Saturday 27 October 2018

అనుభవిస్తేనేకానీ తెలీని నిజం

ఎంత వద్దనుకున్నా కొన్ని అనుభవాలు మన జీవితంలో ఒక సునామీని సృష్టిస్తాయి.

మనచేతుల్లో ఏదీ ఉండని, ఏ ఒక్క పనీ జరగని ఒక విచిత్రమైన పరిస్థితిని క్రియేట్ చేస్తూ.

ఇలాంటివాటిని నేను అస్సలు నమ్మను.

ఇప్పటికి కూడా!

మనలోనో, మన ప్రయత్నంలోనో, మన నిర్ణయంలోనో ఉంటుంది తప్పు. మన పనివిధానంలోనో, మన చుట్టూ మనం క్రియేట్ చేసుకొన్న వాతావరణంలోనో ఉంటుంది తప్పు.

ఈ తప్పు బయటి వ్యక్తులవల్లనో, పరిస్థితులవల్లనో కూడా జరగొచ్చు.

ఈ తప్పుని గుర్తించడం మాత్రం అంత ఈజీ కాదు.

గుర్తించినా, చాల్లాసార్లు మన ఈగో ఒప్పుకోదు. మనకిలాంటి ఈగో ఉందన్న నిజాన్ని మన మనసొప్పుకోదు.

అయితే, ఈ లాజిక్కులెలా ఉన్నా, ఈ నిజాల్ని ఒప్పుకొనే సమయం కూడా మనకొస్తుంది. కానీ అప్పటికే మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని మనం కోల్పోయుంటాము.

ఇష్టం లేకపోయినా సరే, అప్పుడు చెప్తాము. ఒక్కటే మాట.

సరెండర్.

దేవుడు గుర్తుకొస్తాడు. లేదా మనకు తెలీని ఆ శక్తి ఏదో గుర్తుకొస్తుంది.

సరెండర్.

అంతే ఇంకేం చేయలేం.

ఇలా మనల్ని సరెండర్ చేయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఒకటిరెండు విషయాలకు మాత్రమే ఉంది.  వాటిలో ప్రధానమైనది ...

డబ్బు.

జీవితంలో ఏం జరిగినా జాంతానై. డబ్బు డబ్బే!

ఈ ఒక్కవిషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌కు తావులేదు. బంధువులైనా, మిత్రులైనా, శత్రువులైనా, శ్రేయోభిలాషులైనా.

ఎవరైకైనా సరే, అనుభవిస్తేనేకానీ తెలీని నిజం మన జీవితంలో ఇదొక్కటే.

డబ్బుదగ్గర ఏ లాజిక్కులూ, ఏ నమ్మకాలూ, ఏ వ్యక్తిత్వాలూ, ఏ రిలేషన్లు పనిచేయవు. నిలవవు.

మన అనుభవంలోకి వచ్చేవరకూ ఈ నిజాన్ని మనం అస్సలు నమ్మలేం.

దటీజ్ ద పవరాఫ్ డబ్బు! 

No comments:

Post a Comment