Tuesday 3 September 2013

ఆలోచనలు అన్‌లిమిటెడ్!

Manipulating Money, Creativity and Life ...
Manohar Chimmani Unmasked! 


ఇదీ "నగ్నచిత్రం" బ్లాగ్ కి కొత్తగా నేను అనుకున్న డిస్క్రిప్షన్ లేదా ట్యాగ్‌లైన్. ఈ పోస్ట్ రాయటం పూర్తయ్యాక బ్లాగ్ హెడర్ మీద ఈ మార్పు ఎడిట్ చేస్తాను.

బహుశా ఇప్పటికి చాలాసార్లు నా వ్యక్తిగతమైన ఒక ఫీలింగ్‌ని, ఈ బ్లాగ్ ద్వారా మీతో చాలాసార్లు పంచుకున్నాను. ఏంటంటే - ఈ బ్లాగూ, ఫేస్‌బుక్కూ నాకత్యంత ప్రియమైన నేస్తాలు అని. వంద శాతం నిజం. ఎలాంటి హిపోక్రసీ లేని వాస్తవం.

ఈ బ్లాగ్ మీద, ఫేస్‌బుక్ మీద ఎన్ని ప్రయోగాలు చేశానో లెక్కలేదు. ఈ ఇద్దరు నేస్తాలతో గడిపిన నా సమయం చాలా తక్కువే కావొచ్చు. కానీ ఆ సమయమే నాకెంతో విలువైన సమయం. అది - నాతో నేను సంభాషించుకున్న సమయం. నన్ను నేను విశ్లేషించుకున్న సమయం. నా జీవిత వాస్తవాల్ని నిర్వచించుకున్న సమయం.

ఇంక చాలు. ప్రయోగాలు, ఫలితాలు అన్నీ చేశాను. చూశాను. ఇక మీదట ఈ బ్లాగ్‌లో ఒక్క సినిమాలే కాదు. నాకు  తోచిన ప్రతి టాపిక్‌నీ, రాయాలనిపించిన ప్రతి అంశాన్నీ రాస్తాను.

సక్సెస్ సైన్స్, సినిమాలు, మనీ, రైటింగ్, ఆర్ట్, క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. నాకిష్టమైన ఈ సబ్జెక్టులన్నిటిమీదా రాయాలనుకుంటున్నాను. రాస్తాను.

పాలిటిక్స్ ఒక్కటే నాకు ఏమాత్రం ఇష్టం లేని సబ్జెక్టు. బై మిస్టేక్ దాన్ని కూడా అప్పుడప్పుడూ బ్లాగ్‌లో టచ్ చేయాల్సి రావొచ్చు.

ఇక - ప్రస్తుతం నేను చేస్తున్న ఎన్నో పనుల్లో సినిమాలు ఒకటి. సినిమాలే జీవితం మాత్రం కాదు.

నిజం చెప్పాలంటే - నా జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిందీ, ఎన్నో అద్భుత అనుభవాల్ని ఆస్వాదించిందీ ఫీల్డుకి బయటే. అలాగని ఫీల్డుని నేను తక్కువగా చేసి చెప్పటం లేదు. చూడటం లేదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే సినీ ఫీల్డులో లేనిది లేదు!

సమస్యల్లా ఒక్కటే. ఈ రంగంలోకి దిగితే బయటికి రావటం మాత్రం సాధారణ మానవమాత్రులవల్ల మాత్రం కాదు. ప్రస్తుతం నా పరిస్థితీ అదే! 

1 comment:

  1. ఎవరైనాసరే హిపోక్రసి లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి!నంగినంగి మాటలు వద్దేవద్దు!ముసుగులన్నీ తీసేసి నిర్భయంగా నిజం మాట్లాడేవాళ్ళు కావాలి!దొంగవ్రాతలు చదివి చదివి విసిగివేసారి ఎండి పండిపోయాను!

    ReplyDelete