Wednesday 10 April 2019

వొక మానసిక వైకల్యం

కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. సైకియాట్రీలో దానికి తప్పక ఏదో ఒక శాస్త్రీయనామం ఉండే ఉంటుందని నా నమ్మకం.

అసలిలాంటి అంశంపైన ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, రాయడం అవసరం అనిపించి రాస్తున్నాను.

కట్ టూ పాయింట్ - 

బ్లాగ్ అనేది ఆ బ్లాగర్ వ్యక్తిగత ఆలోచనలకు మిర్రర్.

బ్లాగర్ రాసే అంశం ఏదైనా కావొచ్చు, ఖచ్చితంగా అది ఆ బ్లాగర్ వ్యక్తిగత దృక్పథాన్ని, ఆలోచనాధోరణిని తెలుపుతుంది.

అది పర్సనల్ కావొచ్చు. పబ్లిక్ లైఫ్‌కు సంబంధించినది కావొచ్చు. ఒకసారి ఆ అంశం పబ్లిక్‌లోకి వచ్చిందంటే దానిమీద కామెంట్ చేసే స్వేఛ్ఛ ప్రతి బ్లాగ్ రీడర్‌కు ఉంటుంది.

ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఉంటుందని నేననుకోను.

అయితే, కామెంట్ అనేది ఆ నిర్దిష్టమైన బ్లాగ్ పోస్ట్‌లో చర్చించిన అంశంపైనే సూటిగా ఉండాలి. నిర్మాణాత్మకంగా, డిగ్నిఫైడ్‌గా ఉండాలి.

అంతే తప్ప, బ్లాగ్‌లో రాసిన అంశాన్ని పక్కనపెట్టి, దాని మీద చర్చించే సామర్థ్యం/జ్ఞానం లేక, ఏదో ఒక అర్థంలేని చెత్త కామెంట్ పెట్టడం ఆయా వ్యక్తుల మానసిక వైకల్యాన్నే తెలుపుతుంది.

బ్లాగ్‌లో రాసిన విషయం అబధ్ధం .. అసలు నిజం ఇది అని చెప్పగలగాలి. విశ్లేషణ చేయగలగాలి. ఏదైనా డేటా ఉంటే ఇవ్వగలగాలి. అలా, బ్లాగ్‌లో రాసిన టాపిక్‌పైన ఎంతైనా చీల్చి చెండాడవచ్చు. ఆ హక్కు కామెంటర్‌కు ఉంటుంది.

కాని, అది నిర్మాణాత్మకంగా ఉండాలి. 

అంతే తప్ప, టాపిక్‌ను పక్కనపెట్టి వ్యక్తిగతంగా ఏదో అసంబధ్ధమైన కామెంట్ చేయడం, లేదా ఏదో ఒక సంబంధం లేని  విషయాన్ని కామెంట్‌గా పెట్టడం అనేది సరైన పధ్ధతి కాదు. 

ఇలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు.

నా ఇన్నేళ్ల బ్లాగింగ్ లైఫ్‌లో ఇలాంటివాళ్లు కూడా కొందరు నాకు ఎదురయ్యారు.

నేను చాలా ఓపికగా వీరి కామెంట్స్‌కు కూడా జావాబిస్తాను. కాని, ఒక పరిధి దాటిన తర్వాత ఏం చేయలేం.

అదొక మానసిక వైకల్యం అనుకొని వారినలా వదిలివేయటం, బ్లాక్ చేయటం తప్ప. 

2 comments:

  1. దీన్ని మాలికలోను, శోధినిలోను శాశ్వతంగా ఒక చోట అందరికి కనిపించేలా ఉంచితే బావుంటుంది. రచయితలకి, పాఠకులకి కూడా ఉపయుక్తం.

    ReplyDelete
    Replies
    1. ఈ మహత్కార్యం చేయడానికి మీలాంటివారే పూనుకోవాలి. నేనుగా అడగటం బాగుండదు.

      అన్యగామి ... ఈ పేరు చాలా బాగుంది.

      Thank you for your comment.

      Delete