Wednesday 19 February 2014

డిజిటల్ సినిమా బూమ్!

ఒకప్పుడు సినిమా అంటే అదో పెద్ద రహస్యం. రాకెట్ సైన్స్. ఇప్పుడంత సీన్ లేదు. అంతా డిజిటల్‌మయమైపోయింది. చూద్దామన్నా ఇప్పుడు ఎక్కడా ఫిలిం నెగెటివ్ కానీ, ఫిలిం రీలు కానీ కనిపించవు.

ఇప్పుడు ఎవరయినా .. ఎంత రేంజ్ బడ్జెట్లోనయినా ఒక మాదిరి ఫీచర్ ఫిలిం నిర్మించవచ్చు. అయితే అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజయ్యే స్థాయిలో ఉండాలంటే మాత్రం కనీసం ఒక 50 లక్షల వరకు బడ్జెట్ తప్పనిసరి.

సినిమాలో ఏమాత్రం సరుకున్నా, సరయిన సమయంలో దాన్ని రిలీజ్ చేస్తే మాత్రం ఎవరయినా కోట్లు సంపాదించవచ్చు. ఆఫ్‌కోర్స్, ఈ కోట్లు కొల్లగొట్టడం అనేది ఆ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందన్నదానిమీద ఆధారపడి ఉంటుంది.    

ఇప్పటివరకూ చర్చించిందంతా కేవలం అంతా కొత్తవాళ్లతో తీసే యూత్ ఎంటర్‌టైనర్ సినిమాల గురించి. ఉదా: ఈ రోజుల్లో, బస్ స్టాప్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, 3 జి లవ్, ప్రేమ కథా చిత్రమ్ మొదలైనవి.

ఈ రేంజ్ మైక్రో బడ్జెట్ సినిమాలమీద పెట్టే పెట్టుబడి ఎంతమాత్రం రిస్కు కాదు. శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఔట్‌రైట్ సేల్ వంటి రకరకాల రూపాల్లో మనం పెట్టిన పెట్టుబడికి మరింత ఎక్కువగానే మనకు రిటర్న్స్ ఉంటాయి.

ఈ రిటర్న్స్‌కి సినిమా జయాపజయాలతో పనిలేదు. లక్కీగా, సినిమా ప్రేక్షకాదరణ పొంది 'హిట్' టాక్ వచ్చిందంటే చాలు.. ఇంక చెప్పేదేముంది. ఒక్క నైజాం ఏరియాలోనే 10 కోట్ల కలెక్షన్ ఉంటుంది.    

మరో ప్లస్ పాయింట్ ఏంటంటే - ఇదంతా ఒక్క 5 నెలల కాలంలో పూర్తయ్యే విషయం!

అయితే చెప్పినంత సులభం కాదు. దీన్ని సాధించడం కోసం ఒక లైక్‌మైండెడ్ టీమ్, ప్యాషనేట్ ఇన్‌వెస్టర్స్ చాలా అవసరం.

చిన్నమొత్తంలో పెట్టుబడి పెడుతూ ఫిలిం ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాలన్న ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈమెయిల్ ద్వారా నన్ను నేరుగా సంప్రదించవచ్చు.    

కట్ టూ సింపుల్ లాజిక్ - 

ఒక్క 10 కోట్ల లాభం కోసం, భారీ హీరోలతో 50 కోట్లు/100 కోట్లు ఖర్చుపెట్టి సంవత్సరాలపాటు సినిమాలు తీస్తూ హెవీ గ్యాంబ్లింగ్ చేయడంతో పోలిస్తే .. కేవలం 50 లక్షల పెట్టుబడితో జీరో రిస్క్ రిటర్న్స్ లేదా కనీసం ఓ 10 కోట్ల ప్రాఫిట్స్ పొందటం చాలా గొప్ప విషయం అన్నది ఎవరయినా ఒప్పుకొని తీరాల్సిన నిజం.

ముఖ్యంగా, కొత్తగా ఈ ఫీల్డులోకి రావాలనుకొనే ఇన్‌వెస్టర్ల విషయంలో మాత్రం ఇదే చాలా తెలివైన నిర్ణయం కూడా. 

4 comments:

  1. మంచి విషయం చెప్పారు.
    సినీమా ఇండస్ట్రీ డాబు నుండి దిగివచ్చి కళాత్మకనిర్మితిగా పునర్వ్యవస్థీకృతం అయ్యేందుకు ఈ‌ డిజిటాల్ పరిణామం ఎంతో దోహదపడుతుంది. ఐతే, ఈ మార్పు కారణంగా ఈ కుహనా ఇండస్ట్రీ చెదిరిపోవటంతో దాన్నే నమ్ముకున్న అనేకమంది కార్మికజీవులు రోడ్డుపాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే, బడాబాబుల స్టూడియో బిజినెస్సులు దెబ్బతినటం‌ జరగవచ్చును. ఆ స్టూడియోల ఆదాయం పైన వచ్చే పన్నుల మీద ఆశపెట్టుకునే ప్రభుత్వాలకూ కూడా ఈ విషయంలో ఇబ్బంది తప్పదు - కాని అది మరొక రకంగా పూడుతుందేమో.

    ReplyDelete
    Replies
    1. అలాంటి సమస్య ఉండదండీ! కొత్తగా ఇంకెన్నో రకాలుగా పనులు తప్పక క్రియేట్ ఔతుంటాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది.

      Delete
  2. great calculation man. theaters anni Dil Raju, Allu aravind and Suresh babu chetulo unnai kada

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది కరెక్టే. ఇంకోఇద్దరి పేర్లు మీరు చెప్పటం మర్చిపోయారు.

      కానీ, ఇక్కడ అందరికీ తెలియని ఒక నిజం ఉంది. చిన్న సినిమా బాగా ఆడితే మీరు చెప్పిన ఆ నలుగురయిదుగురే ఎంచక్కా ఔట్‌రైట్ కి కొనేసుకుంటారు!

      మరొక విషయం ఏంటంటే, పెద్ద సినిమాల రిలీజ్ ఉన్న సమయంలోనే మనకు కూడా థియేటర్లు కావాలనుకొవడం, అప్పుడే రిలీజ్ చేయాలనుకోవడం వ్యాపారపరంగా ఒక పెద్ద అవివేకం. దీనికి ఉదాహరణ ఎన్నో సూపర్ డూపర్ హిట్టయిన చిన్న సినిమాలే!

      ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. కొద్ది నెలల్లో ఈ విషయంలో సీన్ చాలా మారనుంది! అది ఖచ్చితంగా మైక్రో బడ్జెట్ సినిమాలకు అనుకూలంగా ఉంటుంది.

      Delete