Monday 23 May 2022

పుష్పవిలాపం!


ముఖ్యమైన అతికొద్దిమంది మిత్రులకు, శ్రేయోభిలాషులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అప్పుడప్పుడు నేను మంచి పూలు, కేక్స్, చాకొలెట్స్, ప్లాంట్స్ వంటివి పంపిస్తుంటాను. 

కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ వల్ల కూడా పంపిస్తుంటాను. అది వేరే విషయం అనుకోండి. 

ఇలా పంపించడం అనేది ఒక్క హైద్రాబాద్‌కే పరిమితం కాదు. పాండిచ్చేరి, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు కూడా.  

కట్ చేస్తే - 

నిన్న నాకు బాగా తెలిసిన ఆత్మీయులైన ఒక జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా, ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ పూలు, కేక్, చాకొలెట్స్, ఒక ప్లాంట్ ఎట్సెట్రా ప్లాన్ చేశాను.  

ఎప్పట్లాగే నేనుపయోగించే రెండు ఆన్‌లైన్ పోర్టల్స్‌కు వెళ్ళాను. జస్ట్ ఒక 3 నిమిషాల పని అది. కాని, నాకే నమ్మశక్యం కాని విధంగా... మొట్టమొదటిసారిగా నేనీ విషయంలో ఫెయిలయ్యాను. 

ఒక పాపులర్ పోర్టల్ అసలు ఎంతకూ చెకవుట్ కానివ్వలేదు. ఇంకో పాపులర్ పోర్టల్‌కు ఆర్డర్ పెట్టాను. అంతా ఓకే అయ్యింది. 2 గంటల్లో వైజాగ్‌లో మీరు చెప్పినవారికి ఇవన్నీ చేరతాయి అని కూడా ఆ పోర్టల్ చెప్పింది. 

నా బిజీ వర్కింగ్ అవర్స్ తర్వాత ఎప్పుడో రాత్రి 10 సమయంలో - ఎందుకో - బై మిస్టేక్ - నా ఈమెయిల్ చూసుకున్నాను.

"సర్విస్ షార్టేజి వల్ల పంపించలేకపోయాము. 7 రోజుల్లో మీ డబ్బులు మీకు రివర్ట్ అవుతాయి" అని మెసేజ్! 

ఏం చేసేదిలేక, అప్పుడు, రాత్రి 10 తర్వాత, ఒక గ్రీటింగ్ రాసి (డిజిటల్లీ చేసి) వారి టైమ్‌లైన్ మీద పోస్ట్ చేసి మళ్ళీ నా పనిలో పడ్డాను... 

నీతి: 
ఇలాంటి "ఆన్‌లైన్ థింగ్స్", "వర్చువల్ థింగ్స్" మీద పెద్ద నమ్మకం పెట్టుకోవద్దు.

ఫోన్ చేసి చక్కగా ఒక 2 నిమిషాలు మాట్లాడి శుభాకాంక్షలు చెప్తే సరిపోతుంది. లేదంటే... లెక్క చూసుకొని, ఒక 2 రోజుల ముందు అందేటట్టుగా, మన సొంత హాండ్ రైటింగ్‌తో గ్రీటింగ్స్ చెప్తూ ఒక ఉత్తరం రాసి "పోస్ట్" చెయ్యాలి. 

ఈ రెండూ ఇచ్చే ఆనందం ముందు ఇంకేదీ పనికిరాదు. 

ఈ డిజిటల్ ఏజ్‌లో నువ్వు చెప్పేది ఎవ్వరిష్టపడతారు అన్నది ఒక బిగ్ క్వశ్చన్.

అయితే - అలా ఇష్టపడేవారు మాత్రమే ఇలా పంపించడానికి అర్హులు అన్నది నా జవాబు. 

7 comments:

  1. నేను కూడా మీ “శ్రేయోభిలాషినే”నండి, హ్హహ్హ 🙂🙂.

    మీరు సూచించిన గ్రీటింగ్ కార్డులు పంపే పద్ధతికి నా సమర్ధన కూడా 👍. అలా చేస్తే personal touch కనిపిస్తుంది. కానీ దాంతో బాటు మీరు పంపిస్తానంటున్న కేకులు, చాక్లెట్లు, బుకేలు 🙂?? అవి పంపించాలంటే ఆన్-లైన్ లో బుక్ చెయ్యడమే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న విధానం కదా. మరి ఆ విధానానికి పైన మీరు చెప్పిన చిక్కులు తప్పవు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి ఆలోచించారు? (అసలు ఇటువంటి app లకు వెంటనే వసూలు‌ చేసిన మన డబ్బుని మనకు వాపసు చెయ్యడానికి ఈ డిజిటల్ కాలంలో కూడా వారంరోజల సమయం ఎందుకో నాకర్థం కాదు. They cannot be that busy?)

    Sent from my iPhone

    ReplyDelete
  2. నా చిన్నతనం లో నాకు లీలగా గుర్తు లైట్ శియాన్ కలర్ లెటర్ (ఇన్‌లాండ్ లెటర్) ఒకటి, లైట్ క్రోమాటిక్ యల్లో (పోస్ట్ కార్డ్) ఉండేవి. విథిన్ స్టేట్ ఐతే ౭౨ గంటలు, ఔటాఫ్ స్టేట్ ఐతే డిస్టెన్స్ బట్టి ఏడెనిమిది రోజులు షుమారుగా అందుకునే వారు. మినిపోలిస్ నుండి ౧౯౯౮ సం. గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. అంతకు మునుపే డెట్రాయిట్ నుండి ౧౯౯౭ ఆగస్ట్ లో ఏయిర్ మెయిల్ అందుకున్నాము. ఐతే అప్పుడు చేతి వ్రాతలతో ఉండే వాటిని చూస్తే సదరు మనిషే మన చెంతకు క్షేమ సమాచారాన్ని స్వయాన వారి దస్తూరిలో అందించారనే ఓ ఆనందం కలిగేది.
    గ్రీటింగ్ కార్డ్ నేతే పోస్ట్ లో పంప వచ్చు మరి ఈ ఈ కాలం లో కేకులు, ఫ్లవర్ బోకెలెలా పంపగలమని వియన్నారాచార్య గారి సందేహం.. సింపుల్.. డెస్టినేషన్ తెలుసు కనుక ఆయా లోకాలిటి లో ఉండే బేకరి, లేదా ఫ్లోరిస్ట్ నంబర్ అందిపుచ్చుకుని వారికి విషయం దెల్పి డెలివరి అయ్యిందని తెలుసుకుని యూపీఐ ద్వార డబ్బులు పంపిస్తే సరిపోతుంది.

    ఇహ మరొకటి..
    మన నుండి డెబిట్ అవ్వటానికి నిమిషాల నిడివి.. మనకు క్రెడిట్ కావాలంఠే రోజుల నిడివి ఎందుకనంటే..

    ఏదైనా ఆన్‌లైన్ లో బుక్ చేసి చెకౌట్ చేశాక పేమెంట్ పేజ్ లో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తే అమౌంట్ డెబిట్ మెసేజ్ నిమిషాల్లో ఓటీపి సహ మనకు తెలుస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్.. కాని మనకు తెలియనిదేమిటంటే ఆ అమౌంట్ డెబిట్ అవ్వటం నిజమే అయితే అవప్పుడే సదరు అకౌంట్ లో క్రెడిట్ కావు. ట్రాంజాక్షన్ ఐడి జెనరేట్ అయ్యి బఫర్ ఫీడ్ లో డిజిటల్ ట్రాన్స్ ఫర్ ఔతాయి. ఆ తరువాత క్రెడిటర్ బ్యాంక్ ఐయఫ్యస్ సీ, లొకేషన్, అకౌంట్ టైప్ తెలుసుకుని ఆ బఫర్ నుండి సెంట్రల్ సర్వర్ కు లావాదేవి డిజిటల్ కీ జనరేట్ ఔతుంది.. ఆ కీ తో పాటు రిఫండ్ రిఫరెన్స్ నంబర్, ట్రాంజాక్షన్ ఐడి జెనరేట్ అయ్యి సదరు బ్యాంక్ వారి ఇంటర్నల్ సిస్టమ్ క్యూ నంబర్ జెనరేట్ చేసి, దానితో పాటు జర్నల్ నెంబర్ క్రియేట్ అయ్యి క్రెడిటర్ బ్యాంక్ సర్వర్ వరకు చేరుతుంది. అక్కడ దానిని రిమిటర్ ఐడి, అకౌంట్ టైప్, యూనిక్ ట్రాంజాక్షన్ ఐడిలను బట్టి ఆయా అకౌంట్ హోల్డర్ తాలుకు అకౌంట్ లో క్రెడిట్ అప్రువల్ కై వేచి ఉంటుంది. అది ఆటోమేటిక్ క్రెడిట్ అయ్యి సదరు కస్టమర్ కు మెసేజ్ ద్వార తెలియ పరుస్తారు. ఇది బ్యాక్ ఎండ్.. ఐతే వీటి నడుమ మరొకటి ఉంది. ఈ నిడివిలో ఆయా సొమ్ము మీదా పదో పరకో ఇంటిరెస్ట్ పోగవుతుంది. ఇది సైలెంట్ ఇంటిరెస్ట్.. ఆయా రోజుల వ్యవధి బట్టి ఇంటర్ బ్రాంజ్ ట్రాంజాక్షన్ ఫీ కింద వాటిని వసూల్ చేస్తారు. ఇది తెలిసి కొన్ని కొన్ని ఈ స్టోర్లు షిపింగ్ చార్జ్ వసూల్ చేస్తు ఉంటాయి.. దీని మూలాన అక్కడ కట్ ఐన సొమ్ము ఇలా రాబట్టుకుంటారన్న మాట.. ఈ ప్రాసెస్ అటు వైపు నుండి కూడా ఇంతే..

    Sent from My Age Old Samsung Galaxy Note 4 Just before Disposing Off.

    ReplyDelete
    Replies
    1. డబ్బులు చేతిలో పడకుండా సరుకు ఎవరు డెలివరీ చేస్తారు, శ్రీధరా?

      నా రెండో పాయింటు మన డబ్బు మనకు రిఫండ్ చెయ్యటానికి అవతలి వాడికి రోజుల తరబడి టైమ్ ఎందుకూ అని? మీరు చెప్పినవన్నీ సాంకేతిక వివరాలు. అవన్నీ కూడా కంప్యూటర్‌లో నెట్-వర్క్ సవ్యంగా ఉంటే సెకండ్లలో జరిగిపోతాయి. Straight Through Processing అనే మాట వినే ఉంటారుగా? ఒకవేళ వస్తున్న ట్రాన్-జాక్షన్లను పోగేసుంచి, గంటకో అరగంటకో ఒకసారి బ్యాచ్ లు బ్యాచ్ లుగా ప్రోసెస్ చేస్తే (batch processing) ఆ గంటో అరగంటో వ్యవధి మాత్రం పడుతుంది అంతే. కానీ నా ప్రశ్న ఏమిటంటే నా డబ్బుని బిగించుకు కూర్చుని వారంరోజుల తరువాత ఇస్తాననడమేమిటి? వాడు ఎప్పుడు ఇచ్చినా మీరు వివరించిన ప్రోసెస్ అంతా సెకండ్లలో జరిగిపోతుంది కదా. వాడు రిఫండ్ ట్రాన్-జాక్షన్ని మొదలెట్టడమే (initiate) ఆలస్యం, దాని కోసం వారం పదిరోజులు తీసుకుంటానంటే ఎలా? అంటే ఎదుటివాడి డబ్బుని కొన్ని రోజులు వాడుకోవడమేగా? నేను మొదట కట్టిన డబ్బు తమ ఎకౌంట్ లోకి వచ్చిందని బ్యాంక్ ఎకౌంట్ చూసి నిర్ధారణ చేసుకోవడానికి మహా అయితే 24 గంటల సమయం చాలదా, రోజుల తరబడి కావాలా?
      డిజిటల్ వ్యాపారస్తులూ జిందాబాద్.

      Delete
    2. 8 రోజులు దాటింది. నాకు మాత్రం ఇంకా రిఫండ్ రాలేదు! :-)

      Delete
    3. నే వ్రాసిన చివరి ఫుట్ నోట్ గమనించలేదనుకుంటా మీరు. అలా వారం పది రోజుల మేరా తీసుకునే వ్యవధి మూలాన దాని మీద ఎంతో కొంత సొమ్ములు వడ్డిగా మరుతాయి వాటిని సైలెంట్ ఇంటిరెస్ట్ లా అందుకుంటాయి బ్యాంక్ లో ఉండే చాంస్ ఎక్కువ. మరో విషయమేమిటంటే బ్యాచ్ ల కింద క్యూ, జర్నల్ నెంబర్ , పారిటి చెక్ డిజిట్లు జనరేట్ అవ్వటానికి కొద్దో గొప్పో సమయం పడుతుంది. 18001234 డెయిల్ చేసి తక్కిన వివరాలు తెలుసుకోవచ్చును. అవి కూడా సర్వర్ లన్ని యాక్టివ్ ఉండాలి. అందుకే రోజుల తరబడి. అదీను బిజినెస్ డేస్.

      Delete
    4. సీఓడీ మోడ్ లో, అమేజాన్, ఫ్లిప్ కార్ట్ మొదలగు ఈ కామర్స్ సైట్లు డబ్బులు చేతిలో పడకుండానే సరుకు డెలివరీ చేస్తారు. ఐతే ఇందులో చిన్న కిటుకు ఉంటుంది. ఈ-కామర్స్ సైట్లైతే ఆర్డర్ అందుకున్నాక కొరియర్ వాడు సదరు సెల్లర్ కు క్యాష్ రూపంలో అందజేసుకుంటు, అలా అలా చివరిన కష్టమర్ అందించే క్యాష్ రివర్స్ పాత్ లో చివరాఖరున ఈ-కామర్స్ సైట్లు అందుకుంటాయి. కోవిడ్ మూలాన 25.03.2020 నుండి డిజేబల్ చేసి ఉంది, వియన్నాచార్య

      Delete