Sunday 18 September 2022

సముద్రం నాకిష్టం


"కొన్ని జ్ఞాపకాల్ని 
అంత ఈజీగా మర్చిపోలేం. 
అంత ఈజీగా తుడిచివేయలేం.
 
అవి పోవాలంటే పోతాయ్...
కాని, మనతో పాటే." 

కట్ చేస్తే -

 హైద్రాబాద్‌లో అన్నీ ఉన్నాయి. ఒక్క సముద్రం తప్ప.

ఆమధ్య కేసీఆర్ ఏపీనుంచి ఏదో పోర్ట్ ఎత్తుకొస్తారని విన్నాను.

ఆ పని చేస్తారో లేదో గాని, దానికి బదులు వైజాగ్ నుంచి సముద్రం ఎత్తుకొస్తే బాగుండునని నేను చాలాసార్లు అనుకొన్నాను. :)

సముద్రమంటే నాకు అంత ఇష్టం.

కట్ టూ వైజాగ్ - 

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మేమున్న నాలుగు రోజులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి.

1987లో అనుకుంటాను, నేను వైజాగ్ మొట్టమొదటిసారిగా వెళ్లాను...

తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లానుగానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.


వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది.

ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి.

ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు.

దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

సముద్రం నా ప్రేయసి. 

సముద్రం నా ఆత్మ. 

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్... 

3 comments:

  1. 3 మంత్స్ వరకు రాను అన్నారు .
    మూడు వారాలకే మిస్ అయిపోయారా ??
    సినిమా ఇండస్ట్రీ లో ఉండే డార్క్ విషయాలు గురించి కూడా రాయండి సర్ అప్పుడప్పుడు

    ReplyDelete
  2. If you see any beach in completely remote villages, you can enjoy more than vizag.

    ReplyDelete
  3. గంభీరమైన సముద్రం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ హోరులో మనకు వేరే ఆలోచనలు రావు.

    ReplyDelete