Tuesday 25 December 2012

ఇంగ్లీష్, హిందీల్లో అయితే ఓకే!


 సుమారు ఒక డజన్ డబల్ మీనింగ్ డైలాగుల్ని పట్టించుకోకుండా వదిలేస్తే - మారుతి సినిమాను చాలా బాగా తీశాడు. తన మొదటి (హిట్) సినిమా
" రోజుల్లో" తో పోలిస్తే ఇది చాలా అర్థవంతమయిన సినిమా. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలతో కలిసి మరీ చూడొచ్చు. అలా చూడాల్సిన సినిమా ఇది. నాతోపాటు సినిమాకు వచ్చిన నా మిత్రులు దయానంద్, ఫ్రతాప్ కూడా ఇదే మాట అన్నారు. ఒకరు లెక్చరర్, ఒకరు సెక్రెటేరియట్ లో ఆఫీసర్. 

సంధ్య 70 ఎం ఎం లో ఇవాళ మార్నింగ్ షో "బస్ స్టాప్" చూశాను...

రివ్యూ రాయుళ్ల రాతలను మాత్రమే పట్టించుకొనేవాళ్లు, అర్థం లేని హిపోక్రసీ ఉన్న పేరెంట్స్ (పిల్లలు కూడా) - సినిమా చూడకపోవటం ద్వారా ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారని నా ఉద్దేశ్యం. రెండు వైపులా అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ప్రాబ్లం రాకుండా చూడటం సాధ్యమా, అసలీ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు... ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సినిమాలో సమాధానాలు దొరుకుతాయి. ఎట్ లీస్ట్ ఒక మంచి అవగాహన వస్తుంది. పెద్దలూ, పిల్లలూ "అదర్ సైడ్" నుంచి కూడా కొంచెమయినా ఆలోచించడం ప్రారంభిస్తారు

హిందీ లో వచ్చిన "ఢెల్లీ బెల్లీ" ని ఆకాశానికి ఎత్తేసి ఒప్పుకునే ఇదే రివ్యూ రైటర్స్, చిత్ర విమర్శకులు... బస్ స్టాప్ ను కూడా ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి"ఢెల్లీ బెల్లీ" లోనూ ఇప్పటి తరం యువత లైఫ్ స్టయిల్ నే చూపారు. నిజ జీవితంలో వారు ఎలా మాట్లాడతారో అవే డైలాగులను పచ్చిగా వాడారు. జీవన్ శైలినే చూపారు.  "బస్ స్టాప్" లోనూ అంతే.

ఎటొచ్చీ మన తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికే ఎక్కడలేని హిపోక్రసీలు అడ్డొస్తాయి. హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో అయితే ఎంత పచ్చి బూతు అయినా "చాలా నేచురల్ గా" ఉంటుంది వీరందరి కళ్లకూ, చెవులకూ!

ఇంకా ఎన్నాళ్లీ "మాస్క్" లు? ఇకనుంచయినా కొంచెం ఎదగడానికి ట్రై చేస్తే బాగుంటుంది.

ఒక్కటి మాత్రం నిజం. కొన్ని "టూ మచ్" గా అనిపించినా, పదో పన్నెండో డబల్/డైరెక్ట్ మీనింగ్ డైలాగులు, సీన్లు లేకుండా అయితే సినిమా అసలు ఆడేది కాదు. స్పైసీ కోటింగ్ ఉంది కాబట్టే సినిమాలో ఇచ్చిన సందేశం అంత స్వీట్ గా నిలబడింది.   విషయంలో మారుతికి కంగ్రాట్స్ చెప్పక తప్పదు. తన తొలి సినిమా "ఈ రోజుల్లో" లాగానే,  ఇది కూడా లేటెస్ట్ ఫిలిం మేకింగ్ ఫార్మాట్లో తీసిన సినిమానే కావటం మరో చెప్పుకోదగ్గ విశేషం.

కొంతమంది రివ్యూయర్స్ రాసినట్టు అతనిది వల్గారిటీ కాదు. క్రియేటివ్ స్ట్రాటజీ.  

1 comment:

  1. yes, you are right.. it is a good movie with good message.. some dialogues may pinch but it is a worthy movie to watch with family..

    ReplyDelete