Saturday 29 March 2014

2015 నుంచి అందరికీ ఇంటర్‌నెట్ ఫ్రీ!

ఇప్పటిదాకా ప్రపంచాన్ని దాదాపు తల్లకిందులుగా చేసి, మనిషి జీవితాన్ని వివిధరకాలుగా, అత్యధికంగా ప్రభావితం చేస్తున్న పదం ఒక్కటే.

ఇంటర్‌నెట్ ..

అయితే, ఇంక ఒకే ఒక్క సంవత్సరంలో ఈ ఇంటర్‌నెట్ కాస్తా "అవుటర్‌నెట్" కాబోతోంది.

మీడియా డెవెలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎం డి ఐ ఎఫ్) అనే సంస్థకు చెందిన ఐటి స్పెషలిస్టులు ఓ కొత్త ప్రాజెక్టుని డెవెలప్ చేశారు. దీని ద్వారా ఎవరయినా, ప్రపంచంలోని ఏ మూలనున్నవారయినా, అతి సులభంగా ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయిపోవచ్చు.

అదీ పూర్తి ఉచితంగా!  

"అవుటర్‌నెట్"గా నామకరణం చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి "క్యూబ్‌స్టాట్స్" అనే యంత్ర పరికరాల్ని చాలా పెద్ద సంఖ్యలో భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇప్పటి ఇంటర్‌నెట్ చేస్తున్న "సమాచారాన్ని అందుకోవడం, చేరవేయడం" అనే పని మొత్తాన్ని భూ కక్ష్యలో తిరిగే ఈ డివైజ్‌లే చూసుకొంటాయి ఇకమీదట.

ఒక విధంగా చెప్పాలంటే - అవుటర్‌నెట్ అనేది ఈ భూమ్మీదున్న అన్ని ఖండాలనూ కలిపే ఓ అతి పెద్ద "వై-ఫై రౌటర్" అన్నమాట!

కట్ టూ క్లయిమాక్స్ - 

ఎం డి ఐ ఎఫ్ చెప్తున్నదాని ప్రకారం.. అవుటర్‌నెట్‌లో ఎలాంటి సెన్సార్‌షిప్ సాధ్యం కాదు.

అంటే, ఇప్పుడు కొన్ని దేశాల్లో,కొన్ని సంస్థల్లో, కొన్ని వెబ్‌సైట్లను నిరోధిస్తున్నట్లుగా ఇకమీదట నిరోధించడం అస్సలు కుదరదు.

మరోవైపు, యూజర్స్‌కి సంబంధించిన సమాచారం విషయంలో మాత్రం కావల్సినంత ప్రైవసీని ఇస్తుంది అవుటర్‌నెట్.

ఇంకేం కావాలి?  

No comments:

Post a Comment