Friday 7 March 2014

ఫేస్‌బుక్ చూడకుండా ఒక వారం!?

ఫేస్‌బుక్‌ని నేనేదో ఎడాలిసెంట్‌లా అదేపనిగా లైక్‌లు కొట్టడానికో, ప్రతి చెత్తా షేర్ చేయడానికో వాడటం లేదు.

అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్‌లా నాక్కొంచెం తిక్కుంది. దాని వెనక చాలా లెక్కలున్నాయి. ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే కొన్ని టైమ్‌బౌండ్ గోల్స్ ఉన్నాయి. అతి తక్కువ వ్యవధిలో నేను వాటిని సాధించగలగాలి. సాధించాలి.

చాలా క్రిస్టల్ క్లియర్‌గా, ఈ గోల్స్, నా సెక్సీ శామ్‌సంగ్ నోట్‌బుక్ డెస్క్‌టాప్ మీదే ఉంటాయి ఎప్పుడూ. ఏ క్షణం నేను నా నోట్‌బుక్ తెరచినా ముందు నాక్కనిపించేది నా ఈ ఇమ్మీడియేట్ టార్గెట్సే!

మొన్నటివరకూ వీటి సంఖ్య 3. గత డిసెంబర్ 18 నాడు, వీటిల్లో ఒక లక్ష్యాన్ని అనుకున్న సమయానికంటే ముందే సాధించగలిగాను.

ఇప్పుడు నా డెస్క్‌టాప్ మీద ఇక మిగిలింది రెండే రెండు ఇమ్మెడియేట్ గోల్స్. వాటి డెడ్‌లైన్స్: ఈ మార్చ్ 31, ఆగస్ట్ 15.

ఈ రెంటిని కూడా అనుకున్న సమయానికి సాధిస్తానన్న నమ్మకం, ట్రాక్ రికార్డ్ నాకుంది. కొన్నిసార్లు చెప్పలేం. ఏదీ మనచేతుల్లో ఉండని పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు నేనున్న ఫీల్డులో ఈ పరిస్థితే ఎక్కువ. పైగా ఈ రెండు లక్ష్యాలూ కొంచెం కష్టతరమైనవే. ఒకదాన్ని మించి ఒకటి. అయినా నా నమ్మకం నమ్మకమే.

నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా వెనకున్నారు.. నా మంచిని కోరుతూ. అది చాలు నాకు.

ఆ వెనకే నేను నమ్మిన బాబా నాకున్నాడు. ఆయన దీవెనలూ ఉన్నాయి. ఆయనకే అంతా వదిలేశాను. నా పని మాత్రం నేను లేజర్ ఫోకస్‌తో చేసుకుంటూవెళ్తున్నాను.  

కట్ టూ ఫేస్‌బుక్ చూడకుండా ఒక వారం! -

పై నేపథ్యంలో, ఖచ్చితంగా ఒక నెలపాటు అసలు ఫేస్‌బుక్ ముఖం చూడకూడదని గట్టిగా నుకున్నాను. కానీ, హైలీ ఇంపాజిబుల్! పూర్తిగా ఒక వారం కూడా కుదర్లేదు.

"బ్రదర్, ఏమైంది ఆ విషయం?" అని ఓ ప్రొఫెషనల్ ఫ్రెండ్‌ని ఓ ముఖ్యమైన విషయం గురించి అడిగినప్పుడు .. "రాత్రికి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెడ్తున్నాలే..చూస్కో." అని జవాబు!

అదన్నమాట పరిస్థితి. నేనున్న ఫీల్డులో కమ్యూనికేషన్ అవసరాలు అలాంటివి. నేనింకా "వాట్సాప్"లో లేను. బ్రతికిపోయాను..  

సో, కొంచెం కొంచెం మళ్లీ ఎంటరవుతున్నాను. కాకపోతే - ఎఫ్‌బీ మీద నేను వెచ్చించే నా యావరేజ్ 40 నిమిషాల సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించుకున్నాను. నో ప్రాబ్లమ్‌స్.

ఇక్కడ విషయం లైకులూ, షేర్లూ కాదు. ట్రాక్‌లో ఉండటం చాలా అవసరం. తద్వారా పనుల్ని మరింత తొందరగా పూర్తిచేసుకోవడం ముఖ్యం. 

No comments:

Post a Comment