Sunday 10 March 2019

ఔర్ ఏక్ ధక్కా .. 16 పక్కా!

"When Politics Decides Your Future, Decide What Your Politics Should Be!"

ఎవరి కొటేషనో తెలియదు. కాని, దీన్ని ఆమధ్య ఇప్పటి మన టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫేస్‌బుక్ పేజీ మీద కూడా చూశాను.  


సవాలక్ష పనికిరాని రొటీన్ కొటేషన్లలో ఇదొకటి కాదు. తప్పనిసరిగా అందరూ పట్టించుకోవల్సిన కొటేషన్. బాగా ఆలోచించాల్సిన కొటేషన్.

ముఖ్యంగా, బాగా చదువుకున్నవాళ్లు మరింతగా అలోచించాల్సిన కొటేషన్ ఇది.

ఎందుకంటే - స్టాటిస్టిక్స్ ప్రకారం, రాజకీయాలపట్ల పూర్తి నిరాసక్తంగా ఉండే ఒకే ఒక్క అత్యంత బాధ్యతారాహిత్యమైన సెగ్మెంట్ ఈ బాగా చదువుకున్నవాళ్లే!

రాజకీయాల్ని అసలు పట్టించుకోరు. వోటింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లరు.

అంత నిరాసక్తత.

ఈ ఒక్క సెగ్మెంట్ నిరాసక్తతే ఈ రోజు మన దేశాన్ని ఎందుకూ పనికిరానివాళ్లు దశాబ్దాలుగా పాలించడానికి కారణమైంది. దేశం ఎన్నోరకాలుగా వెనకబడటానికి కారణమైంది. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా - ఇంత జనాభా, మానవ వనరులు, సహజ వనరులు ఉండి కూడా, ఈ దేశం ఇంకా ఒక 'అభివృధ్ధిచెందుతున్న దేశం' గానే ఉండటానికి కారణమైంది.

సోషల్ మీడియా పుంజుకున్న తర్వాత ఈ విషయంలో కొంతయినా మార్పు వచ్చిందనే అనిపిస్తోంది. అయితే ఈ మార్పు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకూడదు. రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో రావాలి.

దానికి ఇదే సరైన సమయం. 

కట్ టూ మన 16 పార్లమెంట్ స్థానాలు - 

మొట్టమొదటిసారిగా ఒక పూర్తిస్థాయి విభిన్న రాజకీయనాయకున్ని కేసీఆర్‌లో చూస్తున్నాము. 

ఒక దార్శనికుడుగా, ఒక మానవీయమూర్తిగా ఆయన ప్రవేశపెట్టిన/చేసి చూపించిన అనేక ప్రజాసంక్షేమ పథకాలు, అభివృధ్ధి పనులు ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.

కేంద్రప్రభుత్వం కూడా!

ఉద్యమకాలంలో కేసీఆర్‌ విశ్వరూపం ఒక ఎత్తు కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వివిధ కోణాల్లో అనితరసాధ్యమైన ఆయన సామర్థ్యం మరొక ఎత్తు.

కేసీఆర్‌లోని ఈ విభిన్నత, ఈ వైవిధ్యమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా టీఆరెస్ అద్భుత విజయం సాధించడానికి కారణమైంది.

ఇదే స్థాయి విజయాన్ని, రెట్టించిన ఉత్సాహంతో, రేపు లోక్‌సభ ఎన్నికల్లో కూడా సాధించాలి. అప్పుడే టీఆరెస్ విజయం సంపూర్ణమౌతుంది.

లోక్‌సభ స్థానాలకు సంబంధించి, తెలంగాణలో టీఆరెస్‌కు గట్టి పోటీ ఇచ్చే పార్టీలు అసలు లేవు.

ఇక్కడ పోటీ టీఆరేస్‌కు టీఆరెస్‌తోనే.

రేపు టీఆరేస్‌ పోటీచేయబోయే 16 స్థానాల్లో, ఏ స్థానంలో ఎవరెక్కువ మెజారిటీ సాధిస్తారన్నదే అసలు పోటీ.

ఏప్రిల్ 11 పోలింగ్, మే 23 ఫలితాలు.

మస్త్ మజా ఆయేగా ...  

No comments:

Post a Comment