Saturday 15 September 2012

సినిమాలెందుకు తీస్తారు?


బయట వ్యాపారాలెన్ని వున్నా - జూదం లాంటి (హెవీ గ్యాంబ్లింగ్!) బిజినెస్ లోకి యెవరయినా యెందుకు వస్తారు? హాలీవుడ్ సంగతి ఏమో గానీ, మన ఇండియా లో మాత్రం నాకు తెలిసినంతలో విషయం ఇదీ

> నిజంగా సినిమా కళ మీద వున్న మమకారంతో.
> వ్యాపారానికి గ్లామర్ వుంది. మిగిలిన వ్యాపారాల్లో లేని 'ఓవర్ నైట్ ఫేం' ఒక్క బిజినెస్ లో నే సాధ్యం.
> రేంజ్ ని బట్టి - హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, దర్శకులతో నెట్ వర్క్ పెంచుకొనే అవకాశం వుంటుంది.
> సినిమా వాళ్లు యే పొలిటికల్ పార్టీలో - యెంత స్థాయి వారినయినా ఈజీ గా కలిసే అవకాశం వుంటుంది. పొలిటికల్ ఎంట్రీ కి రూట్ ఈజీ!
> సొసైటీ లో మంచి సెలబ్రిటీ స్టేటస్ వుంటుంది. (ఇంట్లో యెలా వున్నా!)
> బ్లాక్/వైట్ అంటూ మనీ తో యెన్నో అడ్జస్ట్ మెంట్ లు చేసుకోడానికి సినిమా బిజినెస్ ఒక ప్లాట్ ఫాం లా పనిచేస్తుంది. (అంటారు! బట్, నిజమేనట!!)
> ఒక సినిమా స్టార్ట్ చేస్తే చాలు - మనీ బాగానే రొటేషన్ అవుతుంది.
> సినిమా పుట్టినప్పటి నుంచీ ఇప్పటివరకుయెప్పుడయినా సరే, సక్సెస్ శాతం కేవలం 10% కంటే యెక్కువ యెప్పుడూ యెక్కడా వుండదు. అయినా సరే - దీని అట్రాక్షన్ దీనిదే!
> జాగ్రత్త గా చేసుకొంటే యెలాంటి రిస్క్ వుండదు. కానీ, దానికి ఒకలైక్ మైండెడ్’ టీం అవసరం.
> కొంత మంది ఏమీ తెలియక, మరికొన్ని వ్యామోహాలతో వస్తారు. ఒక్క దానికోసమే అయితే సినిమానే అక్కర్లేదు అన్నది కామన్ సెన్స్! అది తెలుసుకొనేటప్పటికి అంతా అయిపోతుంది!!

ఈ బిజినెస్ గురించి  రాయాలంటే ఇంక చాలా వుంది. మరోసారి చూద్దాం.


No comments:

Post a Comment