఖచ్చితమయిన అర్థం అనేది ఉంటుంది. వాల్యూ ఉంటుంది.  

దీనికి పూర్తి వ్యతిరేకంగా కొందరుంటారు. వీళ్లంతా అలా గట్టున ఉండి కామెంట్స్ చేసేవాళ్లన్నమాట. ప్రతి విషయంలోనూ వీళ్ల అమూల్యమయిన సలహాలు, కామెంట్స్ వదుల్తుంటారు. ఎన్నేళ్లయినా స్వతంత్రంగా ఏదీ చేయలేరు. చేసి నిరూపించుకోలేరు. ఇదంతా వ్యర్థం. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

చూస్తుండగానే మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశకు చేరుకొంది. కొద్దిరోజుల్లోనే కాపీ చేతికి రానుంది. తర్వాత సెన్సార్, బిజినెస్, రిలీజ్.

మా హీరో అఖిల్ కార్తీక్ .. హీరోయిన్ ప్రియ వశిష్ట  నుంచి, మా లైట్‌బాయ్ శివమణి వరకు - శ్రీశ్రీ మూవీస్ టీమ్‌లోని ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ లక్ష్యం ఒక్కటే.

ఆ లక్ష్యం కోసమే కష్టపడుతున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం.

ఆ నమ్మకం మాకుంది.          

2 comments: