Tuesday 18 September 2012

సినిమా వాళ్లని జనాలు ఎందుకు నమ్మరు?

సినిమా అంటే హీరోయిన్ ఒక్కటే కాదు - నానా గొడవలుంటాయి. మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో  ఒక ఆఫీస్ కు వెళ్లాను. అది శాటిలైట్ రైట్స్ కొనే ఒక థర్డ్ పార్టీ ఆఫీసు.

ఒక ప్రొడ్యూసర్ సినిమాను ఆ థర్డ్ పార్టీ పెద్దమనిషి కొనేశాడు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించాడు. అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు కోసం ప్రొడ్యూసర్ ఆ ఆఫీస్ చుట్టూ పిచ్చికుక్కలా తిరుగుతున్నాడు! నెలలు గడిచాయి. అదెలాగంటే - ఆ పెద్దమనిషి వారంలో 2 రోజులు హైదరాబాద్ లో ఉంటాడు. మిగిలిన 5 రోజులు చెన్నై లో. ఇక్కడ ఉన్న 2 రోజులూ "పొద్దున రా.. సాయంత్రం రా" అంతూ తిప్పుతాడు. కట్ చేస్తే మల్లీ 5 రొజులు కనిపించడు! 

ఈ గొడవంతా ఇన్వెస్టర్లు వినరు. చెప్పిన టైం కు డబ్బు ఇవ్వకపోతే నడిరోడ్డుమీద కాలర్ పట్టుకుంటారు. బండబూతులు కూడా! ఇవన్నీ పాపం ఆ ప్రొడ్యూసర్ అనుభవించాడు. నేను స్వయంగా చూశాను.

ఇంత డ్రామా ఆ పెద్దమనిషి ఎందుకు క్రియేట్ చేయాలి? కేవలం 3 నెలల్లో కనీసం ఒక 15 లక్షల లాభం అతనికి ఆ ప్రొడ్యూసర్ సినిమా ద్వారా వస్తోంటే ఎందుకిలా అతన్ని టార్చర్ పెట్టటం? అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం యెలాగూ ఇవ్వక తప్పదు. నిజంగా ఇచ్చే రోజు ఏదో చెప్పి, ఆ రోజే రమ్మని ఇవ్వచ్చుగా? కానీ, వీళ్లు అలా ఎప్పుడూ  చెయ్యరు...

ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి యెన్నో. ఇదిగో - ఇలాంటి వారి పుణ్యమా అనే బయట సినిమా వాళ్లని జనాలు నమ్మరు.

No comments:

Post a Comment