Sunday 20 January 2013

రాజరికం 2013


"ఇంక వందేళ్లయినా దేశాన్ని గాంధీ-నెహ్రూ వంశమే పాలిస్తూ ఉంటుంది."

సుమారు పాతికేళ్ల క్రితం అనుకుంటాను... ఒక నవల లోనో, ఇంకేదయినా వ్యాసంలోనో ఖచ్చితంగా గుర్తు లేదు.. యండమూరి వీరేంద్రనాథ్ రాశారు మాట.

జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ... ఇప్పుడింక రాహుల్ గాంధీ! మధ్యలో సంజయ్ గాంధీ యాక్సిడెంట్లో చనిపోయాడుగానీ, లేదంటే బహుశా ఆయన కూడా సీన్లో ఉండేవాడు. ఇంక ప్రియాంక గాంధీ, మేనక గాంధీ, ఆవిడ కొడుకు వరుణ్ గాంధీ లు ఎలాగూ ఉండనే ఉన్నారు.  

మధ్య ఒక ఫారిన్ మ్యాగజైన్లో ఒక వ్యాసం చదివాను. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ గురించిన వ్యాసం. 120 కోట్ల జనాభా ఉన్న ఒక దేశాన్ని తన ఒంటి చేత్తో  కంట్రోల్ చేస్తున్న మహిళ మరెవరో కాదు - సోనియా గాంధీనాకు ఆ వ్యాసంలో గానీ, ఆ స్టేట్‌మెంట్‌లో గానీ... ఎలాంటి అతిశయోక్తి కనిపించలేదు.  వాస్తవంలో జరుగుతున్నది అదే కదా..

మన రాజ్యాంగం ఒప్పుకోలేదు కానీ, లేదంటే - సోనియా ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యుండేది. మన్మోహన్ సింగ్ సీన్లో ఉండేవాడే కాదు. మన్మోహన్ సింగ్‌నే ఎందుకు కావాలనుకున్నారు అసలు? ఆయన్ను మించిన సమర్థులు కాంగ్రెస్‌లో లేరా? ఉన్నారు. కానీ, సమర్థులు సీన్లోకి ఎంటర్ అవుతే రాజరికానికానికే ఎసరొచ్చే సమస్య ఉంటుంది.  కాబట్టి అలాంటి పిచ్చి స్టెప్ వాళ్లు వెయ్యలేదు.

ఇలాంటి రాజరికపు పోకడల్ని మనం పెంచి పోషిస్తున్నంత కాలం మన దేశం ఇలాగే ఉంటుంది. అవినీతి మరింతగా ఎదిగి అకాశాన్ని అంటుతుంది. అలాగని, ఇది కేవలం ఆ ఒక్క వంశానికి సంబంధించిన విషయమే కాదు. రాష్ట్రాల్లోని ఇంకెంతోమంది రాజకీయ నాయకుల వంశాలకూ వర్తిస్తుంది.   

ఢిల్లీ విషయానికొస్తే మాత్రం -

ఎవరి స్వీయ ప్రయోజనాల కోసం వాళ్లు చూసుకొంటూ - ఢిల్లీలో భజన చేస్తున్నంత కాలం, బానిస మనస్తత్వంతో బ్రతుకుతున్నంత కాలం .. ఇంకో వంద ఏళ్లతర్వాత, అంటే, 3013 లో నయినా సరే... నెహ్రూ-గాంధీ వంశమే ఈ దేశాన్ని పాలిస్తూ ఉంటుంది. 

ఎంతో సామర్థ్యం ఉండీ, అనుభవం ఉండీ, అదేపనిగా భజన చేసే మన సీనియర్ నాయకులెందర్నో చూసినప్పుడు నాకు చాలా జాలి కలుగుతుంది. ఎందుకంటే, ఈ భజన కార్యక్రమంలో అందరికంటే ముందుంటున్నది వాళ్లే!

1 comment:

  1. మంచి పోస్ట్. ఈ నెహ్రూ కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలనుంచి తప్పించేవరకు మన దేశం బాగుపడదు.

    మీరు "మన రాజ్యాంగం ఒప్పుకోలేదు" అని రాసారు. కానీ మన రాజ్యాంగంలో ఆ నియమం లేదు. భారతదేశపు పౌరుడు ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చు.(ఆర్టికల్ 84).

    ReplyDelete