Tuesday 5 July 2022

థాంక్స్ టు కేటీఆర్... ప్రగతిభవన్‌లో నా బుక్ లాంచ్!


కొందరి గురించి ఎంత చిన్న నిజం రాసినా అది పొగడ్తగానో, లేకపోతే భజనగానో అనిపిస్తుంది. అలాంటివారిలో ఒకరు కేసీఆర్. ఇంకొకరు కేటీఆర్.   

బ్లాగ్‌లో రాసినా, న్యూస్‌పేపర్స్ ఆర్టికిల్స్‌లో రాసినా - నేను వారి గురించి రాసిన ప్రతి ఒక్క విషయం నిజమే రాశాను. కళ్ళముందు జరిగిన విషయమే రాశాను. వారు సాధించిన విజయాలే రాశాను. వారు పూనుకొంటున్న మరెన్నో గొప్ప గొప్ప పనుల గురించి రాశాను. అంతకు ముందు అరవై ఏళ్ళుగా - వేరెవ్వరూ తెలంగాణ కోసం తలపెట్టని, కనీసం ఊహించని ఎన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల గురించి రాశాను. 

వారిద్దరి గురించి నేను రాసిన ప్రతి వాక్యం వెనుక రియాలిటీ ఉంది, లాజిక్ ఉంది.      

పనిచేస్తున్నవారిని గురించి, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గురించి రాస్తే తప్పేంటి? 

ఈ దృక్పథంతోనే - గత కొన్నేళ్ళుగా కేసీఆర్ కేంద్రబిందువుగా నేను రాసిన ఎన్నో బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, దినపత్రికల ఎడిట్ పేజీలకు రాసిన ఎన్నో ఆర్టికిల్స్‌లోంచి - ఎన్నిక చేసిన కొన్ని ఆర్టికిల్స్‌తో రూపొందించిన అందమైన సంకలనం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం.  

216 పేజీల హార్డ్‌బౌండ్ క్లాసిక్. 

ఈ కంటెంట్‌నంతా - ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి తెలంగాణ ప్రజలతో ఒక చిన్న పుస్తకరూపంలో ఇలా పంచుకొంటున్నాను. ఈ చిన్న ప్రయత్నం ఇన్‌స్పిరేషన్‌తో - నాలాంటి ఇంకెందరో బయటికి రావాలని, వాళ్లంతా కూడా వారికి వీలైనవిధంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలన్నది ఈ పుస్తకం ద్వారా నేనాశిస్తున్న ప్రధాన ప్రయోజనం.

త్వరలో జాతీయ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్న సందర్భంగా - గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి - ఒక రచయితగా, ఒక డైహార్డ్ అభిమానిగా నేనందిస్తున్న చిరుకానుక ఈ పుస్తకం. 

ఇక, ఈ పుస్తకానికి సంబంధించి ముఖ్యమైన కొందరు వ్యక్తులకు నా కృతజ్ఞతాభివందనాలను పుస్తకంలో ప్రత్యేకంగా తెలుపుకొన్నాను. వారందరికీ పేరుపేరునా మరొక్కసారి నా ధన్యవాదాలు.     

కట్ చేస్తే - 

ట్విట్టర్‌లో "ఆస్క్ కేటీఆర్" కార్యక్రమం ద్వారా నాకు మాట ఇచ్చినట్టుగానే - ఈరోజు గౌరవ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రగతి భవన్‌లో తన ఛాంబర్‌కు నన్ను ఆహ్వానించి, ఆత్మీయంగా పలుకరించి, మాట్లాడి, అక్కడున్న మరొక మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, ఎంపి రంజిత్ రెడ్డి గారికి, ఇతర విఐపిలకు నన్ను పరిచయం చేసి, నా పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుత  జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేసీఆర్ గారి కోసం ఒక పుస్తకాన్ని, తన కోసం ఇంకో పుస్తకాన్ని కేటీఆర్ గారు నా సంతకంతో అడిగి తీసుకోవడం అనేది ఇంకో గొప్ప అనుభూతి. 

కేటీఆర్ గారు నా పుస్తకం చదివి తన రివ్యూ ట్వీట్ చేస్తానని చెప్పడం... అది ఇంకో లెవెల్ ఫీలింగ్. 

That's KTR garu... 

Progressive Yet Rooted,
Aggressive Yet Inclusive, 
Administrator Par Excellence
Yet Master Political Strategist,
Torchbearer of New Age Politics,
Icon of Modern Telangana &
Brand Ambassador for Telangana Youth... 

Thanks a bunch, Hon Min KTR garu! 

2 comments: