Wednesday 6 February 2019

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ అభ్యర్థులు!

62 ప్యూన్ ఉద్యోగాలు పడ్డాయి.

అదీ పోలీస్ డిపార్ట్‌మెంట్లో.

ఈ 62 మెసెంజర్-కమ్-ప్యూన్ ఉద్యోగాలకు రికార్డ్ స్థాయిలో 93,000 మంది నిరుద్యోగులు అప్లైచేసుకున్నారు.

ఎంతమంది అప్లై చేసుకున్నా తప్ప్పులేదు.

కానీ, ఈ 93,000 మందిలో -
3,700 మంది పీహెచ్‌డీ చేసినవాళ్లున్నారు.
28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లున్నారు.
50,000 మంది గ్రాడ్యుయేట్లున్నారు.

ఈ ప్యూన్ ఉద్యోగానికి కావల్సిన రెండే రెండు ప్రాథమిక అర్హతలు ఇవి:
1. సైకిల్ తొక్కడం రావాలి.
3. 5వ తరగతి చదువుకొని వుంటే చాలు.

ఎక్కువమంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడా ప్యూన్ ఉద్యోగాల సెలెక్షన్స్‌కు నానా రకాల టెస్టులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు.

కట్ చేస్తే - 

ప్యూన్ ఉద్యోగం అంటే 'చేయకూడని ఉద్యోగం' ఏమీ కాదు.

ఏ పని విలువ దానిదే.

కాకపోతే, '5 వ తరగతి చదివితే చాలు' అనే స్థాయి ఉద్యోగాలు చేయడం కోసం పీహెచ్‌డీలు, పీజీలు, డిగ్రీలు చేయాల్సినపనిలేదు.

గవర్నమెంటుకు నష్టం. మనకూ నష్టమే.

డబ్బూ, సమయం కూడా ఎంతో వృధా.

నిజానికి .. తిట్టాల్సింది 71 ఏళ్లుగా మన దేశాన్ని పాలించిన ప్రభుత్వాలను, ఆయా ప్రభుత్వాల్లో పనిచేసిన విద్యామంత్రిత్వ శాఖలను. మొత్తంగా మనవాళ్ళు అస్సలు పట్టించుకోని మన విద్యా వ్యవస్థని.

అభివృధ్ధి చెందిన దేశాల్లో .. స్కూలు స్థాయినుంచే చదువుకొంటూ పనిచేసుకొని డబ్బులు సంపాదించుకొనేట్టుగా అలవాటుచేసే ఒక డిసిప్లిన్ అక్కడి విద్యావ్యవస్థల్లో ఉంది.

'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ఆయా దేశాల్లో ఉంది.

ఎవరు ఏ క్షణమైనా చదువు మానేసి, తమకు ఇష్టమైన పని చేసుకొని బ్రతకగలిగే ఆత్మవిశ్వాసాన్ని అక్కడి విద్యావ్యవస్థలు అందిస్తున్నాయి.

బిల్ గేట్స్‌లూ, జకెర్‌బర్గ్‌లూ అలాగే తయారయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగాలకోసం ముసలోళ్లు అయ్యేదాకా ఎదురుచూస్తూ వారి సమయం వృధాచేసుకోలేరు.

మరిక్కడ .. మనదగ్గరో?

సిగ్గుపడాలి ...

71 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఒక దేశం ఇంకా "అభివృధ్ధిచెందుతున్న దేశం" గానే ఉంది.

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ చేసినవాళ్లు కూడా అప్లై చేసుకొంటున్నారు ... 

ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే కాదన్న కామన్‌సెన్స్ ఇవ్వలేని మన విద్యావ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతోంది.

కట్ చేస్తే - 

ఈ 62 ప్యూన్ ఉద్యోగాలు పడింది ఎక్కడో చెప్పలేదు కదూ?

ఉత్తరప్రదేశ్‌లో.  

2 comments:

  1. Everyone wants government job. Assured income and pension light work and that too if one wishes to do with zero accountability, dollops of holidays.

    ReplyDelete
  2. . . . ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే కాదన్న కామన్‌సెన్స్ ఇవ్వలేని మన విద్యావ్యవస్థ . .

    ఒకప్పుడు మా అమ్మగారు (ఆవిడ ఆట్టే చదువుకోలేదు) గవర్నమెంటు ఉద్యోగం లేదా అని అడిగే వారు, మా చెల్లెళ్ళకు మేము చూస్తున్న సంబంధాలను గురించి. పరిస్థితిలో కొంతమార్పు వచ్చిన మాట నిజమే కాని ఆ మార్పు తగుమాత్రంగా లేదనే అనిపిస్తోంది.

    ఒకసారి (60ల చివర్లో) నాకంటే రెండేళ్ళు సీనియర్ అబ్బాయి ఒకడు మానాన్నగారి దగ్గరకు M.O ఫార్మ్ కాబోలు పూర్తిచేయటానికి సహాయంకోసం వచ్చాడు. ఆయనకు బాగా విచారం కలిగింది. ఏంచదువులు చెబుతున్నాం మనం! పిల్లలకు ఫారాలు నింపుకోవటం కూడా రావటం లేదు! అశోకుడి గురించీ ఇంగ్లీషు గ్రామరు గురించీ ఎంత చెప్పినా చివరకు కరెంటుపోతే ఫీజు వేసుకోవటం కూడా రానివాళ్లను తయారు చేస్తున్నాయీ చదువులు అని బాధపడ్డారు.

    బ్రతకటానికి పనుకొచ్చే చదువులు కాకపోయేసరికి పీహెడీలూ ప్యూన్ ఉదోగాలకు రావలసి వస్తోంది. చాలాయేళ్ళ క్రిందట సంస్కృతంలో పీహెడీ చేసిన ఒకతను యూనివర్శిటీమీద కేసువేసాడు! నాకు వీళ్ళు యేళ్ళపాటు నేర్పిన సంస్కృతం జీవనోపాధికి పనికిరావటంలేదూ - నన్ను ములగచెట్టు ఎక్కించి డాక్టరేట్ దాకా తోసిన యూనివర్శిటీదే ఆ నేరం అని!

    ReplyDelete