Sunday 17 March 2019

రాక్షస రాజకీయం!

తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 'పొలిటికల్ సీజన్' మంచి వూపులో ఉన్నప్పుడు నాలుగు మాటలనుకుంటారు. నాలుగు ఆరోపణలు చేసుకుంటారు.

అది సహజం.

మళ్లీ ఎక్కడయినా ఎదురైనప్పుడో, లేదా .. ఏదో పనిమీదో, ఫంక్షన్‌లోనో కలిసినప్పుడు "ఆన్నా, బాగున్నావే" అని మర్యాదగా, ప్రేమగా పలకరించుకుంటారు.

రాజకీయాలు వేరే. స్నేహాలు, బంధుత్వాలు వేరే.

అన్నిటికంటే ముందు మానవత్వం ఇక్కడ పరిమళిస్తుంది.

కట్ చేస్తే - 

ఈ మధ్య నేను ఎక్కువగా ఆంధ్రలో నా వ్యక్తిగత, వృత్తిగత పనులమీద ఎక్కువగా తిరుగుతున్నాను.

నా వృత్తిగత పనులు కొన్ని డైరెక్టుగా రాజకీయాలతోనే ముడిపడి ఉన్నందువల్ల .. చాలా దగ్గరినుంచి ఆంధ్ర రాజకీయాలను, రాజకీయనాయకులను, బేసిగ్గా అక్కడి రాజకీయరంగాన్ని బాగా స్టడీ చేసే అవకాశమొచ్చింది.

తప్పయితే క్షమించండి, కానీ, వ్యక్తిగతంగా నాకయితే నచ్చలేదు.

చెప్పే మాట వేరు. చేసేది పూర్తిగా దానికి ఉల్టా ఉంటుంది. లేదా అసలేం జరగదు. ఇంచ్ కదలదు.

ప్రామిస్‌లకు విలువ అస్సలు లేదు.

ఒక అభ్యర్థిని ఒక ఎమ్మెల్లేనో, పార్లమెంటు స్థానానికో ఎన్నిక చేసినట్టు చెబుతారు. అన్ని పేపర్లు, వివరాలు తీసుకుంటారు. నామినేషన్స్ కూడా వాళ్లే ఫిలప్ చేసి, సంతకాలు తీసుకొని రెడీగా పెడతారు. తెల్లారితే "జాబితా ప్రకటన .. ఇంకేం మార్పుల్లేవ్ .. ఉండవ్" అనుకుంటాము. వాళ్లూ అదే చెబుతారు.

తెల్లారుతుంది. జాబితాలో పేరుండదు!

2019 లో, ప్రపంచం అంతా ఒక మంచి "న్యూ ఏజ్" పాజిటివ్ మార్పుకోసం తపిస్తోంటే, ఇక్కడ మాత్రం 65 దాటిన, మృదుస్వభావి అయిన, ఒక పొలిటికల్ లీడర్‌ను అతి కిరాతకంగా నరికేస్తారు.

శరీరంపైన కత్తి గాట్లు, గొడ్డలివేట్లున్నా - దాన్ని ముందు "కార్డియాక్ అరెస్ట్" అంటారు. తర్వాత హత్య అంటారు.

రోజంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది.

తెల్లారి రెండు పార్టీలవారు ఎవరి ఎన్నికల ప్రచారానికి వారు హెలికాప్టరేసుకొని ఎగిరిపోతారు.

వారి మాటలను నమ్మి లక్షలు, కోట్లు ఖర్చు చేసి అన్ని కోల్పోయినవారు వీధినపడతారు. అప్పటిదాకా 'ఆహా ఓహో' అన్నవారు అసలు పట్టించుకోరు. అలా సర్వం కోల్పోయినవాడు పైస పైసకు వెతుక్కుంటూ చావలేక బ్రతుకుతుంటాడు.

ఇదే ఉదాహరణ తెలంగాణలో అయితే - ఏకంగా కేసీఆర్ మీదే పోటీచేసి సర్వం కోల్పోయిన లీడర్‌ను అతని పార్టీ పట్టించుకోలేని పరిస్థితిలో, టీఆరెస్సే ఆహ్వానించి అక్కునచేర్చుకొంది. ఆదుకొంది.

కట్ టూ ఇంకో చిన్న ఉదాహరణ -

నామినేషన్ వేయకముందే అధికారపార్టీ బెదిరింపులు, కాల్స్ మొదలౌతాయి. ఇంటికి పోలీసులొస్తారు. యస్పీ స్వయంగా ఆ అభ్యర్థికి కాల్ చేస్తాడు. ఇంకొకడు కాల్ చేసి "చావాలనుందా" అని టెర్రరైజ్ చేస్తాడు.

ఇన్నీ ఎదుర్కొని, నానా కష్టాలు పడ్ద తర్వాత - ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం టిక్కెటుండదు!

తెలంగాణలో రాజకీయాల్లేవని కాదు. కానీ, ఇంత ఘోరంగా మాత్రం లేవు.

నరుక్కొవడాలు, చంపుకోవడాలు అస్సల్లేవ్.

అంతెందుకు .. ఉద్యమసమయంలో విద్యార్థులను వెంబడించి కొట్టినవారిని, కేసీఆర్‌ను, టీఆరెస్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టినవారిని కూడా .. రాష్ట్రం ఏర్పడ్ద తర్వాత గతమంతా మర్చిపోయి, పార్టీలోకి తీసుకొన్నారు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

ఏం చేసినా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే.

అలాగే - పార్టీలు మారినా, ఏం చేసినా రక్తపాత రహితంగా.

అన్ని కోట్లమందితో, అంత సెన్సిటివ్ తెలంగాణ ఉద్యమాన్ని సహితం నడిపి సాధించింది కూడా రక్తపాత రహితంగానే.

హాట్సాఫ్ టూ కేసీఆర్!

రాజకీయాలు ప్రజలకు సేవచేయడానికే తప్ప ఇట్లా నిలువెత్తు  రాక్షసత్వం చూపడానికి మాత్రం కాదు. 

9 comments:

  1. తెరాసలో స్వంత బాబాయి ఫోటో కూడా లేకుండా ప్రచార పోస్టర్లు వేస్తున్నారు కదా ? ఒక మనిషి బ్రతికుండగానే ఇగ్నోర్ చేస్తే చంపినట్లే కదా ? కత్తితో పొడిచి చంపితే గానీ రాజకీయమా ?

    ReplyDelete
    Replies
    1. మీరంటున్నదెవరిగురించో నాకర్థం కాలేదు. వివరంగా చెప్పగలిగితే సంతోషం.

      Delete
    2. @MANOHAR CHIMMANI:

      వారు రాసింది నారా రామమూర్తి నాయుడు (చంద్రబాబు తమ్ముడు అనగా లోకేష్ బాబాయి) గురించేమోనండీ!

      Delete
    3. నిన్న కరీం నగర్ సభలో గానీ ప్రచార పోస్టర్ లో గానీ హరీష్ రావుగారు కనబడుటలేదు.కారణం ఏమిటి ?

      Delete
    4. నీహారిక గారూ, ఆ తరువాత జరిగిన నిజామాబాదు సభలో కేటీయార్ ఫోటో ఉన్నట్టు లేదు, కవిత మాత్రమే కనిపించింది. ఇది కూడా సైడులైను కావొచ్చా?

      Delete
    5. ఊళ్ళో అందరూ కుటుంబ పార్టీ అంటున్నారని హరీష్ రావుగారిని సైడ్ అయిపోమన్నారు. కేటీఆర్ ని గానీ కవితని గానీ సైడ్ అవ్వమనే ధైర్యం ఎవరికైనా ఉందా ? పసుపు రైతులు కవితక్కని సైడ్ కి తోస్తారేమో ?

      Delete
    6. మంద కృష్ణ మాదిగ, ర్యాగ కృష్ణయ్య, గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, చుండ్రు సుహాసిని, బండ్ల గణేష్, లగడపాటి రాజగోపాల్, ఇలా ఒకరి తరువాత ఇంకొకరి మీద ఆశ పెట్టుకోవడం, అవన్నీ ఉత్తుత్తి అడియాసలే కావడం ఇదంతా షరా మామూలే. "పచ్చ తోరణాలు" తాజాగా హరీష్ రావు మీద గంపెడంత ఆశ పెట్టుకున్నారు!

      Delete
  2. బాబాయి కాదు పొరపాటు వ్రాసాను.

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ, బాబాయి అంటే రామమూర్తి నాయుడు అనుకున్నా.

      మెదక్ జిల్లా సభలో హరీష్ రావు కనిపించకపోతే అప్పుడు చూద్దాం.

      Delete