Sunday 1 April 2018

కేసీఆర్ ప్రధానమంత్రి అయితే... 2

కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఎప్పట్లాగే ఆ కథ తర్వాత మాట్లాడుకుందాం. 

దీనికంటే ముందు, ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాలను మనం గుర్తు చేసుకుందాం.

అలోచిద్దాం.

ఆ తర్వాతే, జాతీయస్థాయి రాజకీయాల్లో కేసీఆర్ గారి రంగప్రవేశం గురించి చర్చిద్దాం.

మనకు బ్రిటిష్‌వాళ్లనుంచి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయింది. ఈ 70 ఏళ్లలో సింహభాగం ఒక్క కాంగ్రెస్ పార్టీనే మన దేశాన్ని పాలించింది. 

నెహ్రూ నుంచి మొదలైంది కథ. 


నెహ్రూ సొంత ప్రయోజనాలు, ఐక్యరాజ్యసమితి స్థాయిలో పేరు కోసం పిచ్చి, పంచశీల వంటి పనికిరాని సొల్లుతో భారత్ అటు చైనాకు కొంత, ఇటు పాకిస్తాన్‌కు కొంత భూభాగం వదులుకొని, చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది.

ఈ రెండు దేశాలతో అప్పటినుంచి
 ఆ రావణకాష్టం ఇంకా రగులుతూనే ఉంది.

70 ఏళ్లు దాటినా.  


ఐరన్ లేడీ గా ప్రసిధ్ధిగాంచిన ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడం వంటి కొన్ని అత్యంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా, అత్యధిక కాలం 
 దేశాన్ని పాలించినా .. ఎమర్జెన్సీ విధించడం వంటి అతి ఘోరమైన తప్పిదాలు కూడా ఆమె హయాంలో జరిగాయి. 


తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఆమె పరోక్ష ప్రోద్భలంతో ఎదిగిన భింద్రన్‌వాలే వల్లనే చివరకు ఆమె దారుణ హత్యకు గురైంది.


ఇదే తరహాలో .. పైపై మెరుగులు, పేరు కోసం తీసుకొన్న అత్యంత తప్పుడు అంతర్జాతీయ పాలసీ నిర్ణయాలవల్ల రాజీవ్ గాంధీ కూడా ఎల్‌టిటిఇ చేతుల్లో ఘోరంగా హతమయ్యారు.

ఇంకో కోణంలో, వాళ్లు అసలు ఏ పార్టీ అన్నది కాదు ఇక్కడ పాయింటు. 


మన దేశ ప్రధానులు ఎంత ఘోరమైన హత్యలకు గురయ్యారు .. అందుకు దారితీసిన రాజకీయ కారణాలేంటి అన్నదే ప్రశ్న.  

1947 నుంచి ఈ రోజువరకు కూడా - కాంగ్రెస్ సృష్టించి, పెంచిపోషిస్తున్న సూడో సెక్యులరిజం కారణంగానే దేశం నానా కంగాళీ అయింది. అర్థంలేని అపోహలు, అభద్రతాభావాలు ప్రజలమధ్య పెరిగిపోయాయి. 


ఈ స్థితే దేశంలో ఇంకా కొనసాగుతోంది.

ఈ స్థితే దేశంలోని అన్నిరంగాల్లో ఒక పెద్ద అభివృధ్ధి నిరోధకమై కూర్చుంది. 


రెండో ప్రపంచయుధ్ధంలో సర్వం కోల్పోయిన దేశాలు, మూడు దశాబ్దాలక్రితం కరువు కాటకాలతో విలవిల్లాడిన దేశాలు, మన దేశంలో ఉన్న అన్నిరకాల వనరులతో పొలిస్తే ఏ విధంగానూ సరితూగని అతి చిన్న చిన్న దేశాలు ఎన్నో మనం చూస్తుండగానే ఈ 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. అభివృధ్ధి చెందిన దేశాలయ్యాయి. ధనిక దేశాలయ్యాయి.  

అత్యధిక జనాభా, అన్నిరకాల వనరులు, అత్యుత్తమ మేధోసంపత్తి ఉన్న మన దేశం మాత్రం 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఒక "అభివృధ్ధి చెందుతున్న దేశం" గానే ఉండటం నిజంగా సిగ్గుచేటు. 


దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలకోసం వాళ్లు తీసుకొన్న అత్యంత తప్పుడు నిర్ణయాలు, సృష్టించిన పనికిరాని పాలసీలు .. ఇవే మన దేశం ఇప్పటికీ ఇంకా ఒక అభివృధ్ధిచెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణాలు. 

మినహాయింపు ఒక్కటే ...

అది మన తెలంగాణ బిడ్డ, తెలుగువాడు .. పి వి నరసింహారావు. 


దేశం ఆర్థికస్థితిగతుల్ని మార్చడానికి దేశ ప్రధానిగా అప్పుడు పి వి తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలవల్లనే కనీసం దేశం ఇప్పుడీ స్థితిలో ఉంది. 


అలాంటి మన పి వి మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు లేవు. కనీసం ఆయనకు ఢిల్లీలో సమాధిస్థలం కూడా లేదు. 


ఈ వివక్షను మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రశ్నించారో లేదో, ప్రశ్నించకపోతే ఎందుకని ప్రశ్నించలేదో, అసలంత దమ్ము వాళ్లకున్నదో లేదో నాకు తెలియదు. 

కట్ టూ కేసీఆర్ - 

"ఈ దేశంలో ఇక ఎప్పుడూ ఇంతే" అని అందరికీ ఒక రొటీన్‌గా అలవాటైపోయిన ఇలాంటి అత్యంత దయనీయ, స్వార్థపూరిత, స్థబ్ద రాజకీయాల్లో ఒక ఖచ్చితమైన గుణాత్మకమైన మార్పు ఇప్పుడు అవసరం. 


ఆ మార్పునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురావాలనుకొంటున్నారు. 


ఆ మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకొంటున్నారు. 


అయితే రాష్ట్రం వేరు, దేశం వేరు. 


అంత సులభం కాదు. 


అలాగని అసాధ్యం కూడా కాదు. 


ఆ దిశలో ముందొక అడుగు పడాలి.  


ఆ అడుగు మన కేసీఆర్ వేయడం నిజంగా హర్షణీయం.  

కట్ చేస్తే - 

అందరి దృష్టీ ఢిల్లీలో ఉన్న గద్దె మీదే తప్ప దేశం కోసం ఆలోచించేవాళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? 

స్పీచుల్లోనే తప్ప చేతల్లో ఎక్కడుంది అభివృద్ధి? 

అసలు దేశంలో ఎక్కడ ఏముంది? ఎక్కడ ఏ సమస్యలున్నాయి? ఎందుకున్నాయి? వాటికి పరిష్కారం ఏంటి?... అన్న ఈ ప్రాథమిక విషయాలపై ఎంతమంది రాజకీయ నాయకులకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది? 

ఉంటే ఎందుకు మాట్లాడరు? ఎందుకు చేయరు? 

ఎంతసేపూ ప్రజల నిత్యజీవితంతో, అభివృద్ధితో సంబంధం లేని పనికిరాని విషయాలేనా? లేని సమస్యల్ని సృష్టిస్తూ విద్వేషాలను పెంచుకుంటూపోవడమేనా?   

కేసీఆర్‌కు ఈ దేశ భౌగోళిక పరిస్థితులు తెలుసు. సహజవనరుల సంపద తెలుసు. సమస్యలౌ తెలుసు, వాటి మూలాలు తెలుసు. దశాబ్దాలు సాగదీయకుండా వాటినెలా పరిష్కరించవచ్చో తెలుసు. అమెరికా వంటి దేశాలు ప్రపంచాన్ని ఎందుకు శాసించగైగే స్థానంలో ఉన్నాయో తెలుసు. మన దేశం ఆ స్థాయికి ఎందుకు రాలేకపోయిందో తెలుసు. 

ఒక కొత్త రాష్ట్రాన్ని సాధించిన అనుభవం ఉంది. దాన్ని అత్యంత వేగంగా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్న రికార్డు ఉంది. 

ఇప్పుడు దేశంలో ఉన్న ఏ ఇతర రాజకీయనాయకునితో పోల్చినా... ప్రధానమంత్రి కావడానికి కేసీఆర్‌ను మించిన ఆలోచన, అవగాహన, స్పష్టత, సామర్థ్యం ఉన్న నాయకులు ప్రస్తుతం దేశంలో ఎవరూ లేరన్నది స్పష్టం.   

6 comments:

  1. మీకొక 50 సంవత్సరాలు ఉంటాయి కదా ? ఎన్ని హిట్ సినిమాలు తీసారేమిటీ ? ఒక్క సినిమా హిట్ అయినట్టు నాకు గుర్తు.మీ జీవితంలో వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు?

    ReplyDelete
    Replies
    1. 1. పైన బ్లాగ్ పోస్టు సబ్జెక్టుతో ఎలాంటి సంబంధం లేని కామెంట్ ఇది. చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పే హక్కు మీకుంది.
      2. తమ ఐడెంటిటీ చెప్పుకోడానికే సంకోచించేవారితో ఏదైనా ఏం చర్చించగలం?! Btw, 2018 లో ఈ పరిస్థితిని మించిన వైఫల్యం ఇంకేముంటుంది?!!

      Delete
    2. పీవీ తెలంగాణా వాడు కాబట్టే మంచి జరిగింది అని చెపుతున్నారు. అదే కాంగ్రెస్ 70 ఏళ్ళనుండి బ్రష్టు పట్టించింది అని కూడా చెపుతున్నారు. కే సీ ఆర్ ప్రతిభావంతుడనీ మీరు చెపుతున్నారు. ఆయనకి జీవితాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని మరిచిపోతున్నారు.

      దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు. చేసారా ? ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం మీ తెలంగాణా పాలసీ....అంజయ్య దగ్గరనుండి ఎంతో మంది అనామకులని( ఈ మాట అనడానికి నేను బాధపడడం లేదు) ముఖ్యమంత్రులను, ప్రధానులను చేసింది కాంగ్రెస్ పార్టీ యే... స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుండీ అత్యధిక కాలం పాలించిందీ (కుటుంబీకులను)నష్టపోయిందీ కూడా కాంగ్రెస్ మాత్రమే !

      అందరూ స్వార్ధంగా పనిచేస్తుంటే దానిని భరించింది కూడా కాంగ్రెస్సే ...

      వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కే సీ ఆర్ ముందుంటారు....అంతే వేగంగా నోటి దూల కూడా తీర్చుకుంటారు. మీరు మర్చిపోవచ్చు కానీ పడ్డవాళ్ళు మర్చిపోవడం అంత సులభం కాదు.

      మనం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాం అది మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది. మంచి జరిగితే తెలంగాణా వారిది చెడు జరిగితే ఆంధ్రా వారిదా ? జీవితంలో వచ్చే కష్టనష్టాలకి ఎదుటివాడి మీద నెపం నెట్టేసే బాధ్యతలేని వాళ్ళతో ఏమి మాట్లాడతాం ?

      పీ వీ కి డిల్లీ లో అంత్యక్రియలు ఎందుకు చేయలేదో మీకు తెలియదా ? బాబ్రీ కూలుస్తుంటే నోరుమూసుకుని కూర్చున్నాడని సోనియా శిక్షించారు.

      ప్రజలు మార్పు కోరుకోవడం సహజం అయితే వైఫల్యాలకు మాత్రం ఒక్కరినే బలిచేయాలనుకోవడం సరి కాదు.
      మీ జీవితంలో వైఫల్యాలకు ఎవరిని బలి చేస్తారని అడుగుతున్నాను.

      నా ఐడీ మీకు తెలియకపోవచ్చు బ్లాగర్లకు తెలుసు.

      ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క శెట్టి మొఖమా ఏంటీ ?

      అయినాసరే మీకోసమే ఈ పోస్టు....

      https://ramyamgakutirana.blogspot.in/2018/04/blog-post.html

      Delete
    3. 1. "ఫోటోలు పెట్టి ఆకర్షించడానికి నాది అనుష్క శెట్టి మొఖమా ఏంటీ ?"
      ఐడెంటిటీ కోసం పెట్టే ఫోటోలు ఎవర్నో ఆకర్షించడానికని ఇప్పుడే మీ ద్వారా తైలిసింది. :)


      2. "అయినాసరే మీకోసమే ఈ పోస్టు...."
      చాలా థాంక్స్. చాలా సంతోషం కూడా. నాకోసం మళ్లీ ఏళ్ల తర్వాత మీరో బ్లాగ్ పోస్టు రాయడానికి పూనుకున్నారు! కాకపోతే, అంతకు ముందు ఒక్కటే బ్లాగ్ పోస్టు ఉంది మీ బ్లాగ్‌లో .. అదేంటో అర్థం కాలేదు! బ్లాగ్ టైటిల్‌గా నాకెంతో ఇష్టమైన పాటను ఎంచుకున్నదుకు మీకు మరోసారి థాంక్స్. :)




      Delete
  2. ఆంధ్రా తెలంగాణా గొడవలు ఎలా వున్న అఒక తెలుగువాడు జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకోవడం మంచిదే!నేనూ ఒక పోష్టు వేశాను ఇక్కడ చూడండి.

    అయితే,ఎకాఎకిన మొదటి ప్రయత్నంలోనే ఒకే వూపులో ప్రధానమంత్రి అయిపోవడం జరక్కపోవచ్చు.సహజంగా మనం కేసీయారు గురించి చెప్పాలంటే మొదటి ఎస్సెట్ జనాన్ని ఉర్రూత లూగించే అతని రాజకీయ ప్రసంగాలే కాబట్టి దాంతోనే ఘనకార్యాలు చెయ్యగలడని అనుకుంటాం.కానీ ప్రధాని పదవికి పోటీ పడాలంటే ఎంతమందిని తను ప్రచారం చెయ్యడం ద్వారా గెలిపించగలడు అనేది నిర్ణయిస్తుంది.దీనికి రెండు పద్ధతులు ఉంటాయి.అభ్యర్ధులుగా డమ్మీల్ని పెట్టి కేవలం తన చరిస్మా తోనే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మరొక దారిలేక ఇతనికి విధేయులౌతారు.అదే అభ్యర్ధి సొంత బలం మీద గెలవగలిగినవాడైతే ఇతర మార్గాల ద్వారా తనకు విధేయుడై ఉండేటట్టు చూసుకోవడం.ఫలితాంశం ఒక పార్టీగా గానీ ఎక్కూవ పార్టీలుగా గానీ మూడింట రెండు వంతుల సీట్లని తన చరిస్మా ద్వారానే రప్పించగలిగితేనే అతను ప్రధానమంత్రి అవుతాడు.

    ఈ రెంటినీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం కష్టమే,కాబట్టి ఎక్కువ వూహించుకోకూడదు.ఒక్క తెలంగాణలోని అన్ని సీట్లూ గెలవడం సరిపోదు ఇతర రాష్ట్రాలలో కూడా తన ద్వారా మాత్రమే గెలిచి తనకి విధేయులై ఉండేవాళ్ళని సాధించుకోగలగాలి.అది ప్రస్తుతం దాదాపు అసంభవమే కదా!

    అన్నిటికన్న పైన స్పాన్సరింగ్ లాబీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి.సామాన్యులకి వోట్లు వెయ్యడం తప్ప ఇవ్వాళ నిజమైన నిర్ణాయక శక్తి లేదు.ఆ నిర్ణాయక శక్తి వ్యాపార పారిశ్రామిక వర్గాల సంఘటిత స్వరూపానికి ఉంది.వాళ్ళు "నువు ప్రధానమంత్రివి అయితే మాకు ఏమి చేస్తావు?" అని అడుగుతారే తప్ప "నువ్వు ప్రధానమంత్రివి అయితే సామాన్యులకు ఏమి మేలు చేస్తావు?" అని అడగరు.వాళ్ళకి ఆ గ్యారెంటీ ఇస్తే ఎన్నికల ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు.వాళ్ళకి ఇచ్చే గ్యారెంటీ ఇచ్చాక కేసీయార్ ఒక్కడే ఈ దేశాన్ని కాపాడగలడు అనే ఇమేజికి మీడియాని వాడుకోవడం రెండవ దశ.ఈ రెండూ చెయ్యగలిగితే సామాన్యులకి ఇతన్ని రక్షకుడిగా పరిచయం చేసే పనిని వాళ్ళే చూసుకుంటారు.మోదీ ప్రధానమంత్రి అయింది ఈ దారిలోనే,మోదీ చేసింది కేసీయార్ కూడ చెయ్యొచ్చు - కానీ అన్ని లెక్కలూ సరిపోవాలి కదా, చూద్దాం!

    P.S:It is completely different as compared to telangana agitation and the way KCR became CM of telangana - So,he has to take a new outlook and he has to follow new strategy.

    ReplyDelete
  3. I totally agree with you. A new strategy is a must for KCR to become PM and I believe he is having that already.

    ReplyDelete