Monday 21 April 2014

ఒక "టికెట్" ఖరీదుతో ఎంతయినా సాధించవచ్చు!

పాలిటిక్స్ ఇప్పుడొక "బిగ్ బిజినెస్" అయిపోయింది. సాక్షాత్తూ.. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు సి ఎం గా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవలే ఓ మాటన్నాడు. అదీ ప్రెస్‌లో.

"రాజకీయాల్లో అవినీతిని పట్టించుకోవద్దు. తిరిగి ఆ డబ్బంతా ఎలెక్షన్లలో ప్రజలదగ్గరికే వెళ్తుంది!" అని ..

ఈ మాటల్ని నేషనల్ మీడియా బాగా కవర్ చేసింది. ఎంత సిగ్గుచేటు?

అసలు మీడియాలో చాలామంది ఎగతాళిగా నవ్వారు కూడా! ఇవీ మన పాలిటిక్స్. ఇదీ మన పొలిటీషియన్ల స్థాయి.

కట్ టూ "టికెట్" ఖరీదు -

నాకు తెలిసిన అతిదగ్గరి (ఉన్నతస్థాయి స్థాయి) సోర్స్‌ల ద్వారా నేను విన్న ఒక నిజాన్ని నేను నిజంగా జీర్ణించుకోలేకపోయాను. ఇది అంతకు ముందు మనందరికీ తెలిసిందే. కానీ, విషయం ఈ స్థాయికి చేరిందనుకోలేదు.

మనకున్న ప్రముఖ పార్టీలన్నిట్లోనూ - జస్ట్ ఒక అభ్యర్థిగా టికెట్ తీసుకొని పోటీ చేయడానికి 5 నించి 30 కోట్లదాకా యావరేజ్‌న బిజినెస్ జరిగిందట!

కొన్ని ప్రత్యేక స్థానాల్లో, పరిస్థితుల్లో.. ఈ టికెట్ ధర ఇంతకు మరెన్నో రెట్లు కూడా పలికిందట!

అంటే - కేవలం టికెట్‌కే 30 కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థి, గెలవడానికి ఇంకెంత ఖర్చుపెడతాడు? ఆ పెట్టిన ఖర్చుకి ఎన్ని రెట్లు అడ్డగోలుగా సంపాదించాలనుకుంటాడు? ఏ స్థాయి అంచనా ఉంటుందతని మెదడులో?

కట్ టూ ఒక యుటోపియా - 

ఇన్నేసి కోట్లు ఖర్చుపెట్టి, అవినీతితో అడ్డగోలుగా సంపాదించి, జనాల పొట్టలుకొట్టే వీళ్లంతా ఎంత సుఖంగా జీవిస్తున్నారో నాకయితే తెలియదు.

కాని, ఇదే డబ్బుతో ఒక్కో అభ్యర్థి ఒక్కో ఊరినే ఒక అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దవచ్చు. ప్రజలకు నిజంగా పనికొచ్చేవిధంగా ఇంకెంతో సాధించవచ్చు. ఇది చేయడానికి ఏ పార్టీ టికెట్ అవసరం లేదు. పార్టీ అవసరం లేదు.

ఈ ఆనందం ముందు ఏ అధికారమయినా వెలవెలపోతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఆలోచించడం నిజంగా ఒక భ్రమే!  

No comments:

Post a Comment