Sunday 28 January 2018

వ్యక్తులు కాదు ముఖ్యం!

"సోషల్ మీడియా సైన్యం ... కేసీఆర్ కోసం!"

ఈ టైటిల్‌తో నిన్న నేనొక బ్లాగ్ రాసి, దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను.

ఈ పోస్ట్ సృష్టించిన సంచలనం ఒక రేంజ్‌లో ఉంది.

పొగడ్తలూ, అలకలూ, కోపాలూ.

బట్ ... అందరూ మన మిత్రులే. అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నవాళ్లే.

మన తెలంగాణ, మన కేసీఆర్.

కట్ చేస్తే -  

"ఎలాంటి బ్రౌజింగ్ చెయ్యకుండా, ఏమాత్రం ఆగకుండా, తడుముకోకుండా, నాకు అలవోకగా గుర్తొచ్చిన పేర్లు ఇవన్నీ. కొంచెం సమయం తీసుకొని ఆలోచిస్తే ఇంకో 100 పేర్లు ఈజీగా గుర్తుకొస్తాయి. ఆన్ లైన్లోకి వెళ్తే పెద్ద లిస్టే అవుతుంది." ...  అని ఆ పోస్టు ప్రారంభంలోనే చాలా క్లియర్‌గా చెప్పాను.

అలా, పోస్టు ప్రారంభంలో ఒక చిన్న సాంపిల్‌గా, ఒక లీడ్‌గా నేను రాసిన ఆ పేర్లన్నీ  .. ఆ పోస్ట్ రాస్తున్నప్పుడు నాకు అప్పటికప్పుడు గుర్తుకొచ్చినవి మాత్రమే తప్ప, వాళ్లే అందరూ కాదు.

అతిరథమహారథులైన సీనియర్లు, పెద్దలు, మిత్రులు కూడా ఇంకా ఎందరో ఉన్నారు.

"అసలు మన సోషల్ మీడియా సైన్యం ఎందుకు ... దాని అవసరం ఏంటి, దాని ఇంటెన్సిటీ ఎంత గొప్పది" ... అన్న విషయం చర్చించడమే ఆ పోస్టు ప్రధానోద్దేశ్యం తప్ప, మన సైన్యం లిస్ట్ అంతా సేకరించి రాయడం కాదు.

అదంత సులభం కూడా కాదు.

ఎందుకంటే మన సైన్యం వందల్లో కూడా కాదు, వేలల్లో ఉంది!

మన సైన్యం ఇంటెన్సిటీ, అవసరం గురించి చెప్పడమే ఇక్కడ ప్రధానం తప్ప వ్యక్తులు కాదని మరొక్కసారి నా సవినయ మనవి.

పెద్దలు, సీనియర్లు, మిత్రులు ఈ విషయాన్నీ, నన్నూ అర్థం చేసుకొన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

లక్ష్యం ముఖ్యం.

వ్యక్తులు కాదు!

కట్ చేస్తే - 

ఇక మీదట నా పోస్టులు  ఎవరైనా తమ వాల్ మీద పోస్ట్ చేయాలనుకొంటే, దయచేసి Written by అని నా పేరు 'పైన టైటిల్ దగ్గర' వేయగలిగితేనే పోస్ట్ చేయండి. లేదంటే షేర్ చేయండి.

ఈ రెండూ చేయలేము అనుకొంటే, అసలు ఈ పని చేయకండి .. అని నా సవినయ మనవి. 

దయచేసి తప్పుగా అనుకోవద్దు.

పైన నాపేరు లేకుండా, డైరెక్టుగా వారి టైమ్‌లైన్ మీద కాపీ పేస్ట్ చేసిన కారణంగా ... ఆ పోస్టు వారే రాసినట్టుగా ఉంటుంది తప్ప, క్రింద ఎక్కడో Written by అని నా పేరు రాసింది చాలామంది చూడరు. 

దీనివల్ల ఏర్పడిన "అసలెవరు రాశారు ఈ పోస్టు?" అన్న కన్‌ఫ్యూజన్‌తో,  చాలా మెసేజ్‌లు నా ఇన్‌బాక్స్‌లో  చదివాక, ఈ పాయింట్ గురించి ఇంత వివరంగా, ఇలా, రాయాల్సిరావడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది.

ఈ రిక్వెస్టు ... కేవలం పదే పదే రిక్వెస్టు చేసినా అసలు పట్టించుకోని అలాంటి కొందరు మిత్రుల కోసమే. వారు కూడా అన్యధా భావించరనే నా నమ్మకం.

కట్ చేస్తే - 

ఇదంతా ఎలా ఉన్నా, నేను రాసిన ఈ "సోషల్ మీడియా సైన్యం ... కేసీఆర్ కోసం!" పోస్టు వల్ల మొత్తానికి మన సోషల్ మీడియా సైన్యం చాలా అప్రమత్తంగా ఉందని మాత్రం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది.

It's a very good sign!

మన సోషల్‌మీడియా సైన్యంలో ఎందరో మహానుభావులు. అందరికీ పేరుపేరునా వందనాలు.
^^^

#KCR #TRS #TRSSocialMedia #TelanganaSocialMedia #Telanagana #SocialMediaSainyam #ManoharChimmani  

Saturday 27 January 2018

సోషల్ మీడియా సైన్యం ... కేసీఆర్ కోసం!

ధరణి కులకర్ణి, కట్పల్లి సంతోష్ రెడ్డి,  సందీప్ రెడ్డి కొత్తపల్లి, సవాల్ రెడ్డి, రవికాంత్, ఇ రవికాంత్, ఏనుగు సీతారాం రెడ్డి, నజీర్ మహ్మద్, విజయ్ వి రెడ్డి, శ్రీదేవి మంత్రి, రాంపల్లి మహాలక్ష్మి, మాధవి మదగాని, మున్నూర్ రవి, ప్రసాద్ కాసుల, జగన్ రావు, శ్రవణ్ కుమార్, మేరీ సూర్యగోపు, అర్చన నేత, సదానందం కామని, గుమ్మడి సాగర్, నాగిరెడ్డి కొండకింది, కృష్ణ సింగ్ ఠాకూర్, వెంకట్ గాంధీ, పొద్దుటూరి నిరంజన్, అనిల్ కూర్మాచలం, అనిల్ బైరెడ్డి, బాల్ శెట్టి గౌడ్, ధాము నర్మాల, సత్యమూర్తి, నాగాంజనేయులు కూరోజు, రఘువీర్ రాథోడ్, జవ్వాజి వేణు, సందీప్ ఠాకూర్, కళ్యాణ్ ...

ఎలాంటి బ్రౌజింగ్ చెయ్యకుండా, ఏమాత్రం ఆగకుండా, తడుముకోకుండా, నాకు అలవోకగా గుర్తొచ్చిన పేర్లు ఇవన్నీ.

కొంచెం సమయం తీసుకొని ఆలోచిస్తే ఇంకో 100 పేర్లు ఈజీగా గుర్తుకొస్తాయి. ఆన్ లైన్లోకి వెళ్తే పెద్ద లిస్టే అవుతుంది.

ఇటీవలే ప్రభుత్వం నుంచి పదవులుంపొందిన ఒకరిద్దరి పేర్లు నేనిక్కడ రాయలేదు. అలాగే, ముందే ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కొందరి పేర్లు కూడా నేనిక్కడ రాయటం లేదు.

అసలెవరు వీళ్లంతా ?!

వీళ్లంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలంగా, టి ఆర్ ఎస్ పార్టీ/ప్రభుత్వ అధినేతగా ప్రజలకోసం వారు చేస్తున్న కార్యక్రమాలను గురించీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించీ .. ఎప్పటికప్పుడు ప్రజలకు తాజా సమాచారాన్ని అందిస్తూ, పనికిరాని సన్నాసి విమర్శలను తిప్పికొడుతూ, అవసరమైతే ఉతికి ఆరేస్తూ, సోషల్ మీడియాలో తమ అద్భుతమైన పోస్టులు, రైటప్స్ లతో దుమ్మురేపుతున్నారు.

ప్రభుత్వం నుంచిగానీ, పార్టీ నుంచిగానీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, సోషల్ మీడియా యుద్ధభూమిలో కేసీఆర్ కోసం, తెలంగాణ కోసం వివిధ స్థాయిల్లో, వివిధ శైలుల్లో పనిచేస్తున్న ఈ  సైన్యంలో యువర్స్ ట్రూలీ మనోహర్ చిమ్మని కూడా ఉన్నాడు ...

ఎందుకింత పిచ్చి వీళ్ళందరికి?

వీరంతా ఏం చదువుకోని వాళ్ళుకాదు.

ఏం పనిలేకుండా రోడ్లమీద తిరుగుతున్నవాళ్ళు కాదు.

అత్యధికశాతం సినిమా స్టార్ల ఫ్యాన్స్ లాగా ఒకరకమైన 'మంద మెంటాలిటీ' ఉన్నవాళ్ళుకాదు.

అత్యంత స్వచ్చందంగా పనిచేస్తున్న ఈ సోషల్ మీడియా సైన్యంలో ఉద్యోగులున్నారు, నిరుద్యోగులున్నారు, డాక్టర్స్, రైటర్స్, ఫిల్మ్ డైరెక్టర్స్, యాక్టర్స్, ఇతర క్రియేటివ్ పీపుల్, ఇంజినీర్స్, బిజినెస్ మెన్/విమెన్, గృహిణులు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఎందరో ప్రెస్ మిత్రులు ... ఇలా దాదాపు సమాజంలోని ప్రతి రంగం నుంచి చాలామంది ఉన్నారు.

ఎందుకిలా?

అసలు అంత అవసరమేంటి?

అవసరం ఉంది. అంతకు మించిన బాధ్యత కూడా ఉంది.

కాబట్టే .. ఈ స్వచ్చంద సైన్యం. ఈ ఆవేశం. ఈ ఆక్రోశం. ఈ దూకుడు.  ఈ ఏకే 47 బులెట్ పోస్టులు. అవతలివైపు సన్నాసి ఆరోపణలకు ఫైరింగ్ ఆన్సర్లు!

దశాబ్దాలుగా కేవలం కలగానే మిగిలిన అత్యంత అసాధ్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసింది కే సీ ఆర్.

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇదే నిజం.

తెలంగాణ కల సాకారం కావడం కోసం దాదాపు 14 ఏళ్ళు తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఒక మహోన్నత స్థాయి ఉద్యమాన్ని ఒక్క రక్తపు బొట్టు చిందకుండా, అత్యంత విజయవంతంగా నడిపిన కే సీ ఆర్, ఇప్పుడు అదే ఉద్యమస్థాయిలో తెలంగాణను సుసంపన్నం చేసి, రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా చూడాలని తపిస్తున్నారు. అహరహం ఆ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.

అంతకు ముందు తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించని అద్భుత ఫలితాలు ఎన్నో ఇప్పుడు మనం  చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. ఇంకెన్నో ఫలాలు మన ముందుకి, మన జీవితాల్లోకి రానున్నాయి.

ఈ అవిశ్రాంత కృషి, అచంచల దీక్ష, ఒక టాస్క్ మాస్టర్ లోని టఫ్ నెస్ .. ఇవన్నీ ఒక్క కే సీ ఆర్, ఆయన సారథ్యంలోని టీమ్ వల్లనే సాధ్యమవుతుంది.

ఇది మాత్రమే నిజం.

ఎన్నో త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ఏవో కుక్క బిస్కట్లకు ఆశపడి నాశనం చేసుకోడానికి వెనుకాడనివాళ్ళ చేతుల్లోకి పోనివ్వద్దంటే .. ఇదొక్కటే మార్గం.

మన కే సీ ఆర్ ను, మన టీ ఆర్ ఎస్ ను మనం కాపాడుకోవాలి. కనీసం ఇంకో రెండు టర్మ్ లు.

తర్వాత ఇంక ఇలాంటి అవసరం ఉండదు.  ఉండే అవకాశం కే సీ ఆర్ ఇవ్వరు. మనం ఇవ్వం.

ఇప్పుడు మాత్రం తప్పదు.

ఇదంతా మనకోసం. మన పిల్లలకోసం. మన తర్వాతి తరాల కోసం.

మన బంగారు తెలంగాణ కోసం.

అందుకే ఈ సోషల్ మీడియా సైన్యం!

అవతలివారు నమ్మలేని స్థాయిలో .. ఎలాంటి వ్యక్తిగత ఆశలు, కోరికలు లేకుండా.

వందలాదిమంది వాలంటీర్లు ... లక్షలు, కోట్లాది తెలంగాణ ప్రజను జాగృతం చేస్తూ. బంగారు తెలంగాణ వ్యతురేకులను ఉతికి ఆరేస్తూ.

స్వచ్చందంగా.

ఒక సుశిక్షత సైన్యంగా ...
^^^
#KCR #TRS #TelanaganaState #TelanganaSocialMedia #TSSocialMedia

Monday 22 January 2018

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి ...

కొన్ని నిజాలు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి నిజమే ఇది కూడా.

అప్పుడే 14 ఏళ్లు ... 

నా క్లాస్‌మేట్, నా మిత్రుడు, నా బావమరిది చీరాల పురుషోత్తం, IRS పుట్టినరోజు ఇవాళ!

కానీ .. తను మరణించి అప్పుడే 14 ఏళ్ళు అయ్యిందన్న నిజం నన్నీరోజు చాలా బాధపెడుతోంది.

బట్ .. దిస్ ఈజ్ లైఫ్!

అన్నీ మనం అనుకున్నట్టు జరగవు.

నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారిలాగే ఈరోజు కూడా బాధపడుతున్నాను. కానీ, అది తప్పని కూడా నీ జ్ఞాపకాలే నాకు గుర్తుచేస్తున్నాయి.

జీవితంలో ఎన్నెన్నో మనకు ఇష్టంలేనివి, మనం ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం ముఖ్యం.

ఆ ఆత్మవిశ్వాసానికి పర్యాయపదం నువ్వు.

అవధులులేని నీ ఆత్మ విశ్వాసం, నీ చిరునవ్వు, ఆ చిరునవ్వుతోకూడిన నీ ప్రతి పలకరింపు నేనెన్నటికీ మర్చిపోలేను.

మిస్ యూ పురుషోత్తమ్ ..

#ChiralaPurushotham   #IRS   #ChiralaPurushothamIRS   #PurushothamIRS