Saturday 10 November 2012

నా రష్యన్ డిప్లొమా


చేతుల నిండా కందెన మరకలతో, ఎక్కడో ఫ్యాక్టరీల్లో మెషినిస్టుగా పనిచేసుకుంటూ ఉండేవాన్ని .. అనుకోకుండా ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కి వెళ్ల్లాల్సివచ్చింది. అంతే. ‘ ఆర్ట్స్ కాలేజ్ లో పీజీ చేయకపోతే నా లైఫ్ వేస్ట్అనిపించింది.

కట్ చేస్తే

కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రయివేటుగా (ఎక్స్ టర్నల్) రాశాను. దాని రిజల్ట్స్ రాకముందే, ఇక్కడ ఉస్మానియాలో తెలుగు, ఆర్కియాలజీ, ఫిలాసఫీ లకు ఎంట్రన్సులు రాశాను. మూడిట్లోనూ మంచి ర్యాంకుల్లో సీట్లొచ్చాయి. ఓయూ ఎంట్రన్స్ రిజల్ట్స్ తీసుకుని కేయూ కి వెళ్లాను - నేను రాసిన డిగ్రీ రిజల్ట్స్ కోసం!

కట్ చేస్తే -

ఎమ్మే తెలుగులో చేరాను, తెలుగే కదా చాలా ఈజీగా ఉంటుందనుకుని.  చేరాకగాని అసలు విషయం తెలియలేదు! ఎం ఏ స్థాయిలో తెలుగు చదవటం చాలా కష్టం. అలా, పదో తరగతి ఫెయిలయ్యాక, డైరెక్ట్ గా పీజీలోనే నా కాలేజ్ లైఫ్. అదీ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో..

కట్ చేస్తే -

రెండేళ్లు బాగా హాస్టల్లో తిని, ఎమ్మే తెలుగు పూర్తిచేశాక గానీ తెలియలేదు అసలు దాంతో యెలాంటి ఉద్యోగం వెంటనే రాదని. అప్పటి నా మైండ్ సెట్ ప్లస్ అవసరం - వెంటనే ఉద్యోగం చేయాలని. అంతే. మళ్లీ ఎంట్రన్సులు! లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్  సైన్సులో BLISc, MLISc రెండూ చక చకా పూర్తిచేశాను. రెండు గోల్డ్ మెడల్స్ సంపాదించుకున్నాను. వెరసి, మొత్తం నాలుగేళ్లు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో చదివాను.

నాలుగేళ్లలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో నేను చదివిన మూడు కోర్సులు ఒక ఎత్తు అయితే.. ఇవి చదువుతూనే, అదే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో, పార్ట్ టైం గా మూడేళ్లపాటు నేను చదివిన రష్యన్ డిప్లొమా మరొక ఎత్తు. ఇప్పుడు నేను ఏ కొంచెమయినా ఇంగ్లిష్ మాట్లాడగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను అంటే - క్రెడిట్ అంతా నేను చదివిన రష్యన్ డిప్లొమాదే.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో నేను నిజంగా బాగా ఎంజాయ్ చేస్తూ చదివిన చదువు - మూడేళ్ల రష్యన్ డిప్లొమానేనే యూనివర్సిటీ టాపర్. మూడేళ్ల డిప్లొమాలో నన్నూ, నా వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. వారిద్దరూ నాకు రష్యన్ నేర్పిన గురువులు. ప్రొఫెసర్ మురుంకర్, ప్రొఫెసర్ కల్పన.

మురుంకర్ సర్ ని మధ్యనే వెళ్లి కలిశాను. నాతోపాటు అప్పటి నా క్లాస్ మేట్ స్వరూప కూడా వచ్చింది. సర్ ని కలవటానికి వెళ్తున్నపుడు చాలా గిల్టీగా ఫీలయ్యాను. ఫీల్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే - నన్ను అమితంగా ప్రభావితం చేసిన నా గురువు ని సుమారు 22 ఏళ్ల తర్వాతగాని కలవలేకపోయాను! అదే జీవన వైచిత్రి. అదే జీవన వైరుధ్యం. అదే జీవితం.

ఇక్కడ కట్ చేయక తప్పదు. ఎందుకంటే, తర్వాతి బ్లాగ్ పోస్ట్ సర్ గురించే ..

2 comments:

  1. ప్రివ్యేత్ సర్ దోబ్రయె ఊత్ర, స్థ్రాన్ త్వుయ్ చి, మీరు ప్రజంట్ చేసిన రష్యన్ లో సంభాషణ పుస్తకం సౌజన్యంతో

    ReplyDelete
  2. ఆ బుక్ నీ దగ్గర ఇంకా ఉందా?!! వెరీ గుడ్..

    ReplyDelete