Sunday, 13 January 2019

జీవితం ఎవ్వరినీ వదలదు!

అవును ..

జీవితం ఎవ్వరినీ వదలదు.

ఊహించనివిధంగా ఏదో ఒక దశలో ఒక చూపు చూస్తుంది.

అప్పుడు తెలుస్తుంది, అసలు జీవితం ఏమిటో.

మొన్నటి నవంబర్ 25 సాయంత్రం నుంచి, ఈ రాత్రివరకు నా జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో ..

నాకత్యంత ప్రియమైన నా చిన్నతమ్ముడి ఆకస్మిక మరణం అందులో ఒకటి.

నాకు నచ్చని ఒక సామాజిక వ్యవస్థ, ఆ సో కాల్డ్ సమాజం పట్ల మన మైండ్‌సెట్ .. నా తమ్ముడిని ఎంతో మానసిక వ్యధకు గురిచేశాయి.

వాడు నాకు మళ్లీ కనిపించనంత దూరం చేశాయి.

డిసెంబర్ 27, 2016 .. సరిగ్గా 2 సంవత్సరాలక్రితం, మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది.

జీవితం చాలా చిన్నది అని చెప్తూ, మొన్న డిసెంబర్ 16 నాడు, నా చిన్నతమ్ముడు శ్రీనివాస్ కూడా, చాలా చిన్నవయసులో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు.

కట్ చేస్తే - 

ఎంతోమంది గురించి నా బ్లాగ్ లో, ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో ఎంతో రాశాను, పోస్ట్ చేశాను.

కానీ, నాకెంతో ప్రియమైన నా చిన్నతమ్ముడి గురించి మాత్రం ఏం రాయలేకపోతున్నాను.

వాసూ, నిన్ను కాపాడుకోలేకపోయాను .. కానీ, నువ్విలా చేసివుండాల్సిందికాదు, బతికున్నంతకాలం నేను బాధపడేలా ..

No comments:

Post a Comment